• English
    • Login / Register

    కొత్త ప్రత్యేక ఎడిషన్‌లను పొందిన స్కోడా స్లావియా మరియు కుషాక్

    స్కోడా కుషాక్ కోసం ansh ద్వారా ఏప్రిల్ 17, 2023 01:25 pm ప్రచురించబడింది

    • 26 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    ఈ ప్రత్యేక ఎడిషన్ؚలు సూపర్బ్, ఆక్టావియా & కోడియాక్ؚల నుండి పొందిన ప్రీమియం బ్లూ రంగులో వస్తాయి

    Skoda Slavia & Kushaq Special Editions

    • స్లావియా కొత్త వార్షిక ఎడిషన్ؚను అలాగే కుషాక్ లావా బ్లూ ఎడిషన్ؚను పొందనున్నాయి. 

    • ఈ ప్రత్యేక ఎడిషన్ؚలు రెండు మోడల్‌లలో 1.5-లీటర్ టర్బో పెట్రోల్ వేరియంట్ؚలలో వస్తాయి. 

    • రెండు మోడల్‌లు లోపల మరియు వెలుపల లుక్ పరంగా మార్పులతో అందించబడతాయి. 

    • స్లావియా వార్షిక ఎడిషన్ ధరలు రూ.17.28 లక్షల వద్ద ప్రారంభం అవుతాయి మరియు కుషాక్ లావా బ్లూ ఆన్ ధరలు రూ.17.99 లక్షల వద్ద ప్రారంభం అవుతాయి (రెండూ ఎక్స్-షోరూమ్). 

    భారతదేశంలో మిగిలిన తమ రెండు మోడల్‌లకు కూడా స్కోడా కొత్త ప్రత్యేక ఎడిషన్‌లను ప్రారంభించింది: స్లావియా మరియు కుషాక్. మొదటది కొత్త వార్షిక ఎడిషన్ؚను పొందుతుంది, ఇది మార్చి 2022లో మార్కెట్‌లోకి ప్రవేశించింది, రెండవది లావా బ్లూ ఎడిషన్ؚను పొందుతుంది. ఈ కొత్త ప్రత్యేక ఎడిషన్ؚలు ఏం అందిస్తాయి మరియు వాటి ధర ఎలా ఉంటుందో చూద్దాం:

    ధరలు 

    స్లావియా

    వేరియెంట్ 

    స్టైల్

    వార్షిక ఎడిషన్

    తేడా

    1.5-లీటర్ టర్బో-పెట్రోల్ MT

    రూ. 17 లక్షలు

    రూ. 17.28 లక్షలు

    + రూ.28,000

    1.5-లీటర్ టర్బో-పెట్రోల్ DCT

    రూ.18.40 లక్షలు

    రూ. 18.68 లక్షలు

    + రూ. 28,000

    కుషాక్

    వేరియెంట్ 

    స్టైల్

    లావా బ్లూ ఎడిషన్ 

    తేడా

    1.5-లీటర్ టర్బో-పెట్రోల్ MT

    రూ.17.79 లక్షలు

    రూ. 17.99 లక్షలు 

    + రూ. 20,000

    1.5-లీటర్ టర్బో-పెట్రోల్ DCT

    రూ.18.99 లక్షలు

    రూ.19.19 లక్షలు 

    + రూ. 20,000

    అన్నీ ఎక్స్-షోరూమ్ ధరలు

    స్లావియా వార్షిక ఎడిషన్ మరియు కుషాక్ లావా బ్లూ ఎడిషన్ రెండు మోడల్‌లు 1.5-లీటర్ స్టైల్ వేరియెంట్ؚలపై ఆధారపడినవి. కుషాక్ؚ విషయానికి వస్తే, ఈ కొత్త లిమిటెడ్-రన్ ఎడిషన్ ఇప్పటికీ మాంటే కార్లో కంటే కింది స్థానంలో ఉంటుంది. 

    కొత్తగా ఏమి ఉంది?

    Skoda Kushaq Lava Blue Edition

    రెండు ప్రత్యేక ఎడిషన్‌లలో ఉమ్మడిగా ఉన్న ఫీచర్‌ల గురించి తెలుసుకుందాం, ముందుగా కొత్త రంగుతో ప్రారంభిద్దాము. సెడాన్ మరియు SUV రెండూ కొత్త లావా బ్ల్యూ రంగులో వస్తాయి, దీన్ని సూపర్బ్, ఆక్టావియా మరియు కోడియాక్ వంటి తమ తోటి ప్రీమియం వాహనాల నుండి పొందింది. రెండు మోడల్‌లు క్రోమ్ రిబ్స్ؚతో హెక్సాగోనల్ గ్రిల్, ముందు మరియు వెనుక మడ్ ఫ్లాప్స్, డోర్‌లు మరియు ట్రంక్ పైన దిగువ క్రోమ్ గార్నిష్ؚను పొందుతుంది, వీటితో పాటు కుషన్ పిల్లోలు మరియు బ్యాడ్జ్ؚలు కూడా ఉంటాయి. B-పిల్లర్‌పై కుషాక్ బ్యాడ్జ్ పైన ‘ఎడిషన్’ అనే అక్షరాలు ఉన్నాయి, స్లావియాలో C-పిల్లర్‌పై ‘యానివర్సరీ ఎడిషన్’ అనే స్టిక్కర్ ఉంటుంది. 

    Skoda Slavia Anniversary Edition

    స్లావియా యానివర్సరీ ఎడిషన్ మెటల్ ప్లేట్ؚను మరియు స్టీరింగ్ వీల్ క్రింద యానివర్సరీ ఎడిషన్ బ్యాడ్జింగ్ؚను పొందుతుంది. స్లావియా యానివర్సరీ ఎడిషన్, అల్యూమినియం పెడల్స్ؚతో వస్తుంది, సబ్-ఊఫర్‌తో 10-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ మరియు 380-వాట్ సౌండ్ సిస్టమ్ కూడా ఉంటాయి. కుషాక్ లావా బ్లూ ఎడిషన్ؚలో కూడా మెటల్ ప్లేట్ మరియు అన్నీ డోర్‌ల పైన పాడిల్ ల్యాంప్ؚలతో వస్తుంది.

    ఇది కూడా చదవండి: ఆక్టావియా & సూపర్బ్‌లను తిరిగి మార్కెట్‌లోకి తీసుకురానున్న స్కోడా ఇండియా 

    ప్రస్తుతం, రెండు మోడల్‌లు ఎనిమిది-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, క్రూజ్ కంట్రోల్, ఆటోమ్యాటిక్ క్లైమేట్ కంట్రోల్, సింగల్-పేన్ సన్ؚరూఫ్, వెంటిలేటెడ్ ముందరి సీట్‌లు, ఆరు వరకు ఎయిర్ బ్యాగ్‌లు, EBDతో ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC) మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS)వంటి ఉమ్మడి ఫీచర్‌లను తమ టాప్-స్పెక్ స్టైల్ వేరియెంట్ؚలలో ఉన్నాయి. 

    పవర్ؚట్రెయిన్

    Skoda Slavia Engine

    రెండు స్కోడా మోడల్‌ల ప్రత్యేక ఎడిషన్‌లు 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను ఉపయోగిస్తాయి, ఇది 150PS పవర్ మరియు 250Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ యూనిట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ లేదా 7-స్పీడ్ DCTతో జోడించబడుతుంది. 

    ఇది కూడా చదవండి: భారతదేశంలో సురక్షితమైన కార్‌లుగా టైగూన్ మరియు కుషాక్‌లను అధిగమించిన వోక్స్వాగన్ విర్టస్ మరియు స్కోడా స్లావియా 

    ఈ మోడల్‌ల బేస్-స్పెక్ వేరియెంట్‌లు కూడా 1.0-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో వస్తాయి, ఇవి 115PS పవర్ మరియు 178Nm టార్క్‌ను అందిస్తుంది. ఈ యూనిట్ 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ؚతో జోడించబడతాయి. 

    పోటీదారులు

    Skoda Slavia & Kushaq

    రూ.11.39 లక్షల నుండి రూ.18.45 లక్షల (ఎక్స్-షోరూమ్) ధరతో వస్తున్న స్కోడా స్లావియా వోక్స్వాగన్ విర్టస్, హోండా సిటీ, హ్యుందాయ్ వెర్నా వంటి వాటితో పోటీ పడుతుండగా. రూ.11.59 లక్షల నుండి రూ.18.99 లక్షల (ఎక్స్-షోరూమ్) ధర పరిధిలో ఉన్న కుషాక్ వోక్స్వాగన్ టైగూన్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా హైరైడర్ మరియు మారుతి గ్రాండ్ విటారా వంటి వాటితో పోటీ పడుతుంది. 

    ఇక్కడ మరింత చదవండి: కుషాక్ ఆన్ؚరోడ్ ధర

    was this article helpful ?

    Write your Comment on Skoda కుషాక్

    explore similar కార్లు

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience