• English
  • Login / Register

కొత్త ఇంటీరియర్‌లను పొందనున్న నవీకరించబడిన టాటా నెక్సాన్ – రహస్యంగా చిత్రీకరించిన ఫోటోలు

టాటా నెక్సన్ కోసం tarun ద్వారా ఏప్రిల్ 12, 2023 06:34 pm ప్రచురించబడింది

  • 22 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

భారీగా నవీకరించబడిన నెక్సాన్ సరికొత్త స్టైలింగ్ మరియు అనేక ఫీచర్ అప్ؚగ్రేడ్‌లతో వస్తుంది

Tata Nexon 2023

  • నవీకరించబడిన నెక్సాన్ ఇంటీరియర్‌లో సరికొత్త డిజైన్ మరియు కొత్త అప్హోల్ؚస్ట్రీతో వస్తుంది. 

  • అవిన్యా నుండి ప్రేరణ పొందిన స్టీరింగ్ వీల్, కొత్త ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మరియు భారీ టచ్ؚస్క్రీన్ؚను కలిగి ఉంటుంది. 

  • ఎక్స్ؚటీరియర్, రీడిజైన్ చేసిన ముందు మరియు వెనుక ప్రొఫైల్స్ؚతో కనెక్టెడ్ LED ఎలిమెంట్ؚలను కలిగి ఉంటుంది. 

  • కొత్త 125PS 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను కలిగి ఉండవచ్చని అంచనా; డీజిల్ ఇంజన్ؚను కూడా నిలుపుకుంటుంది. 

  • రూ.7.8 లక్షల నుండి రూ.14.35 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ప్రస్తుత ధర పరిధి కంటే దీని ధర అధికంగా ఉంటుంది అని అంచనా. 

టాటా నెక్సాన్ 2023ను తిరిగి టెస్ట్ చేస్తున్న రహస్య ఫోటోలు మళ్ళీ కనిపించాయి, ఈ సారి స్పస్టంగా, పార్క్ చేయబడి కనిపించింది. కొత్త రహస్య వీడియోలో నవీకరించబడిన సబ్-కంపాక్ట్ SUV ఇంటీరియర్ వివరాలను చూడవచ్చు, ఇంటీరియర్ పరంగా ఇందులో అనేక మార్పులు కనిపించాయి. నవీకరించిన వెర్షన్ ఈ నెల చివరిలో మార్కెట్‌లో అందుబాటులోకి వస్తుందని అంచనా. 

కొత్త ఇంటీరియర్ వివరాలు

Tata Nexon 2023

2023 టాటా నెక్సాన్ పునర్నిర్మించిన క్యాబిన్ డిజైన్ؚతో వస్తుంది. టాటా అవిన్యా నుండి ప్రేరణ పొందిన, దీర్ఘచతురస్రాకార చదునైన ఉపరితలం మధ్యలో ఉండే, స్టీరింగ్ వీల్ؚను ముందుగా గమనించవచ్చు. ఇందులో ప్రకాశించే టాటా లోగో ఉంటుందని విశ్వసిస్తున్నాము. ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ ప్యానెల్ ఇప్పుడు భారీగా కనిపిస్తోంది, హ్యారియర్ కొత్త ఏడు-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే ఇందులో ఉండవచ్చని ఇది సూచిస్తోంది. 

ఇది కూడా చదవండి: 25 సంవత్సరాల టాటా సఫారి: మరింత ఫ్యామిలీ-ఫ్రెండ్లీ ఇమేజ్ కోసం ఈ ఐకానిక్ SUV తన ధృఢమైన, మాచో ట్యాగ్ؚను ఎలా వదులుకుంది

సెంటర్ కన్సోల్ؚలో కూడా ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ కోసం కొత్త గేర్ లివర్, విభిన్నమైన ఫోన్ డాకింగ్ స్పేస్ వంటి కొన్ని సర్దుబాట్లును చూడవచ్చు. AC వెంట్‌ల క్రింద మెరిసే నల్లని ఫ్యాబ్రిక్‌ను కూడా చూడవచ్చు, ఇందులో కొత్త క్లైమేట్ కంట్రోల్ ప్యానెల్ ఉండవచ్చు. నవీకరించిన నెక్సాన్, ఇటీవల హ్యారియర్ మరియు సఫారీలలో పరిచయం చేసిన 10.25-అంగుళాల భారీ టచ్ؚస్క్రీన్ సిస్టమ్ؚతో వస్తుంది. చివరిగా, అప్హోల్ؚస్ట్రీ ప్రస్తుతం నీలం రంగులో ఉంది, ఇది ఖరీదైనదిగా కనిపిస్తుంది. 

ఎక్స్ؚటీరియర్ؚలో మార్పులు

Tata Nexon EV 2023

కొత్త నెక్సాన్ ముందు ప్రొఫైల్‌లో పూర్తిగా అమర్చిన LED DRLలు, మరింత బూట్ షేప్, నిలువుగా అమర్చిన హెడ్‌ల్యాంప్ؚలు, స్ప్లిట్ ఎయిర్ డ్యామ్ డిజైన్ వంటి కొత్త విజువల్ ఎలిమెంట్ؚలు ఉన్నాయి. రహస్య చిత్రాలలో కొత్త అలాయ్ వీల్ డిజైన్ కూడా కనిపిస్తుంది. వెనుక ప్రొఫైల్ కొత్త బాంబర్, విభిన్నమైన బూట్ షేప్, కనెక్టెడ్ LED టెయిల్ ల్యాంప్ؚలతో రీడిజైన్ చేయబడింది. పరీక్షించిన వాహనం బహుశా టాప్ వేరియెంట్ కావచ్చు, రేంజ్ రోవర్ స్టైల్ రూఫ్-మౌంటెడ్ రేర్ వైపర్ మరియి వాషర్‌లు కూడా కనిపించాయి. 

కొత్త ఫీచర్‌లు

Tata Harrier Red Dark Edition Cabin

(హ్యారియర్ؚలో పరిచయం చేసిన కొత్త టచ్‌స్క్రీన్ సిస్టమ్)

పైన పేర్కొన్నట్లుగా, సరికొత్త నెక్సాన్ؚలో కొత్త డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు 10.25-అంగుళాల పెద్ద టచ్ؚస్క్రీన్ సిస్టమ్‌తో రావచ్చు. వెంటిలేటెడ్ సీట్‌లు, వైర్‌లెస్ ఛార్జర్, ఎలక్ట్రిక్ సన్‌రూఫ్, రేర్ పార్కింగ్ కెమెరాతో ఇది ఇప్పటికే అనేక ఫీచర్‌లను కలిగి ఉంది. 360-డిగ్రీ కెమెరా, ADAS (అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్), ఆరు వరకు ఎయిర్ బ్యాగ్ؚలను జోడించడంతో భద్రత మరింతగా పెరిగింది. 

ఇది కూడా చదవండి: మారుతి ఫ్రాంక్స్ Vs సబ్-కాంపాక్ట్ SUV పోటీదారులు: ఇంధన సామర్ధ్య పోలిక

పవర్ ట్రెయిన్ؚలో మార్పులు?

New 1.2-litre turbo-petrol engine

2023 నెక్సాన్ మునపటి 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ؚతో కొనసాగుతుంది, మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్ ఎంపిక ఉంటుంది. అయితే, ఇది కొత్త మరియు నవీకరించిన 1.2-లీత్ర్ TGDi ఇంజన్ؚను పొందవచ్చు, ఇది 125PS పవర్ మరియు 225Nm టార్క్‌ను క్లెయిమ్ చేస్తుంది. ప్రస్తుత AMT యూనిట్ స్థానంలో DCTని (డ్యూయల్ క్లచ్ ఆటోమ్యాటిక్) కూడా ఆశించవచ్చు. 

ధర అంచనా 

రూ.7.80 లక్షల నుండి రూ.14.35 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉన్న ప్రస్తుత ధర పరిధి కంటే నవీకరించిన నెక్సాన్ ఎక్కువ ధరను కలిగి ఉండవచ్చు. కియా సోనెట్, మహీంద్రా XUV300, రెనాల్ట్ కైగర్, మారుతి సుజుకి బ్రెజ్జా, నిస్సాన్ మాగ్నైట్ మరియు హ్యుందాయ్ వెన్యూలతో ఇది పోటీని కొనసాగిస్తుంది. ఈ నెక్సాన్ వాహనంలో కనిపించిన విజువల్ మరియు ఫీచర్ అప్ؚడేట్ؚలు అన్నీ సబ్-కంపాక్ట్ SUV ఎలక్ట్రిక్ వెర్షన్ؚలో కూడా ఉంటాయని ఆశించవచ్చు. 

చిత్రం మూలం 

ఇక్కడ మరింత చదవండి: నెక్సాన్ AMT 

was this article helpful ?

Write your Comment on Tata నెక్సన్

explore మరిన్ని on టాటా నెక్సన్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience