Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ఇప్పుడు డీలర్ షిప్ؚల వద్ద అందుబాటులో ఉన్న 2023 Tata Nexon మరియు Nexon EV

టాటా నెక్సన్ కోసం ansh ద్వారా సెప్టెంబర్ 13, 2023 02:13 pm ప్రచురించబడింది

టాటా, ICE మరియు EV మోడల్‌ల రెండిటి ధరలను సెప్టెంబర్ 14 తేదీన ప్రకటించనుంది

  • ఇక్కడ కనిపిస్తున్న నెక్సాన్ EV టాప్-స్పెక్ ఎంపవర్డ్ వేరియెంట్.

  • డీలర్ షిప్ؚల వద్ద చేరుకున్న నెక్సాన్ ICE మోడల్ టాప్-స్పెక్ ఫియర్ؚలెస్ వేరియంట్.

  • ఎక్స్ؚటీరియర్ మరియు ఇంటీరియర్ؚలలో తేలికపాటి మార్పులతో రెండు మోడల్‌లు ఒకేలా కనిపిస్తున్నాయి.

  • నెక్సాన్ ధర రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మరియు నెక్సాన్ EV ధర రూ.15 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చు.

టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ మరియు నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ؚలను కారు తయారీదారు విడుదల చేశారు మరియు ఈ రెండిటి బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి. టాటా, వీటి ధరలను సెప్టెంబర్ 14వ తేదీన ప్రకటించనుంది, అయితే విడుదలకు ముందుగానే ఈ మోడల్‌లు డీలర్ؚషిప్ؚలను చేరుకున్నాయి, ఇక్కడ ఈ కార్‌లను స్వయంగా పరిశీలించవచ్చు.

డిజైన్‌ తేడాలు

దూరం నుండి ICE మరియు EV నెక్సాన్ؚల మధ్య తేడాను గమనించలేము. కానీ దగ్గర నుండి చూస్తే, తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. EVలో కనెక్టెడ్ LED DRL సెట్అప్, క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్ మరియు బంపర్‌పై నిలువు ప్యాటర్న్ؚలు మరియు హెడ్‌ల్యాంప్ హౌసింగ్ؚలను చూడవచ్చు. బూట్ లీడ్‌పై “నెక్సాన్” మరియు “నెక్సాన్.ev” బ్యాడ్జ్ؚలను మినహాయించి సైడ్ మరియు రేర్ ప్రొఫైల్ؚలు ఒకేలా ఉంటాయి.

ఇంటీరియర్‌లో, 2023 నెక్సాన్ EV టాప్ వేరియెంట్ 12.3-అంగుళాల భారీ టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు కలిగి ఉన్నాయి. అయితే ఇక్కడ కనిపిస్తున్న నెక్సాన్ؚలో 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ యూనిట్ؚ ఉంది, ఇది టాప్-స్పెక్ వర్షన్ؚ కానందున వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా ఇందులో లేవు. ఇది మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚనుؚతో వస్తుంది కాబట్టి ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚలతో అందించే ప్యాడిల్ షిఫ్టర్ؚలు లేవు.

ఫీచర్‌లు

ఈ రెండిటి ఫీచర్‌ల జాబితా దాదాపుగా ఒకేలా ఉంది. 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్ؚలు, టచ్-ఆధారిత AC ప్యానెల్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్ మరియు వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే వంటి ఫీచర్‌లు ఈ రెండు యూనిట్‌లలో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: ఈ 10 చిత్రాలలో టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ ఎక్స్ؚటీరియర్ؚను వివరంగా పరిశీలించండి

భద్రత పరంగా, ఈ రెండిటిలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు ప్రామాణికంగా ఉన్నాయి, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), రెయిన్-సెన్సింగ్ వైపర్ؚలు, రేర్ వ్యూ కెమెరా మరియు బ్లైండ్ వ్యూ మానిటర్ؚతో 360-డిగ్రీల కెమెరా కూడా ఉన్నాయి.

వేరు వేరు పవర్ؚట్రెయిన్ؚలు

ICE నెక్సాన్ రెండు ఇంజన్ ఎంపికలను పొందింది: 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ AMTతో జోడించిన 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ (115PS/260Nm) మరియు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ AMT మరియు 7-స్పీడ్ DCT అనే నాలుగు ట్రాన్స్ؚమిషన్ ఎంపికలతో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (120PS/170Nm).

ఇది కూడా చదవండి: చూడండి: నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ బ్యాక్ లిట్ స్టీరింగ్ వీల్ؚలో టాటా ఒక ఎయిర్ బ్యాగ్ؚను ఎలా అమర్చింది

30kWh మరియు 40.5kWh గల రెండు బ్యాటరీ ప్యాక్ؚలను నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ పొందింది – ఇవి వరుసగా 129PS/215Nm మరియు 145PS/215Nm శక్తిని విడుదల చేసే ఎలక్ట్రిక్ మోటార్ؚతో జోడించబడాయి. చిన్న బ్యాటరీ ప్యాక్ మెరుగైన 325కిమీ పరిధిని, పెద్దది 465కిమీ మైలేజ్‌ను అందించగలవు. DC ఫాస్ట్ ఛార్జర్ؚను ఉపయోగించి ఈ రెండు బ్యాటరీ ప్యాక్ؚలను 56 నిమిషాలలో 10 నుండి 100 శాతం ఛార్జ్ చేయవచ్చు.

ధర పోటీదారులు

నవీకరించిన నెక్సాన్ మరియు నెక్సాన్ EVలు రెండిటినీ టాటా సెప్టెంబర్ 14 తేదీన విడుదల చేస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.8 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటాయని అంచనా. ICE నెక్సాన్ కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా మరియు మహీంద్ర XUV300లతో పోటీని కొనసాగిస్తుంది మరియు నెక్సాన్ EV మహీంద్రా XUV400తో పోటీ పడుతుంది.

ఇక్కడ మరింత చదవండి: నెక్సాన్ AMT

Share via

Write your Comment on Tata నెక్సన్

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎలక్ట్రిక్ కార్లు

  • పాపులర్
  • రాబోయేవి
Rs.48.90 - 54.90 లక్షలు*
Rs.18.90 - 26.90 లక్షలు*
Rs.21.90 - 30.50 లక్షలు*
Rs.17.49 - 21.99 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర