హ్యుందాయ్ వెర్నా టర్బో DCT Vs స్కోడా స్లావియా, వోక్స్వాగన్ విర్టస్ 1.5 DSG: వాస్తవ ఇంధన సామర్ధ్య పోలిక
హ్యుందాయ్ వెర్నా కోసం shreyash ద్వారా మే 09, 2023 02:54 pm ప్రచురించబడింది
- 51 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
వెర్నాలా కాకుండా, స్లావియా మరియు విర్టస్ؚలో అధిక ఇంధన సామర్ధ్యం అందించే యాక్టివ్ సిలిండర్ డీయాక్టివేషన్ సాంకేతికత ఉంటుంది. వీటి గెలుపుకు ఈ సాంకేతికత సహాయపడుతుందా?
భారతదేశంలో ఇటీవల కాంపాక్ట్ సెడాన్ విభాగంలో వచ్చిన మార్పులకు అనుగుణంగా కొత్త-జనరేషన్ వెర్నా విడుదలతో హ్యుందాయ్ స్పందించింది. వెర్నాలో ప్రీమియం ఫీచర్‌లు మాత్రమే కాకుండా, కొత్త 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్‌తో కూడా వస్తుంది. 1.5-లీటర్ TSI ఇంజన్ؚతో వచ్చే వోక్స్వాగన్-స్కోడా జంట విర్టస్ మరియు స్లావియాల నుండి అత్యంత శక్తివంతమైన సెడాన్ కిరీటాన్ని కూడా కొత్త 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ؚతో వెర్నా సొంతం చేసుకుంది. 7-స్పీడ్‌ల డ్యూయల్-క్లచ్ ఆటోమ్యాటిక్ؚతో అత్యంత శక్తివంతమైన ఇంజన్ؚలను ఈ మూడు మోడల్‌లు అందిస్తున్నాయి. కానీ, ఇంధన సామర్ధ్యం విషయంలో వీటి మధ్య పోలిక ఎలా ఉంది? ఈ కథనంలో, వాస్తవంగా పొందిన టెస్ట్ ఫలితాల ఆధారంగా ఈ ప్రశ్నకు సమాధానం అందించాము:
|
హ్యుందాయ్ వెర్నా |
వోక్స్వాగన్ విర్టస్ |
స్కోడా స్లావియా |
పవర్ |
160PS |
150PS |
150PS |
టార్క్ |
253Nm |
250Nm |
250Nm |
ట్రాన్స్ؚమిషన్ |
7-స్పీడ్ల DCT |
7-స్పీడ్ల DSG |
7-స్పీడ్ల DSG |
పరీక్షించిన హైవే ఇంధన సామర్ధ్యం |
18.89kmpl |
18.87kmpl |
20.85kmpl |
పరీక్షించిన నగర ఇంధన సామర్ధ్యం |
12.60kmpl |
12.12kmpl |
14.14kmpl |
హైవే డ్రైవింగ్ పరిస్థితులలో స్కోడా స్లావియా తన పోటీదారులతో సుమారు 2kmplతో ఓడించింది. నగర డ్రైవింగ్ పరిస్థితులలో హ్యుందాయ్ వెర్నా కంటే దీని సామర్ధ్యం 1.5kmpl తక్కువగా ఉంటుంది.
ఇది కూడా చదవండి: 4-సరికొత్త EVలతో పాటుగా కొత్త-జెనరేషన్ స్కోడా సూపర్బ్ & కోడియాక్ టీజ్‌ర్‌లు
1.5-లీటర్ TSI ఇంజన్‌తో, విర్టస్ మరియు స్లావియా రెండూ వాహనాలు యాక్టివ్ సిలిండర్ డీయాక్టివేషన్ సాంకేతికతను అందిస్తున్నాయి, ఇది తక్కువ ఒత్తిడి పరిస్థితులలో రెండు సిలిండర్‌లను ఆపివేయడం ద్వారా ఇంధన సామర్ధ్యం గరిష్టంగా ఉండేలా చేస్తుంది. రెండిటికి ఏకరితి పవర్‌ట్రెయిన్‌లు ఉన్నపటికి, విర్టస్ తక్కువ సామర్ధ్యాన్ని అందించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది, కానీ ఇది ఇంజన్ అందించే శక్తికి అనుగుణంగా ఉంటుంది.
ఇది కూడా చూడండి: విర్టస్ GTకి మాన్యువల్ ఎంపికను జోడించనున్న వోక్స్వాగన్
మరొక వైపు, సిలిండర్ డీయాక్టివేషన్ లేకుండా ఈ విభాగంలో అత్యంత శక్తివంతమైన కాంపాక్ట్ సెడాన్ అయిన కొత్త-జెన్ హ్యుందాయ్ వెర్నా, హైవే డ్రైవింగ్ పరిస్థితులలో విర్టస్‌తో సమానమైన ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉంది. నగర డ్రైవింగ్ పరిస్థితులలో, విర్టస్‌తో పోలిస్తే వెర్నా 0.5kmpl మరింత సామర్ధ్యాన్ని కలిగి ఉంది.
టెస్ట్ ఫలితాలపై ఆధారపడి, మిశ్రమ పరిస్థితులలో ఈ కాంపాక్ట్ సెడాన్ؚల ఇంధన సామర్ధ్యాన్ని అంచనా వేశాము.
మోడల్ |
సిటీ: హైవే (50:50) |
సిటీ: హైవే(25:75) |
సిటీ: హైవే(75:25) |
హ్యుందాయ్ వెర్నా |
15.11kmpl |
16.79kmpl |
13.74kmpl |
వోక్స్వాగన్ విర్టస్ |
14.75kmpl |
16.56kmpl |
13.31kmpl |
స్కోడా స్లావియా |
16.85kmpl |
18.63kmpl |
15.37kmpl |
మిశ్రమ డ్రైవింగ్ పరిస్థితులలో 2kmpl కంటే ఎక్కువ అందిస్తూ స్కోడా స్లావియా ఉత్తమమైన మైలేజీ గణాంకాలను కలిగి ఉంది, ప్రతి స్థితిలో ఇది వెర్నా కంటే 1.5kmpl ఎక్కువ సామర్ధ్యాన్ని అందిస్తుంది. వెర్నా మరియు విర్టస్ మిశ్రమ డ్రైవింగ్ పరిస్థితులలో దాదాపుగా ఒకే విధమైన మైలేజీ గణాంకాలను కలిగి ఉన్నాయి, తేడా కేవలం 0.43kmplగా ఉంది.
సంక్షిప్తంగా, స్లావియా అత్యంత ఇంధన సామర్ధ్యం కలిగిన సెడాన్, హ్యుందాయ్ వెర్నా మరియు వోక్స్వాగన్ విర్టస్ కూడా అదే స్థాయి సామర్ధ్యాన్ని అందిస్తాయి. అయితే, ఈ మైలేజీ గణాంకాలు డ్రైవింగ్ పద్ధతి, రోడ్డు పరిస్థితి మరియు వాహన ఆరోగ్యంపై ఆధారపడతాయి. వీటిలో ఏదైనా సెడాన్ؚలు కొనుగోలు చేసి ఉంటే, ఈ ఇంధన సామర్ధ్య అనుభవాన్ని కింది కామెంట్ؚలో పంచుకోండి. వీటిలో ఏది వేగవంతమైనది అని తెలుసుకోవాలంటే, మా సిస్టర్ పబ్లికేషన్ ZigWheelsలో తాజా కథనం సిద్ధంగా ఉంది.
ఇక్కడ మరింత చదవండి: వెర్నా ఆన్ؚరోడ్ ధర