సెగ్మెంట్లలో పోరు: టొయోట యారీస్ vs హ్యుందాయ్ క్రెటా- ఏ కారు కొనాలి?

హ్యుందాయ్ క్రెటా 2015-2020 కోసం dinesh ద్వారా ఏప్రిల్ 20, 2019 12:31 pm ప్రచురించబడింది

  • 27 సమీక్షలు
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

Yaris vs Creta

ఇది రూ. 9.43 లక్షల నుంచి రూ.15.03 లక్షల(ఎక్స్ షోరూం ఢిల్లీ) ధరతో క్రెటా కారు రెనాల్ట్ కాప్చర్ మరియు మారుతి S-క్రాస్ వంటి వాటితో మాత్రమే పోటీ పడడంలేదు, ఇదే ధరను కలిగినటువంటి కొన్ని మిడ్ సైజ్ సెడాన్లతో కూడా పోటీ పడుతుంది. అలాంటి సెడాన్ ఒకటి టొయోటా యారీస్, ఇది రూ. 8.75 లక్షల నుంచి రూ. 14.07 లక్షలు మధ్య ధరను కలిగి ఉంటుంది. కాగితంపై ఈ రెండు ఒకే విధమైన ధరలు కలిగి ఉన్న కార్లు ఏ విధంగా పోటీ పడుతున్నాయో చూద్దాం.     

వివరాలలోనికి వెళ్లడానికి ముందు, ఇక్కడ ప్రాథమిక వ్యత్యాసాలు ఉన్నాయి:

టయోటా యారీస్

హ్యుందాయ్ క్రెటా

ఒక మిడ్ సైజ్ సెడాన్: యారీస్ ప్రారంభంతో, టొయోటా 2018 లో భారతదేశంలో మిడ్ సైజ్ సెడాన్ స్పేస్ లో ప్రవేశించింది. యారిస్ క్యాబిన్ కూర్చొనే వారికి సౌకర్యాన్ని మరియు లక్షణాలని అందించడం పై దృష్టి సారించింది. కానీ యారీస్ లో హాయిగా 4 మనుషులు కూర్చోవచ్చు, ఫ్రంట్ ఆరంరెస్ట్ యొక్క ప్లేస్మెంట్ మధ్య వెనుక ప్రయాణీకుల లెగ్‌రూం ని తినేసింది. సంఖ్యల గురించి మాట్లాడుకుంటే క్రెటా  920mm గరిష్ట నీ(మోకాలు) రూం ని కలిగి ఉంది, యారిస్ కారు 815mm గా ఉంది. యారీస్ 476 లీటర్ల రేటెడ్ బూట్ స్పేస్ ని కలిగి ఉంది, ఇది మరింత లగేజీని కల్పించడానికి విస్తరించబడింది.

ఒక కాంపాక్ట్ SUV: క్రెటా అనేది 5-సీట్ల SUV , ఇది ఇటీవల భారతదేశంలో మిడ్ లైఫ్ ఫేస్లిఫ్ట్ ని పొందింది. యారిస్ వలే క్రెటా యొక్క క్యాబిన్ కూడా మంచి అనుభూతిని అందించే లక్షణాలను కలిగి ఉంది, అలాగే 4 మరియు 5 మంది కూర్చోడానికి సౌకర్యంగా ఉంటుంది. దీనిలో వెనకాతల ఉన్న  షోల్డర్ రూం కి కృతజ్ఞతలు ఉన్నాయి. 1275mm వద్ద, యారిస్ వెనుక భాగంలో ఉన్న షోల్డర్ రూం క్రెటా యొక్క షోల్డర్ రూం (1250mm) కంటే ఎక్కువ మరియు దానిని ఈ విషయంలో ఓడించింది. క్రెటా కారు యొక్క బూట్ సామర్ధ్యం 400 లీటర్స్. వెనుక సీట్లు ఫోల్డ్ చేయడం ద్వారా దీనిని మరింత పెంచుకోవచ్చు. SX AT వేరియంట్ 60:40 స్ప్లిట్ అదనంగా కలిగి ఉండి మరింత పాండిత్యము జతచేస్తుంది.

భద్రత ప్రాధాన్యతగా ఉంది: దాని తరగతి లో యారీస్ అత్యంత శ్రేష్ఠమైన కారుగా ఉంది, ప్రత్యేకంగా దాని తక్కువ వేరియంట్స్ ని మీరు పరిగణనలోకి తీసుకుంటే. ఇది సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లు అయిన ఏడు ఎయిర్బాగ్స్ (ఇవి ఆ రేంజ్ లో ప్రామాణికమైనవి), ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్ మరియు రూఫ్-మౌంటెడ్ A.C వెంట్స్ వంటి లక్షణాలను కలిగి ఉంది.

ఉన్నతమైన భద్రతా లక్షణాలు: నవీకరణతో, క్రెటాకు కొత్త లక్షణాల సమూహం లభించింది. వీటిలో, హైలైట్ ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, ఇది సెగ్మెంట్ లో మొదటిది. అయితే, ఇది రెండు వేరియంట్లలో మాత్రమే లభిస్తుంది: టాప్-స్పెక్ SX (O) మరియు SX AT.

పోటీ: హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా, మారుతి సియాజ్, వోక్స్వాగన్ వెండో మరియు స్కోడా రాపిడ్

పోటీ: మారుతి S-క్రాస్, రెనాల్ట్ క్యాప్చర్ మరియు రెనాల్ట్ డస్టర్

Yairs Vs Creta

ఇంజన్: అయితే క్రెటాను 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో ఉండగా, యారీస్ చిన్న 1.5 లీటర్ మోటర్ ని పొందుతుంది. యారీస్ ఇంజిన్ చిన్నది మాత్రమే కాదు, పేపర్ మీద చూస్తే ఈ రెండిటిలో తక్కువ శక్తివంతమైనది కూడా. ట్రాన్స్మిషన్ కు సంబంధించినంత వరకు, రెండు కార్లు 6-స్పీడ్ మన్యువల్ ట్రాన్స్మిషన్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో లభిస్తున్నాయి, అయితే వేర్వేరు రకాలు. అయితే క్రెటా 6 స్పీడ్ టార్క్ కన్వర్టర్ యూనిట్ ని కలిగి ఉంది, యారిస్ కారు పెడల్ షిఫ్టర్స్ తో 7-స్పీడ్ CVT తో అందించబడుతుంది.

వేరియంట్లు మరియు లక్షణాలు:

హ్యుందాయ్ క్రెటా E vs టొయోటా యారీస్ J

ఈ రెండు కార్లు పెట్రోల్ MT వేరియంట్లు రూ .10 లక్షల లోపు ధరతో అందుబాటులో ఉన్నాయి. అయితే వాటి మధ్య ధర వ్యత్యాసం చాలా ముఖ్యమైనది. యారీస్ J వేరియంట్ ధర రూ. 8.75 లక్షలు, క్రెటా E రూ. 9.43 లక్షలు ధర కలిగి ఉంది.

హ్యుందాయ్ క్రెటా E

రూ. 9.43 లక్షలు

టయోటా యారీస్ J

రూ. 8.75 లక్షలు

తేడా

రూ. 68,000 (క్రెటా ఖరీదైనది)

సాధారణ లక్షణాలు: డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్బ్యాగ్స్, EBD తో ABS, మాన్యువల్ AC, టిల్ట్ అడ్జస్టబుల్ స్టీరింగ్, నాలుగు పవర్ విండోస్, ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీట్ మరియు కీలెస్ ఎంట్రీ.

Hyundai Creta

యారీస్ పై క్రెటా కలిగి ఉన్నఅదనపు లక్షణాలు: వెనుక AC వెంట్స్

Toyota Yaris

క్రెటా పై  యారీస్ కలిగి ఉన్నఅదనపు లక్షణాలు: సైడ్, కర్టెన్ మరియు డ్రైవర్ మోకాలి ఎయిర్బాగ్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMs, బేసిక్ మ్యూజిక్ వ్యవస్థ మరియు 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు.

తీర్పు:

మీరు టైట్ బడ్జెట్ లో ఉంటే గనుక, మేము యారీస్ కోసం వెళ్ళమని మీకు సిఫార్సు చేస్తాము. ఇది మరింత సరసమైనది మాత్రమే కాదు, క్రెటా E లో లేనటువంటి చాలా ఎక్కువ లక్షణాలను అందిస్తుంది.

హ్యుందాయ్ క్రెటా E+ Vs టయోటా యారీస్ G

హ్యుందాయ్ క్రెటా E+

రూ. 9.99 లక్షలు

టయోటా యారీస్ G

రూ. 10.56 లక్షలు

తేడా

రూ. 57,000 (యారీస్ ఖరీదైనది)

సాధారణ లక్షణాలు (మునుపటి వేరియంట్లలో): ORVMs మీద LED టర్న్ ఇండికేటర్స్, ఎలక్ట్రికల్ సర్దుబాటు ORVMs, వెనుక A.C వెంట్స్, టచ్‌స్క్రీన్ మ్యూజిక్ సిస్టమ్ మరియు స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్స్.

యారీస్ పై క్రీటా కలిగి ఉన్నఅదనపు లక్షణాలు: లేవు

Toyota Yaris

క్రెటా పై యారీస్ కలిగి ఉన్నఅదనపు లక్షణాలు: సైడ్, కర్టెన్ మరియు డ్రైవర్ మోకాలి ఎయిర్బ్యాగ్, వెనుక పార్కింగ్ సెన్సార్స్, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఫ్రంట్ మరియు రియర్ ఫాగ్ లాంప్స్, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ORVMs, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, పుష్ బటన్ స్టార్ట్ మరియు 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు.

తీర్పు:

యారిస్ ఖచ్చితంగా రెండిటి మధ్య మంచి ఎంపికగా ఉంది మరియు క్రెటా పైగా దీని అధిక ధర బాగా న్యాయం చేస్తుంది. కాబట్టి, మీరు క్రెటా E + ను కొనుగోలు చేయడానికి ప్రణాళిక చేస్తే గనుక, మీ బడ్జెట్ ను విస్తరించి యారీస్ G కోసం వెళ్తే గనుక మరింత ప్రీమియం కారుని కొనుగోలు చేసినట్టు అవుతుంది.

హ్యుందాయ్ క్రెటా SX vs టయోటా యారీస్ V

హ్యుందాయ్ క్రెటా SX

రూ. 11.94 లక్షలు

టయోటా యారీస్ V

రూ. 11.70 లక్షలు

తేడా

రూ. 24,000 (క్రెటా ఖరీదైనది)

సాధారణ ఫీచర్లు (మునుపటి వేరియంట్లలో): రివర్స్ కెమెరా తో రివర్ పార్కింగ్ సెన్సార్లు, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్లీ ఫోల్డబుల్ ORVM లు, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు క్రూయిజ్ కంట్రోల్.Hyundai Creta

యారీస్ పై  క్రెటా కలిగి ఉన్న అదనపు లక్షణాలు: LED DRLs, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్లింక్ మద్దతు మరియు ఆర్కేంస్ సౌండ్ -ట్యూన్డ్ మ్యూజిక్ సిస్టమ్.

Toyota Yaris

క్రీటాపై యారిస్ కలిగి ఉండే అదనపు లక్షణాలు: సైడ్, కర్టెన్ మరియు డ్రైవర్ మోకాలి ఎయిర్బాగ్, వెనుక డిస్క్ బ్రేక్లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, వెనుక ఫాగ్ లాంప్స్, ఆటోమేటిక్ హెడ్ల్యాంప్స్, వర్షం సెన్సింగ్ వైపర్లు మరియు 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు.

తీర్పు : యారీస్, మరింత సరసమైనది ఉండగా, క్రెటా కంటే మరింత భద్రమైనది మరియు సౌకర్యవంతమైన లక్షణాలు కలిగి ఉన్న ప్యాక్. ఎవరైతే బాడీ స్టయిల్  ప్రత్యేఖంగా ఉండాలి అని ఆలోచించరో వారికి యారిస్ సరైన ఎంపిక.

అయితే, దాని అర్ధం క్రెటా డబ్బుకి విలువని అందించదు అని కాదు. ఒక ప్యాకేజీగా, దాని పరిమాణంలోని SUV నుండి మీరు ఆశించిన అనేక లక్షణాలను కలిగి ఉంటుంది. అందువలన, ఎవరైతే అధిక సీటింగ్ స్థానం కోసం వాహనం ఎంపిక చేయాలనుకుంటే, వారికి క్రెటా విలువైనది.  

హ్యుందాయ్ క్రెటా SX AT Vs టొయోటా యారిస్ V CVT

అయితే క్రెటా SX వేరియంట్ లో మాత్రమే ఒక ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో లభిస్తుంది, యారిస్ బేస్ స్పెక్ J వేరియంట్ నుండి ఒక CVT ఎంపికను కూడా పొందుతుంది.

హ్యుందాయ్ క్రెటా SX AT

రూ. 13.43 లక్షలు

టయోటా యారీస్ V CVT

రూ. 12.90 లక్షలు

తేడా

రూ. 53,000 (క్రెటా ఖరీదైనది)

సాధారణ లక్షణాలు: రివర్స్ కెమెరా తో రేర్ పార్కింగ్ సెన్సార్లు, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, అల్లాయ్ వీల్స్, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ORVMs, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు క్రూయిజ్ కంట్రోల్.

Hyundai Creta

యారీస్ పై క్రీటా కలిగి ఉండే అదనపు లక్షణాలు: ISOFIX చైల్డ్ సీటు యాంకర్స్, విద్యుత్ సన్రూఫ్, LED DRLs, ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్లింక్ మద్దతు మరియు ఆర్కంస్ సౌండ్ ట్యూన్డ్ సౌండ్ సిస్టమ్.

Toyota Yaris

క్రీటా పై యారిస్ కలిగి ఉన్న అదనపు లక్షణాలు: సైడ్, కర్టెన్ మరియు డ్రైవర్ మోకాలి ఎయిర్బాగ్, వెనుక డిస్క్ బ్రేక్లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, వెనుక ఫాగ్ లాంప్స్, ఆటోమేటిక్ హెడ్ల్యాంప్స్ మరియు రెయిన్ సెన్సింగ్ వైపర్స్.

తీర్పు: క్రెటా సన్రూఫ్ మరియు ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో కనెక్టివిటీతో ఆడియో సిస్టమ్ ని పొందుతున్నటువంటి మరింత ఆకర్షణీయమైన కారుగా చెప్పవచ్చు మరియు చాలా మందికి మైండ్ లో లేంటువంటి లక్షణాలు అయిన ఆటోమేటిక్ హెడ్ల్యాంప్స్ మరియు రెయిన సెన్సింగ్ వైపర్స్ వంటి లక్షణాలను కూడా కలిగి ఉంది.

కానీ మళ్ళీ ఇక్కడ చెప్పాలంటే యారీస్ అందించే అదనపు భద్రత లక్షణాలను పూర్తిగా ఇక్కడ రాయలేము. మీరు బాడీ స్టయిల్ కోసం ప్రత్యేఖంగా చూడకుండా ఉండి కుటుంబం కోసం మంచి కారు కావాలి అనుకుంటున్నారా మరియు తరచుగా హైవే మీద వెళ్ళడానికి బాగుండాలి అనుకుంటున్నారా అటువంటి వారికి ఇది మంచి ఎంపిక. క్రెటా సన్రూఫ్ మరియు ఇతర అదనపు ఫీచర్లతో ఫాన్సీ కారులా అనిపిస్తుంది, అది ఇప్పటికీ డబ్బు కోసం మంచి విలువను అందిస్తుంది దీనికోసం వెళ్ళండి.  

హ్యుందాయ్ క్రీటా SX డ్యూయల్ టోన్ vs టయోటా యారీస్ VX

Hyundai Creta Dual Tone

 

హ్యుందాయ్ క్రెటా డ్యూయల్ టోన్

రూ. 12.44 లక్షలు

టయోటా యారీస్ VX

రూ. 12.85 లక్షలు

తేడా

రూ. 41,000 యారీస్ ఖరీదైనది)

సాధారణ లక్షణాలు: రివర్స్ కెమెరా తో  రివర్ పార్కింగ్ సెన్సార్లు, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, అల్లాయ్ వీల్స్, ఎలెక్ట్రిక్లీ ఫోల్డబుల్ ORVM లు, ప్రొజెక్టర్ హెడ్ల్యాంప్స్, ఫ్రంట్ ఫాగ్ లాంప్స్, పుష్ బటన్ స్టార్ట్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు క్రూయిజ్ కంట్రోల్.

యారీస్ పై క్రీటా కలిగి ఉండే అదనపు లక్షణాలు:

ఆపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్లింక్ మద్దతు మరియు ఆర్కామిస్ సౌండ్-ట్యూన్డ్ సౌండ్ సిస్టం.

క్రీటాపై యారిస్ కలిగి ఉండే అదనపు లక్షణాలు: సైడ్, కర్టెయిన్ మరియు నీ(మోకాలు) ఎయిర్బ్యాగ్, వెనుక డిస్క్ బ్రేకులు, ముందు పార్కింగ్ సెన్సార్స్, ఎలక్ట్రానిక్ సర్దుబాటు డ్రైవర్ సీటు, హిల్ స్టార్ట్ అసిస్ట్, వెహికెల్ స్టెబిలిటీ కంట్రోల్, టైర్ ప్రజర్ మానిటరింగ్, గెస్చర్ కంట్రోల్ తో ఇంఫోటైన్మెంట్,8-వే ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు, వెనుక ఫాగ్‌ల్యాంప్స్,ఆటోమేటిక్ హెడ్ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్స్ మరియు 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు.

తీర్పు: రూ.41,00 ప్రీమియం తో యారిస్ కారు క్రెటా పైన చాలా లక్షణాలను అందిస్తుంది. అయితే, డబ్బు కోసం విలువని అందించే కారుని గనుక చూసినట్లు అయితే రెండు కార్లలోనీ రెండవ టాప్ వేరియంట్ మంచి ఎంపిక. కానీ మీరు యారిస్ VX మరియు క్రెటా SX డ్యుయల్ టోన్ ఈ రెండిటిలోని ఏదో ఒకటి కొనుక్కోవాలనుకుంటే టాప్ వేరియంట్ యారిస్ VX మీకు మంచి ఎంపిక.

హ్యుందాయ్ క్రెటా SX(O) Vs టొయోటా యారీస్ VX

హ్యుందాయ్ క్రెటా SX(O)

రూ. 13.59 లక్షలు

టయోటా యారీస్ VX

రూ. 12.85 లక్షలు

తేడా

రూ. 74,000 (క్రెటా ఖరీదైనది)

సాధారణ ఫీచర్లు (మునుపటి వేరియంట్లలో):

సైడ్ మరియు కర్టెన్ ఎయిర్బాగ్స్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు మరియు ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ డ్రైవర్ సీటు.

Hyundai Creta

యారీస్ పై క్రీటా అందించే అదనపు లక్షణాలు:

వెహికెల్ స్టెబిలిటీ మేనేజ్మెంట్ కంట్రోల్,స్మార్ట్ కీ బ్యాండ్, విద్యుత్ సన్రూఫ్, వైర్లెస్ మొబైల్ ఛార్జర్, యాపిల్ కార్ప్లే, ఆండ్రాయిడ్ ఆటో మరియు మిర్రర్లింక్ మద్దతు మరియు ఆర్కామిస్ సౌండ్ ట్యూన్డ్ సౌండ్ సిస్టం.

క్రీటా పై యారీస్ అందించే అదనపు లక్షణాలు:

డ్రైవర్ మోకాలి ఎయిర్బ్యాగ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్స్, టైర్ ప్రజర్ మోనిటరింగ్, గెస్చర్ కంట్రోల్ తో ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, వెనుక ఫాగ్‌ల్యాంప్స్, ఆటోమేటిక్ హెడ్ల్యాంప్స్, రెయిన్ సెన్సింగ్ వైపర్లు మరియు 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు.

తీర్పు: యారీస్ ఇక్కడ మరింత తెలివైన ఎంపిక, ఇది క్రెటా కంటే తక్కువ ధరకే లభించడం కాకుండా మరింత భద్రత మరియు ప్రయోజనకర లక్షణాలను అందిస్తుంది.  అయితే, మీరు సన్రూఫ్ తో ఒక కారు కోసం చూస్తున్నట్లయితే, క్రెటా SX(O) అనేది కేవలం ఒకే ఒక (మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో) ఇక్కడ అందించబడుతుంది. ప్రీమియం రూ. 74,000 తో క్రెటా SX(O) కారు యారిస్ కంటే ఎక్కువ ప్రీమియం ని కలిగి ఉంటుందని కొనుగోలుదారులకు భావన కలిగిస్తుంది.

Toyota Yaris

ఎందుకు యారీస్ కొనుగోలు చేసుకోవాలి:

భద్రత: భద్రతా లక్షణాలకు సంబంధించినంతవరకు, యారీస్ దాని విభాగంలోని అత్యంత సౌకర్యవంతమైన కార్లలో ఒకటి. ఇది ఏడు ఎయిర్ బాగ్స్ మరియు EBD తో ABS ను ప్రామాణికమైనదిగా పొందుతుంది. టాప్-ఆఫ్-లైన్ వేరియంట్లు ఫ్రంట్ మరియు వెనుక పార్కింగ్ సెన్సర్లు, వెహికెల్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ స్టార్ట్ అసిస్ట్ మరియు టైర్ ప్రజర్ మోనిటరింగ్ వ్యవస్థ వంటి లక్షణాలను కలిగి ఉంటాయి.  

బూట్ స్పేస్: 476 లీటర్ల వద్ద, ఈ పోలికలో యారీస్ పెద్ద బూట్ తో ఉంది.

ఆటోమెటిక్ వేరియంట్స్: యారీస్ బేస్ వేరియంట్ నుండి ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ యొక్క ఎంపికను అందిస్తున్న దాని సెగ్మెంట్ లో ఉన్న ఏకైక కారు. ఇది దేశంలో అత్యంత సరసమైన మధ్య స్థాయి ఆటోమేటిక్ పెట్రోల్ సెడాన్లలో ఒకటి.

NVH మరియు రైడ్ క్వాలిటీ: ధ్వని మరియు వైబ్రేషన్ కంట్రోల్ గ్లాస్ మరియు మందపాటి సైడ్ వాల్ టైర్లకు ధన్యవాదాలు, యారిస్ ఉత్తమ NVH స్థాయిలలో ఒకటి మరియు రూ. 20 లక్షల కంటే తక్కువ ధర ఉన్న కారులతో పోలిస్తే రైడ్ క్వాలిటీ బాగుంటుంది.

Hyundai Creta

ఎందుకు క్రెటా కారుని కొనుగోలు చేసుకోవాలి:

మరింత స్థలం: క్రెటా యొక్క క్యాబిన్ మంచి గాలిని అందిస్తుందని చెప్పుకోవచ్చు, దీనికిగానూ హెడ్‌రూం కి ధన్యవాధాలు తెలుపుకోవాలి మరియు యారిస్ కంటే ఇది మొత్తంగా పెద్దది కూడా. ఇది ఐదుగురు వ్యక్తులు కూర్చొనేందుకు తప్పకుండా మంచి కారుగా ఉంటుంది.

ఎలక్ట్రిక్ సన్రూఫ్: మీరు ఎక్కువగా ఎలక్ట్రిక్ సన్‌రూఫ్ కావాలనుకుంటే మాత్రం క్రెటా మాత్రమే ఇక్కడ అది అందించే ఏకైక కారు.+

 

శక్తివంతమైన ఇంజన్: క్రెటా యొక్క 1.6 లీటర్ పెట్రోల్ ఇంజిన్ పోలిస్తే ఇది మరింత శక్తివంతమైనది. వాస్తవానికి, దాని తరగతిలో కూడా ఇది చాలా శక్తివంతమైనది.


 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన హ్యుందాయ్ క్రెటా 2015-2020

Read Full News

explore similar కార్లు

Used Cars Big Savings Banner

found ఏ కారు యు want నుండి buy?

Save upto 40% on Used Cars
  • quality వాడిన కార్లు
  • affordable prices
  • trusted sellers

కార్ వార్తలు

  • ట్రెండింగ్ వార్తలు
  • ఇటీవల వార్తలు

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience