టొక్యో లో బహిర్గతానికి ముందే విడుదలయిన 2016 మినీ కూపర్ కన్వర్టిబుల్
మినీ కూపర్ కన్వర్టిబుల్ కోసం nabeel ద్వారా అక్టోబర్ 26, 2015 04:58 pm సవరించబడింది
- 21 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జైపూర్:
మినీ దాని రాబోయే సరికొత్త డ్రాప్-టాప్ ని టోక్యో మోటార్ షో లో బహిర్గతం చెసేందుకు సిద్ధంగా ఉంది. ఉత్సాహం పెంచడానికి, వారు వాహన ప్రారంభానికి ముందు ఆ కన్విర్టబుల్ యొక్క చిత్రాలను విడుదల చేశారు. ఈ మినీ యు.కె లో మార్చి 2016 నుండి అమ్మకానికి వెళ్ళనుంది మరియు ఆ సంవత్సరంలో భారతదేశంలోనికి వస్తుందని భావిస్తున్నారు. ఇది ముందు మోడల్ నుండి అభివృద్ధి చేయబడిన పూర్తి ఎలక్ట్రిక్ రూఫ్ ని కలిగి ఉంటుంది మరియు ఒకేఒక్క రోల్ బార్ తో ఒక ఆధునిక రోలోవర్ రక్షణ వ్యవస్థను కలిగి ఉంటుంది. వీటికి సెన్సార్లు అమర్చబడి ప్రయాణికులను సురక్షితంగా ఉంచుతుంది.
ఈ "మినీ" శక్తివంతమైన 1.5-లీటర్ డీజిల్ లేదా 1.5 / 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ తో అమర్చబడి ఉంటుంది. ఈ ఇంజిన్లు ఆటో మరియు మాన్యువల్ ఎంపికలు రెండింటినీ కలిగియున్న ఒక 6-స్పీడ్ ట్రాన్స్మిషన్ వ్యవస్థ తో జత చేయబడి ఉంటుంది. అలానే ఆటోమెటిక్ వేరియంట్ స్టీరింగ్ వీల్ పైన షిఫ్ట్ పెడల్స్ తో అందించబడతాయి. డైనమిక్ స్టెబిలిటీ కంట్రోల్ మరియు ట్రాక్షన్ కంట్రోల్ తో ఎలక్ట్రానిక్ డిఫరెన్షియల్ లాక్ అన్ని మోడల్స్ లో ప్రామాణికంగా అందించబడుతున్నది.
ఈ వాహనం 98mm పొడవు, 44mm వెడల్పు మరియు హార్డ్ టాప్ కంటే 7mm అధికంగా ఉంటుంది. కొత్త యుకె ఎల్ ప్లాట్ఫార్మ్ 28mm కారు యొక్క వీల్బేస్ ని పెంచుతుంది మరియు ముందరి ట్రాక్ 42mm కి మరియు వెనుక ట్రాక్ 34mm కి పెంచుతుంది. శరీర దృఢత్వం ఇతర చర్యలు తో ఈ వాహనం 3 డోర్ వాహనం కంటే 115 కిలోలు అధికంగా ఉంటుంది. ఈ సాఫ్ట్ టాప్ 30Kmph వేగాన్ని 18 సెకెన్లలో చేరుకోగలుగుతుంది. అదే విధంగా కారు బ్లూటూత్ కనెక్టివిటీ తో మరియు ఒక యుఎస్బి ఆడియో కనెక్షన్ తో 6.5 అంగుళాల సమాచార స్క్రీన్ ని కలిగి ఉంటుంది. పార్కింగ్ సహాయత కొరకు వెనుక పార్కింగ్ డిస్టెన్స్ కంట్రోల్ మరియు రివర్స్ కెమెరా అందుబాటులో ఉంటుంది.