• English
  • Login / Register

2024 లైనప్‌లో కారులను నవీకరించిన Renault: కొత్త ఫీచర్లతో పాటు ధరల తగ్గింపు కూడా పొందండి!

రెనాల్ట్ క్విడ్ కోసం rohit ద్వారా జనవరి 11, 2024 12:06 pm సవరించబడింది

  • 859 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

క్విడ్ మరియు ట్రైబర్‌లలో కొత్త స్క్రీన్లను అందించనున్నారు మరియు కిగర్ క్యాబిన్ ను మరింత ప్రీమియం చేయడానికి కొన్ని నవీకరణలు చేయనున్నారు.

Renault Kwid, Triber and Kiger get MY24 updates

  • ఇప్పుడు ఆటోమేటిక్ గేర్ బాక్స్, ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఫీచర్లను అందించే సరసమైన ఎంపికగా క్విడ్ వేరియంట్ రానుంది.

  • ట్రైబర్ లో వైర్ లెస్ ఫోన్ ఛార్జింగ్, డిజిటల్ డ్రైవర్ డిస్ ప్లే వంటి ఫీచర్లు ఉన్నాయి.

  • కిగర్ యొక్క చిన్న వేరియంట్లలో సెమీ-లెథరెట్ సీట్లు, డ్యూయల్-టోన్ క్యాబిన్ థీమ్ మరియు ఆటోమేటిక్ AC వంటి ఫీచర్లు ఉన్నాయి.

  • రెనో క్విడ్ ధర రూ.4.70 లక్షల నుంచి రూ.6.12 లక్షల మధ్య ఉంటుంది.

  • రెనాల్ట్ ట్రైబర్ ను రూ.6 లక్షల నుంచి రూ.8.75 లక్షల మధ్య విక్రయిస్తున్నారు.

  • కిగర్ ధర రూ.6 లక్షల నుంచి రూ.11 లక్షల మధ్య ఉంటుంది.

ప్రతి సంవత్సరంలాగే, చాలా కార్ల తయారీదారు పోటీ మరియు మార్కెట్లో డిమాండ్ ఉండటానికి ఆ సంవత్సరానికి కొన్ని మోడళ్లను లేదా మొత్తం లైనప్ను మోడళ్లకు MY (మోడల్ ఇయర్) నవీకరిణ చేస్తున్నారు. రెనాల్ట్ ఇండియా లైనప్ లోని మూడు మోడళ్లను నవీకరించారు, వాటిలో కొన్ని వేరియంట్ల ధరలను తగ్గించారు.

ఈ ధరలను ఇప్పుడు వివరంగా పరిశీలిద్దాం:

క్విడ్

2024 Renault Kwid

వేరియంట్

పాత ధర

కొత్త ధర

వ్యత్యాసం

RXE

రూ.4.70 లక్షలు

రూ.4.70 లక్షలు

మార్పు లేదు

RXL

రూ.5 లక్షలు

నిలిపివేయబడింది

RXL (O)

రూ.5.21 లక్షలు

రూ.5 లక్షలు

(రూ.21 వేలు)

RXL (O) AMT [కొత్త]

రూ.5.45 లక్షలు

RXT

రూ.5.67 లక్షలు

రూ.5.50 లక్షలు

(రూ.17 వేలు)

RXT AMT

రూ.6.12 లక్షలు

రూ.5.95 లక్షలు

(రూ.17 వేలు)

క్లైంబర్

రూ.5.88 లక్షలు

రూ.5.88 లక్షలు

మార్పు లేదు

క్లైంబర్ AMT

రూ.6.33 లక్షలు

రూ.6.12 లక్షలు

(రూ.21 వేలు)

రెనాల్ట్ క్విడ్ లో చాలా తక్కువ నవీకరణలను చేశారు. వాటిలో రేర్ సీట్ బెల్ట్ రిమైండర్ ఫీచర్ ను కంపెనీ అన్ని వేరియంట్లలో చేర్చారు. ఇది కాకుండా, ఇంతకు ముందు టాప్-లైన్ RXT మరియు క్లైంబర్ వేరియంట్కు పరిమితమైన ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ ఇప్పుడు RXL (O) వేరియంట్ లో కూడా లభించనుంది. ఈ నవీకరణ తరువాత, క్విడ్ మార్కెట్లో అందుబాటులో కార్లలో ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్ పొందిన అత్యంత సరసమైన కార్లలో ఒకటిగా మారింది.

రెనాల్ట్ మిడ్-స్పెక్ వేరియంట్ అయిన RXL (O) లో 5-స్పీడ్ AMT గేర్బాక్స్ ఎంపికను కూడా అందించనున్నారు. ఇది బడ్జెట్లో ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్ ఎంపికను కోరుకునేవారికి మంచి ఎంపిక.

ట్రైబర్

2024 Renault Triber

వేరియంట్

పాత ధర

కొత్త ధర

వ్యత్యాసం

RXE

రూ.6.34 లక్షలు

రూ.6 లక్షలు

(రూ.34 వేలు)

RXL

రూ.7.05 లక్షలు

రూ.6.80 లక్షలు

(రూ.25,000)

RXT

రూ.7.61 లక్షలు

రూ.7.61 లక్షలు

మార్పు లేదు

RXT AMT

రూ.8.13 లక్షలు

రూ.8.13 లక్షలు

మార్పు లేదు

RXZ

రూ.8.23 లక్షలు

రూ.8.23 లక్షలు

మార్పు లేదు

RXZ AMT

రూ.8.75 లక్షలు

రూ.8.75 లక్షలు

మార్పు లేదు

రెనాల్ట్ ట్రైబర్ ఇప్పుడు కొత్త స్టెల్త్ బ్లాక్ కలర్ లో కూడా లభిస్తుంది. అంతే కాదు, రెనాల్ట్ వేరియంట్లలో కొన్ని కొత్త ఫీచర్లను జోడించారు, అవేంటో ఇప్పుడు తెలుసుకోండి:

  • RXE- టిల్ట్-అడ్జస్టబుల్ స్టీరింగ్ వీల్ మరియు మాన్యువల్ అడ్జస్టబుల్ ORVMలు

  • RXL- రేర్ AC వెంట్లు

  • RXT- రివర్సింగ్ కెమెరా, రేర్ వైపర్లు, 12V పవర్ సాకెట్ మరియు PM2.5 ఎయిర్ ఫిల్టర్

  • RXZ- 7 అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే, వైర్లెస్ ఫోన్ ఛార్జింగ్, డ్రైవర్-సీట్ ఆర్మ్రెస్ట్, ఎలక్ట్రానిక్గా సర్దుబాటు చేయగల ORVMలు మరియు PM2.5 ఎయిర్ ఫిల్టర్

ఇది కాకుండా, ఈ సబ్-4 మీటర్ల క్రాసోవర్ MPV కారు యొక్క అన్ని వేరియంట్లలో ఇప్పుడు రేర్ సీటు బెల్ట్ రిమైండర్ మరియు LED క్యాబిన్ ల్యాంప్లు కూడా లభిస్తాయి.

ఇది కూడా చూడండి: డిసెంబర్ 2023 లో అత్యధికంగా అమ్ముడైన టాప్ 15 కార్లపై ఓ లుక్కేయండి

కిగర్

2024 Renault Kiger

వేరియంట్

పాత ధర

కొత్త ధర

వ్యత్యాసం

RXE

రూ.6.50 లక్షలు

రూ.6 లక్షలు

(రూ.50 వేలు)

RXL (కొత్త)

రూ.6.60 లక్షలు

RXL AMT (కొత్త)

రూ.7.10 లక్షలు

RXT

రూ.7.92 లక్షలు

రూ.7.50 లక్షలు

(రూ.42 వేలు)

RXT (O)

రూ.8.25 లక్షలు

రూ.8 లక్షలు

(రూ.25 వేలు)

RXT AMT

రూ.8.47 లక్షలు

రూ.8 లక్షలు

(రూ.47 వేలు)

RXT AMT (O)

రూ.8.80 లక్షలు

రూ.8.50 లక్షలు

(రూ.30 వేలు)

RXZ

రూ.8.80 లక్షలు

రూ.8.80 లక్షలు

మార్పు లేదు

RXZ AMT

రూ.9.35 లక్షలు

రూ.9.30 లక్షలు

(రూ.5 వేలు)

RXT (O) టర్బో [కొత్త]

రూ.9.30 లక్షలు

RXT (O) టర్బో AMT [కొత్త]

రూ.10.30 లక్షలు

ఈ మూడు మోడళ్లలో రెనాల్ట్ కిగర్ SUV అత్యధిక నవీకరణలను పొందింది. ఫ్రెష్ లుక్ కోసం రెడ్ బ్రేక్ కాలిపర్స్, బ్లాక్ మరియు రెడ్ అప్ హోల్ స్టరీ లభిస్తుంది. రెనాల్ట్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్ మోడల్ కు కొత్త మిడ్-స్పెక్ ఆర్ఎక్స్ఎల్ వేరియంట్ను జోడించారు. టర్బో-పెట్రోల్ మోడల్లో RXT (O) వేరియంట్ ఉంది, ఇవి రెండూ మాన్యువల్ మరియు ఆటోమేటిక్ ట్రాన్స్మిషన్లతో అందించబడ్డాయి. అంతే కాదు, రెనాల్ట్ కిగర్ కొన్ని కొత్త ఫీచర్లతో కూడా వస్తుంది: 

  • RXT (O) - ఆటో AC, ఎలక్ట్రికల్ ఫోల్డబుల్ ORVMలు, సెమీ లెథరెట్ అప్ హోల్ స్టరీ

  • RXZ - ఆటోమేటిక్ ఫోల్డబుల్ ORVMలు, ఆటో-డిమ్మింగ్ IRVMలు, సెమీ-లెథరెట్ అప్ హోల్ స్టరీ, లెథరెట్ స్టీరింగ్ వీల్ కవర్లు, క్రూయిజ్ కంట్రోల్ (న్యాచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ తో), మరియు రెడ్ బ్రేక్ కాలిపర్స్ (టర్బో వేరియంట్లలో మాత్రమే)

ఈ ఫీచర్లతో పాటు, రేర్ సీట్ బెల్ట్ రిమైండర్ మరియు LED క్యాబిన్ ల్యాంప్స్ అన్ని వేరియంట్లలో ప్రామాణికం చేయబడ్డాయి.

రెనాల్ట్ యొక్క ఇండియన్ లైనప్ కు ఈ నవీకరణల గురించి మీ అభిప్రాయం ఏమిటి మరియు ఈ మోడళ్లలో దేనిని మీరు కొనుగోలు చేయాలనుకుంటున్నారు? కామెంట్ బాక్స్ లో తెలియజేయండి.

మరింత చదవండి : క్విడ్ AMT

was this article helpful ?

Write your Comment on Renault క్విడ్

explore similar కార్లు

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience