• English
  • Login / Register

కియా సెల్టోస్ మరియు MG హెక్టర్ ప్రత్యర్థులను మీరు 2020 లో చూడవచ్చు

కియా సెల్తోస్ 2019-2023 కోసం dhruv ద్వారా జనవరి 06, 2020 02:41 pm ప్రచురించబడింది

  • 29 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కియా సెల్టోస్ మరియు MG హెక్టర్ అందించేది ఏమిటి? అలాంటప్పుడు 2020 లో వస్తున్న ఈ కొత్త SUV లు మీ యొక్క ఎంపికను పాడు చేసే అవకాశం ఉంది

Kia Seltos And MG Hector Rivals You’ll Get To See In 2020

కియా సెల్టోస్ మరియు MG హెక్టర్ 2019 లో ప్రయాణీకుల వాహన పరిశ్రమ యొక్క ముఖ్యాంశాలు. ఇంత మంది కారు తయారీదారులు ప్రభావితం అయినప్పటికీ, దెబ్బతిన్నప్పటికీ కూడా చాలా మంది కారు తయారీదారులు తమ డబ్బుని వీటి మీద వెచ్చించారు. సెల్టోస్ మరియు హెక్టర్ ఇక్కడ ఉండగా, వాటి ప్రత్యర్థులు చాలా మంది 2020 లో భారతదేశానికి రానున్నాయి.

ప్రస్తుతం, కియా సెల్టోస్ ధర రూ .9.69 లక్షల నుండి 16.99 లక్షల (ఎక్స్-షోరూమ్ ఇండియా) మధ్య ఉండగా, MG హెక్టర్ ధర రూ .12.48 లక్షల నుంచి రూ. 17.28 లక్షల మధ్య (ఎక్స్-షోరూమ్ ఇండియా) ఉంది. కాబట్టి ఈ పరిధిలో ఆదర్శంగా ఉంచబడే SUV లను చూద్దాం.

2020 హ్యుందాయ్ క్రెటా

Kia Seltos And MG Hector Rivals You’ll Get To See In 2020

ఆశిస్తున్న ధరలు:

రూ .11 లక్షల నుంచి రూ .16 లక్షలు (ఎక్స్‌షోరూమ్)

ఊహిస్తున్న ప్రారంభం: 2020 ఆటో ఎక్స్‌పో

క్రెటా మొట్టమొదటిసారిగా ప్రారంభించబడినప్పటి నుండి ఇప్పటికి చాలా కాలం అయ్యింది మరియు చివరికి 2020 లో ఇది ఒక జనరేషన్ నవీకరణను పొందుతుంది. ఆటో ఎక్స్‌పోలో కొత్త క్రెటాను చూడాలని మేము ఆశిస్తున్నాము, ఇది సెల్టోస్‌ కు సమానమైన నిష్పత్తిని కలిగి ఉంటుంది. ఇది కియా యొక్క BS6 ఇంజన్లు మరియు లక్షణాలను కూడా ఉపయోగించుకుంటుంది. క్రొత్త క్రెటాలో ఎక్కువ భాగం ఇప్పటికే  చైనా-స్పెక్ ix25 ద్వారా ప్రివ్యూ చేయబడింది, అయితే ఇండియా-స్పెక్ మోడల్‌ కానీ ఇండియా-స్పెక్ మోడల్‌ కి దాని యొక్క విభిన్నమైన లక్షణాలు దీనిలో కలిగి ఉన్నాయి.

స్కోడా యొక్క కాంపాక్ట్ SUV

Kia Seltos And MG Hector Rivals You’ll Get To See In 2020

ఊహించిన ధర: రూ .11 లక్షల నుంచి రూ .16 లక్షలు (ఎక్స్‌షోరూమ్)

ఊహించిన ప్రారంభం: 2020 ఆటో ఎక్స్‌పో ప్రవేశం తర్వాత Q2 2021 లాంచ్ అవుతుంది

 భారతదేశానికి కాంపాక్ట్ SUV ని సిద్ధం చేయడానికి స్కోడా కృషి చేస్తోంది, కాని దీనికి ఇంకా అధికారిక పేరు లేదు. ఇది స్కోడా భారత మార్కెట్ కోసం స్థానికీకరిస్తున్న MQB A0-IN ప్లాట్‌ఫామ్ ఆధారంగా ఉంటుంది మరియు కియా సెల్టోస్ మరియు రాబోయే 2020 హ్యుందాయ్ క్రెటాతో పోటీ పడుతుంది. ఈ స్కోడా కాంపాక్ట్ SUV పెట్రోల్, CNG వేరియంట్‌లతో కూడిన యూరో-స్పెక్ కమిక్ ఆధారంగా ఉండే అవకాశం ఉంది. లాంచ్ 2021 లో ఊహించబడినప్పటికీ, మేము ఆటో ఎక్స్‌పో 2020 లో SUV యొక్క సమీప- ప్రొడక్షన్ వెర్షన్‌ను చూస్తాము.

వోక్స్వ్యాగన్ T-క్రాస్

Kia Seltos And MG Hector Rivals You’ll Get To See In 2020

అంచనా ధర: రూ .11 లక్షల నుంచి రూ .16 లక్షలు (ఎక్స్‌షోరూమ్)

ఊహించిన ప్రారంభం: 2021 మొదటి భాగం, ఆటో ఎక్స్‌పో 2020 తొలిసారి

స్కోడా మాదిరిగానే, వోక్స్వ్యాగన్ కూడా కియా సెల్టోస్ మరియు రాబోయే 2020 క్రెటా వంటి వాటితో పోటీ పడడానికి  దాని స్వంత కాంపాక్ట్ SUV ని సిద్ధం చేస్తోంది. దీనిని T-క్రాస్ అని పిలుస్తారు మరియు ఇది ఇప్పటికే బ్రెజిల్ మరియు చైనా వంటి మార్కెట్లలో అమ్ముడవుతోంది. ఇది కూడా MQB A0-IN ప్లాట్‌ఫామ్‌ను ఉపయోగిస్తుంది మరియు 2021 లో స్కోడా SUV తర్వాత లాంచ్ చేయబడవచ్చు, అదే సమయంలో ఆటో ఎక్స్‌పో 2020 లో భారతదేశానికి ప్రవేశించే అవకాశం ఉంది.

2020 మహీంద్రా XUV 500

Kia Seltos And MG Hector Rivals You’ll Get To See In 2020

అంచనా ధర: రూ .12 లక్షల నుంచి రూ .19 లక్షలు (ఎక్స్‌షోరూమ్)

ఊహించిన ప్రారంభం: 2020 రెండవ సగం

XUV500 క్రెటా కంటే ఎక్కువ కాలం ఉంది మరియు ఇది ఇంకా పూర్తి జనరేషన్ మార్పుకి గురి కాలేదు. ఏదేమైనా మహీంద్రా  నవీకరణపై పనిచేస్తోంది, ఆ విషయం అనేక సార్లు మా కంటపడింది. ఇది సాంగ్‌యాంగ్ కొరాండో నుండి స్టైలింగ్ అంశాలు మరియు లక్షణాలను తీసుకుంటుందని భావిస్తున్నారు. ఈ ధరల శ్రేణిలో మూడు వరుసల సీట్లని అందించే కొన్నిSUV లలో అవుట్‌గోయింగ్ XUV500 ఒకటిగా ఉంది, అయితే 2020 లో MG హెక్టర్ మరియు టాటా హారియర్‌కు  కూడా త్వరలో మూడు వరుసల వెర్షన్ లభిస్తుంది.

టాటా గ్రావిటాస్

Kia Seltos And MG Hector Rivals You’ll Get To See In 2020

అంచనా ధర: రూ .14 లక్షల నుండి రూ .18 లక్షలు (ఎక్స్-షోరూమ్)

ఊహించిన ప్రారంభం: 2020 ఆటో ఎక్స్‌పో

  గ్రావిటాస్ హారియర్ యొక్క ఏడు సీట్ల వెర్షన్ మరియు దాని పవర్‌ట్రెయిన్‌ను పంచుకుంటుంది. మేము దాని కోసం ఎదురుచూస్తున్న ఒక ముఖ్య కారణం ఏమిటంటే, ఇది ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ తో అందించబడుతుంది, ఇది ఇప్పటికీ హారియర్‌లో అందుబాటులో లేదు. ముందుగా ఇది 2019 లోనే లాంచ్ అవుతుందని భావించిన టాటా మూడు వరుసల SUV లాంచ్ ని 2020 ఫిబ్రవరికి నెట్టివేసింది.

మరింత చదవండి: సెల్టోస్ ఆటోమేటిక్

was this article helpful ?

Write your Comment on Kia సెల్తోస్ 2019-2023

explore similar కార్లు

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience