మారుతి విటారా బ్రెజ్జా యొక్క టొయోటా ఇండియా-స్పెక్ ప్రత్యర్థి ని ప్రతింబింబించేలా టొయోటా రైజ్ ఉంది

నవంబర్ 05, 2019 12:20 pm sonny ద్వారా ప్రచురించబడింది

  • 44 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

టయోటా యొక్క సబ్ -4m SUV 2022 నాటికి భారతదేశానికి చేరుకుంటుంది

  •  టయోటా రైజ్ సబ్-కాంపాక్ట్ SUV తొలిసారిగా లీక్ అయింది.
  •  2019 టోక్యో మోటార్ షోలో ప్రదర్శించబడిన టొయోటా అనుబంధ సంస్థ డైహాట్సు రాకీ ఆధారంగా రూపుదిద్దుకుంది.
  •  రైజ్ అనేది సబ్ -4m SUV సమర్పణ, ఇండియా-స్పెక్ 2022 మోడల్ యొక్క స్టైలింగ్‌ ను కలిగి ఉండవచ్చు.
  •  టయోటా యొక్క ఇండియా-స్పెక్ సబ్ -4m SUV తదుపరి తరం బ్రెజ్జా తో పవర్‌ట్రైన్‌ లను పంచుకుంటుంది. 
  •  బాలెనో / గ్లాన్జా మాదిరిగా కాకుండా, సుజుకి-టయోటా బ్రెజ్జా విభిన్న బాహ్య స్టైలింగ్‌ను పొందుతుందని భావిస్తున్నారు.

Toyota Raize Could Preview India-spec Maruti Vitara Brezza Rival

టయోటా మరియు సుజుకి తమ కొనసాగుతున్న భాగస్వామ్యంలో భాగంగా కొన్ని ప్రపంచ మార్కెట్లలో మోడళ్లను పంచుకోనున్నాయి. షేర్డ్ జాబితాలో చేర్చబడిన  మారుతి సుజుకి విటారా బ్రెజ్జా సబ్-కాంపాక్ట్ SUV కూడా తోడయ్యింది, దీనికి దాని తరువాతి తరంలో టయోటా బ్యాడ్జ్ లభిస్తుందని భావిస్తున్నారు. ఏదేమైనా, టయోటా యొక్క సబ్-బ్రాండ్ అయిన డైహట్సు నుండి వచ్చిన కొత్త మోడల్ ఎలా ఉంటుందో దాని గురించి మాకు సూచన ఇస్తుంది.

ఇవి కూడా చదవండి: సుజుకి & టయోటా క్యాపిటల్ అలయన్స్‌ను ప్రకటించింది

2019 టోక్యో మోటార్ షోలో డైహత్సు రాకీ సబ్ -4m  SUV ని ప్రదర్శించారు. టయోటా దాని స్వంత కాంపాక్ట్ SUV ని కలిగి ఉంది, దీనిని రైజ్ అని పిలుస్తారు, ఇది నవంబర్ 2019 లో కవర్‌ను విచ్ఛిన్నం చేస్తుందని భావిస్తున్నారు. టయోటా రైజ్ కోసం మొదటి చిత్రాలు ఆవిష్కరణకు ముందే లీక్ అయ్యాయి. డైహత్సు యొక్క ఫ్రంట్ ఎండ్ ప్రస్తుత-తరం హ్యుందాయ్ క్రెటా లాగా కనిపిస్తున్నప్పటికీ, టయోటా రైజ్ మరింత స్పోర్టియర్ ఫ్రంట్ ఎండ్ ని కలిగి ఉంటుంది.

Toyota Raize Could Preview India-spec Maruti Vitara Brezza Rival

టొయోటా సబ్ -4m SUV 2022 లో రెండవ తరం బ్రెజ్జా ఆధారంగా భారతదేశంలో విడుదల కానుంది. ఇది కార్ల తయారీదారుల బెంగళూరు ప్లాంట్ లో తయారు చేయబడుతుంది. మారుతి సుజుకి బాలెనో మరియు టయోటా గ్లాంజా క్రాస్-బ్యాడ్జింగ్ హ్యాచ్‌బ్యాక్‌లు రెండూ ఒకేలా కనిపిస్తాయి, అలా కాకుండా ప్రీమియం షేర్డ్ సబ్ -4m SUV ప్రత్యేకమైన స్టైలింగ్‌ను అందిస్తుందని భావిస్తున్నారు. టయోటా రైజ్ ఇండియా-స్పెక్ మోడల్‌ లో కూడా కనిపించే స్టైలింగ్ యొక్క ఓవర్‌వ్యూ ఇక్కడే ఉంది. 

పవర్‌ట్రెయిన్‌ ల విషయానికొస్తే, టయోటా-సుజుకి బ్రెజ్జా పెట్రోల్ ఇంజిన్‌ తో మాత్రమే అందించబడుతుందని భావిస్తున్నారు. ప్రస్తుత తరం మారుతి విటారా బ్రెజ్జా ప్రస్తుతానికి 1.3 లీటర్ డీజిల్ ఇంజిన్‌ తో మాత్రమే లభిస్తుంది. అయితే, బ్రెజ్జాకు ఫేస్ లిఫ్ట్ లభిస్తుందని, ఏప్రిల్ 2020 నాటికి BS 6 పెట్రోల్ ఇంజన్ వేరియంట్‌ ను ప్రవేశపెట్టాలని భావిస్తున్నారు. 

Toyota Raize Could Preview India-spec Maruti Vitara Brezza Rival

మహీంద్రా మరియు హ్యుందాయ్ సబ్ -4m SUV విభాగంలో చేరిన ఇటీవలి తయారీదారులు, వరుసగా XUV 300 మరియు వెన్యూ వంటి ప్రొడక్ట్స్ ని మనకి అందిచాయి. కియా ఇటీవల తన సొంత సబ్-కాంపాక్ట్ SUV ని పరీక్షిస్తోంది. సుజుకి తో భాగస్వామ్యం ఉన్నప్పటికీ, 2022 ప్రారంభంతో, టయోటా ఈ విభాగానికి చాలా ఆలస్యంగా ప్రవేశిస్తుంది.       

చిత్ర వనరులు: టయోటా రైజ్ డైహత్సు రాకీ 

మరింత చదవండి: మారుతి విటారా బ్రెజ్జా AMT

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your వ్యాఖ్య

Read Full News

ట్రెండింగ్‌లో ఉందికార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience