Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

డీలర్‌షిప్‌ల వద్దకు చేరుకున్న Skoda Kushaq ఎలిగెన్స్ ఎడిషన్

స్కోడా కుషాక్ కోసం shreyash ద్వారా నవంబర్ 30, 2023 06:25 pm ప్రచురించబడింది

ఈ కాంపాక్ట్ SUV కారు ఎలిగెన్స్ ఎడిషన్ ధర సాధారణ వేరియంట్ కంటే రూ.20,000 ఎక్కువ.

  • స్కోడా కొడియాక్ యొక్క ఎలిగెన్స్ ఎడిషన్ టాప్ స్టైల్ వేరియంట్ ఆధారంగా రూపొందించబడింది.

  • ఇందులోని 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ 150 PS శక్తిని మరియు 250 Nm టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది.

  • ఈ కాంపాక్ట్ SUV కారు స్పెషల్ ఎడిషన్ మోడల్ లో డీప్ బ్లాక్ ఎక్ట్సీరియర్ షేడ్ లభిస్తుంది.

  • ఎలిగెన్స్ ఎడిషన్ కొనుగోలు చేయడానికి వినియోగదారులు సాధారణ మోడల్ కంటే రూ. 20,000 ఎక్కువ ఖర్చు చేయాల్సి ఉంటుంది.

స్కోడా కుషాక్ మరియు స్లావియా యొక్క కొత్త ఎలిగెన్స్ ఎడిషన్ భారతదేశంలో విడుదల అయింది. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ ను డీప్ బ్లాక్ ఎక్ట్సీరియర్ కలర్ షేడ్ తో పాటు ఎక్స్ టీరియర్ మరియు ఇంటీరియర్ లో అనేక మార్పులతో పరిచయం చేశారు. కుషాక్ ఎలిగెన్స్ ఎడిషన్ ఇప్పుడు డీలర్‌షిప్‌లకు రావడం ప్రారంభించింది. ఈ కాంపాక్ట్ SUV కారు ఎలిగెన్స్ ఎడిషన్ ప్రత్యేకత ఏమిటో ఇక్కడ చూడండి:

ఎక్ట్సీరియర్ ఇంటీరియర్ నవీకరణలు

కుషాక్ ఎలిగెన్స్ ఎడిషన్ లో డీప్ బ్లాక్ ఎక్స్టీరియర్ కలర్ ఎంపికతో పాటు ఫ్రంట్ గ్రిల్ లో క్రోమ్ ట్రీట్ మెంట్ మరియు బాడీ సైడ్ మోల్డింగ్, బి-పిల్లర్ పై 'ఎలిగెన్స్' బ్యాడ్జింగ్ మరియు 17-అంగుళాల డ్యూయల్-టోన్ అల్లాయ్ వీల్స్ ఉన్నాయి. ఇంటీరియర్ లో సీట్ బెల్ట్ కవర్లు, నెక్ రెస్ట్, కుషన్స్, స్టీరింగ్ వీల్ పై 'ఎలిగెన్స్' బ్యాడ్జింగ్ ఉన్నాయి. ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ లో 'స్కోడా' ఇల్యూమినేషన్ మరియు అల్యూమినియం ఫినిష్డ్ పెడల్స్ తో పాటు ప్యాడిల్ ల్యాంప్స్ కూడా ఉన్నాయి.

ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఈ స్పెషల్ ఎడిషన్ మోడల్ లో చేర్చబడిన ఈ యాక్ససరీ కిట్ ను డీలర్‌షిప్‌ ద్వారా డెలివరీ సమయంలో మీ వాహనంలో ఇన్ స్టాల్ చేయబడుతుంది.

ఇది కూడా చూడండి: సంవత్సరం చివరలో కొత్త కారు కొనడం వల్ల కలిగే లాభాలు మరియు నష్టాలు

ఇందులో ఏం ఫీచర్లు ఉండనున్నాయి?

స్కోడా కొడియాక్ SUV యొక్క ఎలిగెన్స్ ఎడిషన్ దాని టాప్-స్పెక్ స్టైల్ వేరియంట్ పై ఆధారపడినందున, ఇది వైర్ లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లేతో కూడిన 10-అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, 8-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే, వెంటిలేటెడ్ మరియు పవర్డ్ ఫ్రంట్ సీట్లు మరియు ఇల్యూమినేషనేటెడ్ ఫుట్ వెల్స్ వంటి ఫీచర్లను పొందుతుంది. ఆరు ఎయిర్ బ్యాగులు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టం (TPMS) వంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: టెస్టింగ్ సమయంలో మళ్ళీ కనిపించిన ఉత్పత్తికి సిద్ధంగా ఉన్న 5 డోర్ మహీంద్రా థార్

పవర్ ట్రైన్స్

ఎలిగెన్స్ ఎడిషన్ 1.5-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (150 PS / 250Nm) కు మాత్రమే పరిమితం చేయబడింది, ఇది 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్ లేదా 7-స్పీడ్ డ్యూయల్ క్లచ్ ట్రాన్స్మిషన్ (DCT) తో జతచేయబడింది. SUV రెగ్యులర్ వేరియంట్లలో 1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ (115 PS / 178 Nm) 6-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్ మిషన్ లేదా 6-స్పీడ్ టార్క్ కన్వర్టర్ తో జతచేయబడి ఉంటుంది.

ధర ప్రత్యర్థులు

స్కోడా కొడియాక్ ఎలిగెన్స్ ఎడిషన్ ధర సాధారణ వేరియంట్ల కంటే రూ. 20,000 ఎక్కువ. ఈ కాంపాక్ట్ SUV కారు ఎలిగెన్స్ ఎడిషన్ ధర రూ. 18.31 లక్షల నుండి ప్రారంభమై రూ. 19.51 లక్షల వరకు (ఎక్స్-షోరూమ్ పాన్ ఇండియా) ఉంటుంది. ఈ సెగ్మెంట్లో వోక్స్వాగన్ టైగూన్, హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, MG ఆస్టర్, హోండా ఎలివేట్, సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్ లతో పోటీపడుతోంది.

మరింత చదవండి : స్కోడా కుషాక్ ఆన్ రోడ్ ధర

s
ద్వారా ప్రచురించబడినది

shreyash

  • 42 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన స్కోడా కుషాక్

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర