Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

2023 మే నెలలో ఈ 6 కార్‌లు విడుదల అవుతాయని అంచనా

మారుతి జిమ్ని కోసం tarun ద్వారా మే 03, 2023 02:45 pm ప్రచురించబడింది

2023లో ఎంతగానో ఎదురుచూస్తున్న రెండు కార్‌లు ఎట్టకేలకు మే నెలలో మార్కెట్ؚలోకి ప్రవేశించవచ్చు

ఉత్తేజకరమైన మరియు ముఖ్యమైన కార్‌ల విడుదలతో మే నెల రానే వచ్చింది. సంవత్సరం నుండి ఊరిస్తున్న కొన్ని కార్‌లు 2023 ఐదవ నేల అయిన మేలో విడుదల కానున్నాయి. మారుతి తన భారీ వాహనాలను ఎట్టకేలకు విడుదల చేస్తుందని ఆశిస్తున్నాము, కియా కూడా కొన్ని వాహనాలను విడుదల చేయవచ్చు. మే నెలలో విడుదల అవుతాయని ఆశిస్తున్న ముఖ్యమైన టాప్ ఆరు కార్‌ల వివరాలు:

మారుతి జిమ్నీ

అంచనా ధర – రూ. 10 లక్షల నుండి ప్రారంభం

ఆటో ఎక్స్ؚపో 2023లో ఆవిష్కరించిన తరువాత, ఈ నెలలో మారుతి తమ జిమ్నీ ధరలను వెల్లడించవచ్చు. జిప్సీ స్థానంలో వచ్చే ఈ ఐదు-డోర్‌ల వర్షన్ 4X4 ప్రామాణికంగా అందించబడుతుంది. మారుతి విశ్వసించే 5-స్పీడ్‌ మాన్యువల్ మరియు 4-స్పీడ్‌ ఆటోమ్యాటిక్ ఎంపికలతో 103PS పవర్ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను ఇందులో చూడవచ్చు. ఫీచర్‌లలో 9-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్, ఆటోమ్యాటిక్ AC, క్రూజ్ కంట్రోల్, రేర్ పార్కింగ్ కెమెరా, ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు ఉంటాయి. ఇది లైఫ్‌స్టైల్ SUV విభాగంలో విభిన్నమైన అప్రోచ్ؚతో మహీంద్రా థార్ؚకు తిరుగులేని పోటీదారుగా నిలుస్తుంది.

టాటా ఆల్ట్రోజ్ CNG

అంచనా ధర – రూ. 7.35 లక్షల నుండి ప్రారంభం

CNG విభాగంలో వస్తున్న మరొక కారు, టాటా ఆల్ట్రోజ్, ఇది మే మొదటి వారంలో విడుదల అవుతుంది అని అంచనా. ఆల్ట్రోజ్ CNGలో ముఖ్యమైన అంశం ఇందులో ఉండే డ్యూయల్ CNG సిలిండర్ సెట్అప్, ఇది సంప్రదాయ CNG సెటప్ؚలతో పోలిస్తే ఎంతో ఎక్కువ బూట్ స్పేస్ؚను అందిస్తుంది. ఇది 73.4PS పవర్ మరియు 103Nm టార్క్‌ను అందించే 1.2-లీటర్ పెట్రోల్-CNG ఇంజన్‌ను ఉపయోగిస్తుంది మరియు 5-స్పీడ్‌ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జోడించబడుతుంది. దీనికి ప్రత్యామ్నాయంగా మారుతి బాలెనో మరియు టయోటా గ్లాంజా CNGలను కూడా చూడవచ్చు.

హ్యుందాయ్ ఎక్స్టర్

అంచనా ధర – రూ. 6 లక్షల నుండి ప్రారంభం

భారతదేశంలో హ్యుందాయ్ ప్రవేశ పెడుతున్న సరికొత్త SUVని మే నెలలో వెల్లడించవచ్చు. ఎక్స్టర్ మైక్రో-SUV విభాగంలో నిలుస్తుండగా, వెన్యూకు దిగువ స్థానంలో ఉంటుంది. బాక్సీ మరియు నిటారైన స్టైలింగ్ؚతో, దీన్ని గ్రాండ్ i10 నియోస్ؚకు ధృఢమైన మరియు SUV-వంటి ప్రత్యామ్నాయంగా చూడవచ్చు. ఫీచర్‌ల పరంగా మనం దీనిలో ఎలక్ట్రిక్ సన్ؚరూఫ్, భారీ టచ్ؚస్క్రీన్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, వైర్ؚలెస్ ఛార్జర్, ఆరు వరకు ఎయిర్ؚబ్యాగ్ؚలు మరియు రేర్ కెమెరాలు ఉంటాయని ఆశించవచ్చు. హ్యుందాయ్ ఈ మైక్రో SUVని నియోస్ 2-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚతో, మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ؚల ఎంపికతో అందించవచ్చు. టర్బో-పెట్రోల్ ఎంపిక కూడా ఉంటుందని ఆశించవచ్చు.

కియా సెల్టోస్ 2023

అంచనా ధర – రూ. 11 లక్షల నుండి ప్రారంభం

నవీకరించబడిన కియా సెల్టోస్ ఆవిష్కరణను లేదా కనీసం కొన్ని వివరాలను ఈ మే నెలలో చూడవచ్చు. మునపటి ఆకారంతో, ఈ కాంపాక్ట్ SUV లోపల మరియు వెలుపల గణనీయమైన విజువల్ అప్ؚగ్రేడ్ؚలను పొందనుంది. ఇప్పటికే అనేక ఫీచర్‌లను కలిగి ఉన్న క్యాబిన్ؚలో టచ్ؚస్క్రీన్ సిస్టమ్ మరియు డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కోసం అదనంగా కొత్త డ్యూయల్ 10.25-అంగుళాల స్క్రీన్, పనోరమిక్ సన్ؚరూఫ్, హీటెడ్ ఫ్రంట్ సీట్‌లు, మరియు ADAS (అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) కూడా రావచ్చు. 1.5-లీటర్‌ల పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌లు మునపటి మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్‌మిషన్ؚలతో కొనసాగుతాయి. నవీకరించబడిన వాహనంతో క్యారెన్ 160PS పవర్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ؚను అందించవచ్చు.

BMW X3 M40i

అంచనా ధర – రూ. 90 లక్షలు

BMW X3 స్పోర్టియర్ వేరియెంట్ ఇప్పటికే ప్రి-ఆర్డర్ చేయడానికి అందుబాటులో ఉంది మరియు మే నుండి విక్రయాలు ప్రారంభమవుతాయి. M40i వేరియెంట్ ఎక్స్ؚటీరియర్ మరియు ఇంటీరియర్ల కోసం ‘M స్పోర్ట్’ నిర్దిష్ట అంశాలను పొందుతుంది, ఇది ఈ వాహనాన్ని సాధారణ X3 వేరియెంట్ؚల కంటే మరింత ధృఢంగా కనిపించేలా చేస్తుంది. X3 M40iతో 3-లీటర్‌ల ట్విన్-టర్బో ఇన్ؚలైన్ ఆరు-సిలిండర్ పెట్రోల్ ఇంజన్‌తో అందించబడుతుంది, ఇది 360PS పవర్ మరియు 500NM టార్క్‌ను అందిస్తుంది అని అంచనా. ఇది నేరుగా సున్నా నుండి 100kmph వరకు కేవలం 4.9 సెకన్‌లలో చేరుకుంటుంది.

BMW M2

అంచనా ధర – రూ. 1 కోటి

స్పోర్టీ BMWల గురించి మాట్లాడాలంటే, జర్మన్ కారు తయారీదారు అందిస్తున్న స్పోర్టీయర్ కార్‌లలో ఒకటిగా నిలుస్తుంది. ఈ కాంపాక్ట్ స్పోర్ట్స్ కూపే, M2 ప్రపంచంలో ఉన్న అత్యంత శక్తివంతమైన BMWలలో ఒకటి మరియు దీని కొత్త జనరేషన్ అమ్మకాలు ఇంపోర్ట్ రూట్ ద్వారా మేలో ప్రారంభం అవుతాయి. ఇది 3-లీతర్‌ల ట్విన్-టర్బో ఆరు-సిలిండర్ ఇంజన్ నుండి 460PS పవర్ మరియు 550Nm టార్క్‌ను అందిస్తుంది. 0-100kmph వేగాన్ని కేవలం 3.9 సెకన్‌లలో అందుకుంటుంది.

(అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు)

Share via

Write your Comment on Maruti జిమ్ని

explore similar కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.15 - 26.50 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర