• English
  • Login / Register

2018లో ప్రారంభించబడిన 8 బ్లాక్ బాస్టర్ కార్లు

టయోటా యారీస్ కోసం khan mohd. ద్వారా ఏప్రిల్ 22, 2019 10:14 am ప్రచురించబడింది

  • 20 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

8 BLOCKBUSTER Car Launches Of 2018 So Far

కాలం గడిచిపోతుంది. 2018 మొదట అర్ధ భాగంలో జరిగిన 2018 ఆటో ఎక్స్పో ద్వారా - భారతదేశంలోని అన్ని ఆటోమోటివ్ ఈవెంట్లను చూశాము. ఇప్పటి వరకు, ప్రతి నెలలో కనీసం రెండు ప్రారంభాలు జరిగాయి. కొన్ని కార్లు తేలికపాటి నవీకరణలను పొందాయి, మరికొన్ని ఇతర కార్లు పూర్తి నవీకరణలను పొందాయి. వీటిలో, తమ తమ విభాగాలలో ఒక అద్భుతాన్ని  సృష్టించిన మొదటి అయిదు కార్లను మీకు అందిస్తున్నాము.

మిడ్ సైజ్ హ్యాచ్బ్యాక్: మారుతి సుజుకి స్విఫ్ట్

ధర: రూ 4.99 లక్షలు - రూ 8.29 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)

ప్రారంభ తేదీ: 8 ఫిబ్రవరి 2018 (ప్రారంభ నివేదిక)

2018 Maruti Suzuki Swift

భారతదేశం యొక్క ప్రముఖ ప్యాసింజర్ కార్ల తయారీదారుడు, మూడవ తరం స్విఫ్ట్ను విడుదల చేయడానికి 2018 ఆటో ఎక్స్పోని వేదికగా ఎంచుకున్నాడు మరియు కార్ల తయారీదారుడు వారి డీలర్షిప్ల ద్వారా బుకింగ్స్ మరియు విచారణలు అధిక సంఖ్యను కలిగి ఉన్నాడని చెప్పడంలో ఆశ్చర్యపోనవసరం లేదు. ఎల్ఈడి ప్రొజెక్టర్ లాంప్స్ మరియు టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ వంటి లక్షణాలతో ప్యాక్ చేయబడి, టాప్ స్పెక్స్ మోడల్లో 2018 స్విఫ్ట్ అంతకంటే ముందు కంటే ఎక్కువ లక్షణాలను కలిగి ఉంది మరియు ఆకర్షణీయంగా మారింది. ప్రజాదరణ పొందిన ఈ స్విఫ్ట్ హ్యాచ్బ్యాక్, 1.2 లీటరు పెట్రోల్ మరియు ఒక 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్ ముందు వాటినే కొనసాగుతుంది, అదే సమయంలో ఈ ఇంజిన్లతో ఏఎంటి ఆప్షన్ ను అందించడానికి మారుతి ఎంచుకుంది.

జొకోవిక్, ఆర్డర్ అఫ్ సెయింట్ సావా, ఆర్డర్ ఆఫ్ కరాడోర్డ్స్ స్టార్, ఆర్డర్ ఆఫ్ ది రిపబ్లికా సెర్ప్సికా లను గెలుపొందారు.

ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్, ఏబిఎస్ తో ఈబిడి మరియు బ్రేక్ అసిస్ట్, ఐసోఫిక్స్ చైల్డ్ సీటు మౌంట్లు వంటి అంశాలు కొత్త స్విఫ్ట్లో ఇప్పుడు ప్రామాణికమైనవి. ఇతర ముఖ్యమైన లక్షణాలు అయిన 7- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ యూనిట్ను ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో, కీ లెస్ ఎంట్రీ, 60:40 స్ప్లిట్ వెనుక సీట్ మరియు రివర్స్ పార్కింగ్ సెన్సార్లు వంటి అంశాలు కూడా అందించబడ్డాయి.

ఎలా డ్రైవ్ చేయాలనేది తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇక్కడ క్లిక్ చేయండి - 2018 మారుతి సుజుకి స్విఫ్ట్: ఫస్ట్ డ్రైవ్ రివ్యూ

ప్రీమియం హ్యాచ్బ్యాక్: హ్యుందాయ్ ఎలైట్ ఐ 20

ధర: రూ .5.41 లక్షలు - 9.21 లక్షల (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)

విడుదల తేదీ: 7 ఫిబ్రవరి 2018 (ప్రారంభ నివేదిక)

2018 Hyundai Elite i20

2018 స్విఫ్ట్ ప్రారంభం కావడానికి ఒక రోజు ముందు, హ్యుందాయ్ సంస్థ- ఎలైట్ ఐ 20 యొక్క నవీకరించిన వెర్షన్ను ప్రవేశపెట్టింది. ఎలైట్ ఐ 20 ఫేస్లిఫ్ట్ హ్యుందాయ్ యొక్క కరెంట్ డిజైన్ లాంగ్వేజ్ తో కొత్త గ్రిల్, డే టైమ్ రన్నింగ్ ఎల్ఈడి లతో ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, టెయిల్ లాంప్లకు కొత్త గ్రాఫిక్స్, పునఃరూపకల్పన వెనుక భాగం మరియు 16- అంగుళాల డైమండ్- కట్ అల్లాయ్ వీల్స్ వంటి సౌందర్య మార్పులను కలిగి ఉంది.

ఈ క్యాబిన్ డ్యూయల్- టోన్ స్కీమ్ ను పొందుతుంది, 7- అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్- ఆపిల్ కార్పిల్, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్లింక్ కంపాటబిలిటీ వంటి వాటికి మద్దతు ఇస్తుంది, అంతేకాకుండా వెనుక ఏసి వెంట్స్, సెన్సార్లతో కూడిన రేర్ పార్కింగ్ కెమెరా (ఇన్ఫోటైన్మెంట్ స్క్రీన్ పై ప్రదర్శన), శీతలీకరణ గ్లోవ్ బాక్స్, విద్యుత్తు తో మడత మరియు సర్దుబాటు చేయగల వెలుపలి రేర్ వ్యూ మిర్రర్లు (ఓఆర్విఎం లు) వంటి అంశాలను కలిగి ఉంది. మరోవైపు భద్రతా పరంగా డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్ మరియు ఏబిఎస్, డ్యూయల్ ఎయిర్ బాగ్స్ వంటి భద్రతా సౌకర్యాన్ని కలిగి ఉంది. అగ్ర శ్రేణి వేరియంట్ అయిన ఆస్టా వేరియంట్ కూడా నాలుగు ఎయిర్బ్యాగ్స్ మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు మౌంట్లతో అందుబాటులో ఉంది.

2018 హ్యుందాయ్ ఎలైట్ ఐ 20 ముందు వెర్షన్లో ఉండే అదే ఇంజిన్ల ద్వారా ముందుకు సాగుతోంది - అవి వరుసగా, 1.2 లీటర్ పెట్రోల్ మరియు 1.4 లీటర్ డీజిల్ ఇంజన్. అయితే, హ్యాచ్బ్యాక్ ఇప్పుడు దాని పెట్రోల్ ఇంజిన్ ఆప్షనల్ సివిటి గేర్బాక్స్ ను పొందుతుంది.

సబ్ కాంపాక్ట్ సెడాన్: హోండా ఆమేజ్

ధర: రూ 5.60 లక్షలు - 9.0 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ప్రారంభం తేదీ: 16 మే 2018 (ప్రారంభ నివేదిక)

2018 Honda Amaze

రెండో తరం హోండా అమేజ్ సెడాన్, నాలుగు మీటర్ల తక్కువ పొడవును కలిగి ఉన్నా చాలా ఎక్కువ నిష్పత్తిలో కనిపించేలా ప్రదర్శించింది. 2018 హోండా అమేజ్ సెగ్మెంట్- మొట్టమొదటి 3- సంవత్సరాల / అపరిమిత కిలోమీటర్ వారంటీతో వస్తుంది. ఇంతే కాకుండా, ఇది ఒక ఆప్షనల్ సివిటి గేర్బాక్స్ ను పొందుతుంది. ఇది, పెట్రోల్ మరియు డీజిల్ ఇంజిన్ రెండిటితోనూ కలిగి ఉంది, ఇది సెగ్మెంట్లో డీజిల్- ఆధారిత మొట్ట మొదటి కారు. మరోవైపు ఈ వాహనం యొక్క అన్ని వేరియంట్ లలో ఏబిఎస్ తో ఈబిడి, బ్రేక్ అసిస్ట్, రివర్స్ పార్కింగ్ సెన్సార్లు, ఇంపాక్ట్ సెన్సింగ్ డోర్ లాక్స్, ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్లు మరియు అన్ని నాలుగు పవర్ విండోస్ తో పాటు ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్ వంటివి ప్రామాణికంగా అందించబడతాయి.

దీనిని, ఇతర వాహనాలతో పోల్చినప్పుడు మరింత ముందు స్థాయిలో ఉండటానికి, ఈ వాహనంలో ఎల్ఈడి పొజిషనింగ్ లాంప్లు, 15- అంగుళాల అల్లాయ్ చక్రాలు, పుష్ స్టార్ట్ / స్టాప్ బటన్, క్రూజ్ కంట్రోల్, పెడల్ షిఫ్ట్ (సివిటి- పెట్రోల్ ఇంజన్ లో మాత్రమే) మరియు ఆండ్రాయిడ్ ఆటోతో టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ (డిజిపాడ్ 2.0) తో ఆపిల్ కార్ప్లే మరియు అంతర్నిర్మిత నావిగేషన్ వంటి అంశాలు అందించబడ్డాయి.

ఈ వాహనం, 1.2 లీటర్ పెట్రోల్ మరియు ఒక 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ లతో కొనుగోలుదారులకు అందుబాటులో ఉంది - ముందు వెర్షన్ వలె అదే విధమైన ఇంజిన్ల ద్వారా ఇది కొనసాగుతోంది. ఇంజిన్ల ఇంధన సామర్ధ్యం వరుసగా 19.5 కెఎంపిఎల్ మరియు 27.4 కెఎంపిఎల్ వరకు పెరిగాయి.

క్రాస్ఓవర్స్ & సబ్ కాంపాక్ట్ ఎస్యువి లు: ఫోర్డ్ ఫ్రీస్టైల్

ధర: రూ .5.09 లక్షలు - రూ. 7.89 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ప్రారంభ తేదీ: 26 ఏప్రిల్ 2018 (ప్రారంభ నివేదిక)

Ford Freestyle

ఫోర్డ్ సంస్థ, ఈ ఏడాది ఏప్రిల్ నెలలో ఫిగో యొక్క క్రాస్-హాచ్ వెర్షన్, ఫ్రీస్టైల్ను విడుదల చేసింది. అనుకున్నట్లుగా, అది ఎత్తైన గ్రౌండ్ క్లియరెన్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్, అన్నివైపులా బాడీ క్లాడింగ్, పెద్ద చక్రాలు మరియు ప్రొనౌన్స్డ్ వీల్ ఆర్చులు వంటి సాధారణ క్రాస్-హచ్ అంశాలతో వచ్చింది. రాబోయే ఫోర్డ్ ఫిగో ఫెసిలిఫ్ట్ ఆధారంగా, ఫ్రీస్టైల్ కొత్త మెష్ గ్రిల్ మరియు స్వల్ప క్రోమ్ లను హెడ్ల్యాంప్ క్లస్టర్ లో అందించింది.

ఫోర్డ్ ఫ్రీస్టైల్ వాహనంలో, ఫోర్డ్ యొక్క తాజా 'డ్రాగన్' కుటుంబానికి చెందిన ఒక 1.2-లీటర్ 3 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ మరియు అవుట్గోయింగ్ ఫిగో లో ఉన్న 1.5 లీటర్ డీజిల్ ఇంజిన్ లను కలిగి ఉంది. ఈ రెండు ఇంజన్లు కొత్త 5- స్పీడ్ మాన్యువల్ గేర్బాక్స్ తో జత చేయబడ్డాయి. అయితే, ఒక్క ఆటోమేటిక్ గేర్బాక్స్ కూడా లేకపోవడం ఫోర్డ్ యొక్క ప్రతికూలత అని చెప్పవచ్చు.

ఈ వాహనంలో, ఆటో క్లైమేట్ కంట్రోల్, పుష్- బటన్ ఇంజిన్ స్టార్ట్ స్టాప్, ఆటో డిమ్మింగ్ ఇన్సైడ్ రేర్ వ్యూ మిర్రర్ (ఐవిఆర్ఎం), ఆటో హెడ్ల్యాంప్స్, వెనుక-వ్యూ కెమెరా మరియు రైన్ సెన్సింగ్ వైపర్స్ వంటి ఫీచర్లు అందించబడ్డాయి. అంతేకాకుండా, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే కనెక్టివిటీతో కూడిన 6.5- అంగుళాల సింక్రనైజ్ 3 టచ్స్క్రీన్ వ్యవస్థ కూడా అందుబాటులో ఉంది. భద్రత పరంగా ఈ వాహనంలో, ద్వంద్వ ముందు ఎయిర్ బాగ్స్, ఏబిఎస్ తో ఈబిడి, వెనుక పార్కింగ్ సెన్సార్స్, ఆటో డోర్ లాక్ మరియు హై వే స్పీడ్ హెచ్చరికలు, బేస్ వేరియంట్ నుండి ప్రామాణికంగా అందించబడ్డాయి. అంతేకాకుండా, ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లు, ఈఎస్పి (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్), టిసి (ట్రాక్షన్ కంట్రోల్), హెచ్ఎల్ఏ (హిల్ లాంచ్ అసిస్ట్) మరియు ఆరు ఎయిర్బాగ్లు వంటి కీలకమైన భద్రతా అంశాలు కూడా అందుబాటులో ఉన్నాయి.

కాంపాక్ట్ సెడాన్ : టయోటా యారిస్

ధర: రూ 8.75 లక్షలు - రూ 14.07 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ప్రారంభ తేదీ: 18 మే 2018 (ప్రారంభ నివేదిక)

Toyota Yaris

కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్లో కొనుగోలుదారులను అనేక ఎంపికలను ఇవ్వడంతో, మే నెలలో టొయోటా దాని నూతన- సమర్పణ అయిన యారిస్ను ప్రవేశపెట్టింది. దాని ప్రత్యర్ది వాహనాలతో పోలిస్తే స్వల్ప ప్రీమియమ్ ధరకే నిర్ణయించబడింది, 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో పాటు దాని వేరియంట్లు అన్నింటిలోను ఒక వైకల్పిక సివిటి గేర్బాక్స్ తో అందించే ఏకైక వాహనం, టొయోటా యారిస్. భద్రతా అంశాల పరంగా ఒక అడుగు ముందు ఉన్నదనే చెప్పవచ్చు. ఎందుకంటే, ఈ టయోటా సెడాన్, సెగ్మెంట్ ఫస్ట్ ఏడు ఎయిర్బాగ్స్, ఏబిఎస్ తో ఈబిడి మరియు బ్రేక్ అసిస్ట్, అన్ని నాలుగు చక్రాలకు డిస్క్ బ్రేక్లు మరియు ఐసోఫిక్స్ చైల్డ్ సీటు యాంకర్లు వంటి అంశాలు ప్రామాణికంగా అందించబడ్డాయి.

టొయోటా యారిస్- ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, డే టైమ్ రన్నింగ్ ఎల్ఈడి లను, ఎల్ఈడి గ్రాఫిక్స్ తో టెయిల్ లాంప్స్, ఆటో క్లైమేట్ కంట్రోల్, రూఫ్ మౌంటెడ్ వెనుక ఏసి వెంట్స్, 7-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు పవర్ తో పనిచేసే డ్రైవర్ సీటు వంటి అందాలను పొందుతుంది.

దాని ప్రత్యర్ధి వాహనాల మాదిరిగా కాకుండా, యారిస్ ఒక పెట్రోల్ ఇంజిన్ తో మాత్రమే ఇవ్వబడుతుంది - దీనిలో అందించబడిన 1.5 లీటర్ మోటారు, గరిష్టంగా 108 పిఎస్ యొక్క గరిష్ట శక్తిని మరియు 140 ఎన్ఎమ్ గల గరిష్ట టార్క్ ను విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంది. ఈ యారిస్ యొక్క ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే, 17.8 కెఎంపిఎల్ గల మైలేజ్ ను సమర్ధవంతంగా ఇవ్వగలదు.

కాంపాక్ట్ ఎస్యువి లు: హ్యుందాయ్ క్రెటా

ధర: రూ. 9.44 లక్షల - రూ .15.04 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ప్రారంభం తేదీ: 21 మే 2018 (ప్రారంభ నివేదిక)

2018 Hyundai Creta

దక్షిణ కొరియా వాహన తయారీ సంస్థ హ్యుందాయ్, మే 2018 లో దాని అత్యంత విజయవంతమైన క్రెటా ఎస్యూవిని నవీకరించింది. కొన్ని మార్పులు మినహాయించి, 2018 హ్యుందాయ్ క్రెటాలో మిగిలినవి చెక్కుచెదరకుండా వాటినే కొనసాగించింది. అయితే, ఈ వాహనంలో అతి పెద్ద మార్పు ఏమిటంటే, సన్రూఫ్. ఇది, ఒక సవరించిన ముందు మరియు వెనుక బంపర్లు, ఒక కొత్త గ్రిల్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్ (దాని ముందు వాహనాలకు సమానమైనది) మరియు 17 -అంగుళాల మెషీన్ ఫినిష్డ్ అల్లాయ్ వీల్స్ ను పొందుతుంది. క్యాబిన్, ఇంతకు ముందు అందించబడిన డ్యూయల్ -టోన్ బ్లాక్-బీజ్ థీమ్ తో అదే విధంగా కొనసాగుతుంది.

ఈ వాహనం యొక్క యాంత్రిక పరంగా ఎటువంటి మార్పులను కలిగి లేనప్పటికీ, ఇది అదే 1.6 లీటర్ మరియు 1.4 లీటర్ డీజిల్ ఇంజిన్లను మరియు 1.6 లీటర్ పెట్రోల్ మోటర్ను ఆతిథ్యం ఇస్తుంది. పెద్ద ఇంజిన్లకు, 6 స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ లభిస్తుంది.

కాంపాక్ట్ ఎస్యువిలు: మహీంద్రా ఎక్స్యూవి 500 ఫేస్ లిఫ్ట్

ధర: రూ. 12.39 లక్షలు - రూ. 19.05 లక్షలు (ఎక్స్ షోరూమ్, ఢిల్లీ)

ప్రారంభం తేదీ: 18 ఏప్రిల్ 2018 (ప్రారంభ నివేదిక)

2018 Mahindra XUV 500

మహీంద్రా సంస్థ, ఈ ఏడాది ఏప్రిల్లో ఎక్స్యూవి 500 ను భారతదేశంలో తన ప్రధాన ఎస్యూవి రెండో ఫేస్లిఫ్ట్ను ప్రవేశపెట్టింది. దాని మునుపటి విజయవంతం అయిన బిట్స్లో ఎక్కువ భాగం నిలబెట్టుకున్నప్పటికీ, అది ఇప్పుడు క్రోమ్ తో నిండిన మెష్ గ్రిల్, పునఃరూపకల్పన చేయబడిన ఫాగ్ లాంప్ హౌసింగ్లు, ఒక పెద్ద సెంట్రల్ ఎయిర్ డ్యామ్, ఎల్ఈడి డిఆర్ఎల్ఎస్ ల యొక్క కొత్త లేఅవుట్, ఒక కొత్త త్రిభుజాకారంతో చుట్టబడిన టెయిల్ లాంప్స్ డిజైన్ మరియు 17 అంగుళాల అల్లాయ్ చక్రాలు వంటి అంశాలతో అందించబడింది. క్యాబిన్ ముందు వలె అలాగే ఉండిపోయింది, కానీ అదనంగా కొత్త రంగులు మరియు సామగ్రితో మరింత అందంగా కనబడుతుంది.

భద్రత మరియు సౌలభ్యాన్ని మెరుగుపరిచే ముందు వెర్షన్ లో ఉన్న అవే లక్షణాలతో కొనసాగింది. ఈ వాహనం- క్రూజ్ నియంత్రణ, టిల్ట్ మరియు టెలీస్కోపిక్ స్టీరింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, ఆరు విధాలుగా పవర్ తో సర్దుబాటయ్యే డ్రైవర్ సీటు, విద్యుత్ సర్దుబాటు మరియు మడత సర్దుబాటు కలిగిన ఓఆర్విఎం లు, డిఆర్ఎల్ఎస్ లతో కూడిన ఆటోమేటిక్ ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, డైనమిక్ మార్గదర్శకాలతో కూడిన రివర్స్ పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మోనిటరింగ్ వ్యవస్థ, రైన్ సెన్సింగ్ వైపర్స్, పుష్ బటన్ స్టార్ట్ మరియు రీజనరేటివ్ బ్రేకింగ్ వంటి అంశాలను పొందుతుంది.

బోనెట్లో, వివరాలు ముందు వెర్షన్ లో వలె ఉంటాయి. ఇది 2.2 లీటర్ ఎమ్ హాక్ డీజిల్ మరియు ఒక 2.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ చేత నడుపబడుతోంది.

లగ్జరీ క్రాస్ఓవర్: వోల్వో ఎక్స్ సి40

ధర: రూ 39.9 లక్షలు - రూ 43.9 లక్షలు (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ)

ప్రారంభం తేదీ: 04 జూలై 2018 (ప్రారంభ నివేదిక)

Volvo XC 40

2.0 లీటర్ డీజిల్ ఇంజిన్తో అందుబాటులో ఉన్న వోల్వో ఎస్యువి, ఎక్స్ సి40 అత్యంత సరసమైనది. మూడు వేరియంట్లలో అందుబాటులో ఉన్న వోల్వో ఎక్స్ సి40 అనేది స్వీడిష్ కంపెనీ యొక్క అతి చిన్న కాంపాక్ట్ మాడ్యులర్ ఆర్కిటెక్చర్ (సిఎంఏ) ప్లాట్ఫారమ్ పై ఆధారపడిన మొట్టమొదటి కారు.

వోల్వో, సరిపడినన్ని ఫీచర్లతో అందుబాటులో ఉంది ఆ ఫీచర్ల జాబితా ఒక బ్రోచర్ లో వివరంగా అందించబడింది. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం, వరుసగా- ఎల్ఈడి హెడ్ లాంప్లతో యాక్టివ్ బెండింగ్ ఫీచర్, ఒక విస్తృత సన్రూఫ్, వైర్లెస్ ఛార్జింగ్, హ్యాండ్స్-ఫ్రీ బూట్ ఓపెనింగ్, వూఫెర్ టెక్నాలజీతో 13 స్పీకర్ హర్మాన్ కార్డాన్ ఆడియో సిస్టమ్ మరియు ఆండ్రాయిడ్ ఆటో తో పాటు ఆపిల్ కార్ ప్లే తో 9 అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టంతో కూడిన ఎల్ఈడి హెడ్ల్యాంప్స్ వంటివి అందించబడ్డాయి.

భద్రత విషయానికి వస్తే ముందు భాగంలో- డ్రైవర్, ప్రయాణీకుడు మరియు సైడ్ ఎయిర్ బాగ్స్ అలాగే పైలట్ అసిస్ట్, అడాప్టివ్ క్రూజ్ నియంత్రణ, ఎలక్ట్రానిక్ స్థిరత్వ నియంత్రణ, హిల్ డీసెంట్ కంట్రోల్ మరియు సిటీ సేఫ్టీ కూడా ప్యాకేజీలో భాగంగా ఉన్నాయి. ఇతర వాహనాలు, పిల్లలు లేదా జంతువులతో ఏదైనా ఘర్షణకు గురయ్యే అవకాశం ఉన్నదని గుర్తించినట్లయితే సిటీ సేఫ్టీ లక్షణం స్వయంచాలకంగా బ్రేక్లను వర్తిస్తుంది. స్టీరింగ్ ఇన్పుట్లను స్వాధీనం చేయడం ద్వారా సమాంతర పార్కింగ్లో సహాయపడే పైలట్ లక్షణాన్ని పార్కింగ్ కు కూడా అందిస్తుంది.

సిఫార్సు చేయబడినవి: 2018 మారుతి సుజుకి సియాజ్ ప్రారంభానికి ముందే బహిర్గతం అయ్యింది

మరింత చదవండి: యారిస్ ఆన్ రోడ్ ధర


 

was this article helpful ?

Write your Comment on Toyota యారీస్

explore similar కార్లు

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience