2020 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ మొదటిసారి మా కంటపడింది
జీప్ కంపాస్ కోసం raunak ద్వారా జనవరి 18, 2020 01:50 pm ప్రచురించబడింది
- 30 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
కంపాస్ యొక్క ముందు భాగం చాలా మార్పులు చేయబోతున్నట్టు తెలుస్తుంది, ఎందుకంటే చైనాలో గుర్తించిన ఈ టెస్ట్ మ్యూల్ లో ఫ్రంట్ భాగం బాగా కప్పబడి ఉంది
- 2020 కంపాస్ కి మిడ్-లైఫ్ రిఫ్రెష్ రానున్నది, ఇది భారతదేశంలో 2020 మధ్యలో ప్రారంభించబడుతుందని భావిస్తున్నారు.
- ఇది ముందు వాటి కంటే కొన్ని మెరుగైన లక్షణాలైన పార్కింగ్ అసిస్ట్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, LED DRL లతో LED హెడ్‌ల్యాంప్స్ ని కలిగి ఉంటుంది.
- దీనికి FCA యొక్క తాజా 1.3-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ లభించే అవకాశం ఉంది.
- 2.0-లీటర్ మల్టీజెట్ II డీజిల్ ఇంజిన్ ఈ అప్‌డేట్ అయిన కంపాస్ లో కలిగి ఉంటుంది.
జీప్ కంపాస్ యొక్క రిఫ్రెష్ మోడల్ చైనాలో మొదటిసారిగా మా కంటపడింది. జూలై 2017 లో ప్రారంభించబడిన కంపాస్ మిడ్-లైఫ్ అప్‌డేట్ కోసం వేచి ఉంది మరియు ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ 2020 మధ్యలో భారతదేశంలో విడుదల కానుంది. ఇది దాని పరికరాల జాబితాలో కొత్త చేర్పులతో పాటు అప్‌డేట్ చేయబడిన ఎక్స్టీరియర్ మరియు ఇంటీరియర్ భాగాన్ని కలిగి ఉంటుంది. ఇది అంతర్జాతీయ మోడల్ కోసం కొత్త పెట్రోల్ ఇంజిన్ ను కూడా పొందవచ్చు.
ప్రీ-ఫేస్ లిఫ్ట్ జీప్ కంపాస్
మనకి కనిపించిన టెస్ట్ మ్యూల్ భారీగా కప్పబడి ఉన్న ఫ్రంట్ ప్రొఫైల్ ని కలిగి ఉంటుంది,దీని వలన మనకి ముందు భాగంలో భారీగా మార్పులు ఉంటాయని తెలుస్తుంది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ కంపాస్ బై-జినాన్ హెడ్‌ల్యాంప్‌లు మరియు హాలోజన్ డేటైమ్ రన్నింగ్ లైట్లను బంపర్ పై కలిగి ఉంటుంది. ఫేస్‌లిఫ్ట్ లో LED హెడ్‌ల్యాంప్‌లు, LED DRL లను ఉంటాయి కాబట్టి పైన చెప్పిన లక్షణాలు మారడానికి సిద్ధంగా ఉన్నాయని తెలుస్తుంది. వెనుక ప్రొఫైల్ దాదాపు అదే విధంగా ఉన్నట్లు కనిపిస్తోంది, అయితే, టెయిల్ ల్యాంప్స్ లో కొత్త LED గ్రాఫిక్స్ వంటి చిన్న మార్పులను మనం ఆశించవచ్చు.
దీని ఇంటీరియర్ విషయానికి వస్తే ఇంటీరియర్ కూడా కవర్ చేయబడి ఉంది, కానీ కొద్దిగా మార్పులు జరిగే అవకాశం కూడా ఉంది. ప్రీ-ఫేస్‌లిఫ్ట్ మోడల్ లో అందించే సెమీ డిజిటల్ యూనిట్ తో పోలిస్తే రిఫ్రెష్ చేసిన కంపాస్ పూర్తిగా డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ను పొందే అవకాశం ఉంది. FCA యొక్క 8.4-ఇంచ్ Uకనెక్ట్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ దీనిలో అలాగే ఉంటూ, కనెక్ట్ చేయబడిన టెక్ లో భాగంగా eSIM ని పొందే అవకాశం ఉంది. ఈ ఫేస్‌లిఫ్ట్ తో జీప్ వెంటిలేటెడ్ సీట్లు, పవర్ తో కూడిన టెయిల్‌గేట్, ప్రీమియం సౌండ్ సిస్టమ్ (ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న బీట్స్) మరియు హెడ్-అప్ డిస్ప్లే వంటి లక్షణాలు కూడా అందించబడతాయి, ఇవన్నీ కంపాస్ కంటే తక్కువ ధర గల SUV లలో అందించబడతాయి.
2.0-లీటర్ మల్టీజెట్ II డీజిల్ ఇంజన్ ఇప్పటికే BS6 కంప్లైంట్ మరియు ఫేస్‌లిఫ్టెడ్ మోడల్ లో రానున్నది. టాప్-స్పెక్ ట్రైల్హాక్ మోడల్ తో పోల్చితే జీప్ ఇటీవల 9-స్పీడ్ ఆటోమేటిక్ ఆప్షన్ ను మరింత యాక్సెస్ చేయగల వేరియంట్లలో జోడించింది.
కంపాస్ యొక్క 1.4-లీటర్ మల్టీ ఎయిర్ II పెట్రోల్ ఇంజన్ (162 పిఎస్ / 250 ఎన్ఎమ్) ఫేస్‌లిఫ్టెడ్ ఇండియా-స్పెక్ SUV లో భాగం అవుతుంది, అయితే కొంచెం ఎక్కువ 170 Ps ట్యూన్‌లో ఉంటుంది. అయితే, ఇతర మార్కెట్లలో FCA దీనిని వారి తాజా 1.3-లీటర్, 4-సిలిండర్ ఫైర్‌ఫ్లై టర్బో-పెట్రోల్ ఇంజిన్ తో కంపాస్ ఫేస్‌లిఫ్ట్ తో భర్తీ చేసే అవకాశం ఉంది. ఈ ఇంజన్ గత సంవత్సరం జీప్ రెనెగేడ్ ఫేస్‌లిఫ్ట్ తో అడుగుపెట్టింది. ఇది రెండు విధాలుగా పవర్ ని అందించే విధంగా మరియు ట్రాన్స్మిషన్ ఎంపికలలో లభిస్తుంది:
పవర్ |
150PS |
180PS |
టార్క్ |
250Nm |
270Nm |
ట్రాన్స్మిషన్ |
6-స్పీడ్ DCT |
9-స్పీడ్ ఆటోమెటిక్ |
ఫేస్‌లిఫ్టెడ్ కంపాస్ 2020 మధ్యలో షోరూమ్‌లలోకి వస్తుందని భావిస్తున్నాము మరియు సాధారణంగా మిడ్-లైఫ్ రిఫ్రెష్ కాబట్టి కొద్దిగా ధరల పెరుగుదలని ఆశించవచ్చు. ఇంతలో, ఏప్రిల్ 2020 నుండి అమల్లోకి వచ్చే కఠినమైన ఉద్గార నిబంధనలకు కృతజ్ఞతలు తెలుపుతూ జీప్ త్వరలో కంపాస్ యొక్క BS 6-కంప్లైంట్ శ్రేణిని అధిక ధరలకు ప్రవేశపెట్టనుంది.
మరింత చదవండి: కంపాస్ ఆటోమేటిక్