సెప్టెంబర్ 14న ప్రారంభం కానున్న Tata Nexon మరియు Nexon EV ఫేస్ؚలిఫ్ట్ విక్రయాలు
టాటా నెక్సన్ కోసం tarun ద్వారా ఆగష ్టు 28, 2023 02:59 pm ప్రచురించబడింది
- 148 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కొత్త నెక్సాన్ డిజైన్ మరియు ఫీచర్‌ల పరంగా మరింత ప్రీమియంగా ఉంటుంది.
-
టాటా నెక్సాన్ మరియు దాని EV వర్షన్ లు పూర్తిగా కొత్త డిజైన్ؚను కలిగి ఉన్నాయి మరియు ఇవి కర్వ్, హ్యారియర్ EVల నుండి ప్రేరణ పొందాయి.
-
ఆశించిన ఫీచర్‌లలో టచ్-ఆధారిత AC ప్యానెల్, 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఉంటాయి.
-
ఆరు ఎయిర్ బ్యాగ్‌లు, 360-డిగ్రీల కెమెరా మరియు ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సర్‌ల జోడింపుతో భద్రత మెరుగుపడవచ్చు.
-
కొత్త నెక్సాన్ మరింత శక్తివంతమైన 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో రావచ్చు; డీజిల్ ఇంజన్ؚను కొనసాగించవచ్చు.
-
నెక్సాన్ EV పవర్ ట్రెయిన్ؚల గురించి ప్రస్తుతానికి ఎటువంటి నివేదికలు లేవు.
ఎట్టకేలకు టాటా నెక్సాన్ ఫేస్‌లిఫ్ట్ విడుదల తేదీని ప్రతకటించారు, ఇది సెప్టెంబర్ 14న విడుదల కానుంది. టాటా ఈ SUVకి కొన్ని సంవత్సరాలుగా, తరచుగా తేలికపాటి అప్‌డేట్‌లను అందిస్తోంది, అయితే ప్రస్తుత అప్ؚడేట్ 2020 తరువాత మొట్టమొదటి భారీ అప్ؚడేట్ అని చెప్పవచ్చు. నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ ఒకే విధమైన డిజైన్ మరియు ఫీచర్ మార్పులను పొందుతుంది మరియు ఒకే రోజున మార్కెట్‌లోకి ప్రవేశించనున్నాయి.
కొత్త డిజైన్
రహస్య చిత్రాల ఆధారంగా, నవీకరించిన నెక్సాన్ పూర్తిగా కొత్త డిజైన్ؚతో వస్తుంది. ముందు ప్రొఫైల్ టాటా కర్వ్ మరియు హ్యారియర్ EVల నుండి ప్రేరణ పొందింది, ఇందులో పొడవు అంతటా LED DRLలు, నాజూకైన గ్రిల్, స్ప్లిట్ హెడ్‌ల్యాంప్ డిజైన్ మరియు పదునైన బంపర్ؚలు ఉన్నాయి.
ఈ నవీకరించిన సబ్‌కాంపాక్ట్ SUVలో ఆలాయ్ వీల్స్ కూడా రీడిజైన్ చేయబడతాయి. వెనుక వైపు, కనెక్టెడ్ LED టెయిల్‌లైట్‌లు, రీడిజైన్ చేసిన బంపర్, మరింత కొట్టొచ్చినట్లు కనిపించే బూట్ؚను చూడవచ్చు. నెక్సాన్ EVలో కూడా దాని ప్రత్యేకమైన విజువల్ ఎలిమెంట్ؚలతో పాటు ఇలాంటి మార్పులనే ఆశించవచ్చు.
సరికొత్త ఇంటీరియర్ؚలు
నెక్సాన్ మరియు దాని EV వర్షన్ రెండిటి క్యాబిన్, గణనీయమైన మార్పులను పొందింది తద్వారా మెరుగైన డిజైన్‌ను వీటిలో చూడవచ్చు. నవీకరించిన నెక్సాన్ కొత్త-స్పోక్ స్టీరింగ్ వీల్, టచ్-ఆధారిత క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ మరియు సవరించిన సీట్ అప్ؚహోల్ؚస్ట్రీలతో కెమెరాకు చిక్కింది. ఈ నవీకరణలు నెక్సాన్ EVలో కూడా కోనసాగవచ్చు.
మరిన్ని ఫీచర్‌లు
నవీకరించిన నెక్సాన్ 10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్‌లు, 360-డిగ్రీల కెమెరా, ముందు మరియు వెనుక పార్కింగ్ సెన్సర్‌లతో రావచ్చు. నెక్సాన్ EV మరియు దాని ICE వర్షన్ కూడా ADASతో (అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) రానున్నాయి, ఈ భద్రత ఫీచర్ؚను పొందే మొదటి నెక్సాన్ సబ్-4-మీటర్ SUVగా నిలుస్తుంది.
ఇది కూడా చదవండి: భారతదేశంలో ఎలక్ట్రిక్ కార్లు
కొత్త నెక్సాన్ పవర్‌ట్రెయిన్ؚలు
నెక్సాన్‌ను పెట్రోల్, డీజిల్ మరియు ఎలక్ట్రిక్ పవర్‌ట్రెయిన్ ఎంపికలతో అందించనున్నారు. ఇది 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ (6-స్పీడ్ మాన్యువల్ మరియు AMT ఎంపికలు) కొనసాగిస్తుంది, 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ స్థానంలో టాటా కొత్త 1.2 TGDI టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను తీసుకువస్తుంది. కొత్త పెట్రోల్ ఇంజన్ 125PS మరియు 225Nmగా రేట్ చేయబడింది మరియు మాన్యువల్ స్టిక్ؚతో పాటు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚను కూడా పొందుతుంది.
ప్రస్తుతానికి, నెక్సాన్ EV పవర్‌ట్రెయిన్ؚలకు అప్ؚడేట్ؚలు ఉంటాయా లేదా అనే వివరాలు తెలియవు. ప్రస్తుతం ఇది 30.2kWh (ప్రైమ్) మరియు 40.5kWh (మాక్స్) బ్యాటరీ ప్యాక్ؚలను పొందుతుంది, వీటి క్లెయిమ్ చేసిన పరిధి వరుసగా 312కిమీ మరియు 453 కిమీలు ఉంది.
ఇది కూడా చూడండి: ఛార్జింగ్ చేస్తూ మొదటిసారి కెమెరాకు చిక్కిన టాటా పంచ్ EV
2023 నెక్సాన్ ధరలు
(రిఫరెన్స్ కోసం ప్రస్తుత నెక్సాన్ EV మాక్స్)
ఈ గణనీయమైన అప్ؚగ్రేడ్ؚల కారణంగా నెక్సాన్ మరియు నెక్సాన్ EV ఫేస్‌లిఫ్ట్ ధరలు, ప్రధానంగా టాప్ వేరియెంట్ؚల ధరలు పెరుగుతాయి, ICE వర్షన్ ధర ప్రస్తుతం రూ.8 లక్షల నుండి రూ.14.60 లక్షల వరకు ఉంది, తోటి EV వాహనం ధర రూ.14.49 లక్షల నుండి రూ.19.54 లక్షల (అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు) వరకు ఉంది.
ఇక్కడ మరింత చదవండి: టాటా నెక్సాన్ AMT
0 out of 0 found this helpful