9 వేర్వేరు రంగులలో అందుబాటులో ఉన్న 2023 హ్యుందాయ్ వెర్నా
హ్యుందాయ్ వెర్నా కోసం ansh ద్వారా మార్చి 23, 2023 07:45 pm ప్రచురించబడింది
- 40 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఏడు మోనోటోన్ మరియు రెండు డ్యూయల్-టోన్ రంగు ఎంపికలతో అందించబడుతుంది
-
ఆరవ-జనరేషన్ వెర్నా ధర రూ.10.90 లక్షల నుండి రూ.17.38 లక్షల వరకు ఉంటుంది (ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర).
-
రెండు పెట్రోల్ ఇంజన్‌లను పొందింది: 115PS నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ మరియు 160PS టర్బోచార్జెడ్ యూనిట్.
-
ఈ సెడాన్ ముందు, వెనుక భాగాలు పారామెట్రిక్ డిజైన్ డీటైల్స్ؚతో కొత్త బోల్డ్ స్టైలింగ్ؚతో వస్తుంది.
-
ఫీచర్‌లలో డ్యూయల్ డిస్ప్లేؚలు, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు మరియు ADAS ఉన్నాయి.
-
ఇప్పటికే 8,000 కంటే ఎక్కువ బుకింగ్ؚలను అందుకుంది.
ఎంతో నిరీక్షణ తరువాత, ఎట్టకేలకు హ్యుందాయ్ ఆరవ-జనరేషన్ వెర్నాపై తెరను తోలగిస్తూ, దాని ధరలను వెల్లడించింది. ఇది నిలిపివేస్తున్న మోడల్ కంటే పెద్దది మరియు ముందు, వెనుక భాగాలు పారామెట్రిక్ డిజైన్ డీటైల్స్ؚతో కొత్త బోల్డ్ స్టైలింగ్ؚతో వస్తుంది. ఈ సరికొత్త లుక్‌లో మూడు అంశాలు ప్రధానంగా ఉన్నాయి: ముందు మరియు వెనుక భాగంలో LED లైట్ స్ట్రిప్స్‌తో చుట్టినట్లు ఉంటుంది, రూఫ్ؚలైన్ నాజూకైన వంపు ఆకృతిని కలిగి ఉంటుంది మరియు వెనుక ప్రొఫైల్ సగ భాగంలో కోణీయంగా చెక్కినట్టు ఉంటుంది. ఈ సెడాన్ బుకింగ్ؚలు నెల క్రితమే ప్రారంభమయ్యాయి, కానీ అందుబాటులో ఉన్న రంగు ఎంపికలను ఈ కారు తయారీదారు ఇటీవలే వెల్లడించారు.
ఇది కూడా చదవండి: రూ.10.90 లక్షలకు విడుదలైన హ్యుందాయ్ వెర్నా 2023; తన ప్రత్యర్ధులతో పోలిస్తే దీని ధర రూ. 40,000 పైగా తక్కువ
కాబట్టి, మీరు 2023 వెర్నాను బుక్ చేసుకునే ముందు, అందుభాటులో ఉన్న రంగులను చూడండి:
- అట్లాస్ వైట్
- ఫైరీ రెడ్
-
అబిస్ బ్లాక్
-
టైఫూన్ సిల్వర్
-
టెల్లూరియన్ బ్రౌన్
-
టైటాన్ గ్రే
-
స్టారీ నైట్
-
అట్లాస్ వైట్ డ్యూయల్-టోన్
-
ఫైరీ రెడ్ డ్యూయల్-టోన్
పవర్‌ట్రెయిన్
2023 వెర్నా రెండు పెట్రోల్ ఇంజన్ ఎంపికలతో వస్తుంది: 1.5-లీటర్ నాచురల్లీ ఆస్పిరేటెడ్ యూనిట్, ఇది 115PS మరియు 144Nm పవర్ మరియు టార్క్‌ను అందిస్తుంది ఇది 6-స్పీడ్‌ల మాన్యువల్ లేదా CVT గేర్‌బాక్స్ؚతో జత చేయబడుతుంది, 1.5-లీటర్ టర్బో చార్జెడ్ ఇంజన్, ఇది 160PS మరియు 253Nm పవర్ మరియు టార్క్‌ను అందిస్తుంది ఇది 6-స్పీడ్‌ల మాన్యువల్ లేదా ఏడు-స్పీడ్‌ల DCTతో జత చేయబడుతుంది. డ్యూయల్-టోన్ ఎంపిక కొత్త వెర్నా టర్బో వేరియెంట్ؚలకు మాత్రమే పరిమితం అయ్యింది, ఈ వేరియెంట్ నలుపు రంగు ఆలాయ్ వీల్స్ؚను కూడా కలిగి ఉంటుంది.
ఫీచర్‌లు & భద్రత
దీని ఫీచర్‌ల జాబితాలో డ్యూయల్ ఇంటిగ్రేటెడ్ డిస్ప్లేؚలు (10.25-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్ؚమెంట్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే), సింగల్-పేన్ సన్ؚరూఫ్, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, ఇన్ఫోటైన్ؚమెంట్ మరియు AC కోసం స్విచ్చబుల్ కంట్రోల్స్ మరియు ఎనిమిది-స్పీకర్‌ల బోస్ సౌండ్ సిస్టమ్ ఉంటాయి.
ఇది కూడా చదవండి: కొత్త హ్యుందాయ్ వెర్నా ఎలక్ట్రిఫికేషన్ పొందని అత్యంత ఇంధన-సామర్ధ్యాన్ని కలిగిన సెడానా?
వాహనంలో ఉన్న ప్రయాణీకుల భద్రతను నిర్ధారించడానికి, 2023 వెర్నా ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, EBDతో ABS, ప్రయాణీకులు అందరి కోసం మూడు పాయింట్‌ల సీట్ బెల్ట్ؚలు, వెనుక భాగంలో డిఫోగ్గర్ ను ప్రామాణికంగా కలిగి ఉంటుంది. దీనిలో లేన్-కీప్ అసిస్ట్, బ్లైండ్-స్పాట్ అలర్ట్, ఫార్వర్డ్ కొలిషన్ వార్నింగ్, డ్రైవర్ అటెన్షన్ వార్నింగ్ మరియు అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ వంటి అడ్వాన్సెడ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టం (ADAS) ఫీచర్‌లను కలిగి ఉంది.
ధర & పోటీదారులు
హ్యుందాయ్- ఆరవ-జనరేషన్ వెర్నా ధరను రూ.10.90 లక్షలు మరియు రూ.17.38 లక్షల మధ్య నిర్ణయించింది (ప్రారంభ, ఎక్స్-షోరూమ్ ధర) మరియు ఇది హోండా సిటీ, స్కోడా స్లావియా, వోక్స్వాగన్ విర్టస్ మరియు మారుతి సియాజ్ؚలతో పోటీ పడుతుంది.
ఇక్కడ మరింత చదవండి: వెర్నా ఆన్ؚరోడ్ ధర
0 out of 0 found this helpful