భారతదేశం లో న్యూ 2015 కంట్రీమెన్ ను రూ. 36.5 లక్షల వద్ద ప్రారంభించిన మినీ

మినీ కూపర్ కంట్రీమ్యాన్ 2018-2021 కోసం nabeel ద్వారా ఆగష్టు 06, 2015 11:52 am ప్రచురించబడింది

  • 21 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

జైపూర్: 2014 లో న్యూయార్క్ ఆటో షో వద్ద కారు ఆవిష్కరణ తరువాత, చివరకు భారతదేశం లో బిఎండబ్ల్యూ, న్యూ మిని కంట్రీమెన్ ఫేస్లిఫ్ట్ ను రూ. 36.5 లక్షల వద్ద ప్రారంభించింది. ఈ సంస్థ తయారీదారుడు కారు యొక్క బాహ్య బాగాలపై ఎక్కువగా దృష్టి సారించాడు. అంతేకాకుండా, ఈ వాహనం చిన్న చిన్న కాస్మెటిక్ మార్పులను పొందింది. ఈ 2015 కంట్రీమెన్, కొత్త ఫ్రంట్ గ్రిల్ ను కలిగి ఉంది. అంతేకాకుండా, ఈ వాహనం కొత్త అల్లాయ్ వీల్స్ మరియు ఎలీడి డే టైం రన్నింగ్ మరియు ఫాగ్ లైట్లను కూడా కలిగి ఉంది. ఈ కాంపాక్ట్ క్రాస్ఓవర్, ఇప్పుడు మూడు కొత్త బాడీ కలర్స్ తో అందుబాటులో ఉంది. ఆ కలర్స్ వరుసగా జంగిల్ గ్రీన్ మెటాలిక్, స్టార్లైట్ బ్లూ మెటాలిక్ మరియు మిడ్నైట్ గ్రే మెటాలిక్. ఏప్రిల్ 2013 నుండి భారతదేశంలో అసెంబుల్ అయిన తర్వాత, ఈ కారు కంప్లీట్లీ బిల్ట్ యూనిట్ (సిబియు) రూట్ ద్వారా వస్తాయి.

ఈ వాహనం లో ఉండే కొత్త సమాచార వ్యవస్థ మరియు కొత్త బ్లాక్ డయల్స్ లను మినహాయించి మిగిలిన అంతర్గత భాగాలు ఏ మార్పులను చోటు చేసుకోలేదు. స్విచ్లు మరియు వెంట్ల లో కూడా ఏ మార్పులు జరగలేదు. క్రోం చేరికల విషయం లో కూడా ఏ మార్పులు జరుగలేదు. హుడ్ క్రింది విషయానికి వస్తే, ఈ కొత్త మిని, 2.0 లీటర్ ఫోర్ సిలండర్ టర్బోచార్జెడ్ డీజిల్ ఇంజన్ తో అందుబాటులో ఉంది. ఈ ఇంజన్ అత్యధికంగా, 112 బి హెచ్ పి పవర్ ను విడుదల చేస్తుంది. అదే విధంగా, 270 ఎన్ ఎం గల పీక్ టార్క్ ను కూడా విడుదల చేసే సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది. ఈ ఇంజన్, 6-స్పీడ్ స్టెప్ట్రోనిక్ ట్రాన్స్మిషన్ తో జత చేయబడి ఉంటుంది. త్వరణం విషయానికి వస్తే, ఈ వాహనం 0 నుండి 100 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరడానికి 11.3 సెకన్ల సమయం పడుతుంది. మరోవైపు, ఈ వాహనం 185 కె ఎం పి హెచ్ వేగాన్ని చేరుకోగల సామర్ధ్యాన్ని కలిగి ఉంటుంది.

భారతదేశంలో బిఎండబ్ల్యూ, మినీ కూపర్ డి 5 డోర్, మినీ కూపర్ డి 5 డోర్, మినీ కూపర్ ఎస్ 3 డోర్, మినీ కూపర్ కన్వర్టబుల్ మరియు కొత్త 2015 మిని కూపర్ డి కంట్రీమెన్ వంటి వాహనాలని ఆటోమొబైల్ మార్కెట్ కు అందిస్తుంది. ఈ మిని అనేక ధర పరిది కలిగిన వాహనాలను కలిగి ఉంది. అవి ఏమిటంటే, మిని కూపర్ డి (3 డోర్) యొక్క ధర రూ. 28.5 లక్షలు నుండి కంట్రీమెన్ యొక్క ధర రూ. 36.5 లక్షలు వరకు మిని కలిగి ఉంది. 

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మినీ కూపర్ Countryman 2018-2021

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience