2023 హ్యుందాయ్ వెర్నా SX వేరియెంట్ విశ్లేషణ: చెల్లించే ధరకు అత్యంత విలువను అందించే వేరియంట్ ఇదేనా?
హ్యుందాయ్ వెర్నా కోసం rohit ద్వారా ఏప్రిల్ 05, 2023 11:43 am ప్రచురించబడింది
- 20 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఆటోమ్యాటిక్ గేర్‌బాక్స్ మరియు టర్బో పవర్‌ట్రెయిన్ ఎంపికలు రెండిటికి ఇది ఎంట్రీ-లెవెల్ వేరియెంట్
టాప్ వేరియంట్ నుండి రెండవ స్థానంలో నిలిచే ఆరవ-జనరేషన్ హ్యుందాయ్ వెర్నా SX వేరియెంట్, ప్రామాణిక మరియు టర్బో వేరియెంట్ؚలకు మధ్యలో నిలుస్తుంది. కొత్త టర్బో పవర్ؚట్రెయిన్ؚకు ఇది ఎంట్రీ పాయింట్, అలాగే నేచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్ ఎంపికను, మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్‌లను అందిస్తుంది. కాబట్టి, దీన్ని కొనుగోలు చేయాలా లేదా? ఈ విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం:
వేరియెంట్ |
1.5-లీటర్ N.A. పెట్రోల్ |
1.5-లీటర్ టర్బో-పెట్రోల్ |
||
MT |
CVT |
MT |
DCT |
|
SX |
రూ.12.99 లక్షలు |
రూ.14.24 లక్షలు |
రూ.14.84 లక్షలు |
రూ.16.08 లక్షలు |
SX(O) |
రూ.14.66 లక్షలు |
రూ. 16.20 లక్షలు |
రూ.15.99 లక్షలు |
రూ.17.38 లక్షలు |
వ్యత్యాసం |
రూ.1.67 లక్షలు |
రూ.1.96 లక్షలు |
రూ.1.15 లక్షలు |
రూ.1.30 లక్షలు |
వెర్నా SXను ఎందుకు ఎంచుకోవాలి?
LED హెడ్‌లైట్‌లు, క్రోమ్ డోర్ హ్యాండిల్‌లు మరియు 16-అంగుళాల డ్యూయల్-టోన్ ఆలాయ్ వీల్స్ కారణంగా వెర్నా SX వేరియెంట్ టాప్-స్పెక్ SX(O) వేరియెంట్ؚ విధంగానే కనిపిస్తుంది. ప్యాడిల్ షిఫ్ؚటర్‌లతో (రెండు ఇంజన్‌లతో) ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ సౌకర్యాన్ని SX వేరియెంట్ కూడా కొనుగోలుదారులకు అందిస్తుంది. పవర్-ఫోల్డింగ్ ORVMలు, రేర్ వ్యూ కెమెరా మరియు స్టీరింగ్ వీల్, గేర్ సెలక్టర్‌లకు లెదర్ ఫినిష్ వంటి ఫీచర్‌లను కూడా పొందవచ్చు. SXలో సన్ؚరూఫ్, ఆంబియెంట్ లైటింగ్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సర్‌లు వంటి వాటితో ఈ సెడాన్ؚను అలంకరించారు.
వెర్నా SX టర్బోను ఎందుకు ఎంచుకోవాలి?
హ్యుందాయ్ ఈ సెడాన్ؚను కొత్త టర్బో చార్జెడ్ పవర్ؚట్రెయిన్ؚతో, బ్లాకెడ్ వీల్స్, ఎరుపు రంగు బ్రేక్ క్యాలిపర్స్, పూర్తి-నలుపు ఇంటీరియర్ మరియు డ్యూయల్ టోన్ పెయింట్ ఎంపికల వంటి ప్రత్యేక ఫీచర్‌ను ఈ వేరియెంట్ؚలో అందిస్తోంది. ప్రామాణిక SXతో పోలిస్తే బ్లూ లింక్ కనెక్టెడ్ కార్ టెక్ؚతో భారీ ఇన్ఫోటైన్మెంట్ టచ్‌స్క్రీన్ వంటి ఎక్కువ ఫీచర్‌లతో వస్తుంది.
ఇతర ఇంజన్ ఎంపికల కంటే మరింత శక్తివంతమైన ఇంజన్, లుక్ పరంగా మార్పులు మరియు భారీ ఇన్ఫోటైన్మెంట్ వంటి వాటి కోసం చెల్లించవలసిన అదనపు ధర, మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ వెర్షన్‌లకు రూ. 1.85 లక్షలు.
ఇది అందించే ఫీచర్‌లు ఇవే:
ఎక్స్ؚటీరియర్ |
ఇంటీరియర్ |
సౌకర్యం మరియు అనుకూలత |
ఇన్ఫోటైన్మెంట్ |
భద్రత |
|
హైలైట్ ఫీచర్‌లు |
|
|
|
|
|
ఇతర ఫీచర్‌లు |
|
|
|
|
|
మీకు కావాలనుకుంటే SX టర్బోను ఎంచుకోండి |
|
|
|
|
|
మీరు కోరుకుంటే SX(O) కి అప్ؚగ్రేడ్ కావచ్చు |
|
|
|
|
|
వెర్నా SXను ఎందుకు ఎంచుకోవద్దు?
విభాగంలో అగ్ర స్థానంలో ఉన్న SX(O)లో అందించే దాదాపుగా అన్నీ ప్రీమియం సౌకర్యాలను వెర్నా SX వేరియెంట్‌లో హ్యుందాయ్ అందిస్తోంది, అయితే SX(O)లో ADAS, వెంటిలేటెడ్ మరియు హీటెడ్ ముందు సీట్‌లు వంటి ప్రత్యేక ఫీచర్‌లు ఉన్నాయి, అలాగే నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ పవర్ؚట్రెయిన్ؚలో భారీ ఇన్ఫోటైన్మ్నెంట్ టచ్ؚస్క్రీన్ కూడా వస్తుంది. SX ధరతో పోలిస్తే రెండు లక్షల కంటే తక్కువ ధరను చెల్లించిపై ఫీచర్‌లు అన్నిటినీ పొందవచ్చు.
వేరియెంట్ |
తీర్పు |
తగినంత భద్రతను అందిస్తూ కేవలం మౌలిక ఫీచర్‌లను మాత్రమే అందిస్తుంది. యాక్సెసరీలు జోడించే ఆలోచనలు ఉండి, బడ్జెట్‌లో కొనుగోలు చేయాలంటే దీన్ని పరిగణించండి |
|
సమర్ధనీయమైన ధరతో, ఉపయోగకరమైన ఫీచర్‌లతో నిజమైన ఎంట్రీ వేరియెంట్ |
|
SX |
ప్రత్యేకించి CVT ఆటోమ్యాటిక్ లేదా ఎంట్రీ లెవెల్ టర్బో వేరియెంట్ కోసం సిఫార్సు చేస్తున్న వేరియెంట్ |
మెరుగైన అనుభూతి అందించే ఫీచర్‌లు మరియు ADASతో వచ్చే టాప్-స్పెక్ పెట్రోల్-CVT లేదా టర్బో వేరియెంట్ కోరుకుంటే దీన్ని ఎంచుకోండి |
అన్నీ పరిచయ ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా ధరలు
ఇక్కడ మరింత చదవండి: హ్యుందాయ్ వెర్నా ఆన్ؚరోడ్ ధర
0 out of 0 found this helpful