• English
  • Login / Register

జీప్ కంపాస్ డీజిల్ ఆటోమేటిక్ మునుపటి కంటే చాలా తక్కువ ధరని కలిగి ఉంది!

జీప్ కంపాస్ 2017-2021 కోసం dhruv ద్వారా జనవరి 22, 2020 11:23 am ప్రచురించబడింది

  • 26 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కొత్త డీజిల్-ఆటో వేరియంట్లలో కంపాస్ ట్రైల్హాక్ మాదిరిగానే BS 6 డీజిల్ ఇంజన్ లభిస్తుంది

Jeep Compass Diesel Automatic Is A Lot More Affordable Than Before!

  •  డీజిల్-ఆటో కాంబో లాంగిట్యూడ్ మరియు లిమిటెడ్ ప్లస్ వేరియంట్లలో ప్రవేశపెట్టబడింది.
  •  రెండు వేరియంట్లు 9-స్పీడ్ ఆటోమేటిక్ గేర్‌బాక్స్‌ను ఉపయోగిస్తాయి మరియు 4X4 డ్రైవ్‌ట్రెయిన్‌ను పొందుతాయి.
  •  ఇవి కంపాస్ ట్రైల్హాక్ యొక్క 2.0-లీటర్ BS6 డీజిల్ ఇంజన్ ద్వారా పవర్ ని అందుకుంటాయి.
  •  లాంగిట్యూడ్ వేరియంట్ పుష్-బటన్ స్టార్ట్ మరియు క్రూయిజ్ కంట్రోల్ వంటి లక్షణాల జోడింపు ను కూడా పొందుతుంది. 
  •  లాంగిట్యూడ్ మరియు టాప్-స్పెక్ లిమిటెడ్ ప్లస్ వేరియంట్ చివరకు క్రూయిజ్ నియంత్రణను ప్రామాణికంగా పొందుతుంది.

అమెరికన్ కార్ల తయారీ సంస్థ జీప్, కంపాస్ డీజిల్ ఆటోమేటిక్ యొక్క రెండు కొత్త వేరియంట్లను ప్రవేశపెట్టింది. గతంలో, డీజిల్-ఆటో కాంబో SUV యొక్క టాప్-స్పెక్ ట్రైల్హాక్ ఎడిషన్‌ లో మాత్రమే ఉండేది.  ప్రస్తుతం అయితే, జీప్ ఈ కాంబో ని బేస్ లాంగిట్యూడ్ మరియు టాప్-స్పెక్ లిమిటెడ్ ప్లస్ వేరియంట్లలో కూడా అందిస్తోంది.  లాంగిట్యూడ్ వేరియంట్ ధర రూ .21.96 లక్షలు కాగా, టాప్-స్పెక్ లిమిటెడ్ ప్లస్ వేరియంట్ ధర రూ .4.99 లక్షలు (రెండూ ఎక్స్-షోరూమ్ ఇండియా) ఉంది.   

పవర్ట్రెయిన్ కాంబో

లాంగిట్యూడ్ వేరియంట్

లిమిటెడ్ ప్లస్ వేరియంట్

డీజిల్ మాన్యువల్

రూ. 18.03 లక్షలు

రూ. 21.33 లక్షలు

డీజిల్ ఆటో

రూ. 21.96 లక్షలు

రూ. 24.99 లక్షలు

తేడా

రూ. 3.93 లక్షలు

రూ. 3.66 లక్షలు

అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ

రెండు వేరియంట్‌లలోని పవర్‌ట్రెయిన్ అదే 2.0-లీటర్ డీజిల్ ఇంజిన్‌ గా BS 6 ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా ఉంది, ఇది 9-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌కు జత చేయబడింది. జీప్ తన 4X4 డ్రైవ్‌ట్రెయిన్‌ను రెండు వేరియంట్‌లలో కూడా అందిస్తోంది, మీకు కవాలనుకున్నా కూడా వేరే డ్రైవ్‌ట్రెయిన్ ఏమీ ఉండదు,ఇది లేకుండా డీజిల్-ఆటో కంపాస్ ఉండదు.  

ఇది కూడా చదవండి: జీప్ యొక్క మారుతి విటారా బ్రెజ్జా, హ్యుందాయ్ వెన్యూ -ప్రత్యర్థి లాంచ్ టైమ్‌లైన్ వెల్లడించింది

Jeep Compass Diesel Automatic Is A Lot More Affordable Than Before!

క్రూజ్ కంట్రోల్, డ్యూయల్-జోన్ ఎయిర్ కండిషనింగ్, టూ-టోన్ ఇంటీరియర్స్, పాసివ్ కీలెస్ ఎంట్రీ మరియు పుష్-బటన్ స్టార్ట్ వంటి కంపాస్ యొక్క లాంగిట్యూడ్ వేరియంట్‌పై జీప్ మరింత టెక్నాలజీ ని ప్రవేశపెట్టింది. టాప్-స్పెక్ లిమిటెడ్ ప్లస్ వేరియంట్ కూడా క్రూయిజ్ కంట్రోల్‌ ను పొందింది, ఇది అంతకుముందు లేకపోవడం అనేది ఆశ్చర్యం.   

Jeep Compass Diesel Automatic Is A Lot More Affordable Than Before!

సంబంధిత వార్త: 2020 జీప్ కంపాస్ ఫేస్‌లిఫ్ట్ మొదటిసారి మా కంటపడింది

Jeep Compass Diesel Automatic Is A Lot More Affordable Than Before!

కంపాస్ లైనప్‌లో కొత్త చేర్పులు SUV యొక్క పాండిత్యానికి మాత్రమే తోడ్పడతాయి. కంపాస్ టక్సన్ ఫేస్‌లిఫ్ట్‌కు ప్రత్యర్థిగా ఉంటుంది, ఇది 8-స్పీడ్ ఆటో గేర్‌బాక్స్‌ను పొందుతుంది మరియు ఆటో ఎక్స్‌పో 2020 లో ఆవిష్కరించబడుతుంది.

మరింత చదవండి: కంపాస్ ఆటోమేటిక్

was this article helpful ?

Write your Comment on Jeep కంపాస్ 2017-2021

explore మరిన్ని on జీప్ కంపాస్ 2017-2021

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience