Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

టాటా టియాగో ఫేస్‌లిఫ్ట్ రూ .4.60 లక్షల వద్ద లాంచ్ అయ్యింది

టాటా టియాగో కోసం dhruv ద్వారా జనవరి 25, 2020 12:24 pm ప్రచురించబడింది

ప్రస్తుతం టియాగో ఇప్పుడు 1.2-లీటర్ BS 6 పెట్రోల్ ఇంజిన్‌ తో మాత్రమే లభిస్తుంది, డీజిల్ నిలిపివేయబడింది

  • ఫేస్ లిఫ్టెడ్ టియాగో యొక్క ఫ్రంట్ ఎండ్ డిజైన్ పెద్ద ఆల్ట్రోజ్ నుండి ప్రేరణ పొందింది.
  • ఇది 7- ఇంచ్ టచ్‌స్క్రీన్ మరియు 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్ వంటి లక్షణాలను పొందుతుంది.
  • భద్రత విషయానికి వస్తే దీనిలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు, EBD తో ABS వంటి లక్షణాలు అందించబడతాయి.
  • ఇది గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ రేటింగ్ ని దక్కించుకుంది, దీని విభాగంలో ఇది అత్యధికం అని చెప్పవచ్చు.
  • ఇది మారుతి వాగన్ఆర్, సెలెరియో మరియు హ్యుందాయ్ సాంట్రో వంటి కార్లతో పోటీ పడుతుంది.
  • ఈ సెగ్మెంట్ లో డీజిల్ ఇంజిన్‌ను అందించిన ఏకైక కారు టియాగో అని చెప్పవచ్చు.

టాటా మోటార్స్ భారతదేశంలో టియాగో ఫేస్‌లిఫ్ట్‌ ను రూ .4.60 లక్షల (ఎక్స్-షోరూమ్ ఇండియా) నుండి ప్రారంభించింది. ఇది ఫేస్‌లిఫ్టెడ్ నెక్సాన్ మరియు టిగోర్ తో పాటు టాటా యొక్క మొట్టమొదటి ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ ఆల్ట్రోజ్‌ తో కలిసి ప్రారంభించబడింది. ఇది నాలుగు వేరియంట్లలో అందించబడుతుంది, వీటిలో టాప్ రెండు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ తో లభిస్తాయి.

టియాగోలో రెండు పెద్ద మార్పులు ఉన్నాయి. మొదటిది డిజైన్ మరియు రెండవది బోనెట్ కింద ఇంజిన్. టియాగో కి ఇప్పుడు ఆల్ట్రోజ్ లాంటి ఫ్రంట్ ఎండ్‌ లభించింది మరియు ఇప్పుడు ప్రశంసనీయ అంశం ఏమిటంటే ఇది ప్రస్తుత మోడల్ కంటే కొత్త సూది నోస్ లుక్ తో మరింత షార్ప్ గా మరియు పరిణతి చెందినదిగా కనిపిస్తుంది. ఇతర పెద్ద మార్పు ఏమిటంటే టియాగోకు ఇంక డీజిల్ ఇంజిన్ లభించదు. ఎందుకంటే రాబోయే BS6 నిబంధనలకు అనుగుణంగా టియాగో యొక్క డీజిల్ ఇంజిన్‌ను అప్‌గ్రేడ్ చేయడం నిజంగా ఖరీదైనదిగా ఉంటుంది.

BS 6 పెట్రోల్ ఇంజిన్ అదే 3-సిలిండర్, 1.2-లీటర్ యూనిట్ ని కలిగి ఉండి, ఇది 86Ps పవర్ (1 Ps పెరిగింది) మరియు 113Nm (1 Nm తగ్గింది) టార్క్ ని అందిస్తుంది మరియు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా మునుపటిలాగా AMT తో అందించబడుతుంది.

లక్షణాల విషయానికి వస్తే, టాటా దీనిలో ఒక పెద్ద లక్షణం తొలగించింది. టియాగో దీనిలో, దాని టాప్-స్పెక్ వేరియంట్‌ తో వచ్చిన ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్‌లను పొందదు. ఇది కాకుండా, ఇది 15-ఇంచ్ అల్లాయ్ వీల్స్, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటోలకు సపోర్ట్ ఇచ్చే 7-ఇంచ్ టచ్‌స్క్రీన్‌తో అందించబడుతోంది మరియు దాని నాలుగు-స్పీకర్ ప్లస్ ఫోర్-ట్వీటర్ సెటప్ ద్వారా సౌండ్ అనేది బయటకి వస్తుంది. ఇది ఇప్పుడు ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌ తో కూడా వస్తుంది.

భద్రతా విషయానికి వస్తే ముందు భాగంలో డ్యూయల్ ఎయిర్‌బ్యాగులు ఉంటాయి, అన్ని కొత్త కార్లపై ABS తప్పనిసరిగా ఉండడం వలన టియాగో EBD (ఎలక్ట్రానిక్ బ్రేక్-ఫోర్స్ డిస్ట్రిబ్యూషన్)తో వస్తుంది మరియు CSC (కార్నర్ స్టెబిలిటీ కంట్రోల్) తో కూడా వస్తుంది. ఫేస్‌లిఫ్టెడ్ టియాగో గ్లోబల్ NCAP క్రాష్ టెస్ట్‌లో 4-స్టార్ రేటింగ్ ని దక్కించుకుంది, ఇదే ఈ విభాగంలో అత్యధికం అని చెప్పవచ్చు.

ఫేస్‌లిఫ్టెడ్ టియాగోను ఆరు రంగు ఎంపికలలో అందిస్తున్నారు: ఫ్లేమ్ రెడ్, పియర్సెంట్ వైట్, విక్టరీ ఎల్లో, టెక్టోనిక్ బ్లూ, ప్యూర్ సిల్వర్ మరియు డేటోనా గ్రే.

ఇది మారుతి వాగన్ఆర్ మరియు హ్యుందాయ్ సాంట్రో వంటి వాటికి ప్రత్యర్థిగా కొనసాగుతుంది.

మరింత చదవండి: టాటా టియాగో ఆన్ రోడ్ ప్రైజ్

d
ద్వారా ప్రచురించబడినది

dhruv

  • 30 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన టాటా టియాగో

V
vilas parulekar
Jan 22, 2020, 9:37:07 PM

Very good..

J
jitendra pal singh negi
Jan 22, 2020, 4:54:38 PM

I like tata motors

Read Full News

explore మరిన్ని on టాటా టియాగో

టాటా టియాగో

Rs.5.65 - 8.90 లక్షలు* ఆన్ రోడ్ ధర పొందండి
పెట్రోల్20.09 kmpl
సిఎన్జి26.49 Km/Kg
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్
వీక్షించండి మే ఆఫర్లు

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
ఎలక్ట్రిక్
Rs.6.99 - 9.24 లక్షలు*
Rs.5.65 - 8.90 లక్షలు*
Rs.7.04 - 11.21 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర