• Maruti Wagon R Front Left Side Image
 • Maruti Wagon R
 • Maruti Wagon R
 • Maruti Wagon R
 • Maruti Wagon R

మారుతి Wagon R

కారును మార్చండి
580 సమీక్షలుఈ కారుకి రేటింగ్ ఇవ్వండి
Rs.4.19 - 5.69 లక్ష*
*ఎక్స్-షోరూమ్ ధర న్యూ ఢిల్లీ
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
ఈ నెల అందిస్తున్న పండుగ ఆఫర్లను మిస్ అవ్వకండి

మారుతి Wagon R యొక్క కిలకమైన నిర్ధేశాలు

మైలేజ్ (వరకు)22.5 kmpl
ఇంజిన్ (వరకు)1197 cc
బిహెచ్పి81.8
ట్రాన్స్మిషన్మాన్యువల్ / ఆటోమేటిక్
సీట్లు5
Boot Space341 Litres

Wagon R తాజా నవీకరణ

తాజా నవీకరణ: మేము, కొత్తగా నవీకరించబడిన మారుతి వాగన్ ఆర్ వాహనాన్ని, దీని పై విభాగంలో ఉన్న హ్యుందాయ్ గ్రాండ్ ఐ10 తో పోల్చి చూశాం, ఇది ఎంత అద్భుతంగా ఉందో తెలుసుకునేందుకు ఇక్కడ చదవవచ్చు. సమీక్ష, వేరియంట్లు మరియు పోటీ వాహనాల పోలికలతో సహా ఇప్పటి వరకు కొత్త వాగన్ ఆర్ యొక్క ప్రతి వివరాలను తెలుసుకోవాలనుకుంటే - ఇక్కడ తనిఖీ చేయండి.

2019 మారుతి వాగన్ ఆర్ ధర & వేరియంట్స్: కొత్త వాగన్ ఆర్ ధర రూ4.19 లక్షల నుండి రూ5.69 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉంటుంది. ఇది మూడు వేరియంట్లలో వినియోగదారులకు అందుభాటులో ఉంది: ఎల్, వి మరియు జెడ్. వీటి మధ్య బేధాలు తెలుసుకోవడానికి, ఇక్కడ ఇవ్వబడిన వేరియంట్ లక్షణాలను చదవండి.

2019 మారుతి వాగన్ ఆర్ ఇంజిన్లు & ట్రాన్స్మిషన్స్: వాగన్ ఆర్ ఇప్పుడు 1.2 లీటర్ 4 సిలిండర్ పెట్రోల్ ఇంజిన్‌తో వస్తుంది, ఈ ఇంజన్ అత్యధికంగా 83పిఎస్ పవర్ ను అలాగే 113ఎన్ఎమ్ టార్క్లను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇప్పటికే అందుబాటులో ఉన్న సాధారణ 1.0 లీటర్ 3-సిలిండర్ పెట్రోల్ ఇంజిన్ అదేవిధంగా ముందుకు కొనసాగుతుంది, ఈ ఇంజన్ గరిష్టంగా 68పిఎస్ శక్తిని మరియు 90ఎన్ఎమ్ టార్క్ లను ఉత్పత్తి చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. రెండు ఇంజిన్లు కూడా 5 స్పీడ్ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ గేర్‌బాక్సుల ఎంపికతో జతచేయబడి అందించబడుతున్నాయి. మారుతి వారు ఇప్పటికీ, కొత్త వాగన్ ఆర్ కోసం సిఎన్జి ఎంపికను అందించడం లేదు.

2019 మారుతి వాగన్ ఆర్ భద్రతా లక్షణాలు: కొత్త వాగన్ ఆర్ ఇప్పుడు డ్రైవర్ ఎయిర్బాగ్, ఎబిఎస్, ఈబిడి, ముందు సీట్‌బెల్ట్ రిమైండర్, స్పీడ్ ఎల్డర్ సిస్టమ్, వెనుక పార్కింగ్ సెన్సార్స్ వంటి ప్రామాణిక భద్రతా అంశాలతో అందించబడుతుంది. ప్రెటెన్షనర్లు మరియు లోడ్ పరిమితులు కలిగిన ముందు సీటు బెల్ట్, సహ-ప్రయాణీకుల ఎయిర్బాగ్ వంటివి అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్ కు మాత్రమే పరిమితం చేయబడ్డాయి మరియు అదనపు ఖర్చుతో ఎల్ మరియు వి వేరియంట్లలో ఆప్షనల్‌గా అందించబడతాయి.

2019 మారుతి వాగన్ ఆర్ అంశాలు: మారుతి సంస్థ, కొత్త వాగన్ ఆర్ ను కొన్ని నవీకరణ సౌకర్యాలతో అందించింది, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే లతో పాటు స్టీరింగ్ వీల్ పై నియంత్రణ స్విచ్చ్‌లు ఈ కొత్త నవీకరణలో అందించబడ్డాయి. ఇది కూడా మాన్యువల్ ఎసి, నాలుగు పవర్ విండోస్, విద్యుత్ తో సర్దుబాటయ్యే మరియు మడత సర్ధుబాటు కలిగిన ఓఆర్‌విఎంలు, వెనుక వాషర్ మరియు వైపర్ తో పాటు డిఫోగ్గర్, 60:40 స్ప్లిట్ వెనుక సీట్లు మరియు ముందు ఫాగ్ లాంప్ లు వంటి అంశాలతో వస్తుంది.

2019 మారుతి వాగన్ ఆర్ పోటీదారులు: కొత్త వాగన్ ఆర్ హ్యుందాయ్ శాంత్రో , టాటా టియాగో, డాట్సన్ గో మరియు మారుతి సుజుకి సెలెరియో వంటి వాహనాలకు గట్టి పోటీని ఇవ్వడానికి సిద్ధంగా ఉంది.

ఎక్కువ మొత్తంలో పొదుపు!!
38% ! ఉపయోగించిన ఉత్తమ ఒప్పందాలను కనుగొనండి వరకు సేవ్ చేయండి

మారుతి వాగన్ ఆర్ ధర list (Variants)

వాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ 998 cc , మాన్యువల్, పెట్రోల్, 22.5 kmplRs.4.19 లక్ష*
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
వాగన్ ఆర్ ఎల్ఎక్స్ఐ ఆప్షనల్ 998 cc , మాన్యువల్, పెట్రోల్, 22.5 kmplRs.4.25 లక్ష*
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
వాగన్ ఆర్ విఎక్స్ఐ 998 cc , మాన్యువల్, పెట్రోల్, 22.5 kmplRs.4.69 లక్ష*
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
వాగన్ ఆర్ విఎక్స్ఐ ఆప్షనల్ 998 cc , మాన్యువల్, పెట్రోల్, 22.5 kmplRs.4.75 లక్ష*
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
వాగన్ ఆర్ విఎక్స్ఐ 1.2 1197 cc , మాన్యువల్, పెట్రోల్, 21.5 kmplRs.4.89 లక్ష*
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
వాగన్ ఆర్ విఎక్స్ఐ ఆప్షనల్ 1.2 1197 cc , మాన్యువల్, పెట్రోల్, 21.5 kmplRs.4.96 లక్ష*
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
వాగన్ ఆర్ విఎక్స్ఐ ఏఎంటి 998 cc , ఆటోమేటిక్, పెట్రోల్, 22.5 kmplRs.5.16 లక్ష*
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
వాగన్ ఆర్ జెడ్ఎక్స్ఐ 1.2 1197 cc , మాన్యువల్, పెట్రోల్, 21.5 kmplRs.5.22 లక్ష*
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
వాగన్ ఆర్ విఎక్స్ఐ ఏఎంటి ఆప్షనల్ 998 cc , ఆటోమేటిక్, పెట్రోల్, 22.5 kmplRs.5.22 లక్ష*
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
వాగన్ ఆర్ విఎక్స్ఐ AMT1.2 1197 cc , ఆటోమేటిక్, పెట్రోల్, 21.5 kmplRs.5.36 లక్ష*
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
వాగన్ ఆర్ విఎక్స్ఐ ఏఎంటి ఆప్షనల్ 1.2 1197 cc , ఆటోమేటిక్, పెట్రోల్, 21.5 kmplRs.5.43 లక్ష*
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
వాగన్ ఆర్ జెడ్ఎక్స్ఐ ఏఎంటి 1.2 1197 cc , ఆటోమేటిక్, పెట్రోల్, 21.5 kmplRs.5.69 లక్ష*
తనిఖీ ఫిబ్రవరి ఆఫర్లు
వేరియంట్లు అన్నింటిని చూపండి

మారుతి Wagon R సమీక్ష

రెండు దశాబ్దాల నుండి ఆచరణాత్మక మరియు ప్రయోజనకర హాట్చ్యాక్ కోసం ఎదురు చూస్తున్న కొనుగోలుదారులకు మారుతి వాగన్ ఆర్ అగ్ర ఎంపికలలో ఒకటిగా నిలిచింది. మునుపటి తరం వాగన్ ఆర్ యొక్క టాల్‌బాయ్ బాక్సింగ్ రూపకల్పన అనేది అమ్ముడుపోతున్న ఏ ఇతర హ్యాచ్‌బ్యాక్ కన్నా, ఈ వాగన్ ఆర్ మరింత ఆచరణాత్మక సాధనంగా పనిచేయడానికి ఒక క్రియాత్మక ఎంపికగా వినియోగదారుల ముందుకు వచ్చింది. మార్కెట్ పోకడలు, వినియోగదారుని అవసరాలు అలాగే భద్రత మరియు ఉద్గార నిబంధనలను అనుసరిస్తూ ఈ వాగన్ ఆర్ వాహనం రూపుదిద్దుకుంది. సహజంగానే, దాని ప్రాధమిక విలువలతో మాత్రమే నిర్మించబడినా దాని ప్రత్యర్థులకు గట్టి పోటీని ఇవ్వడమే కాకుండా ఆల్ రౌండర్‌గా మారేందుకు మారుతి ఇటీవలే, మూడవ-తరం వాగన్ ఆర్ 2019ను స్వల్ప మార్పులతో తీసుకొచ్చింది.

“కొత్త మారుతి సుజుకి వాగన్ ఆర్, ప్రతి అంశంలోనూ అభివృద్ధి చెందింది, ఇది భద్రత, పనితీరు, లక్షణాలు అలాగే రూపకల్పన పరంగా కూడా నవీకరించబడింది."

కొత్త డిజైన్ అంత అద్భుతంగా ఏమి లేదు, అయితే మారుతి కొత్త వాహనం, మునుపటి నమూనా వలె కనిపించడం లేదని నిర్ధారించింది. ఈ వాహనానికి జనాదరణ పెరగడంతో నమూనా కూడా నవీకరించబడింది.

మూడవ తరం వాగన్ ఆర్, మారుతి దాని ప్రాముఖ్యతను మరోసారి చూపించింది. విశాలమైన క్యాబిన్ మరియు భారీ బూట్ కారణంగా ఈ వాహనానికి జనాదరణ పెరిగింది. మరో విషయం ఏమిటంటే, ఇది మరింత శక్తివంతమైన ఇంజన్‌తో కూడా అందుబాటులో ఉంది.

కొత్త వాగన్ ఆర్ వెనుక సీట్ల విషయానికి వస్తే మరీ అంత ఖచ్చితమైనది కాదు అని చెప్పవచ్చు. కానీ ఇంతకుముందెన్నడూ లేనంత దృడంగా మరియు ఇతర ప్రత్యర్థులతో సవాలు చేయటానికి సిద్ధంగా ఉంది. మరియు ధరల పెంపు ఈ ఒప్పందాన్ని మరింత తీసివేసింది.

Maruti Wagon R Exterior

సుజుకి సంస్థ, తన హార్ట్క్ మాడ్యులర్ వేదిక ద్వారా తాజా వెర్షన్లో మూడవ-తరం వాగన్ ఆర్ ను తీసుకుని వచ్చింది. ఈ కొత్త ప్లాట్‌ఫాం, వాగన్ ఆర్ ను మరింత విస్తృతమైనదిగా నిర్మించింది మరియు దాని యొక్క పరిమాణ పెరుగుదల మొదటి చూపులోనే చాలా స్పష్టంగా కనబడింది.

చెప్పినట్లు, దీన్ని నవీకరించారు. అదే విధంగా, మారుతి సుజుకి వాగన్ ఆర్ డిజైన్ ఏమాత్రం పాడు చెయకుండా మరింత అందంగా కనబడుతుంది. ఈ కొత్త హ్యాచ్‌బ్యాక్ ఒక టాల్ బాయ్ గా కొనసాగుతోంది, ఈ వాహనంలో లోపలకి ప్రవేశించేందుకు మరియు నిష్క్రమణకు చాలా సులభతరం చేస్తుంది, అంతేకాకుండా మునుపటి వెర్షన్ తో పోలిస్తే, ఈ వాహనానికి పుష్కలమైన హెడ్రూంను ఇవ్వడం జరిగింది. అలాగే, కొత్త శాంత్రో వలె కాకుండా, వాగన్ఆర్ టాల్ బాయ్ లుక్ మరింత ఆకర్షణీయంగా కనిపించేలా అందించింది. శాంత్రో కొత్త తరం వాహనం యొక్క డిజైన్ ఐ10 యొక్క పరిణామం కంటే మరింత అద్భుతంగా కనిపిస్తుంది. 2019 వాగన్ ఆర్ కు పెద్ద పెద్ద విండోస్ అందించడం వలన క్యాబిన్లో మరింత గాలి వచ్చేందుకు వీలుగా రూపొందించబడింది. కొత్త వాగన్ ఆర్, అసలు రూపకల్పన విధానాన్ని మరింత ముందుకు తీసుకెళ్లింది మరియు బాక్సింగ్గా కొనసాగుతున్నప్పటికీ, అది భర్తీ చేసిన మోడల్ కంటే చాలా వరకు తాజాగా కనిపిస్తోంది.

మారుతికి వాగన్ ఆర్ యొక్క ముందు భాగంలో వెడల్పు పెరగడం కారణంగా మరింత చదునుగా అందంగా కనబడుతుంది. ఈ వాహనానికి అందించిన ముందు భాగంలో దీర్ఘచతురస్రాకార గ్రిల్ క్రింది భాగంలో వెడల్పుగా ఆకట్టుకునే విధంగా అమర్చబడి ఉంటుంది. అల్గాగే దానిపై భాగంలో ప్రామాణిక క్రోమ్ గ్రిల్ వంటివి మరింత మెరుగులు దిద్దుకున్నాయి. ఈ గ్రిల్ కు ఇరువైపులా హెడ్‌ల్యాంప్స్ ముందు కన్నా మరింత అందంగా రూపుదిద్దుకున్నాయి మరియు దీనిలోనే టాటా టియగో మినహా మిగిలిన అన్ని పోటీ వాహనాల మాదిరిగా రెగ్యులర్ మల్టీ-రిఫ్లెక్టార్ యూనిట్లను కలిగి ఉంటాయి, దీని యొక్క అగ్ర శ్రేణి వేరియంట్లో ప్రొజెక్టార్ యూనిట్లు అందించబడ్డాయి. ఇక్కడ భాదాకరమైన విషయం ఏమిటంటే, కొత్త అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్ఎక్స్ఐ లో, పాత మోడల్ దిగువ శ్రేణి వేరియంట్ అయిన విఎక్స్ఐ స్టింగ్రే వేరియంట్లో అందించిన ద్వంద్వ-బ్యారెల్ ప్రొజెక్టర్ హెడ్‌ల్యాంప్స్‌ను వలె కాకుండా దీనిలో అందించడం లేదు. మారుతి సుజుకి యొక్క 'బ్లూ ఐడ్ బాయ్'గా వాగన్ ఆర్ ఇక లేనట్లుగా కనిపిస్తుంది.

ఇక్కడ అర్ధం చేసుకున్నది ఏమిటంటే, వాగన్ ఆర్ వాహనాన్ని లక్షణాల పరంగా చెప్పిన దాని కంటే మరింత అద్భుతంగా ఉంటుంది. టాటా టియాగో, విశ్వవ్యాప్తంగా ఆకట్టుకునే డిజైన్ ఉన్న వాగన్ ఆర్ కంటే మరింత సమర్థవంతమైనది. అయితే, చాలా వరకు, స్టైలింగ్ క్విర్కీ అని పిలవలేము, కానీ ఆకర్షణీయంగా ఉంది. 

ముందు తరాల వాగన్ ఆర్ వాహనాలు అన్నీ, చూడడానికి ఎల్లప్పుడూ అందంగా సాదా-గానే ఉండేవి. మూడవ-తరం మోడల్, చక్రం వంపులలో ప్రముఖమైన ముడతలు ఉన్నందున అసాధారణమైనదిగా కనిపిస్తోంది. అంతేకాకుండా, కొత్త హ్యాచ్‌బ్యాక్ ఒక సూక్ష్మ అలాగే ఇంకా గుర్తించదగిన ఒక వేస్ట్లైన్ ను పొందుతుంది. ఈ మార్పులు, పాత మోడల్ లాగా సాదాగా కాకుండా కనిపిస్తుంది మరియు కొత్త హాచ్బాక్ను బాహ్యభాగం పరంగా జాజ్ ను గుర్తుచేస్తుంది. తాజా ధోరణి విషయానికి వస్తే, మారుతున్న మారుతి సుజుకి ప్లాంట్‌లో ఈ వాహనానికి సి-పిల్లార్ నలుపు రంగును కలిగి ఒక ఫ్లోటింగ్ రూఫ్ ప్రభావాన్ని సృష్టించింది. ఈ వాహనం ఎంపిక చేసుకోవడానికి, అనేక అధునాతన కొత్త రంగు ఎంపికలతో అందుబాటులో ఉంది. అవి వరుసగా, క్లాసిక్ మాగ్మా గ్రే, ప్రముఖమైన సిల్కీ సిల్వర్, సుపీరియర్ వైట్, పేలవమైన జాజికాయ బ్రౌన్ మరియు ప్రకాశవంతమైన నీలం వంటి రంగులు వినియోగదారుడు ఎంపిక చేసుకునేందుకు అందుబాటులో ఉన్నాయి.

కొత్త వాహనం యొక్క టైర్ల విషయానికి వస్తే, విస్తృతంగా మరియు మందంగా అందించబడ్డాయి. అయితే, ప్రతికూలతల విషయానికి వస్తే, ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ లో కూడా శాంత్రో వలె అల్లాయ్ చక్రాలు అందించబడలేదు. అయొతే అధనంగా ఒక్కోదానికి, 4900 రూపాయిలను చెల్లించినట్లైతే అల్లాయ్ చక్రాలను ఆప్షనల్ గా పొందవచ్చు. అయితే కారు మొత్తానికి క్లాడింగ్ ఆప్షనల్ గా అందించబడుతున్నాయి, ఇది ఒక ఆనందకరమైన విషయం అని చెప్పవచ్చు. దీని వలన కొత్త వాగన్ ఆర్ వాహనానికి, ఒక ప్రత్యేకమైన లుక్ వస్తుంది.

ఈ వాహనం యొక్క వెనుక భాగం విషయానికి వస్తే, ముందు వలె వెనుక కూడా చదునుగా కనిపిస్తుంది. అయితే, మునుపటి మోడల్‌తో పోలిస్తే వెనుక విండ్ స్క్రీన్ కొద్దిగా నవీకరించబడింది. బూట్ మూతకు, మధ్య భాగంలో నెంబరు ప్లేట్ చోటు చెసుకుంది, అయితే టైల్ లాంప్లు వోల్వో వాహనాలలో కనిపించే వాటిని ప్రేరేపిస్తాయి.

పాత నమూనా వలె కాకుండా, కొత్త వాగన్ ఆర్ వాహనం దాని వెనుక బంపర్ కు ఫాగ్ ల్యాంప్‌లను కలిగి లేదు. మారుతికి చెందిన మిగిలిన కొత్త కార్ల లాగా, వెనుకవైపు సుజుకి లోగో తప్ప, ఎటువంటి బ్యాడ్జ్‌లు లేవు. 

బాహ్య భాగాల పొలికలు

 

టాటా టియాగో

హ్యుందాయ్ శాంత్రో

మారుతి వాగన్ ఆర్

డాట్సన్ గో

పొడవు (మిల్లీ మీటర్లు)

3746

3610

3655

3788

వెడల్పు (మిల్లీ మీటర్లు)

1647

1645

1620

1636

ఎత్తు (మిల్లీ మీటర్లు)

1535

1560

1675

1507

గ్రౌండ్ క్లియరెన్స్ (మిల్లీ మీటర్లు)

170

-

-

180

వీల్‌బేస్ (మిల్లీ మీటర్లు)

2400

2400

2435

2450

వాహనం బరువు (కిలోలలో)

1012

-

845

-

 

బూట్ పరిమాణ పొలికలు

 

డాట్సన్ గో

మారుతి వాగన్ ఆర్

టాటా టియాగో

హ్యుందాయ్ శాంత్రో

పరిమాణం

265-లీటర్లు

341 లీటర్లు

242-లీటర్లు

235 లీటర్లు

 

వినోద వ్యవస్థ

మూడవ-తరం వాగన్ ఆర్, మారుతి స్మార్ట్‌ప్లే స్టూడియోకి చెందిన 7 అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ తో వస్తుంది. ఇది ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ప్లే మరియు హర్మాన్ ఆధారిత ఏహెచ్ఏ రేడియో లతో సహ మీ స్మార్ట్‌ఫోన్ లో ఉన్న యాప్ తో పాటు వివిధ పనులకు మద్దతిసుంది. (ఆహా రేడియో, వెబ్ నుండి వ్యక్తిగతీకరించిన, ప్రత్యక్ష మరియు ఆన్ డిమాండ్ రేడియో స్టేషన్ లోకి మనకు ఇష్టమైన కంటెంట్‌ను నిర్వహిస్తుంది), అంతేకాకుండా మ్యాప్ మై ఇండియా నావిగేషన్, మరియు మరిన్ని అంశాలకు మద్దతు ఇస్తుంది.

ఈ యూనిట్, ఒక కెపాసిటివ్ టచ్‌స్క్రీన్ (స్మార్ట్‌ఫోన్ లాంటిది) మరియు ఒక సాధారణ టైల్-టైప్ లేఅవుట్‌ను కలిగి ఉంటుంది. సాధారణ కాంతిలో ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈ కొత్త హర్మాన్-ఆధారిత యూనిట్ క్రమంగా కొత్త మారుతి కార్లలో, మునుపటి బోష్-ఆధారిత వ్యవస్థను భర్తీ చేస్తుంది.

Wagon R Interior

ఈ వాహనానికి అందించిన దాని టాల్‌బాయ్ రూపకల్పనకు ధన్యవాదాలు, ముందుగా అంతర్గత భాగం విషయానికి వస్తే, కొత్త వాగన్ ఆర్ లోపలికి వేళ్ళేందుకు మరియు బయటకు వచ్చేందుకు చాలా సౌకర్యంగా ఉంటుంది ఇది ప్రయాణికులకు ఒక గొప్ప వరం అని చెప్పవచ్చు. ఈ వాహనం యొక్క డోర్లను దాదాపు 90 దిగ్రీల వద్ద సౌకర్యవంతంగా తెరవవచ్చు. 

కొత్త వాగన్ ఆర్ యొక్క ముందు భాగం విషయానికి వస్తే, దాని డాష్‌బోర్డ్ పూర్తిగా పునఃరూపకల్పన చేయబడింది మరియు ద్వంద్వ-టోన్ నలుపు అలాగే లేత గోధుమరంగు లేఅవుట్‌తో వెండి చేరికలతో అందంగా రూపొందించబడింది. స్టీరింగ్ వీల్ అనేది ఇగ్నిస్ నుండి నేరుగా కొనుగోలుదారుల ముందుకు వచ్చింది, కానీ ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ లాగా లెదర్ ను పొందలేదు. సెంటర్ కన్సోల్‌లో, 7-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్‌తో ఆధిపత్యం చెలాయిస్తుంది. ఈ వ్యవస్థ, భారతదేశంలో వాగన్ ఆర్ లోనే మొదటిసారిగా ఇవ్వబడింది. ఈ టచ్‌స్క్రీన్ కు ప్రక్కన, నిలువుగా ఉండే సెంట్రల్ ఏసి వెంట్ లను చూడవచ్చు. దీని మాన్యువల్ నియంత్రణలు టచ్‌స్క్రీన్ క్రింది భాగంలోనే అమర్చబడి ఉంటాయి. 

సీట్ల విషయానికి వస్తే, బూడిద రంగు మరియు లేత గోధుమ రంగు కలయికతో గోధుమ రంగు హైలైట్లతో లెధర్ అపోలిస్ట్రీ ఇవ్వబడింది. తేలికైన అపోలిస్ట్రీ, ద్వంద్వ టోన్ రంగులు మరియు పుష్కలమైన హెడ్ రూం వంటి అంశాలు క్యాబిన్ కు మంచి అనుభూతిని అందిస్తాయి. ముందు సీట్లు వెనుక వైపు లుంబార్ మద్దతు ఉండటం వలన సౌకర్యవంతంగా ఉంటాయి. మునుపటి-తరం మోడల్ లో చూసినట్టుగా ఈ కొత్త వాహనంలో కూడా డ్రైవర్ పక్క సీటు క్రింద ఒక నిల్వ కంపార్ట్మెంట్ ఇవ్వబడింది.

మరోవైపు వెనుక ఉన్న సీట్ల విషయానికి వస్తే, సగటు పరిమాణం కలిగిన ప్రయాణీకులకు కూడా తొడ మద్దతు ఇవ్వడం జరగలేదు. కానీ వెనుక రూమ్ కావలసిన దానికంటే ఎక్కువ ఇవ్వబడింది మరియు ఇది విభాగంలో ఉత్తమం అని చెప్పవచ్చు. పెరిగిన వెడల్పు కారణంగా, మునుపటి తరం మోడల్ తో పోలిస్తే ఈ కొత్త వాగన్ ఆర్ లో మధ్య వెనుక ప్రయాణీకుడు చాలా సౌకర్యవంతంగా ప్రయాణించగలడు. 

డిక్కీ విషయానికి వస్తే, 341 లీటర్ల బూట్ స్థలంతో, ఈ కొత్త వాగన్ ఆర్ దాని ప్రత్యర్థుల కంటే చాలా ఎక్కువ విశాలమైనది, అలాగే దానికి పైన ఉండే విభాగంలో అనేక కార్ల కంటే కూడా చాలా విశాలంగా ఉంటుంది. నిజానికి, ఇది విటారా బ్రజ్జా (328-లీటర్లు) మరియు బాలెనో (339-లీటర్లు) కంటే కూడా బారీ డిక్కి స్థలాన్ని పొందింది. ఇది 340 లీటర్ల బూట్ స్థలాన్ని కలిగి ఉన్న ఈ కొత్త వాగన్ ఆర్, ఉప-4 మీటర్ల కార్లలో చేర్చబడింది. ఈ శ్రేష్టమైన జాబితాలో ఉన్న ఇతర కార్ల బూట్ స్థలం విషయానికి వస్తే, నెక్సాన్ (350 లీటర్లు), హోండా జాజ్ (354 లీటర్లు) మరియు డబ్ల్యూఆర్-వి (363 లీటర్లు) ఉన్నాయి. విస్తృత మరియు సర్దుబాటయ్యే బూట్ స్థలం అలాగే 60:40 స్ప్లిట్ మడత వెనుక సీట్లు అందించిన మారుతి సంస్థకు ధన్యవాదాలు చెప్పవచ్చు. అంతేకాకుండా ఈ కొత్త వాగన్ ఆర్, మీ కుటుంబ సభ్యులను మరియు స్నేహితులను విమానాశ్రయం చేరుకోవటానికి కావలసిన సామర్థ్యం కంటే ఎక్కువ వైశాల్యాన్ని కలిగి ఉంటుంది.

వాగన్ ఆర్ యొక్క అంతర్గత పరంగా కొంచెం లోపం ఉన్నదని చెప్పవచ్చు, అంతేకాకుండా అవసరమైన కొన్ని సమర్థతా సమస్యలు కూడా లోపలి భాగంలో ఉన్నాయి. మొదట విషయం ఏమిటంటే వాగార్ ఆర్ లో, సర్ధుబాటు హెడ్ రెస్ట్లు లేవు. సుదీర్ఘమైన ప్రయాణాలలో డ్రైవర్ మరింత సౌకర్యవంతంగా డ్రైవ్ చేయడానికి కనీసం డ్రైవర్ సీటుకైనా సర్దుబాటు చేయగల హెడ్ రెస్ట్లు అందించి ఉంటే బాగుండేది. ప్రస్తుతం మారుతి సంస్థ వారు, ఆరు అడుగుల పొడవు కన్నా తక్కువగా ఉన్న వ్యక్తికి కూడా మెడకు సరిగ్గా మద్దతు ఇవ్వలేదు.

మారుతి సంస్థ డ్రైవర్ సౌకర్యార్ధం, ఎత్తు సర్ధుబాటు స్టీరింగ్ వీల్ అందించింది కానీ, డ్రైవర్ సీటు కోసం ఎత్తు సర్దుబాటును విస్మరించింది. ఇది కనీసం అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్ఎక్స్ఐ లో కూడా అందించలేదు. హ్యుందాయ్ శాంత్రో కూడా ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీట్ ను విస్మరించింది, కానీ టాటా టియాగో మరువలేదు. క్యాబిన్ వెనుక భాగం విషయానికి వస్తే, వెనుక తలుపులకు ఇవ్వబడిన చేతి రెస్ట్ చిన్నగా ఉంటుంది, పెద్దవారి విషయంలో, వెనుకవైపు ఉన్న విండోల నియంత్రణను యాక్సిస్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది.

చిన్న చిన్న సమస్యలు కాకుండా, క్యాబిన్ లోపల మొత్తం ముగింపు రెండవ తరం మోడల్ కు ఒక అడుగు పైనే ఉన్నదని భావించవచ్చు. మరియు కొత్త వాగన్ ఆర్ చూడటానికి చాలా ఆకర్షణీయంగా ఉంది. 

Maruti Wagon R Performance

మూడవ తరం వాగన్ ఆర్ అనేది, మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ఎంపికలతో కూడిన పెట్రోల్ ఇంజిన్ చే జత చేయబడి ఉంటుంది. ఈ వాగన్ ఆర్ వాహనం, ఇప్పటికే ఉన్న 1.0-లీటర్, 3-సిలిండర్ ఇంజిన్ తో అందుబాటులో ఉన్నప్పటికీ, మరింత శక్తివంతమైన 1.2 లీటర్, 4-సిలిండర్ మోటార్ కూడా ఈ కొత్త వాహనంలో అందుభాటులో ఉంది. ఈ ఇంజన్, మాన్యువల్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. మారుతి లో ఉన్న స్విఫ్ట్ మరియు బాలెనో వంటి భారీ హాచ్బాక్లలో అందించబడిన అదే 1.2 లీటర్ ఇంజన్ దీనిలో కూడా అందించబడింది.

పాత మోడల్లో ఉన్న 1.0 లీటర్ ఇంజిన్‌ను, 1.2 లీటర్ ఇంజిన్ తో పోలిస్తే, మొత్తం టార్క్‌లో 23ఎన్ఎం మెరుగైన టార్క్ ను అలాగే అత్యధికంగా 15పిఎస్ పవర్ ను అదనంగా అందిస్తుంది. పాత వాహనం కంటే ఈ కొత్త వాగన్ ఆర్ బరువు 50 కిలోల వరకు తగ్గిపోయింది, ఈ కొత్త వాహనంలో అందించబడిన 1.2 లీటర్ ఇంజిన్, మునుపటి మోడల్‌తో పోల్చి చూస్తే చాలా అద్భుతంగా ఉంది. 1.2 లీటర్ ఇంజన్ 15-20కెఎంపిహెచ్ నుండే డౌన్‌షిఫ్ట్ అవసరం లేకుండానే మూడవ గేర్‌లో అత్యధిక వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఈ వాహనం యొక్క పోటీ వాహనాలైన వాటిలో ఇవ్వబడిన ఇంజన్ ను దీనిలో జత చేసినప్పటికీ, క్యాబిన్ లోపల ఇంజిన్ శబ్ధం వినిపిస్తుంది. దీనికి గల కారణం, తగినంత ఇన్సులేషన్ లేకపోవడం వలన కావచ్చు.

రైడ్ మరియు నిర్వహణ

మూడవ-తరం వాగన్ ఆర్ యొక్క రైడ్ నాణ్యత, రెండో-తరం మోడల్ మీద మరింత మెరుగుపడింది. ఈ కొత్త వాహనం, కొత్త గట్టి చట్రం, విస్తృత టైర్లు మరియు సాపేక్షంగా మృదువైన సస్పెన్షన్ సెటప్‌కు కొంచెం తక్కువగా ఉంటుంది. ముందుగా కాకుండా, ప్రయాణ సమయంలో మరింత కుదుపులు ఉండవు. 3-సిలిండర్ ఇంజిన్ తో ఉన్న పాత మోడల్‌తో పోలిస్తే, నాలుగు-సిలెండర్ ఇంజిన్ తక్కువ స్పందనలను ఉత్పత్తి చేస్తుంది.

ఈ కొత్త వాహనంలో అందించబడిన స్టీరింగ్ వీల్, నగరాలలో వేగంతో వెళ్ళినప్పుడు భారీ స్థాయిలో ఉంటుంది మరియు అదే విధంగా కొంచెం అస్పష్టంగా కూడా ఉంటుంది. స్టీరింగ్ వీల్ మరింత మంచి అనుభూతిని కలిగి ఉంటే వినియోగదారులు ఎక్కువ ప్రాధాన్యతను ఇచ్చేవారు. ముందు చక్రం పాక్షికంగా కప్పబడి ఉంటుంది అయితే, వెనుక చక్రానికి ఏ రకమైన క్లాడింగ్ లేదు. అందువల్ల, చక్రాల శబ్ధం లోపలి క్యాబిన్లో మరింత స్పష్టంగా వినిపిస్తుంది. ఈ తగినంత క్లాడింగ్ కలిగి ఉంటే, రైడ్ అనుభవం మరింత అద్భుతంగా ఉంటుంది. ఈ విషయంలో ఇదే విభాగంలో ఉన్న ఇతర పోటీ వాహనాలతో ఎదుర్కొనే సామర్ధ్యం లేదు.

వాగన్ ఆర్, ప్రయాణ సమయంలో పదునైన మలుపులు కారణంగా అయిష్టంగా ఉంటుంది. అంతేకాకుండా, దాని ఎత్తు మరియు మృదువైన సస్పెన్షన్ సెటప్ కారణంగా అనుభూతి పాక్షికంగా ఉంటుంది. ఇదే విభాగంలో ఇతర కార్లు వలె, ఇది సున్నితమైన పద్ధతిలో నడుపబడేందుకు కష్టపడుతుంది.

నగరాలలో ఇటువంటి పద్ధతిలో నడుపగానే, వాగన్ఆర్ కొత్త పెప్పీ 1.2 లీటర్ మోటర్ మరియు అద్భుతమైన రైడ్ నాణ్యతతో మంచి రైడ్ అనుభూతిని ఇవ్వగలుగుతుంది. వాగన్ ఆర్ యొక్క తక్కువ టర్నింగ్ వ్యాసార్థం కారణంగా నగరంలో ట్రాఫిక్‌ను సులభంగా ఎదుర్కోగలుగుతుంది మరియు ఇరుకైన ప్రదేశాల్లో పార్కింగ్ సమయంలో మరింత ఉపయోగకరంగా ఉంటుంది.

పనితీరు పొలికలు (పెట్రోల్)

 

మారుతి వాగన్ ఆర్ 

డాట్సన్ గో

టాటా టియాగో

హ్యుందాయ్ శాంత్రో

శక్తి

81.80బిహెచ్పి@6000ఆర్పిఎం

67బిహెచ్పి@5000ఆర్పిఎం

84బిహెచ్పి@6000ఆర్పిఎం

68బిహెచ్పి@5500ఆర్పిఎం

టార్క్ ( ఎన్ఎం)

113ఎన్ఎం@4200ఆర్పిఎం

104ఎన్ఎం@4000ఆర్పిఎం

114ఎన్ఎం@3500ఆర్పిఎం

99ఎన్ఎం@4500 ఆర్పిఎం

ఇంజిన్ సామర్ధ్యం (సిసి)

1197

1198

1199

1086

ట్రాన్స్మిషన్

మాన్యువల్

మాన్యువల్

మాన్యువల్

మాన్యువల్

అగ్ర వేగం (కెఎంపిహెచ్)

-

150 కెఎంపిహెచ్

150 కెఎంపిహెచ్

162కెఎంపిహెచ్

0-100 త్వరణం (సెకన్లు)

18.6 సెకన్లు

13.3 సెకన్లు

14.3 సెకన్లు

15.23 సెకన్లు

వాహన బరువు (కిలోలు)

835కిలోలు

-

1012కిలోలు

-

ఇంధన సామర్ధ్యం (ఏఆర్ఏఐ)

21.5కెఎంపిఎల్

19.83కెఎంపిఎల్

23.84కెఎంపిఎల్

20.3కెఎంపిఎల్

శక్తి బరువు నిష్పత్తి

97.96 బిహెచ్పి/టన్

-

83.00 బిహెచ్పి/టన్

-

Wagon R Safety

మూడవ తరం వాగన్ ఆర్, డ్రైవర్ ఎయిర్బాగ్, ఏబిఎస్ తో ఈబిడి మరియు వెనుక పార్కింగ్ సెన్సార్ వంటి అంశాలు ప్రామాణికంగా అందించబడుతున్నాయి. ఈ వాహనం యొక్క అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్ వేరియంట్ విషయానికి వస్తే, సహ-డ్రైవర్ ఎయిర్బాగ్ను అలాగే ప్రిటెన్షినార్లు మరియు లోడ్ పరిమితులను కలిగి ఉండే ముందు సీటు బెల్ట్‌లు వంటి అంశాలు అధనంగా జోడించబడతాయి. ఈ రెండు క్రియాశీల భద్రతా లక్షణాలు ఎల్ మరియు వి వేరియంట్లలో ఆప్షనల్‌గా అదనంగా అందుబాటులో ఉన్నాయి.

Maruti Wagon R Variants

మూడవ-తరం వాగన్ ఆర్, మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంది: అవి వరుసగా ఎల్, వి మరియు జెడ్. ముందుగా దిగువ శ్రేణి వేరియంట్ అయిన ఎల్ వేరియంట్ లో చిన్న 1.0- లీటర్ పెట్రోల్ ఇంజిన్ కలిగి ఉండగా, కొత్త 1.2-లీటర్ మోటర్ అగ్ర శ్రేణి వేరియంట్ అయిన జెడ్ లో అందించబడుతుంది. మరోవైపు మధ్యస్థ వేరియంట్ అయిన వి విషయానికి వస్తే, రెండు ఇంజిన్ ఆప్షన్లతో అందుబాటులో ఉంటుంది.

మారుతి Wagon R యొక్క అనుకూలతలు & ప్రతికూలతలు

Wagon R మేము ఇష్టపడే విషయాలు

 • లభ ప్రవేశం మరియు నిష్క్రమణ: మీరు బాగా వంగి లోనికి ప్రవేశించవలసిన అవసరం లేదు మరియు వాగన్ ఆర్ నుండి బయటకు రావడం కూడా చాలా సులభం.
 • విశాలమైన క్యాబిన్: వెలుపలి కొలతలు మరియు వీల్‌బేస్ పెరుగుదల కారణంగా లోపలి కాబిన్ స్థలం మరింత విశాలానికి దారితీసింది.
 • భారీ బూట్: 341-లీటర్ బూట్ స్పేస్ తో దాని సెగ్మెంట్లో గరిష్టంగా ఉంది. నిజానికి, ఈ వాహనాన్ని, దీని పైన విభాగంలో ఉన్న వాహనాలతో కంటే కూడా పోల్చదగినది లేదా పెద్దదిగా ఉంటుంది. 3-4 మీడియం సైజు సంచులు సులభంగా అమర్చవచ్చు. అంతేకాకుండా మరింత స్థలాన్ని ఇవ్వడం కోసం వెనుక సీటుకు 60:40 స్ప్లిట్ సౌకర్యం జోడించబడింది.
 • రెండు ఇంజిన్లలో ఆటోమేటిక్ ఆప్షన్: ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఆప్షన్ సౌలభ్య స్థాయిని మరింత పెంచుతుంది అంతేకాకుండా కారు నడపడానికి సులభమైనది. ఈ ఎంపిక, వి మరియు జెడ్ వేరియంట్లలో లభిస్తుంది మరియు రెండు ఇంజిన్లతోనూ లభిస్తుంది.
 • భద్రత: ఏబిఎస్ ప్రామాణికంగా అందించబడుతుంది, డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బాగ్స్ అన్ని వేరియంట్ లలో అప్షనల్గా అందించబడతాయి. ఈ కొత్త నవీకరించబడిన వాహనం ముందు కంటే కూడా దృడంగా ఉంది.

Wagon R మేము ఇష్టపడని విషయాలు

 • ప్లాస్టిక్ నాణ్యత: క్యాబిన్‌లోని మెటీరియల్స్ నాణ్యత మరింత మెరుగుపర్చవలసిన అవసరం ఉంది. నాణ్యతలో క్రమబద్ధత కూడా ఒక ఆందోళనకర విషయం అని చెప్పవచ్చు.
 • ప్రస్తుతం, సిఎన్జి లేదా ఎల్పిజి ఎంపికలు లేవు.
 • స్పాంజి బ్రేక్‌లు: మంచి పెడల్ స్పందన ఉండవల్సిన అవసరం ఉంది.
 • కోల్పోయిన లక్షణాలు: సర్దుబాటు వెనుక హెడ్ రెస్ట్, ఎత్తు సర్దుబాటు డ్రైవర్ సీటు, వెనుక పార్కింగ్ కెమెరా మరియు అల్లాయ్ చక్రాలు వంటి అంశాలు కనీసం అగ్ర శ్రేణి వేరియంట్ లోనైనా అందించవలసిన అవసరం ఉంది.
 • బలహీనమైన క్యాబిన్ ఇన్సులేషన్: ఎన్విహెచ్ స్థాయిలు అత్యుత్తమంగా లేవు - క్యాబిన్లోకి, చాలా భయంకరమైన ఇంజిన్ శబ్దం వస్తుంది.

అత్యద్భుతమైన లక్షణాలను

 • Pros & Cons of Maruti Wagon R

  60:40 స్ప్లిట్ సర్ధుబాటు వెనుక సీటు: సెలెరియో మినహా, ఈ సెగ్మెంట్లోని ప్రతీ ఒక్క కారులో, వెనుక సీటు మడత సర్ధుబాటును కలిగి ఉంటుంది, ఈ సర్ధుబాటును కలిగి ఉండటం వలన బూట్ స్థలం మరింత పెరుగుతుంది.

 • Pros & Cons of Maruti Wagon R

  341-లీటర్ బూట్ స్పేస్: వాగన్ ఆర్ యొక్క బూట్ స్పేస్, దాని పోటీ వాహనాల అలాగే దీనిని పై సెగ్మెంట్ లో ఉండే కార్ల కంటే కూడా చాలా విశాలమైనది.

 • Pros & Cons of Maruti Wagon R

  7-అంగుళాల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్: మారుతి యొక్క కొత్త స్మార్ట్‌ప్లే స్టూడియో, ఆపిల్ కార్ప్లే మరియు ఆండ్రాయిడ్ ఆటో మద్దతుతో పాటు కార్ల తయారీదారుడు స్మార్ట్‌ఫోన్ ఇంటిగ్రేషన్ యాప్, స్మార్ట్‌ప్లే స్టూడియో తో వస్తుంది. ఇది ఇంటర్నెట్ రేడియోలను మరియు వాహన గణాంకాలను ప్రదర్శిస్తుంది.

మారుతి Wagon R కొనుగోలు ముందు కథనాలను చదవాలి

మారుతి Suzuki వాగన్ ఆర్ వినియోగదారుని సమీక్షలు

4.5/5
ఆధారంగా580 వినియోగదారుని సమీక్షలు
Chance to win image iPhone 6s & image vouchers - T&C *

ధర & సమీక్ష

 • తాజా సమీక్షలు
 • చాలా ఉపయోగకరమైన సమీక్షలు
 • Maruti Wagon R

  Maruti Wagon R is a great car at a low price in this segment. It gives a nice performance. ఇంకా చదవండి

  M
  Manthan Patel
  On: Feb 22, 2019 | 3 Views
 • Maruti Wagon R

  Maruti Wagon R is a nice car. I like the sound clarity and good display. ఇంకా చదవండి

  S
  Santhoshshijil Krishnan
  On: Feb 21, 2019 | 1 Views
 • ALL NEW MARUTI WAGON R

  The Maruti Wagon R has been one of India's top selling cars for a very long time now. The car is widely used in the commercial sector and has been a trusty seed for those... ఇంకా చదవండి

  u
  user
  On: Feb 21, 2019 | 2 Views
 • Maruti Wagon R

  Maruti Wagon R has excellent performance, fantastic durability, awesome comfort, elegant mileage and best pricing. ఇంకా చదవండి

  S
  Shikhar Gupta
  On: Feb 21, 2019 | 70 Views
 • Maruti Wagon R

  Maruti Wagon R comes in low budget and maintenance. It keeps the value for money and even has good mileage. ఇంకా చదవండి

  S
  Shaquib Ahmad
  On: Feb 21, 2019 | 20 Views
 • మారుతి Wagon R సమీక్షలు అన్నింటిని చూపండి
 • for LXI CNG

  CNG For Earth, Truly Satisfying

  Look and Style: Truly International look with good road presence.  Comfort: Very comfortable front and rear seats for tall persons. High roof space. Refreshing interior.... ఇంకా చదవండి

  s
  shail
  On: Dec 08, 2010 | 127016 Views
 • for LXI

  The Only Drawback In New Wagona R

  I already have two Wagon R since the last few years. Except for the fuel economy both are good cars .The new car is very spacious, well designed and has better fuel econo... ఇంకా చదవండి

  s
  sampan
  On: Sep 04, 2010 | 181599 Views
 • Wagon R Is The Best

  Here is the review of Wagon R after driving it for one month:  Previously I had a Santro. Highlights: Outlook: With changed outlook, the new Wagon  R looks more stylish ... ఇంకా చదవండి

  K
  Kiran
  On: Jun 11, 2013 | 14963 Views
 • for VXI

  No more a value for money, rather go for Hyundai or Honda make

  I would strongly suggest not to buy the new Maruti Wagon R. I bought it in Diwali 2013, and in just about slightly more than a month, the window glasses started making no... ఇంకా చదవండి

  P
  Prithvijit
  On: Jan 03, 2014 | 33293 Views
 • for VXI

  Info On Wagon R

  Look and Style: The looks of the car are not the best in the market but I find it pretty decent as compared to various odd shaped cars. It has a unique style in its segme... ఇంకా చదవండి

  A
  Ajay
  On: Jan 16, 2011 | 18243 Views
 • మారుతి Wagon R సమీక్షలు అన్నింటిని చూపండి

మారుతి Wagon R మైలేజ్

The claimed ARAI mileage: Maruti Wagon R Petrol is 22.5 kmpl. The claimed ARAI mileage for the automatic variant: Maruti Wagon R Petrol is 22.5 kmpl.

ఇంధన రకంట్రాన్స్మిషన్ARAI మైలేజ్
పెట్రోల్మాన్యువల్22.5 kmpl
పెట్రోల్ఆటోమేటిక్22.5 kmpl

మారుతి Wagon R వీడియోలు

 • Maruti Wagon R 2019 - Pros, Cons and Should You Buy One? Cardekho.com
  6:44
  Maruti Wagon R 2019 - Pros, Cons and Should You Buy One? Cardekho.com
  Feb 11, 2019
 • New Maruti Wagon R 2019 Review in Hindi | More Practical, More Powerful | CarDekho.com
  11:39
  New Maruti Wagon R 2019 Review in Hindi | More Practical, More Powerful | CarDekho.com
  Jan 31, 2019
 • Maruti Wagon R 2019 Review | Now Sensible, Sophisticated and Desirable? | ZigWheels.com
  15:26
  Maruti Wagon R 2019 Review | Now Sensible, Sophisticated and Desirable? | ZigWheels.com
  Jan 31, 2019
 • New Wagon R 2019 Launch Walkaround Review | Price, Colours, Interior & More | ZigWheels
  8:2
  New Wagon R 2019 Launch Walkaround Review | Price, Colours, Interior & More | ZigWheels
  Jan 24, 2019
 • New Maruti Wagon R 2019 Price = Rs 4.19 Lakh | Looks, Interior, Features, Engine (Hindi)
  13:0
  New Maruti Wagon R 2019 Price = Rs 4.19 Lakh | Looks, Interior, Features, Engine (Hindi)
  Jan 23, 2019
 • Upcoming Hatchbacks in India with Prices & Launch Dates - WagonR, 45X, Baleno & More! | CarDekho.com
  5:8
  Upcoming Hatchbacks in India with Prices & Launch Dates - WagonR, 45X, Baleno & More! | CarDekho.com
  Jan 21, 2019

మారుతి Wagon R రంగులు

 • Color
  సిల్కీ సిల్వర్
 • Color
  POOLSIDE నీలం
 • Color
  NUTMEG గోధుమ
 • Color
  మాగ్మా గ్రీ
 • Color
  ఔటమ్న్ నారింజ
 • Color
  సుపీరియర్ తెలుపు

మారుతి Wagon R చిత్రాలు

మారుతి Wagon R వార్తలు

మారుతి Wagon R రహదారి పరీక్ష

వాడిన కారు కొనుగోలు చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలొ లాభపడండి.

 • ఉపయోగించిన మారుతి Wagon R
 • అదేవిధమైన ధర

ఇటీవల Maruti Wagon R 2019 గురించి వినియోగదారులు ప్రశ్నలను అడిగారు

 • munesh_gaur has asked a question about Wagon R 2019

  Does కొత్త వాగన్ ఆర్ have passenger airbag?

  • 1 Answer
  • Cardekho_Experts
  • on 19 Feb 2019

  Yes, Wagon R 2019 has dual front airbags as option on all variants.

  Helpful (0)
 • Dilip_Khavnekar has asked a question about Wagon R 2019

  Why there is less cooling of A/సి లో {0}

  • 1 Answer
  • Cardekho_Experts
  • on 16 Feb 2019

  To know the actual problem we suggest to contact to take the vehicle to your nearest service centre. click the given link that might help you. https://bit.ly/2X6jFB9

  Helpful (0)
 • Bhargav_Kadia has asked a question about Wagon R 2019

  We filled HP 15w-40 లో {0}

  • 1 Answer
  • Cardekho_Experts
  • on 12 Feb 2019

  Its might is a problem because it is mostly made of MUVs and heavy-duty vehicles. We recommend you to talk to your nearest authorized service center on this they are the best person to talk.

  Helpful (0)
View All Questions

Have any question? Ask now!

Guaranteed response within 48 hours

Write your Comment పైన మారుతి వాగన్ ఆర్

87 comments
1
C
CarDekho
Nov 11, 2018 7:44:59 AM

Thank you for showing confidence in our services & making us a part of you car buying journey.

  సమాధానం
  Write a Reply
  1
  N
  Nirmalendu Bit
  Nov 10, 2018 5:02:39 PM

  I have purchased Wagon R in this Sept 2018 after obtaining all information from this site. I got VXi model on 480000. Excelent purchase in this Range.

  సమాధానం
  Write a Reply
  2
  C
  CarDekho
  Nov 11, 2018 7:44:59 AM

  Thank you for showing confidence in our services & making us a part of you car buying journey.

   సమాధానం
   Write a Reply
   1
   C
   CarDekho
   Sep 25, 2018 12:40:18 PM

   Hyundai Santro will be launch on 23 October. So it would be unfair to give any verdict yet about it.

    సమాధానం
    Write a Reply
    Calculate EMI of Maruti Wagon R×
    డౌన్ చెల్లింపుRs.0
    0Rs.0
    బ్యాంకు వడ్డీ రేటు 10.5 %
    8%22%
    రుణ కాలం (సంవత్సరాలు)
    • మొత్తం రుణ మొత్తంRs.0
    • చెల్లించవలసిన మొత్తంRs.0
    • మీరు అదనంగా చెల్లించాలిRs.0

    Calculated on Ex-Showroom price

    Rs. /month
    Apply రుణం

    మారుతి Wagon R భారతదేశం లో ధర

    సిటీఆన్-రోడ్ ధర
    ముంబైRs. 4.98 - 6.75 లక్ష
    బెంగుళూర్Rs. 5.13 - 7.02 లక్ష
    చెన్నైRs. 4.93 - 6.7 లక్ష
    హైదరాబాద్Rs. 5.02 - 6.81 లక్ష
    పూనేRs. 5.01 - 6.72 లక్ష
    కోలకతాRs. 4.89 - 6.59 లక్ష
    కొచ్చిRs. 4.76 - 6.57 లక్ష
    మీ నగరం ఎంచుకోండి

    ట్రెండింగ్ మారుతి కార్లు

    • ప్రాచుర్యం పొందిన
    • రాబోయే
    ×
    మీ నగరం ఏది?