మళ్లీ తిరిగి 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్‌ను పొందనున్న Skoda Slavia, Skoda Kushaq స్టైల్ వేరియంట్‌లు

స్కోడా స్లావియా కోసం shreyash ద్వారా అక్టోబర్ 16, 2023 11:56 am ప్రచురించబడింది

  • 71 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

చెక్ తయారీ సంస్థ, స్కోడా కుషాక్ యొక్క స్టైల్ వేరియంట్‌లో అల్లాయ్ వీల్స్‌ను కూడా భర్తీ చేసింది.

  • స్లావియా మరియు కుషాక్ మార్కెట్‌లోకి ప్రవేశించినప్పుడు పెద్ద 10-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్ అందించబడింది, అయితే సప్లై చైన్ సమస్యల కారణంగా వెనక్కి తిరిగి రప్పించుకుంది.

  • ఇది స్కోడా స్లావియా మరియు కుషాక్ రెండింటి యొక్క అగ్ర శ్రేణి స్టైల్ వేరియంట్‌లతో మాత్రమే అందుబాటులో ఉంది.

  • ఈ రెండు మోడల్‌లు ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్లు మరియు ఇల్యుమినేటెడ్ ఫుట్‌వెల్‌ను కూడా పొందుతాయి.

  • అయినప్పటికీ, 10-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్ స్కోడా కుషాక్ యొక్క మోంటే కార్లో ఎడిషన్‌తో ఇప్పటికే అందుబాటులో ఉంది.

  • స్లావియా మరియు కుషాక్ ధరలు రూ. 10.89 లక్షల నుండి ప్రారంభమవుతాయి (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా)

స్కోడా స్లావియా, స్కోడా కుషాక్ ఇప్పుడు 10-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌ను తిరిగి పొందాయి, ఇది సెమీకండక్టర్ చిప్‌ల కొరత కారణంగా తాత్కాలికంగా అందుబాటులో లేదు. ఈ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ రెండు మోడళ్ల యొక్క అగ్ర శ్రేణి స్టైల్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది. అయితే, పెద్ద టచ్‌స్క్రీన్ సిస్టమ్ ఇప్పటికే కుషాక్ యొక్క మోంటే కార్లో ఎడిషన్‌తో అందించబడుతుండటం గమనించదగ్గ విషయం.

స్కోడా ఇటీవల రెండు కార్ల ధరల జాబితాను సవరించింది, కొంత కాలానికి వాటి ధరలను కూడా తగ్గించింది. వేరియంట్ వారీగా సవరించిన ధరలను చూడటానికి ఇక్కడ క్లిక్ చేయండి.

మరిన్ని ఫీచర్లు

ఫీచర్ల విషయానికి వస్తే, పెద్ద 10-అంగుళాల టచ్‌స్క్రీన్ సిస్టమ్‌తో పాటు, స్టైల్ వేరియంట్‌లోని రెండు మోడల్‌లు ఇప్పుడు ఎలక్ట్రికల్‌గా సర్దుబాటు చేయగల ఫ్రంట్ సీట్లు మరియు ఫుట్‌వెల్ ఇల్యూమినేషన్‌ను కూడా పొందుతున్నాయి. స్లావియా మరియు కుషాక్ రెండింటిలోని ఇతర సాధారణ లక్షణాలలో 8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్‌ప్లే, సింగిల్ పేన్ సన్‌రూఫ్ మరియు వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు ఉన్నాయి. అదనంగా, స్లావియా యొక్క యాంబిషన్ ప్లస్ వేరియంట్ అంతర్నిర్మిత డాష్‌క్యామ్‌ను కూడా కలిగి ఉంది.

భద్రత పరంగా, ఈ రెండు కార్లలో గరిష్టంగా ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్-హోల్డ్ అసిస్ట్ మరియు వెనుక పార్కింగ్ కెమెరా, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), హిల్‌ హోల్డ్ అసిస్ట్ వంటి భద్రతా అంశాలు అందించబడతాయి.

ఇది కూడా చూడండి: స్కోడా స్లావియా మాట్ ఎడిషన్ రూ. 15.52 లక్షలతో ప్రారంభించబడింది

కుషాక్‌ కు విభిన్న అల్లాయ్ వీల్స్

గతంలో, స్కోడా కుషాక్ యొక్క స్టైల్ వేరియంట్ డ్యూయల్-టోన్ 17-అంగుళాల అల్లాయ్ వీల్స్‌తో అందించబడింది. అయితే, ఇప్పుడు దాని స్థానంలో అదే పరిమాణంలో సరళంగా కనిపించే సిల్వర్ అల్లాయ్ వీల్స్ అందించబడుతున్నాయి. మరోవైపు, కుషాక్ యొక్క మోంటే కార్లో ఎడిషన్, 5-స్పోక్ డ్యూయల్-టోన్ 17-అంగుళాల వీల్స్‌ను కలిగి ఉంది. సూచన కోసం, స్కోడా వెగా అనే ఒకే పేరుతో రెండు వీల్స్ పై డిజైన్‌ చేయబడుతుంది.

పవర్‌ట్రెయిన్ ఎంపికలు

స్కోడా స్లావియా మరియు కుషాక్ రెండూ వాహనాలు, రెండు ఇంజన్ ఎంపికలను పొందుతాయి: మొదటిది 1-లీటర్ టర్బో పెట్రోల్ (115PS/178Nm) మరియు రెండవది 1.5-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (150PS/250Nm). ఈ రెండు ఇంజన్లు 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో ప్రామాణికంగా జత చేయబడతాయి, అయితే ముందు 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్‌ ఆప్షనల్ గా అందించబడేది మరియు ఇప్పుడు 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్‌మిషన్ (DCT)ని ఆప్షనల్ పొందుతుంది.

ధర పరిధి & ప్రత్యర్థులు

స్కోడా యొక్క రెండు కార్ల దిగువ శ్రేణి వేరియంట్ ధరలను పరిమిత సమయం వరకు తగ్గించినందున, స్లావియా మరియు కుషాక్ ఇప్పుడు రూ.10.89 లక్షల నుండి ప్రారంభమవుతాయి. స్లావియా రూ. 19.12 లక్షలతో అగ్రస్థానంలో ఉండగా, కుషాక్ రూ. 20.01 లక్షలకు చేరుకుంది.

స్లావియా- హోండా సిటీ, వోక్స్వాగన్ విర్టస్, హ్యుందాయ్ వెర్నా మరియు మారుతి సియాజ్‌ లకు గట్టి పోటీని ఇస్తుంది. మరోవైపు, స్కోడా కుషాక్- హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, MG ఆస్టర్, హోండా ఎలివేట్, టయోటా హైరైడర్, మారుతి గ్రాండ్ విటారా, వోక్స్వాగన్ టైగూన్ మరియు సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్‌లకు ప్రత్యర్థిగా కొనసాగుతుంది. 

అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా

మరింత చదవండి : స్లావియా ఆన్ రోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన స్కోడా స్లావియా

Read Full News

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిసెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience