2019 లో పెట్రోల్ వేరియంట్లను పొందనున్న మారుతి విటారా బ్రెజ్జా
మారుతి విటారా బ్రెజా 2016-2020 కోసం dhruv ద్వారా సెప్టెంబర్ 10, 2019 02:47 pm ప్రచురించబడింది
- 16 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
విటారా బ్రెజ్జా యొక్క పెట్రోల్ వేరియంట్ ఎస్‌యూవీ ఫేస్‌లిఫ్ట్‌తో లాంచ్ అవుతుందని భావిస్తున్నారు
- విటారా బ్రెజ్జా 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్‌ను ఉపయోగించవచ్చు, ఎర్టిగా మరియు సియాజ్‌లో కూడా ఇది ఉంది.
- ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ పొందవచ్చు. ఎర్టిగా మరియు సియాజ్ ఇప్పటికే ఈ విధంగా అందుబాటులో ఉంది.
- ఈ నవీకరణతో డీజిల్ అనేది ఇంక ఉండకపోవచ్చు.
2019 లోనే విటారా బ్రెజ్జాలో పెట్రోల్ ఇంజన్ పెడుతున్నట్లు మారుతి సంస్థ ధృవీకరించింది. ఇంతకుముందు, భారత కార్ల తయారీదారు రాబోయే 2020 ఆటో ఎక్స్పో లో సబ్ -4 మీటర్ ఎస్‌యూవీ పెట్రోల్ వెర్షన్‌ను విడుదల చేస్తారని భావించారు.
విటారా బ్రెజ్జా ఏ ఇంజిన్‌ను ఉపయోగిస్తుందో మారుతి ఇంకా ధృవీకరించనప్పటికీ, సియాజ్ మరియు ఎర్టిగా వంటి వాటిలో ఉన్న 1.5-లీటర్ పెట్రోల్ ఇంజిన్ (105 పిఎస్ / 138 ఎన్ఎమ్) ను ఉపయోగిస్తుందని ఊహించడం అనేది మంచిది అని అనిపిస్తుంది. దీని అర్థం ఏమిటంటే 5-స్పీడ్ MT కాకుండా, మారుతి విటారా బ్రెజ్జా యొక్క పెట్రోల్ వెర్షన్‌ను 4-స్పీడ్ టార్క్ కన్వర్టర్‌తో సియాజ్ మరియు ఎర్టిగా మాదిరిగానే అందించగలదు. ఇది మారుతి నుండి 1.2-లీటర్ ఇంజిన్‌ను కూడా ఉపయోగించగలదు, అది 83Ps శక్తిని / 113Nm టార్న్ ను అందిస్తుంది. మారుతి డీజిల్‌కు ప్రత్యామ్నాయంగా సిఎన్‌జి ని కూడా పరిశీలిస్తోంది.
బాలెనో RS లో అందించే 1.0-లీటర్ బూస్టర్‌జెట్ ఇంజిన్ కోసం ఆశతో ఉన్నవారికి, ఇది దిగుమతి చేసుకున్నందున దీనిని మారుతి సంస్థ విటారా బ్రెజ్జాలో ఉంచుతుందని మేము అనుకోము మరియు ఇది ఎస్‌యూవీ అధిక ధరలకు దారితీస్తుంది.
విటారా బ్రెజ్జా 2016 లో ప్రారంభించబడిన దగ్గర నుండి చాలా కాలంగా నవీకరణ కోసం వేచి ఉంది. ఫేస్ లిఫ్ట్ ప్రస్తుతం పనితీరులో ఉంది మరియు మారుతి ఫేస్ లిఫ్ట్ తో పాటు ఎస్యువి యొక్క పెట్రోల్ వేరియంట్‌ను విడుదల చేయాలని మేము ఆశిస్తున్నాము. మారుతి ఫేస్‌లిఫ్ట్ ప్రారంభించే సమయానికి డీజిల్ ఇంజిన్‌ను ఆపేయవచ్చు, బిఎస్ 6 ఉద్గార నిబంధనలు అమలులోకి రావడానికి కొన్ని నెలలు మాత్రమే మిగిలి ఉంటాయి మరియు బిఎస్ 6 యుగంలో డీజిల్ కార్ల అమ్మకాలను ఆపాలని మారుతి సంస్థ నిర్ణయించింది.