టోక్యో మోటర్ షో లైవ్: సుజుకీ స్విఫ్ట్ ఆరెస్ ప్రదర్శితమయ్యింది
మారుతి స్విఫ్ట్ 2014-2021 కోసం అభిజీత్ ద్వారా అక్టోబర్ 28, 2015 05:55 pm ప్రచురించబడింది
- 16 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
సుజుకీ వారు స్విఫ్ట్ ఆరెస్ ని టోక్యో మోటర్ షోలో ప్రదర్శించారు. స్విఫ్ట్ ఆరెస్ కి సౌందర్య మార్పులకు మించి ఇక్కడ మారుతీ వారు ఒక లిమిటెడ్ ఎడిషన్ గా అందించారు. జపాన్లో ప్రదర్శితమైన ఆరెస్ లో బయట మరియూ లోపల ఎన్నో మార్పులు అందించారు. ఇంజిను విషయంలో కూడా మార్పు జరిగింది. ముఖ్యంగా, కారు భారతదేశానికి రానుంది.
ఎరుపు రంగులో ఉండి, ఒక కొత్త గ్రిల్లు, కొత్త హెడ్ ల్యాంప్ క్లస్టర్ తో నలుపు చుట్టుతలు, ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్, ఫాగ్ ల్యాంప్ క్లస్టర్ చుట్టూర డే టైం రన్నింగ్ ల్యాంప్స్, అన్ని ప్రక్కలా సైడ్ స్కర్టింగ్స్, రేర్ స్పాయిలర్, ఒక కొత్త టెయిల్‌ల్యాంప్ క్లస్టర్ అమరిక మరియూ వేర్వేరు అల్లోయ్ వీల్స్ జతలు కలిగి ఉన్నాయి.
లోపల మార్పుల విషయానికి వస్తే, ఇంఫొటెయిన్‌మెంట్ సిస్టము తో నావిగేషన్, ఒక కొత్త స్టోరేజ్ స్థలం డ్యాష్‌బోర్డ్ యొక్క సెంట్రల్ డెక్ పై కూడా ఉంది. స్టీరింగ్ వీల్ వంటివి అలానే ఉన్నాయి కానీ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ వంటివి పూర్తిగా మార్పును పొందాయి. ఇప్పుడు దీనికి స్పీడోమీటర్ కోసం సెంటర్లో పెద్ద డయల్ ఉండి, రెవ్ కౌంటర్ ని ఎడమ వైపు ఒక చిన్న స్ట్రిప్ గా ఉంటుంది. ఈ డయల్ దాదాపు డిజిటల్ గా ఉండి, బ్యాటరీ చార్జ్ లెవెల్ వంటివి ఇందులో భాగంగా పొందింది.
ఇంజిను విషయంలో శక్తి పరంగా పెద్దగా ఏమీ ఆశించనక్కరలేదు. కానీ డ్యువల్ జెట్ సిస్టం మరియూ రీజెనరేటివ్ బ్రేకింగ్ తో 1.2-లీటర్ పెట్రోల్ ఇంజినుకి జత చేయడం వలన కంప్రెషన్ నిష్పత్తిలో మార్పులు కలిగి ఎక్కువ ఇంధన సామర్ధ్యం అందించే అవకాశం మాత్రం ఉంది. ఈ కారు 6000ఆర్పీఎం వద్ద 91bhp శక్తిని అందిస్తుంది. ఒక 3Nm టార్క్ పెరిగి 4400ఆర్పీఎం వద్ద 118Nm టార్క్ ని విడుదల చేయగలదు.