• English
  • Login / Register

డైనమిక్ టర్న్ ఇండికేటర్ؚలతో కనిపించిన 2024 టాటా నెక్సాన్

టాటా నెక్సన్ కోసం tarun ద్వారా జూలై 14, 2023 03:46 pm ప్రచురించబడింది

  • 3.9K Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ప్రస్తుత మోడల్ؚతో పోలిస్తే అనేక ప్రీమియం జోడింపులను పొందనున్న 2024 టాటా నెక్సాన్.

2024 Tata Nexon

  • బహుశా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ హయ్యర్-ఎండ్ వేరియెంట్ؚలు, డైనమిక్ లేదా సీక్వెన్షియల్ టర్న్ ఇండికేటర్‌లను పొందనుంది. 

  • మునపటి రహస్య చిత్రాలలో, బోనెట్‌పై LED లైట్ బార్ ఉండటం చూడవచ్చు.

  • కొత్త స్టీరింగ్ వీల్ మరియు భారీ డిస్ప్లేలతో క్యాబిన్ؚలో కూడా కొన్ని మార్పులు ఉండవచ్చు.

  • టాటా కొత్త 1.2-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను పొందవచ్చు; 1.5-లీటర్ డీజిల్ యూనిట్ؚను కూడా నిలుపుకుంటుంది.

నవీకరించిన టాటా నెక్సాన్ కొత్త మరియు ప్రత్యేకమైన రహస్య చిత్రాలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి, ఇందులో సరికొత్త మరియు ఆకర్షణీయమైన ఫీచర్‌ల జోడింపులను చూడవచ్చు. నవీకరించిన SUV వర్షన్ؚలో డైనమిక్ టర్న్ ఇండికేటర్ؚలు ఉన్నాయి, ఇవి ప్రత్యేకించి లగ్జరీ బ్రాండ్ؚల నుండి వచ్చే ప్రీమియం కార్‌లలో మాత్రమే కనిపిస్తాయి. ఇలాంటి ప్రీమియం ఫీచర్‌లను సబ్‌కాంపాక్ట్ SUVలో అందించే మొదటి కారు తయారీదారుగా టాటా నిలుస్తుంది.

2024 Tata Nexon

ఇతర ముఖ్యమైన డిజైన్ అప్ؚగ్రేడ్‌లలో రీడిజైన్ చేయబడిన వెనుక బంపర్ؚలు, ఆకర్షణీయమైన బూట్ ఆకారం, కొత్త టెయిల్ؚలైట్ డిజైన్ మరియు కొత్త అలాయ్ వీల్స్ ఉన్నాయి. డిజైన్ పరంగా నెక్సాన్ؚకు భారీ మార్పులు జరుగనున్నాయి, ఇవి దానికి తిరిగి ప్రజాదరణ పొందగలిగే అవకాశాన్ని అందిస్తుంది.

ఇది కూడా చూడండి: ముఖ్యమైన వివరాలను చూపుతూ, మొదటిసారిగా కెమెరాకు చిక్కిన నవీకరించిన టాటా నెక్సాన్ EV 

అనేక ప్రీమియం అంశాలతో నెక్సాన్ ఇంటీరియర్ కూడా పునరుద్ధరించబడనుంది. స్పోక్ؚల కోసం బ్యాక్ؚలిట్ సెక్షన్ؚతో కొత్త ఫ్లాట్-బాటమ్ స్టీరింగ్ వీల్‌తో వస్తుంది, ఇది టాటా లోగోను ప్రదర్శిస్తుంది. భారీ 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ సిస్టమ్ మరియు 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే కూడా ఉంటుందని ఆశిస్తున్నాము, ఇది నెక్సాన్ EV మాక్స్ డార్క్ వెర్షన్ నుండి ఈ SUV సాధారణ వేరియెంట్ؚలలో ప్రామాణికంగా ఉంటుంది. 

2024 Tata Nexon

2024 నెక్సాన్ మునపటి 115PS 1.5-లీటర్ డీజిల్ ఇంజన్‌తో కొనసాగుతుంది, 1.2-లీటర్ TGDI టర్బో-పెట్రోల్ యూనిట్‌ను కూడా అందించవచ్చు. ఈ ఇంజన్ؚను ఆటో ఎక్స్ؚపో 2023లో ఆవిష్కరించారు, ఇది 125PS పవర్ మరియు 225Nm టార్క్‌ను అందిస్తుంది. ప్రస్తుత టర్బో-పెట్రోల్ ఇంజన్ AMT ఎంపిక స్థానంలో టాటా కొత్త ఇంజన్ؚతో జోడించిన DCT (డ్యూయల్ క్లచ్ ఆటోమ్యాటిక్) రావచ్చు.

ఇది కూడా చదవండి: భారీగా కప్పబడి కనిపించిన టాటా కర్వ్

రూ.7.80 లక్షల నుండి రూ.14.50 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరను కలిగి ఉండే, ప్రస్తుత వర్షన్ కంటే టాటా నెక్సాన్ ఫేస్ؚలిఫ్ట్ ధర ఎక్కువగా ఉంటుదని అంచనా. ఇది కియా సోనెట్, మహీంద్రా XUV300, రెనాల్ట్ కైగర్, మారుతి సుజుకి బ్రెజ్జా, నిస్సాన్ మాగ్నైట్ మరియు హ్యుందాయ్ వెన్యూ వంటి వాటితో పోటీని కొనసాగిస్తుంది. 

ఇక్కడ మరింత చదవండి: టాటా నెక్సాన్ AMT

was this article helpful ?

Write your Comment on Tata నెక్సన్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience