• English
  • Login / Register

కొత్త GT వేరియెంట్ؚలను, కొత్త రంగులలో లిమిటెడ్ ఎడిషన్ؚలను పొందిన వోక్స్వాగన్ టైగూన్

వోక్స్వాగన్ టైగన్ కోసం rohit ద్వారా జూన్ 12, 2023 12:03 pm ప్రచురించబడింది

  • 52 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

కొత్త వేరియెంట్ؚలు మరియు ధరలతో, బేస్ వెర్షన్ DSG ఎంపిక మరింత అందుబాటులోకి వస్తుంది, టాప్-స్పెక్ GT+ వేరియెంట్ మరింత చవకగా లభ్యమవుతుంది

Volkswagen Taigun limited editions

  • వోక్స్వాగన్, కొత్త GT వేరియెంట్ؚలను మరియు ప్రత్యేక రంగులను ఏప్రిల్ؚలో జరిగిన వార్షిక సమావేశంలో ఆవిష్కరించింది. 

  • లిమిటెడ్ ఎడిషన్ SUVల బుకింగ్ؚలను కేవలం తమ వెబ్ؚసైట్ ద్వారా మాత్రమే అంగీకరిస్తోంది.

  • GT DSG, GT MT కంటే పై స్థాయిలో నిలుస్తుంది, GT Plus MT, GT Plus DSG కంటే క్రింది స్థాయిలో నిలుస్తుంది.

  • కొత్త వేరియెంట్ؚలు అన్నీ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో మాత్రమే లభిస్తాయి.

  • లిమిటెడ్ ఎడిషన్ؚలతో పాటు కొత్త వేరియెంట్ؚలు కొత్త డీప్ బ్లాక్ పర్ల్, కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్ రంగులలో లభిస్తాయి.

  • లిమిటెడ్ ఎడిషన్‌లలో అందించే ఫీచర్‌లలో, లోపల మరియు వెలుపల రెడ్ యాక్సెంట్‌లు, గ్లోస్ బ్లాక్ ఫినిష్ ఉన్నాయి.

  • కొత్త వేరియెంట్ؚల ధరలు రూ.16.80 లక్షల నుండి రూ.19.46 లక్షల (ఎక్స్-షోరూమ్ పాన్-ఇండియా) వరకు ఉన్నాయి.

  • లిమిటెడ్ ఎడిషన్ మోడల్‌ల డెలివరీలు జూలై 2023 నుండి ప్రారంభమవుతాయి.

ఈ సంవత్సరం ఏప్రిల్ؚలో కారు తయారీదారు వార్షిక మీటింగ్ؚలో ఆవిష్కరించిన వోక్స్వాగన్ టైగూన్ పర్ఫార్మెన్స్ లైన్ؚలోని కొత్త వేరియెంట్‌లు ప్రస్తుతం మార్కెట్ؚలో అందుబాటులోకి వచ్చాయి. అంతేకాకుండా, ‘GT ఎడ్జ్ లిమిటెడ్ కలెక్షన్’లో భాగంగా రెండు కొత్త లిమిటెడ్ ఎడిషన్ؚలను కూడా ఈ SUV అందుకుంది, వీటి బుకింగ్ؚలు కేవలం ఆన్ؚలైన్ؚలోనే అంగీకరిస్తున్నారు.

కొత్త వేరియెంట్ؚలు మరియు ధరలు

  వేరియెంట్ 

  ధర 

GT DCT

  రూ. 16.80 లక్షలు

GT+ MT

  రూ. 17.80 లక్షలు

GT+ MT డీప్ బ్లాక్ పర్ల్ 

  రూ. 18 లక్షలు

GT+ MT కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్  

  రూ. 18.20 లక్షలు

GT+ DCT డీప్ బ్లాక్ పర్ల్ 

  రూ. 19.26 లక్షలు

GT+ DCT కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్  

  రూ. 19.46 లక్షలు

రిఫరెన్స్ కోసం, టైగూన్ ఎంట్రీ-లెవెల్ పర్ఫార్మెన్స్ లైన్ GT వేరియెంట్ؚను వోక్స్వాగన్ 6-స్పీడ్‌ల మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో మాత్రమే అందిస్తుంది, టాప్-స్పెక్ GT ప్లస్ 7-స్పీడ్‌ల DSG (డ్యూయల్-క్లచ్ ఆటోమ్యాటిక్)కి మాత్రమే పరిమితమైంది. ప్రస్తుతం, GT వేరియెంట్ؚలు రెండూ 150PS పవర్ ను అందించే 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ నుండి శక్తిని పొందుతాయి, రెండు ట్రాన్స్ؚమిషన్‌ల ఎంపికతో వస్తాయి.

Volkswagen Taigun GT badge

కొత్త GT DCT వేరియెంట్, GT MTకి ఎగువన నిలుస్తుంది, దీని ధర రూ.16.26 లక్షలుగా ఉంది. మరొక వైపు, GT+ MT, GT+ DCT కంటే దిగువ స్థాయిలో ఉండగా దీని ధర రూ.18.71 లక్షలుగా ఉంది. కొత్త వేరియెంట్ؚలతో, DCT ఎంపిక దిగువ వేరియెంట్ؚలను మరింత అందుబాటులోకి తెస్తుంది, టాప్-స్పెక్ GT+ వేరియెంట్ؚను మరింత చవకైనదిగా చేస్తుంది.

టైగూన్ చిన్న 1-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ؚతో డైనమిక్ లైన్ వేరియెంట్ؚలలో కూడా లభిస్తుంది (6-స్పీడ్‌ల MT మరియు ATతో) – కంఫర్ట్ లైన్, హైలైన్, మరియు టాప్ؚలైన్ؚలుగా అందిస్తున్నారు.

వోక్స్వాగన్, టైగూన్‌ను పరిమిత కాలానికి మాత్రమే డీప్ బ్లాక్ పర్ల్ మరియు కార్బన్ స్టీల్ గ్రే మ్యాట్ రంగులలో అందిస్తుంది. కారు తయారీదారు జూలై 2023 నుండి వీటిని కస్టమర్‌లకు డెలివరీ ప్రారంభిస్తారు. ఈ GT ఎడ్జ్ వేరియెంట్ؚలు బిల్ట్-టు-ఆర్డర్ؚగా, బుకింగ్ؚల ఆధారంగా తయారు చేయబడతాయి.

ఇది కూడా చదవండి: A.I ప్రకారం భారతదేశంలో రూ.20 లక్షల కంటే తక్కువ ధరతో అందుబాటులో ఉన్న 3 టాప్ ఫ్యామిలీ SUVలు ఇవి

టైగూన్ GT ఎడ్జ్ వేరియెంట్ؚలలో కొత్తవి ఏమిటి?

Volkswagen Taigun Deep Black Pearl
Volkswagen Taigun Carbon Steel Grey Matte

డీప్ బ్లాక్ పర్ల్ ఎడిషన్ؚలో సాధారణ GT-నిర్దిష్ట అప్ؚగ్రేడ్ؚలు ఉన్నాయి, వీటిలో రెడ్ బ్రేక్ క్యాలిపర్ؚలు, సీట్‌లకు ఎరుపు స్టిచింగ్ మరియు కొత్త మెరిసే నలుపు ఎక్స్ؚటీరియర్‌పై మరింత కొట్టొచ్చినట్లు కనిపించే ఎరుపు రంగు యంబియెంట్ లైటింగ్ ఉన్నాయి. మరొక వైపు, మ్యాట్ ఎడిషన్ؚలో ORVM, డోర్ హ్యాండిల్స్ మరియు వెనుక స్పాయిలర్‌ల కోసం మెరిసే నలుపు రంగు ఫినిష్ అలాగే ముందు మరియు పక్క వైపు ఎరుపు రంగు యాక్సెంట్‌లు ఉన్నాయి.

ఇవే కాకుండా, ఈ SUV ప్రస్తుత వేరియంట్‌లలో ఉన్న ఫీచర్‌ల జాబితా తోనే కొనసాగుతుంది. ఇందులో 10-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆటో క్లైమేట్ కంట్రోల్, సింగిల్-పేన్ సన్ؚరూఫ్, మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు (ప్రామాణిక GT వేరియెంట్ؚలలో ఇప్పటికీ అందుబాటులో లేవు) ఉంటాయి. దీని భద్రత కిట్‌లో ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలు, రివర్సింగ్ కెమెరా, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్, మరియు SIOFIX చైల్డ్ సీట్ యాంకరేజ్ؚలు ఉంటాయి.

ఇది కూడా చదవండి: కార్ؚప్లే మరియు మ్యాప్స్ అప్లికేషన్ కోసం ఆకర్షణీయమైన కొత్త ఫీచర్‌లతో వస్తున్న యాపిల్ iOS 17 

ధర మరియు పోటీదారులు

టైగూన్ ధర రూ.11.62 లక్షలు మరియు రూ.19.06 లక్షల (ఎక్స్-షోరూమ్ ప్యాన్ ఇండియా) మధ్య ఉంటుంది, కేవలం కొత్త లిమిటెడ్ ఎడిషన్ؚ రంగులు GT ప్లస్ DSG వేరియెంట్ؚలు అధిక ప్రీమియంతో వస్తాయి. ఇవి టయోటా హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా, కియా సెల్టోస్, హ్యుందాయ్ క్రెటా, MG ఆస్టర్, స్కోడా కుషాక్ మరియు రాబోయే సిట్రోయెన్ C3 ఎయిర్ؚక్రాస్ మరియు హోండా ఎలివేట్ؚలతో పోటీ పడుతుంది.

ఇక్కడ మరింత చదవండి: వోక్స్వాగన్ టైగూన్ ఆన్ؚరోడ్ ధర

was this article helpful ?

Write your Comment on Volkswagen టైగన్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience