ఇప్పుడు డీలర్ షిప్ؚల వద్ద అందుబాటులో ఉన్న 2023 Tata Nexon మరియు Nexon EV
టాటా నెక్సన్ కోసం ansh ద్వారా సెప్టెంబర్ 13, 2023 02:13 pm ప్రచురించబడింది
- 37 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
టాటా, ICE మరియు EV మోడల్‌ల రెండిటి ధరలను సెప్టెంబర్ 14 తేదీన ప్రకటించనుంది
-
ఇక్కడ కనిపిస్తున్న నెక్సాన్ EV టాప్-స్పెక్ ఎంపవర్డ్ వేరియెంట్.
-
డీలర్ షిప్ؚల వద్ద చేరుకున్న నెక్సాన్ ICE మోడల్ టాప్-స్పెక్ ఫియర్ؚలెస్ వేరియంట్.
-
ఎక్స్ؚటీరియర్ మరియు ఇంటీరియర్ؚలలో తేలికపాటి మార్పులతో రెండు మోడల్‌లు ఒకేలా కనిపిస్తున్నాయి.
-
నెక్సాన్ ధర రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి మరియు నెక్సాన్ EV ధర రూ.15 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ఉండవచ్చు.
టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ మరియు నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ؚలను కారు తయారీదారు విడుదల చేశారు మరియు ఈ రెండిటి బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి. టాటా, వీటి ధరలను సెప్టెంబర్ 14వ తేదీన ప్రకటించనుంది, అయితే విడుదలకు ముందుగానే ఈ మోడల్‌లు డీలర్ؚషిప్ؚలను చేరుకున్నాయి, ఇక్కడ ఈ కార్‌లను స్వయంగా పరిశీలించవచ్చు.
డిజైన్ తేడాలు


దూరం నుండి ICE మరియు EV నెక్సాన్ؚల మధ్య తేడాను గమనించలేము. కానీ దగ్గర నుండి చూస్తే, తేడాలు స్పష్టంగా కనిపిస్తాయి. EVలో కనెక్టెడ్ LED DRL సెట్అప్, క్లోజ్డ్-ఆఫ్ గ్రిల్ మరియు బంపర్‌పై నిలువు ప్యాటర్న్ؚలు మరియు హెడ్‌ల్యాంప్ హౌసింగ్ؚలను చూడవచ్చు. బూట్ లీడ్‌పై “నెక్సాన్” మరియు “నెక్సాన్.ev” బ్యాడ్జ్ؚలను మినహాయించి సైడ్ మరియు రేర్ ప్రొఫైల్ؚలు ఒకేలా ఉంటాయి.


ఇంటీరియర్‌లో, 2023 నెక్సాన్ EV టాప్ వేరియెంట్ 12.3-అంగుళాల భారీ టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు కలిగి ఉన్నాయి. అయితే ఇక్కడ కనిపిస్తున్న నెక్సాన్ؚలో 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ యూనిట్ؚ ఉంది, ఇది టాప్-స్పెక్ వర్షన్ؚ కానందున వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు కూడా ఇందులో లేవు. ఇది మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚనుؚతో వస్తుంది కాబట్టి ఆటోమ్యాటిక్ వేరియెంట్ؚలతో అందించే ప్యాడిల్ షిఫ్టర్ؚలు లేవు.
ఫీచర్‌లు


ఈ రెండిటి ఫీచర్‌ల జాబితా దాదాపుగా ఒకేలా ఉంది. 10.25-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్ؚలు, టచ్-ఆధారిత AC ప్యానెల్, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్ మరియు వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లే వంటి ఫీచర్‌లు ఈ రెండు యూనిట్‌లలో ఉన్నాయి.
ఇది కూడా చదవండి: ఈ 10 చిత్రాలలో టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ ఎక్స్ؚటీరియర్ؚను వివరంగా పరిశీలించండి
భద్రత పరంగా, ఈ రెండిటిలో ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు ప్రామాణికంగా ఉన్నాయి, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), రెయిన్-సెన్సింగ్ వైపర్ؚలు, రేర్ వ్యూ కెమెరా మరియు బ్లైండ్ వ్యూ మానిటర్ؚతో 360-డిగ్రీల కెమెరా కూడా ఉన్నాయి.
వేరు వేరు పవర్ؚట్రెయిన్ؚలు
ICE నెక్సాన్ రెండు ఇంజన్ ఎంపికలను పొందింది: 6-స్పీడ్ మాన్యువల్ లేదా 6-స్పీడ్ AMTతో జోడించిన 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ (115PS/260Nm) మరియు 5-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ మాన్యువల్, 6-స్పీడ్ AMT మరియు 7-స్పీడ్ DCT అనే నాలుగు ట్రాన్స్ؚమిషన్ ఎంపికలతో 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (120PS/170Nm).
ఇది కూడా చదవండి: చూడండి: నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ బ్యాక్ లిట్ స్టీరింగ్ వీల్ؚలో టాటా ఒక ఎయిర్ బ్యాగ్ؚను ఎలా అమర్చింది
30kWh మరియు 40.5kWh గల రెండు బ్యాటరీ ప్యాక్ؚలను నెక్సాన్ EV ఫేస్ؚలిఫ్ట్ పొందింది – ఇవి వరుసగా 129PS/215Nm మరియు 145PS/215Nm శక్తిని విడుదల చేసే ఎలక్ట్రిక్ మోటార్ؚతో జోడించబడాయి. చిన్న బ్యాటరీ ప్యాక్ మెరుగైన 325కిమీ పరిధిని, పెద్దది 465కిమీ మైలేజ్‌ను అందించగలవు. DC ఫాస్ట్ ఛార్జర్ؚను ఉపయోగించి ఈ రెండు బ్యాటరీ ప్యాక్ؚలను 56 నిమిషాలలో 10 నుండి 100 శాతం ఛార్జ్ చేయవచ్చు.
ధర & పోటీదారులు
నవీకరించిన నెక్సాన్ మరియు నెక్సాన్ EVలు రెండిటినీ టాటా సెప్టెంబర్ 14 తేదీన విడుదల చేస్తుంది. వీటి ధరలు వరుసగా రూ.8 లక్షలు (ఎక్స్-షోరూమ్) మరియు రూ.15 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటాయని అంచనా. ICE నెక్సాన్ కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా మరియు మహీంద్ర XUV300లతో పోటీని కొనసాగిస్తుంది మరియు నెక్సాన్ EV మహీంద్రా XUV400తో పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి: నెక్సాన్ AMT