• English
    • Login / Register

    Tata Nexon Facelift: ఇప్పటి వరకు గమనించిన మార్పులు

    ఆగష్టు 28, 2023 02:44 pm rohit ద్వారా ప్రచురించబడింది

    68 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    ఇప్పటి వరకు అందుకోని ముఖ్యమైన అప్ؚడేట్ؚను పొందనున్న నెక్సాన్, మార్పులు EV వర్షన్‌కు కూడా వర్తిస్తాయి

    Tata Nexon Facelift

    • 2017లో ఆవిష్కరించబడిన తరువాత టాటా నెక్సాన్ రెండవ భారీ రీఫ్రెష్ؚను పొందనుంది. 

    • నవీకరించిన SUV యొక్క అనేక రహస్య చిత్రాలలో నాజూకైన LED లైటింగ్ మరియు కొత్త స్టీరింగ్ వీల్ వంటి అనేక వివరాలు వెల్లడయ్యాయి. 

    • 360-డిగ్రీల కెమెరా, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, బహుశా ADAS వంటి కొత్త ఫీచర్‌లు ఉంటాయని అంచనా. 

    • ప్రస్తుత మోడల్ؚలో ఉన్న అదే టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్ؚలను పొందవచ్చు. 

    • కొత్త నెక్సాన్ టాటా DCT ఎంపికతో కొత్త 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ؚను కూడా పొందవచ్చు. 

    • సెప్టెంబర్‌లో విక్రయాలు ప్రారంభం కావచ్చని అంచనా, ధరలు రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయి. 

    ఇటీవల దేశంలో అధికంగా విక్రయించబడుతున్న SUVలలో ఒకటి, టాటా నెక్సాన్, ఇది త్వరలోనే భారీ అప్ؚడేట్ؚను పొందనుంది, 2020 తరువాత ఇది అందుకుంటున్న రెండవ భారీ రీఫ్రెష్ ఇది. 2023 ప్రారంభం నుండి, పరీక్షించబడుతున్న టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ అనేక రహస్య చిత్రాలను కాలక్రమేనా ఇప్పటికే చూశాం. దీని విడుదల సమీపిస్తుండగా, 2023 టాటా నెక్సాన్ గురుంచి ఇప్పటి వరకు తెలుసుకోవలసిన, ఇప్పటికే తెలిసిన వివరాలు క్రింద అందించబడ్డాయి: 

    ఎక్స్ؚటీరియర్

    Tata Nexon 2023 Front Profile

    చిత్రం మూలం

    ఇటీవల, SUV ముందు మరియు వెనుక భాగం ఎక్కువ ముసుగు లేకుండా కనిపించింది, తద్వారా పూర్తి డిజైన్ అప్ؚడేట్ؚలను చూడగలిగాము. ముందు వైపు, కొత్త నెక్సాన్, తాజా LED హెడ్‌లైట్ؚల సెట్ (ప్రస్తుతం బంపర్ؚలో నిలువుగా అమర్చబడింది), సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్ؚలతో పదునైన LED DRLలు, భారీ గ్రిల్ ఉన్నాయి. టాటా కర్వ్ మరియు హ్యారియర్ EV కాన్సెప్ట్ؚల నుండి స్టైలింగ్ ప్రేరణలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.

    2023 Tata Nexon Rear Spied

    చిత్రం మూలం

    పక్క భాగంలో జరిగిన మార్పులు చాలా తక్కువే అని చెప్పవచ్చు, వీటిలో కొత్త ఆలాయ్ వీల్స్ ఉన్నాయి. ఇటీవల తీసిన మరికొన్ని రహస్య చిత్రాలలో, నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ వెనుక భాగం ఎటువంటి ముసుగు లేకుండా కనిపించింది. వెనుక వైపు జరిగిన గణనీయమైన అప్ؚడేట్ؚలలో డ్యాపర్ కనెక్టెడ్ LED టెయిల్‌లైట్‌లు, మెరుగైన బంపర్ మరియు మరింత కొట్టొచ్చినట్లు ఉన్న టెయిల్‌గెట్ మరియు పొడవైన రిఫ్లెక్టర్ హౌసింగ్ؚలు ఉన్నాయి. 

    ఇది కూడా చూడండి: ఛార్జింగ్ చేస్తూ మొదటిసారి కెమెరాకు చిక్కిన టాటా పంచ్ 

    టాటా, ఈ డిజైన్ మార్పులను నెక్సాన్ EVలో కూడా కొనసాగిస్తుంది, ఇది ప్రామాణిక నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ విడుదల సమాయనికే విడుదల అవుతుందని అంచనా. అయితే లుక్ పరంగా అప్ؚడేట్ؚలు స్వారూప్యంగా  ఉంటాయి, కానీ ఎలక్ట్రిక్ స్వభావాన్ని చూపించేలా కొన్ని బ్లూ టచెస్ మరియు క్లోజ్డ్-ఆఫ్-ప్యానెల్స్ؚను పొందవచ్చు. 

    ఇంటీరియర్

    Tata Nexon 2023

    ఇప్పటికే కనిపించిన అనేక టాటా నెక్సాన్ టెస్ట్ వాహనాలలో రీడిజైన్ చేసిన, మెరుగైన క్యాబిన్ లేఅవుట్ؚను కలిగి ఉండటాన్ని చూడవచ్చు. ఈ వివరాలలో నాజూకైన AC వెంట్ؚలు, క్లైమేట్ కంట్రోల్ؚల కోసం కొత్త టచ్-ఇన్పుట్ ప్యానెల్, సవరించిన సీట్ అప్ؚహోల్ؚస్ట్రీ మరియు టాటా అవిన్యా కాన్సెప్ట్ؚలో ఉన్న కొత్త 2-స్పోక్ؚల స్టీరింగ్ వీల్ ఉన్నాయి. 

    ఇది కూడా చదవండి: 1 లక్ష విక్రయాలను దాటిన టాటా EVలు – నెక్సాన్ EV, టియాగో EV మరియు టిగోర్ EV 

    నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్‌లో టాటా, 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వెంటిలేటెడ్ సీట్ؚలు, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్ؚలను అందించవచ్చు. దీని భద్రత కిట్ؚలో ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజీలు, 360-డిగ్రీల కెమెరా, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సర్‌లు ఉండవచ్చు. కారు తయారీదారు ఒక అడుగు ముందుకువేసి, ఇందులో అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ (ADAS) ఫీచర్‌లను కూడా పరిచయం చేయవచ్చు, తద్వారా ఇది ఈ ఫీచర్‌లను అందించే మొదటి సబ్-4m SUVగా నిలుస్తుంది. 

    బోనెట్ؚలో ఏముంది?

    కొత్త నెక్సాన్ ప్రస్తుత మోడల్‌లో ఉన్న 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ؚను (115PS/160Nm) కొనసాగిస్తుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ లేదా 6-స్పీడ్ AMTకి జోడించబడుతుంది. ఇది టాటా కొత్త 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో (125PS/225Nm) కూడా అందించబడవచ్చు, కొత్త DCT (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ؚమిషన్) ఎంపికను పొందవచ్చు. 

    ఇది కూడా చదవండి: ఆగస్ట్ 2023లో హ్యుందాయ్ ఎక్స్టర్‌తో పోలిస్తే టాటా పంచ్ మారితంగా అందుబాటులో ఉంది 

    నవీకరించిన నెక్సాన్ EV పవర్‌ట్రెయిన్ వివరాలను ప్రస్తుతానికి రహస్యంగానే ఉంచారు, భారీ మార్పులు ఉంటాయని భావించడం లేదు. టాటా ప్రస్తుతం పూర్తి ఎలక్ట్రిక్ SUVని రెండు విస్తృత వేరియెంట్‌లలో అందిస్తోంది: ప్రైమ్ (30.2kWh బ్యాటరీ ప్యాక్; 312 కిమీ ARAI-క్లెయిమ్ చేసిన పరిధి) మరియు మ్యాక్స్ (40.5kWh బ్యాటరీ ప్యాక్; 453కిమీ ARAI-క్లెయిమ్ చేసిన పరిధి). 

    అంచనా విడుదల తేదీ మరియు ధర

    Tata Nexon 2023

    నవీకరించిన నెక్సాన్ؚను టాటా సెప్టెంబర్ؚలో విడుదల చేస్తుందని అంచనా. అప్ؚడేట్ చేసిన SUV ధర రూ. 8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉంటుంది, మరిన్ని కొత్త ఫీచర్‌లను పొందే టాప్ ఎండ్ వేరియెంట్ؚల ధర మరింత ఎక్కువగా ఉండవచ్చు. కియా సోనెట్, మారుతి బ్రెజ్జా, రెనాల్ట్ కైగర్, మహీంద్రా XUV300, హ్యుందాయ్ వెన్యూ, నిస్సాన్ మాగ్నైట్ؚలు మరియు మారుతి ఫ్రాంక్స్ మరియు సిట్రోయెన్ C3 వంటి క్రాస్ؚఓవర్ؚలతో టాటా నెక్సాన్ పోటీ కొనసాగిస్తుంది. 

    ఇక్కడ మరింత చదవండి: నెక్సాన్ AMT

    was this article helpful ?

    Write your Comment on Tata నెక్సన్

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience