• English
  • Login / Register

విడుదలైన విర్టస్ GT మాన్యువల్, బ్లాక్డ్-అవుట్ క్లబ్‌లోకి ప్రవేశించిన వోక్స్వాగన్

వోక్స్వాగన్ వర్చుస్ కోసం tarun ద్వారా జూన్ 12, 2023 12:08 pm ప్రచురించబడింది

  • 76 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ సెడాన్ 150PS పవర్ ఇంజిన్ సరసమైన ధరలో, మరింత మన్నికగా వస్తుంది, అయితే కొత్త రంగు పరిమిత కాలానికి మాత్రమే అందుబాటులో ఉంటుంది

Volkswagen Virtus

  • వినియోగదారుల ఫీడ్‌బ్యాక్ ఆధారంగా, వోక్స్వాగన్ 6-స్పీడ్ల మాన్యువల్ ట్రాన్స్మిషన్‌ను విర్టస్ GTలో ప్రవేశపెట్టింది.

  • విర్టస్ GT లైన్ కొత్త మాన్యువల్ వేరియంట్ను పొందింది, ఇది ప్రస్తుతం GT ప్లస్ DSGతో పోలిస్తే 1.67 లక్షల రూపాయలు తక్కువ ధరలో లభిస్తుంది. 

  • విర్టస్ కొత్త GT ఎడ్జ్ లైన్, కొత్త ముదురు నలుపు పెర్ల్ ఎక్సటీరియర్ రంగులో కూడా వస్తుంది.

  • కేవలం టాప్ ఎండ్ GT ప్లస్ వేరియంట్లో మాత్రమే అందుబాటులో ఉంటుంది.

మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ పరిచయంతో, వోక్స్వాగన్ విర్టస్ GT లైన్ ప్రస్తుతం సరసమైన ధరలో లభిస్తుంది. అంతేకాకుండా, కొత్త ముదురు నలుపు పెర్ల్ రంగును ఈ సెడాన్ GT లైన్ మోడల్‌లలో మాత్రమే అందిస్తున్నారు.

కొత్త వేరియంట్ మరియు రంగుల ధరలు

    వేరియంట్లు  

  ఎక్స్-షోరూం ధర

    GT ప్లస్ MT

  రూ.16.89 లక్షలు  

  GT ప్లస్ MT ముదురు నలుపు పెర్ల్ రంగు

  రూ.17.09 లక్షలు  

    GT ప్లస్ DSG ముదురు నలుపు పెర్ల్ రంగు

  రూ.18.76 లక్షలు  

150 PS 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజిన్‌ను అందించే వోక్స్వాగన్ విర్టస్ GT లైన్ ప్రస్తుతం మాన్యువల్ వేరియంట్‌లో అందుబాటులో ఉంది. ఇప్పటి వరకు, ఈ ఇంజన్ 7-స్పీడ్ DSG (డ్యూయల్-క్లచ్ ఆటోమేటిక్)తో మాత్రమే అందుబాటులో ఉండేది. మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ వేరియంట్ ఆటోమేటిక్‌ వేరియంట్ కంటే రూ.1.67 లక్షల తక్కువ ధరలో లభిస్తుంది మరియు మరింత మాన్నికైన డ్రైవింగ్ అనుభవాన్ని కోరుకునే ఔత్సాహికులకు కూడా అనుకూలంగా ఉంటుంది.

Volkswagen Virtus

ఈ సెడాన్ 6-స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ల ఎంపికతో 115PS 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్‌తో కూడా లభ్యమవుతుంది.

ఇవి కూడా చదవండి: వోక్స్వాగన్ టైగూన్ కొత్త GT వేరియంట్లు మరియు కొత్త రంగులతో పరిమిత ఎడిషన్‌లలో లభిస్తుంది.

సాధారణ రంగు ఎంపికలతో పోలిస్తే ముదురు నలుపు పెర్ల్ రంగు రూ.20,000 ఎక్కువ ధరలో లభిస్తుంది. ఈ సెడాన్ ఇప్పటికే ఆరు రంగు ఎంపికలతో అందుబాటులో ఉంది: కర్కుమా ఎల్లో, రైజింగ్ బ్లూ మెటాలిక్, రిఫ్లెక్స్ సిల్వర్, కార్బన్ స్టీల్ గ్రే, కాండీ వైట్ మరియు వైల్డ్ చెర్రీ రెడ్. ఆన్‌లైన్‌లో ఈ కొత్త రంగు GT ఎడ్జ్ వేరియంట్‌లను బుక్ చేసుకోవచ్చు మరియు మొత్తం బుకింగ్‌లపై తయారీ ఆధారపడి ఉంటుంది. ఇది మోడల్ పరిమితంగా విడుదల చేయనున్నారు మరియు డెలివరీలు జూలై 2023లో ప్రారంభమవుతాయి.

Volkswagen Virtus

ఈ నవీకరణలో ఫీచర్‌ల పరంగా ఎటువంటి మార్పులు లేవు. అందువల్ల ఈ సెడాన్లో ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, 10.1-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్‌ప్లే, డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, వైర్‌లెస్ ఫోన్ ఛార్జర్ మరియు వెంటిలేటెడ్ ముందు సీట్‌లు వంటి మునపటి ఫీచర్లను కలిగి ఉంది. ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, హిల్ హోల్డ్ అసిస్ట్, ISOFIX చైల్డ్ సీట్ మౌంట్‌లు మరియు వెనుక పార్కింగ్ కెమెరా వంటి భద్రత అంశాలును కూడా కలిగి ఉంది.

ఇవి కూడా చదవండి: హ్యుందాయ్ వెర్నా టర్బో DCT vs స్కోడా స్లావియా మరియు వోక్స్వాగన్ విర్టస్ 1.5 DSG: వాస్తవ-ప్రపంచ ఇంధన సామర్థ్య పోలిక

హ్యుందాయ్ వెర్నా, స్కోడా స్లావియా, మారుతి సుజుకి సియాజ్, మరియు హోండా సిటీలతో విర్టస్ పోటీ పడుతోంది, కానీ దాని ప్రత్యర్థులలో ఏదీ పూర్తిగా నలుపు రంగులో అందుబాటులో లేదు. 

మరిన్ని వివరాలకై చదవండి: వోక్స్వాగన్ విర్టస్ ఆటోమేటిక్

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Volkswagen వర్చుస్

Read Full News

explore మరిన్ని on వోక్స్వాగన్ వర్చుస్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience