ముసుగులు లేకుండా కనిపించిన Tata Nexon Facelift ఫ్రంట్ ప్రొఫైల్
ఇందులో ఉన్న కొత్త హెడ్ؚల్యాంపుల డిజైన్ హ్యారియర్ EV కాన్సెప్ట్ డిజైన్‌కు సారూప్యంగా ఉంది
-
టెస్ట్ వాహనం యొక్క ఫ్రంట్ ప్రొఫైల్ ఎటువంటి కవర్ లేకుండా స్పష్టంగా కనిపించింది.
-
లోపలి వైపు భారీ మార్పులు ఉంటాయని అంచనా.
-
1.5-లీటర్ డీజిల్ మరియు 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚల ఎంపికలలో అందించవచ్చు.
-
ఇది ఈ సంవత్సరం చివరలో విడుదల కానుంది, రూ.8 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర ఉండవచ్చు అని అంచనా.
నవీకరించిన టాటా నెక్సాన్ؚను కొద్ది కాలంగా అభివృద్ధి చేస్తున్నారు. కొన్ని నెలలలో విడుదల కానున్న ఈ SUV యొక్క అనేక రహస్య చిత్రాలను ఇప్పటికే చూశాము. ఇటీవల, నవీకరించిన నెక్సాన్ టెస్ట్ వాహనం ఫ్రంట్ ప్రొఫైల్ ఎటువంటి ముసుగు లేకుండా కనిపించింది, కొన్ని భారీ డిజైన్ అప్ؚగ్రేడ్ؚలను వెల్లడించింది.
కొత్త డిజైన్ లాంగ్వేజ్
ప్రస్తుత మోడల్ؚతో పోలిస్తే నవీకరించిన నెక్సాన్ ఫ్రంట్ ప్రొఫైల్ؚను భారీగా మార్చినట్లు కనిపిస్తోంది. ముందువైపు, ప్రస్తుతం సీక్వెన్షియల్ ఇండికేటర్‌లతో నాజూకైన LED DRLలు మరియు హెడ్ؚల్యాంప్ؚలు బంపర్‌పై దిగువన అమర్చి ఉన్నాయి. నిలువుగా ఉన్న హౌసింగ్ؚతో ఈ హెడ్ؚల్యాంప్ؚలు, 2023 ఆటో ఎక్స్ؚపోలో హ్యారియర్ EV కాన్సెప్ట్ పై ప్రదర్శించిన హెడ్ؚల్యాంప్ؚలకు సారూప్యంగా ఉన్నాయి.
ప్రస్తుతం గ్రిల్ భారీగా కనిపిస్తుంది మరియు పెద్ద ఎయిర్ డ్యామ్ మధ్య నుండి వెళ్తున్న ప్లాస్టిక్ ఎలిమెంట్ రెండు హెడ్ؚల్యాంప్ؚల హౌసింగ్ؚను కనెక్ట్ చేస్తోంది.
ఇతర డిజైన్ అప్ؚడేట్ؚలు
ఇంతక ముందు కనిపించిన నవీకరించిన నెక్సాన్ؚలో కొత్త అలాయ్ వీల్స్, సవరించిన బంపర్ డిజైన్ (ముందు మరియు వెనుక), కొత్త ఆకారంలో టెయిల్‌గేట్ మరియు కనెక్టెడ్ టెయిల్ ల్యాంప్ సెట్అప్ؚను గమనించవచ్చు. ఇటీవల కనిపించిన మోడల్ బహుశా బేస్ వేరియెంట్ కావచ్చు, ఎందుకంటే ఇది స్టీల్ వీల్స్‌పై ఉంది మరియు ఎటువంటి క్రోమ్ లేదా మెరిసే నలుపు రంగు గార్నిష్ؚను కనిపించలేదు.
ఇది కూడా చదవండి: సరికొత్త ఇంటీరియర్ డిజైన్ؚను పొందనున్న నవీకరించిన టాటా నెక్సాన్ –రహస్య చిత్రాలు
2023 టాటా నెక్సాన్ؚ ఇంటీరియర్‌లో కూడా అప్ؚడేట్‌లను చూడవచ్చు. సరికొత్త క్యాబిన్ థీమ్, భారీ టచ్ؚస్క్రీన్ యూనిట్ؚతో కొత్త డ్యాష్ؚబోర్డ్ లేఅవుట్, టాటా అవిన్యా నుండి ప్రేరణ పొందిన స్టీరింగ్ؚ వీల్ మరియు సవరించిన సెంటర్ కన్సోల్ؚతో వస్తుంది.
ఆశించదగిన పవర్ؚట్రెయిన్ؚలు
6-స్పీడ్ మాన్యువల్ మరియు 6-స్పీడ్ AMTతో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ؚను (115PS/160Nm) టాటా కొనసాగించే అవకాశం ఉంది. అయితే ఈ కారు తయారీదారు తమ సరికొత్త 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ యూనిట్ؚను (125PS/225Nm) కూడా DCT (డ్యూయల్ క్లచ్ ట్రాన్స్ؚమిషన్) ఆటోమ్యాటిక్ ఎంపికతో అందించవచ్చు.
ఫీచర్‌లు భద్రత
నవీకరించిన నెక్సాన్ؚలో టాటా 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, పూర్తి డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్ؚలెస్ ఫోన్ ఛార్జింగ్, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్ AC మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు వంటి ఫీచర్‌లను అందిస్తుంది.
ఇది కూడా చదవండి: డైనమిక్ టర్న్ ఇండికేటర్ؚలతో కనిపించిన 2024 టాటా నెక్సాన్
భద్రత విషయంలో, కారు తయారీదారు ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలను, EBDతో ABS, హిల్ అసిస్ట్, ESP (ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్) మరియు 360-డిగ్రీల కెమెరాను అందిస్తుంది. అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్స్ (ADAS) అందించే మొదటి సబ్-కాంపాక్ట్ SUV కూడా కావచ్చు.
విడుదల పోటీదారులు
నవీకరించిన నెక్సాన్ ను టాటా సెప్టెంబర్ 2023 నాటికి విడుదల చేయవచ్చు, దీని అంచనా ప్రారంభ ధర రూ.8 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉండవచ్చు. కియా సోనెట్, హ్యుందాయ్ వెన్యూ, మారుతి బ్రెజ్జా మరియు మహీంద్రా XUV300 వంటి వాటితో ఇది పోటీని కొనసాగిస్తుంది.
ఇక్కడ మరింత చదవండి: నెక్సాన్ AMT