2023 హ్యుందాయ్ వెర్నా SX(O) వేరియెంట్ విశ్లేషణ: ఇంత వెచ్చించవలసిన విలువ కలిగి ఉందా?
ADAS, హీటెడ్ మరియు వెంటిలేడ్ ముందు సీట్‌లు వంటి ప్రీమియం ఫీచర్‌ల కోసం, ఈ విభాగంలో టాప్ వేరియంట్ అయిన SX(O) మాత్రమే ఏకైక ఎంపిక
సరికొత్త హ్యుందాయ్ వెర్నాను, ఈ విభాగంలో మొదటిసారిగా వస్తున్న మరియు మెరుగైన అనుభూతిని అందించే అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS), వెంటిలేటెడ్ మరియు హీటెడ్ ముందు సీట్‌లు, 10.25-అంగుళాల భారీ టచ్ؚస్క్రీన్ సిస్టమ్ (నేచురల్లీ ఆస్పిరేటెడ్ పవర్ؚట్రెయిన్‌కు మాత్రమే) వంటి ఫీచర్‌లతో అందిస్తున్నారు. అయితే, వీటితో పాటు ఇంకా మరిన్ని ఫీచర్‌లను కోరుకుంటే, ఇక్కడ ఉన్న ఏకైక ఎంపిక ఈ విభాగంలో టాప్ వేరియంట్ అయిన కాంపాక్ట్ సెడాన్ SX (O) మాత్రమే. ఈ వేరియంట్ కోసం, అదనపు ధరను చెల్లించవచ్చో లేదో ఇప్పుడు చూద్దాం:
వేరియెంట్ |
1.5-లీటర్ N.A. పెట్రోల్ |
1.5-లీటర్ టర్బో పెట్రోల్ |
||
MT |
CVT |
MT |
DCT |
|
SX(O) |
రూ.14.66 లక్షలు |
రూ.16.20 లక్షలు |
రూ.15.99 లక్షలు |
రూ.17.38 లక్షలు |
వెర్నా SX(O)ను ఎందుకు ఎంచుకోవాలి?
ప్రస్తుతం మార్కెట్ؚలో అధిక ఫీచర్‌లు కలిగిన, అత్యంత శక్తివంతమైన కాంపాక్ట్ సెడాన్ కోసం చూస్తుంటే, సరికొత్త వెర్నా టాప్-స్పెక్ SX(O) సరైన ఎంపిక. 10.25-అంగుళాల భారీ టచ్‌స్క్రీన్ (నేచురల్లీ ఆస్పిరేటెడ్ పవర్ؚట్రెయిన్ؚతో), హీటెడ్ ముందు సీట్‌లు (కూలింగ్ ఫంక్షనాలిటీ కూడా అందుబాటులో ఉంది) వంటి ఫీచర్‌లను ఆస్వాదించాలంటే ఈ సరికొత్త సెడాన్ ఏకైక వేరియంట్. భద్రత పరంగా SX(O)లో ADAS, రేర్ డిస్క్ؚబ్రేక్ؚలు మరియు ఎలక్ట్రిక్ పార్కింగ్ బ్రేక్ (చివరి రెండూ టర్బో DCT వెర్షన్ؚలో మాత్రమే అందుబాటులో ఉన్నాయి) వంటి ఫీచర్‌లను కలిగి ఉంది.
ADASతో సరికొత్త వెర్నా (అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్) కోరుకుంటే, పెట్రోల్-CVT లేదా టర్బోఛార్జెడ్ ఇంజన్ వేరియెంట్ؚను ఎంచుకోవాలి. ఆడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ కోసం వెర్నా SX(O) టర్బో DCTని ఎంచుకోవాలి.
ఇది ఏమి అందిస్తుందో ఇప్పుడు చూద్దాం:
ఎక్స్ؚటీరియర్ |
ఇంటీరియర్ |
సౌకర్యం మరియు అనుకూలత |
ఇన్ఫోటైన్మెంట్ |
భద్రత |
|
హైలైట్ ఫీచర్‌లు |
|
|
|
|
|
|
|
|
|
|
|
వెర్నా SX(O)లో ఇంకా మెరుగు పరచవలసినవి ఫీచర్‌లు ఏవి?
జనరేషన్ అప్ؚగ్రేడ్ؚతో మెరుగైన స్థలం, పనితీరు మరియు ఫీచర్‌ల పరంగా వెర్నా తన పోటీదారులతో సమానంగా నిలుస్తుంది. అంతేకాకుండా రేర్ విండో సన్ షెడ్‌లు, రేర్ సెంటర్ హెడ్ రెస్ట్, 360-డిగ్రీల కెమెరా వ్యూ మరియు డెడికేటెడ్ ఫోన్ సీట్ బ్యాక్ పాకెట్ వంటి మరిన్ని సౌకర్యాలను అందించే అవకాశాన్ని హ్యుందాయ్ పరిగణించవలసింది అని అభిప్రాయపడుతున్నాము. కారు తయారీదారు వైర్ؚలెస్ అండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లేను కూడా SX(O) వేరియెంట్ؚలో అందించవలసిందని భావిస్తున్నాము. అలాగే, పెట్రోల్-CVT SX(O)లో మిగిలిన ADAS స్యూట్ؚతో పాటు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఫంక్షన్ؚను కూడా అందిస్తే బాగుండేది.
వేరియెంట్ |
తీర్పు |
తగినంత భద్రతను అందిస్తూ కేవలం మౌలిక ఫీచర్‌లను మాత్రమే అందిస్తుంది. యాక్సెసరీలు జోడించే ఆలోచనలు ఉండి, బడ్జెట్‌లో కొనుగోలు చేయాలంటే దీన్ని పరిగణించండి |
|
సమర్ధనీయమైన ధరతో, ఉపయోగకరమైన ఫీచర్‌లతో నిజమైన ఎంట్రీ వేరియెంట్ |
|
ప్రత్యేకించి CVT ఆటోమ్యాటిక్ లేదా ఎంట్రీ లెవెల్ టర్బో వేరియెంట్ కోసం సిఫార్సు చేస్తున్న వేరియెంట్ |
|
SX(O) |
మెరుగైన అనుభూతి అందించే ఫీచర్‌లు మరియు ADASతో వచ్చే టాప్-స్పెక్ పెట్రోల్-CVT లేదా టర్బో వేరియెంట్ కోరుకుంటే దీన్ని ఎంచుకోండి |
అన్నీ పరిచయ ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా ధరలు
ఇక్కడ మరింత చదవండి: వెర్నా ఆన్ؚరోడ్ ధర