డిమాండ్ లలో కార్లు: హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ టాప్ సెగ్మెంట్ సేల్స్ ఫిబ్రవరి 2019 లో
హ్యుందాయ్ వెర్నా 2017-2020 కోసం dhruv attri ద్వారా మే 21, 2019 12:32 pm ప్రచురించబడింది
- 17 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మొత్తం సెడాన్లో దాదాపు 86 శాతం వాటాను కలిగి ఉన్న మూడు సెడాన్లు ఈ విభాగంలో ఆధిపత్యం చెలాయిస్తున్నాయి
- సిటీ, వెర్నా, సియాజ్ మిగిలిన వాటి కంటే చాలా ప్రాచుర్యం పొందాయి.
- స్కొడా రాపిడ్ కారు VW వెంటో మరియు టయోటా యారీస్ ల కంటే ఎక్కువ జనాదరణ పొందింది.
- టయోటా యారీస్ ఇప్పటికీ సియాజ్ ఫేస్లిఫ్ట్ తర్వాత రెండవ సరికొత్త సమర్పణ ఉన్నప్పటికీ కూడా తక్కువ అమ్మకాలు చూస్తుంది.
ఈ సెడాన్స్ అనేవి ప్రస్తుతం SUV లకు తమ యొక్క ఖ్యాతిని అందిస్తున్నాయని చెప్పవచ్చు. మీరు గత 3 సంవత్సరాలలో ఫిబ్రవరి అమ్మకాలు చేపట్టితే, సెడాన్ మార్కెట్ వాటా 20 శాతం నుంచి 16 శాతానికి పడిపోయింది. ఎస్యూవీలు 16 శాతం నుంచి 20 శాతానికి పెరిగాయి. ఈ కాంపాక్ట్ కార్ సెగ్మెంట్ లో, టాప్ 3 అత్యుత్తమంగా అమ్ముడుపోయే సెడాన్ లు అనేవి అథ్యధికంగా అమ్ముడుపోయే కాంపాక్ట్ SUV హ్యుందాయి క్రెటా కి కొంచెం దగ్గరగా మాత్రమే వస్తున్నాయి. ఈ క్రెటా ఎల్లపుడూ 10,000 నెలవారీ విక్రయాలపై స్థిరంగా ఉంది అని చెప్పవచ్చు.
స్వల్పకాలంలో, కాంపాక్ట్ సెడాన్ సెగ్మెంట్ యొక్క ప్రజాదరణ స్థిరంగా ఉంది, కానీ ఈ విభాగంలో కేవలం మూడు కార్లు (హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సుజుకి సియాజ్) ఆధిపత్యం చెలాయిస్తున్నాయి. ఇంకా మీరు లోతుగా చూడాలంటే ఈ సేల్స్ గణాంకాలు దానికి సంబందించిన వివరాలు చూద్దాము.
ఫిబ్రవరి 2019 |
జనవరి 2019 |
MoM పెరుగుదల |
ప్రస్తుత మార్కెట్ వాటా |
మార్కెట్ భాగస్వామ్యం గత సంవత్సరం |
YoY మార్కెట్ వాటా |
సగటు 6 నెలల సేల్స్ |
|
హోండా సిటీ |
3273 |
4855 |
-32.58 |
29.08 |
27.71 |
1.37 |
3522 |
హ్యుందాయ్ వెర్నా |
3299 |
3216 |
2.58 |
29.31 |
28.54 |
0.77 |
2979 |
మారుతి సుజుకి సియాజ్ |
3084 |
2934 |
5.11 |
27.4 |
34.93 |
-7.53 |
4121 |
స్కోడా రాపిడ్ |
898 |
844 |
6.39 |
7.97 |
5.2 |
2.77 |
927 |
టయోటా యారీస్ |
350 |
343 |
2.04 |
3.1 |
0 |
3.1 |
450 |
వోక్స్వ్యాగన్ వెంటో |
351 |
562 |
-37.54 |
3.11 |
3.6 |
-0.49 |
466 |
ముఖ్యమైన అంశాలు
త్రిమూర్తులు: ఈ విభాగంలో వాల్యూమ్లను డ్రైవ్ చేసే మూడు కార్లు ఉన్నాయి: హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సియాజ్. ఈ మూడు రూపాలు కలిసి మొత్తం సెగ్మెంట్ అమ్మకాలలో 86 శాతం ఉన్నాయి. నెలవారీ మరియు సగటు (6 నెలలు) అమ్మకాలు వాల్యూమ్ కూడా మనకి ఏమి చెబుతాయి అంటే ఈ విభాగంలో నాల్గవ అత్యంత ప్రజాదరణ పొందిన కారు యొక్క అమ్మకాలను గనుక మనం చూసుకున్నట్లయితే టాప్ 3 కార్ల అమ్మకాలలో మూడింట ఒక వంతు కంటే కూడా తక్కువగా నిర్వహిస్తుంది. రెండు తక్కువ ప్రజాదరణ పొందిన కార్ల వ్యక్తిగత అమ్మకాలు - వెంటో మరియు యారీస్ - వెర్నాలో 10 శాతం కన్నా కొంచెం ఎక్కువ.
అగ్ర స్థానం కొరకు పోటీ: ఈ విభాగంలో జనవరి 2019 లో సిటీ అనేది అత్యంత ప్రజాదరణ పొందిన కారు అని చెప్పవచ్చు, ఇది ఫిబ్రవరిలో హ్యుందాయ్ వెర్నాకు అగ్ర స్థానాన్ని కోల్పోయింది. మొత్తంమీద చూసుకుంటే ఇది ఫిబ్రవరి నెలలో బాగా రసవత్తరంగా జరిగే పోటీ, ఎందుకంటే ఇది 200 యూనిట్ల తేడాతో ఈ అన్ని కార్లు కూడా ఈ మూడు స్థానాలలో ఉన్నాయని చెప్పవచ్చు. అగ్ర స్థానంలో ఉన్న వెర్నా సిటీ కంటే కేవలం 26 యూనిట్లు మాత్రమే ముందంజలో ఉండగా, సిటీ కారు సియాజ్ కి 189 యూనిట్ల ద్వారా మూడవ స్థానంలో ఉంది.
ఈ సంవత్సరం సియాజ్ ఈ సెగ్మెంట్ లో అత్యుత్తమ అమ్మకాలు లేని కారుగా ఉన్నా కూడా, గత 6 నెలల్లో అత్యంత ప్రజాదరణ పొందిన కారు అని చెప్పవచ్చు.
ఫిబ్రవరి నెలలో అత్యధికంగా ఓడిపోయిన కార్లు:
ఇక్కడ ఆశక్తికరమైన అంశం ఏమిటంటే నెలవారిగా అమ్మకాలు తక్కువగా వస్తున్న కార్లు హోండా సిటీ మరియు VW వెంటో అమ్మకాలు అనేవి సేల్స్ చార్ట్ కి రెండు వైపులా ఉన్నాయి. ప్రతి కారుకి సంవత్సరానికి సంబంధించిన వాటా పెరుగుతూ వస్తుంది, వెంటో మరియు సియాజ్ మినహాయించి. VW అనేది చాలా కాలం నుండి ఒక నవీకరణ కోసం వేచి ఉంది మరియు కొన్ని సంవత్సరాలలో కొత్త తరం రావచ్చని మేము ఆశిస్తున్నాము.
ఫిబ్రవరి నెలలో అత్యధిక లాభాలు ఆర్జిస్తున్న కార్లు: సెగ్మెంట్ లో ఎక్కువ లాభాలు అవీ లేకపోయినా, స్కొడా రాపిడ్ ఇది అత్యధిక నెలవారీ డిమాండ్ ని అందుకుంది, తర్వాత సియాజ్ ఫేస్లిఫ్ట్ అని చెప్పవచ్చు. సంవత్సరానికి పెరుగుతున్న డిమాండ్ సంబందించినంత వరకు, ఇక్కడ కూడా మళ్ళీ స్కొడా నిలిచింది. చెక్ కారు తయారీదారుడు ఫిబ్రవరిలో రాపిడ్ మోంటే కార్ లో ఎడిషన్ ను పరిచయం చేసింది, మార్చిలో రాపిడ్ పై 6 సంవత్సరాల వారంటీని అందించాడు.
యారిస్ పై ప్రజాదరణ తగ్గింది: ఇది ప్రారంభించి ఒక సంవత్సరం కూడా అవ్వలేదు, కానీ టయోటా యారిస్ ఇప్పటికే కొనుగోలుదారులు యొక్క ఆశక్తిని కోల్పోయిందని తెలుస్తోంది. ఏడు ఎయిర్బాగ్స్ మరియు TPMS వంటి కొన్ని విభాగ-అగ్రస్థానంలో ఉన్న లక్షణాలను కలిగి ఉన్నప్పటికీ, యారీస్ సగటున నెలకు 450 కంటే ఎక్కువ కొనుగోలుదారులను కనుగొనడంలో విఫలమైంది.
ఊహించని విజేత:
అమ్మకాల వాల్యూమ్ పరంగా స్కోడా రాపిడ్ టాప్ 3 కార్లలో ఒకటి కాదు, కానీ ఇది యారీస్ మరియు వెంటో కంటే దాదాపు రెండు రెట్లు ఎక్కువ ప్రజాదరణ పొందింది. రాపిడ్ భవిష్యత్ లో కూడా సెగ్మెంట్ లో అగ్రస్థానంలోకి వస్తుందని మేము అనుకోవడం లేదు, అయితే రాపిడ్ తదుపరి మోడల్ ప్రస్తుత మోడల్ కంటే ఎక్కువ ప్రభావం చూపగలదు అని నమ్ముతున్నాము. కొత్త రాపిడ్ 2021 లో వస్తుందని అంచనా వేయబడుతుంది మరియు ఇది MQB A0 ప్లాట్ఫారమ్ పై ఆధారపడి ఉంటుంది, ఇది T-క్రాస్ మరియు కామిక్ వంటి రాబోయే VW మరియు స్కొడా కాంపాక్ట్ SUV లతో భాగస్వామ్యం చేయబడుతుంది. రాపిడ్ ప్రస్తుతం భారతదేశంలో అత్యంత సరసమైన మరియు ప్రసిద్ధ స్కొడా అని చెప్పవచ్చు.
-
Toyota Yaris vs Hyundai Verna vs Honda City: Petrol Automatic Comparison Review
-
Cars In Demand: Hyundai Creta, Maruti S-Cross Top Segment Sales in February 2019
Read More on : Verna on road price