• English
  • Login / Register

మిస్టర్ బీన్స్ 25 సంవత్సరాల సెలబ్రేషన్ లో భాగంగా ఒక మినీ కారుతో వీధుల్లో ప్రయాణించిన రోవాన్ అట్కిన్సన్ [వీడియో]

మినీ కూపర్ క్లబ్మ్యాన్ కోసం manish ద్వారా సెప్టెంబర్ 07, 2015 02:52 pm ప్రచురించబడింది

  • 19 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

రోవాన్ అట్కిన్సన్ తన ప్రపంచ ప్రసిద్ద్ధ 90 సిట్కాం నుండి ఐకానిక్ దృశ్యాన్ని తిరిగి సృష్టించారు. మిస్టర్ బీన్ అప్పటి దృశ్యంలో ఉపయోగించిన కుర్చీ లాంటీ ఒక కొత్త కుర్చీతో అసాధారణ ఆవిష్కరణతో మినీ కారు సహాయంతో ప్రయాణించారు. ఆ 60 సంవత్సరాల మనిషి హాస్య సన్నివేశాలతో మన కడుపు చెక్కలయ్యేలా చేశాడు. ఈ షో భారతదేశపు టి.వి తెరపై ప్రసారం అయ్యి విజయం సాధించింది. ఇప్పుడు, 25 సంవత్సరాల తరువాత బ్రిటీష్ నటుడు లండన్ వీధుల్లో మరియు బకింగ్హామ్ ప్యాలెస్ చుట్టూ తన నిమ్మ ఆకుపచ్చ బ్రిటిష్ లేలాండ్ మినీ 1000 తో తిరుగుతున్నారు. ఈ ఈవెంట్ శుక్రవారం జరుపుకున్నారు. రోవాన్ అసలు సన్నివేశం స్మృతిగా కారు పైభాగంలో కట్టివేయబడి కనిపించారు.

ఈ నటుడు మిస్టర్ బీం దుస్తులలో పెయింట్ డబ్బాలు మరియు ఒక తుడుపు కర్ర తో పెడల్ ని నియంత్రించి ప్రయాణించారు. నటుడు తన ప్రేమపూరితమైన తన టెడ్డీ బొమ్మతో ఉన్నారు.

ఈ వేడుక ఒక కేక్ కట్టింగ్ తో మరియు తన అభిమానుల పలకరింపుతో జరిగింది. ఈ కారు #మిస్టర్ బీన్ 25 అనే ట్విట్టర్ కీవర్డ్లు తో ఈవెంట్ కి మరింత ప్రయోజనం చేకూర్చింది. మొదటి మిస్టర్ బీన్ చిత్రం చక్కని వాణిజ్యాత్మకాన్ని కలిగి ఉంది. కానీ దానికి హాలీవుడ్ సూత్రాలు అమలు చేయడం మూలంగా పాడయ్యింది . "మిస్టర్ బీన్ హాలిడే " ప్రియమైన పాత్రతో మళ్ళీ తన దారిలోకి వచ్చింది మరియు తన పాత్రతో చాలా బాగా రక్తి కట్టేలా చేసింది. ఈ విజయం అంతా కూడా రోవాన్ యొక్క సృజనాత్మకత ఫలితంగా వచ్చింది. కానీ దశాబ్ద కాలం విరామం రావడంతో వారి అభిమానులు భరించలేకపోతున్నారు. కాబట్టి, అంత విరామం రాకుండా మరిన్ని కొత్త ప్రాంభాలను మాకు అందిస్తారని ఆశిస్తున్నాము.

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Mini కూపర్ క్లబ్మ్యాన్

Read Full News

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience