• English
  • Login / Register

రూ.10.90 లక్షలతో ప్రారంభించబడిన 2023 హ్యుందాయ్ వెర్నా; దాని ప్రత్యర్థులతో పోలిస్తే రూ. 40,000కు పైగా తగ్గిన ధర

హ్యుందాయ్ వెర్నా కోసం tarun ద్వారా మార్చి 22, 2023 09:50 am సవరించబడింది

  • 76 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

సరికొత్త డిజైన్, భారీ కొలతలు, ఉత్తేజకరమైన ఇంజన్‌లు మరియు మరిన్ని ఫీచర్లను పొందండి!

Hyundai Verna 2023

  • కొత్త వెర్నా ధర రూ.10.90 లక్షల నుంచి రూ.17.38 లక్షల వరకు ఉంది.

  • మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌లతో 1.5-లీటర్ పెట్రోల్ మరియు టర్బో-పెట్రోల్ ఇంజన్‌లతో లభిస్తుంది.

  • ఇంటిగ్రేటెడ్ డ్యూయల్ డిస్‌ప్లేలు, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు మరియు బోస్ సౌండ్ సిస్టమ్‌ వంటి అంశాలను పొందుతుంది.

  • భద్రత పరంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్‌లు, TPMS మరియు ADASల ద్వారా మరింత భద్రతను అందిస్తుంది.

  • హోండా సిటీ, వాక్స్వాగన్ విర్టస్ మరియు స్కోడా స్లావియా వాహనాలు ప్రత్యర్థులు.

హ్యుందాయ్ ఆరవ తరం వెర్నాను భారతదేశంలో విడుదల చేసింది. కారు తయారీ సంస్థ ఫిబ్రవరి మధ్య నుండి సెడాన్ కోసం ఇప్పటికే 8,000 బుకింగ్‌లను పొందింది అలాగే కస్టమర్ డెలివరీలు త్వరలో ప్రారంభం కానున్నాయి. ప్రస్తుతం, ఈ సెడాన్ పెట్రోల్ ఇంజన్ ను మాత్రమే అందిస్తుంది మరియు ఈ వెర్నా రూ.10.90 లక్షల నుండి రూ.17.38 లక్షల (ఎక్స్-షోరూమ్, ఢిల్లీ) ధరతో నాలుగు వేర్వేరు వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.

వేరియంట్లు మరియు ధరలు

వేరియంట్లు

1.5-లీటర్MT

1.5-లీటర్ CVT

1.5-లీటర్ టర్బో-పెట్రోల్ MT

1.5-లీటర్ టర్బో-పెట్రోల్ DCT

E

రూ 10.90 లక్షలు

N.A.

N.A.

N.A.

S

రూ 11.96 లక్షలు

N.A.

N.A.

N.A.

SX

రూ 12.99 లక్షలు

రూ 14.24 లక్షలు

రూ 14.84 లక్షలు

రూ 16.08 లక్షలు

SX (O)

రూ 14.66 లక్షలు

రూ 16.20 లక్షలు

రూ 15.99 లక్షలు

రూ 17.38 లక్షలు

అన్ని ఎక్స్-షోరూమ్ ధరలు 

CVT వేరియంట్‌ యొక్క ధరలు పెట్రోల్-మాన్యువల్ వేరియంట్‌ల కన్నా రూ.1.54 లక్షల వరకు ఎక్కువ ఉంటుంది, అదే DCT టర్బో మాన్యువల్‌ వేరియంట్ల విషయానికి వస్తే రూ.1.4 లక్షల వరకు డిమాండ్ చేస్తుంది.

మరింత శక్తివంతమైన ఇంజన్!   

ఇంజన్  

1.5-లీటర్ సహజ సిద్దమైన పెట్రోల్

1.5-లీటర్ టర్బో పెట్రోల్

పవర్ 

115PS

160PS

టార్క్ 

144Nm

253Nm

ట్రాన్స్మిషన్ 

6-MT / CVT

6-MT / 7-DCT

ఇంధన సామర్ధ్యం

18.6kmpl / 19.6kmpl

20kmpl / 20.6kmpl

ఐదవ తరం వెర్నా యొక్క అదే 1.5-లీటర్ సహజ సిద్దమైన ఇంజన్ ను కొనసాగిస్తుంది, అయితే డీజిల్ ఇంజిన్ నిలిపివేయబడింది. మరోవైపు, కొత్త వెర్నాలో 120PS, 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ స్థానంలో కొత్త 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్‌తో భర్తీ చేయబడింది. ఈ ఇంజిన్ 160PS పవర్ ను మరియు 253Nm టార్క్ లను ఉత్పత్తి చేస్తుంది, ఇది స్కోడా స్లావియా మరియు వోక్స్‌వ్యాగన్ విర్టస్ యొక్క 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ అవుట్‌పుట్ కంటే 10PS మరియు 3Nm ఎక్కువ, వీటి కారణంగా వెర్నా దాని విభాగంలో అత్యంత శక్తివంతమైన సెడాన్ గా నిలిచింది.

ఈ రెండు ఇంజన్‌లు మాన్యువల్ లేదా ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఎంపికలతో జత చేయబడి ఉండవచ్చు, మరో విషయం ఏమిటంటే ఇవి ప్యాడిల్ షిఫ్టర్‌లతో కూడా అందించబడతాయి.

భారీ కొలతలు

Hyundai Verna 2023

కొలతలు

మునుపటి వెర్నా

కొత్త వెర్నా

వ్యత్యాసం

పొడవు

4,440mm

4,535mm

+95mm

వెడల్పు

1729mm

1,765mm

+36mm

ఎత్తు

1475mm

1,475mm

-

వీల్ బేస్

2600mm

2,670mm

+70mm

కొత్త వెర్నా, దాని మునుపటి వెర్షన్ కంటే మరింత పొడవుగా మరియు వెడల్పుగా ఉంది, అయితే అదే ఎత్తుతో కొనసాగుతుంది. దీని వీల్‌బేస్ కూడా 70 మిమీ పెరిగింది అలాగే ఇప్పుడు దాని విభాగంలో ఇదే పొడవైన వాహనం. 528 లీటర్ల బూట్ సామర్ధ్యంతో, కొత్త వెర్నా దాని ప్రత్యర్థులతో పోలిస్తే అగ్రస్థానంలో ఉంది. 

సాంకేతికతతో కూడిన క్యాబిన్

New-gen Verna infotainment

ఇప్పటికే ఎన్నో విభిన్న అంశాలను కలిగిన వెర్నా మరిన్ని పరికరాలను పొంది దాని విభాగంలో మరింత ప్రత్యేకతను కనబరుస్తుంది. కొన్ని ముఖ్యమైన అంశాలు ఇక్కడ ఇవ్వబడ్డాయి:

  • పూర్తి LED లైటింగ్
  • ఎలక్ట్రిక్ సన్‌రూఫ్
  • డ్యూయల్ స్క్రీన్ డిస్‌ప్లేలు (10.25-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ మరియు డిజిటలైజ్డ్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్)
  • ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ప్లే
  • 8-స్పీకర్ బోస్ సౌండ్ సిస్టమ్
  • వైర్‌లెస్ ఛార్జర్
  • క్రూజ్ కంట్రోల్
  • పాడిల్ షిఫ్టర్లు
  • యాంబియంట్ లైటింగ్
  • టచ్-ఎనేబుల్డ్ క్లైమేట్ మరియు ఆడియో కంట్రోల్ ప్యానెల్
  • హీటెడ్ మరియు వెంటిలేటెడ్ ముందు సీట్లు
  • పవర్డ్ ఫ్రంట్ డ్రైవర్ సీటు
  • వెనుక AC వెంట్లు
  • వెనుక విండో కర్టెన్లు

సెడాన్ స్పోర్ట్స్, డ్యూయల్ స్క్రీన్ డిస్‌ప్లేలు, బోస్ సౌండ్ సిస్టమ్ మరియు హీటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి అనేక సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్లను కలిగి ఉంది.

మెరుగైన భద్రత

హ్యుందాయ్ సంస్థ, వెర్నాలో ప్రామాణిక భద్రతా కిట్ ను అందిస్తోంది, దానిలో ఉన్న కొన్ని భద్రతా అంశాలు క్రింది ఇవ్వబడ్డాయి:

  • ఆరు ఎయిర్ బ్యాగులు
  • ISOFIX చైల్డ్-సీట్ మౌంట్‌లు
  • ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్‌లు
  • మూడు-పాయింట్ సీట్ బెల్ట్‌లు (ప్రయాణికులందరికీ)
  • వెనుక డీఫోగ్గర్

వెర్నా యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లలో ESC, ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఫ్రంట్ పార్కింగ్ సెన్సార్లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) మరియు ఆల్-వీల్ డిస్క్ బ్రేక్‌లు ఉన్నాయి. వీటన్నింటితో పాటు ADAS (అధునాతన డ్రైవర్-సహాయక వ్యవస్థలు) దాని అగ్ర శ్రేణి వేరియంట్ లో మాత్రమే అందిస్తుంది, దీనితో పాటు మరికొన్ని క్రింది ఇవ్వబడ్డాయి:

  • ఫ్రంట్ కొలిజన్ వార్నింగ్ మరియు అవాయిడెన్స్ అసిస్ట్ 
  • బ్లైండ్ స్పాట్ మానిటరింగ్
  • లేన్ కీప్ అసిస్ట్
  • లీడింగ్ వెహికల్ డిపార్చర్ అసిస్ట్
  • హై బీమ్ అసిస్ట్
  • రేర్ క్రాస్ ట్రాఫిక్ కొలిజన్ వార్నింగ్ మరియు అసిస్టెన్స్
  • అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్
  • లేన్ ఫాలో అసిస్ట్

అయినప్పటికీ, హోండా సిటీ దాని స్ట్రాంగ్-హైబ్రిడ్ వెర్షన్‌తో 2022లో మొదటిసారిగా అందించినందున ఇది సెగ్మెంట్-ఫస్ట్ ఫీచర్ కాదు మరియు ఇప్పుడు స్టాండర్డ్ వెర్షన్‌తో కూడా ఈ ఫీచర్ ను అందిస్తోంది.

రంగులు

Hyundai Verna 2023

కొత్త వెర్నా ఏడు రంగు ఎంపికలలో అందించబడుతుంది, అవి వరుసగా:

  • టైటాన్ గ్రే
  • టెల్లూరియన్ బ్రౌన్
  • టైఫూన్ సిల్వర్
  • ఫెయిరీ రెడ్
  • అట్లాస్ వైట్
  • అబిస్ బ్లాక్
  • స్టార్రీ నైట్

తెలుపు మరియు ఎరుపు షేడ్లు, బ్లాక్ రూఫ్‌తో కూడా ఎంచుకోవచ్చు, అయితే డ్యూయల్-టోన్ పెయింట్ ఎంపికలు టర్బో వేరియంట్‌లకు మాత్రమే ప్రత్యేకంగా అందించబడతాయి.

వారంటీ మరియు నిర్వహణ

హ్యుందాయ్ వెర్నా, మూడు సంవత్సరాలు / అపరిమిత కిలోమీటర్ల ప్రామాణిక వారంటీతో అందించబడుతుంది, దానితో పాటు ఐదు సంవత్సరాల వరకు మరమ్మత్తులు మరియు నిర్వహణా ప్యాకేజీ అలాగే రోడ్‌సైడ్ అసిస్టెన్స్ కూడా అందించబడుతుంది. వారంటీని ఏడేళ్ల వరకు పొడిగించే అవకాశం యజమానులకు ఉంది. వెర్నా తన సెగ్మెంట్‌లో అత్యంత తక్కువ నిర్వహణ ఖర్చును కలిగి ఉందని కార్ల తయారీ సంస్థ పేర్కొంది.

ఇవి కూడా చదవండి: వోక్స్వాగన్ విర్టస్ యొక్క 1.5-లీటర్ TSI మరియు 1.0-లీటర్ TSI వేరియంట్‌ల మధ్య సర్వీస్ ఖర్చులు ఏవిధంగా ఉంటాయో ఇక్కడ ఉంది

ప్రత్యర్థులు

హ్యుందాయ్ వెర్నా యొక్క  తాజా వెర్షన్, హోండా సిటీస్కొడా స్లావియా మరియు వోక్స్వాగన్ విర్టస్ లతో పోటీని కొనసాగిస్తోంది, అయితే మారుతి సుజుకి సియాజ్ ‌కి ప్రీమియం ప్రత్యామ్నాయంగా కూడా కొనసాగుతుంది. ఈ ధర శ్రేణిలో, ప్రీమియం కాంపాక్ట్ SUVలు అలాగే కొన్ని మధ్యతరహా SUVల నుండి మీకు నచ్చిన కారును ఎంచుకునే అవకాశం కూడా ఉంది.      

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Hyundai వెర్నా

Read Full News

explore మరిన్ని on హ్యుందాయ్ వెర్నా

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience