హోండా సిటీ, మారుతి సియాజ్ కంటే ఎక్కువగా ఉన్న టయోటా యారీస్ యొక్క సగటు వెయిటింగ్ పిరియడ్
మారుతి సియాజ్ కోసం dhruv attri ద్వారా మే 21, 2019 12:03 pm ప్రచురించబడింది
- 15 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
పూణే, చండీగఢ్ మరియు ఇండోర్ వంటి నగరాలలో దాదాపుగా కార్లు అందుబాటులో ఉండగా, ఢిల్లీ మరియు ముంబై నగరాల్లో కొనుగోలుదారులు కొంచెం ఎక్కువ కాలం వేచి ఉండవలసి ఉంటుంది.
- గరిష్టంగా 20 రోజులు, హోండా సిటీ కోసం వేచి ఉండటం అనేది చాలా తక్కువ.
- సియాజ్ యొక్క వెయిటింగ్ పిరియడ్ అనేది మూడు నుండి నాలుగు వారాల మధ్య ఉంటుంది.
- హ్యుందాయి వెర్నా గనుక మీకు రావాలనుకుంటే కనీసం ఒక నెల వేచి ఉండాలి, అది కూడా మీరు ఉన్న సిటీ పై అది ఆధారపడి ఉంటుంది.
- VW వెంటో మరియు యారీస్ కార్ల కోసం వేచి ఉండాల్సిన కాలం 15 రోజులు మరియు 45 రోజులు మధ్య ఉంటుంది.
మీ పేపర్ వర్క్ అన్నీ పూర్తి చేసిన తర్వాత కూడా మీ కారు కోసం వేచి ఉండటం అనేది కొంచెం ఇబ్బందికరమే అని చెప్పాలి. ముఖ్యంగా కాంపాక్ట్ సెడాన్ల విషయానికి వస్తే, యారీస్ వంటి కార్ల కోసం వేచి ఉండే కాలం కనీసం 3 నెలల వరకు ఉంటుంది. మీ యొక్క కొనుగోలు అనేది ఇంకా కొంచెం మెరుగ్గా ఉండాలంటే భారత దేశంలో ప్రధాన నగరాలలో ఎంత వెయిటింగ్ పిరియడ్ ఉందో ఇక్కడ మేము పొందుపరుచాము, చూద్దాము పదండి.
హోండా సిటీ |
మారుతి సియాజ్ |
హ్యుందాయ్ వెర్నా |
వోక్స్వ్యాగన్ వెంటో |
టయోటా యారీస్ |
|
ఢిల్లీ |
1 వారం |
4 వారాలు |
20 రోజులు |
15 రోజులు |
1 నెల |
గుర్గాం |
1 వారం |
1 నెల |
1 నెల |
15 రోజులు |
3 వారాలు |
నోయిడా |
వెయిటింగ్ పిరియడ్ లేదు |
4 వారాలు |
వెయిటింగ్ పిరియడ్ లేదు |
15 రోజులు |
1 నెల |
బెంగళూరు |
20 రోజులు |
4 వారాలు |
10 రోజుల |
వెయిటింగ్ పిరియడ్ లేదు |
వేచి లేదు |
ముంబై |
15 రోజులు |
4 వారాలు |
1 నెల |
15 రోజులు |
20 రోజులు |
హైదరాబాద్ |
వెయిటింగ్ పిరియడ్ లేదు |
3 వారాలు |
10 రోజుల |
15 రోజులు |
15 రోజులు |
పూనే |
వెయిటింగ్ పిరియడ్ లేదు |
వెయిటింగ్ పిరియడ్ లేదు |
15 రోజులు |
15 రోజులు |
45 రోజులు |
చెన్నై |
15 రోజులు |
4 వారాలు |
10 రోజుల |
15 రోజులు |
45 రోజులు |
జైపూర్ |
వెయిటింగ్ పిరియడ్ లేదు |
4 వారాలు |
15 రోజులు |
15 రోజులు |
1 నెల |
అహ్మదాబాద్ |
10 రోజులు |
4 వారాలు |
15 రోజులు |
వెయిటింగ్ పిరియడ్ లేదు |
45 రోజులు |
లక్నో |
10 రోజులు |
4 వారాలు |
1 నెల |
15 రోజులు |
45 రోజులు |
కోలకతా |
వెయిటింగ్ పిరియడ్ లేదు |
4 వారాలు |
వెయిటింగ్ పిరియడ్ లేదు |
వెయిటింగ్ పిరియడ్ లేదు |
45 రోజులు |
చండీగఢ్ |
1 వారం |
వెయిటింగ్ పిరియడ్ లేదు |
10 రోజుల |
15 రోజులు |
3 నెలలు |
పాట్నా |
1 వారం |
4 వారాలు |
10 రోజుల |
15 రోజులు |
25 రోజులు |
ఇండోర్ |
10 రోజులు |
వెయిటింగ్ పిరియడ్ లేదు |
వెయిటింగ్ పిరియడ్ లేదు |
1 నెల |
4 వారాలు |
గమనిక: పైన పేర్కొన్న సమాచారం కేవలం ఒక అంచనా మాత్రమే మరియు ఈ వెయిటింగ్ పిరియడ్ అనేది మీరు ఎంచుకున్న కారు యొక్క వేరియంట్, పవర్ట్రెయిన్ మరియు రంగు ఎంపికపై ఆధారపడి ఉంటుందని చెప్పవచ్చు.
హోండా సిటీ: హోండా సెడాన్ కి నోయిడా, జైపూర్, కలకత్తా, పూణే, హైదరాబాద్ లలో ఎటువంటి వెయిటింది పిరియడ్ లేకుండానే లభిస్తుంది. బెంగళూరులో గరిష్టంగా వేచి ఉండాల్సిన కాలం (20 రోజులు), తరువాత చెన్నై మరియు ముంబై రెండిటిలో 15 రోజులు వెయిటింగ్ పిరియడ్ ఉంది.
హ్యుందాయ్ వెర్నా: హ్యుందాయ్ వెర్నా కోసం గరిష్టంగా వేచి ఉండాల్సిన కాలం ఒక నెల. నోయిడా, కలకత్త, ఇండోర్ లాంటి నగరాలలో కొనుగోలుదారులు ఈ హ్యుందాయ్ సెడాన్ కోసం అంతగా వేచి ఉండాల్సిన అవసరం లేదు.
మారుతి సియాజ్: మారుతి సెడాన్ కోసం వేచి ఉండాల్సిన కాలం చాలా ఎక్కువగా ఉంది. ఇది రాష్ట్రాలలో మూడు నుండి నాలుగు వారాల వరకు ఉంటుంది, అయితే ఇండోర్, చండీగఢ్ మరియు పూణేలో కొనుగోలుదారులు దీని కోసం వేచి ఉండాల్సిన అవసరం లేదు.
వోక్స్వ్యాగన్ వెంటో: ఇండోర్ లో ఒక నెల రోజుల వెయిటింగ్ పిరియడ్ మినహాయిస్తే మిగిలిన నగరాల్లో అదే 15 రోజులపాటు VW సెడాన్ కి వెయిటింగ్ పిరియడ్ ఉంది. బెంగళూరు, అహ్మదాబాద్, కొలకత్తా వాళ్ళు అందరూ వేచి ఉండవలసిన అవసరం లేదు.
టయోటా యారీస్: అమ్మకాల పరంగా చార్ట్ లో ఆఖరిన ఉన్న టయోటా యొక్క యారీస్ కారుకి చాలా ఎక్కువ కాలం వెయిటింగ్ పిరియడ్ ఉండడం అనేది కొంచెం ఆశ్చర్యకరం అని చెప్పవచ్చు. బెంగళూరు మినహాయిస్తే (దీనికి వెయిటింగ్ పిరియడ్ లేదు),యారీస్ కోసం మీరు హైదరాబాద్ లో 15 రోజులు తక్కువ వెయిటింగ్ పిరియడ్ ని కలిగి ఉన్నారు. ఈ నిరీక్షణ కాలం అనేది 45 రోజుల నుండి మూడు నెలల వరకు కొనసాగుతుంది.
Read More on : Maruti Ciaz on road price
0 out of 0 found this helpful