• English
  • Login / Register

రెనాల్ట్ క్విడ్ వేరియంట్స్ వివరించబడ్డాయి: ఏది ఎంచుకోవాలి?

రెనాల్ట్ క్విడ్ కోసం dhruv attri ద్వారా అక్టోబర్ 21, 2019 12:07 pm ప్రచురించబడింది

  • 31 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

రెనాల్ట్ క్విడ్ యొక్క ఐదు వేరియంట్లలో ఏది మీకు సూట్ అవుతుంది?

రెనాల్ట్  క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ ను రూ .2.83 లక్షల నుంచి రూ .4.85 లక్షల (ఎక్స్‌షోరూమ్, ఢిల్లీ) మధ్య విడుదల చేసింది. ఫ్రెంచ్ కార్ల తయారీదారు క్విడ్‌లో రెండు ఇంజన్ ఎంపికలను అందిస్తుంది: 0.8-లీటర్ మరియు 1.0-లీటర్, రెండూ 3-సిలిండర్ పెట్రోల్ యూనిట్లు. ఈ రెండూ 5-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో పాటు 5-స్పీడ్ AMT ఎంపిక 1.0-లీటర్ యూనిట్‌లో మాత్రమే ఉంటుంది. ఇది STD, RXE, RXL ,RXT మరియు క్లైంబర్ అనే ఐదు వేరియంట్లలో లభిస్తుంది. ఏ వేరియంట్ మీ అవసరాలకు మరియు బడ్జెట్‌కు బాగా సరిపోతుంది? పూర్తిగా చదవండి.

 

రెనాల్ట్ క్విడ్

ఇంజిన్

0.8-లీటర్, 3-సిలెండర్ పెట్రోల్; 1.0-లీటర్, 3-సిలెండర్ పెట్రోల్

ట్రాన్స్మిషన్

5MT; 5MT/5AMT

పవర్

54PS; 68PS

టార్క్ 

72Nm; 91Nm

ఎమిషన్ టైప్

BS4

రంగు ఎంపికలు

  •  జాన్స్కర్ బ్లూ (క్రొత్తది)
  •  ఫైరీ రెడ్
  •  ఐస్ కూల్ వైట్
  •  మూన్లైట్ సిల్వర్
  •  అవుట్‌బ్యాక్ బ్రాంజ్
  •  ఎలక్ట్రిక్ బ్లూ

Renault Kwid: Old vs New

ధరలు

క్విడ్

ధరలు (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

STD 0.8

రూ. 2.83 లక్షలు

RXE 0.8

రూ. 3.53 లక్షలు

RXL 0.8

రూ. 3.83 లక్షలు

RXT 0.8

రూ. 4.13 లక్షలు

RXT 1.0

రూ. 4.33 లక్షలు (రూ. 4.41 లక్షలు)

RXT 1.0 AMT

రూ. 4.63 లక్షలు (రూ. 4.71 లక్షలు)

క్లైంబర్ MT

రూ. 4.55 లక్షలు (రూ. 4.62 లక్షలు)

క్లైంబర్ AMT

రూ. 4.85 లక్షలు (రూ. 4.92 లక్షలు)

STD: బాగుంటుంది,కానీ బయటి నుండి మాత్రమే

 

ధరలు

STD

రూ. 2.83 లక్షలు

వెలుపలి భాగం:

బాడీ-కలర్ బంపర్స్, LED DRL లతో డ్యూయల్ బారెల్ హెడ్‌ల్యాంప్స్, LED ఎలిమెంట్స్‌తో టెయిల్ లాంప్స్, వీల్ ఆర్చ్ క్లాడింగ్, రూఫ్-ఇంటిగ్రేటెడ్ స్పాయిలర్ మరియు 14 ఇంచ్ స్టీల్ వీల్స్ కోసం వీల్ క్యాప్స్ వంటి లక్షణాలను కలిగి ఉంది.

లోపల భాగం:

ఫాబ్రిక్ అప్హోల్స్టరీ మరియు బ్లాక్ సెంటర్ కన్సోల్.

భద్రత: వెనుక పార్కింగ్ సెన్సార్లు, డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్, EBD తో ABS, డ్రైవర్ మరియు కో-డ్రైవర్ సీట్ బెల్ట్ రిమైండర్, స్పీడ్ అలర్ట్ మరియు రియర్ చైల్డ్ లాక్ వంటి భద్రత లక్షణాలను కలిగి ఉంది.

ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్: డిజిటల్ టా కోమీటర్, ట్రిప్ మీటర్ మరియు గేర్ షిఫ్ట్ ఇండికేటర్ (MT వేరియంట్లలో మాత్రమే) ఉన్నాయి.

సౌకర్యం మరియు సౌలభ్యం: డ్రైవర్-సైడ్ సన్ విజర్ మరియు హీటర్ (AC లేదు).

తీర్పు 

ఇది బడ్జెట్ కారుల మాదిరిగా ఉండదు, రెనాల్ట్ క్విడ్ యొక్క బేస్ వేరియంట్ బాడీ-కలర్ బంపర్స్ మరియు LED ఎలిమెంట్లకు కృతజ్ఞతలు తెలుపుకోవాలి , వెలుపల నుండి ఖర్చుతో నిర్మించబడలేదు. ఇది బయట నుండి చూడడానికి చక్కగా కనబడవచ్చు, కానీ ఇంటీరియర్స్ మరియు భద్రతా లక్షణాలు అంత బాగా ఉండవు, ఎందుకంటే ఇది AC మరియు ఫ్రంట్ పవర్ విండోలను కూడా కోల్పోతుంది.

ఈ వేరియంట్‌తో ఉన్న మరో సమస్య మిస్ అయిన ప్యాసింజర్ ఎయిర్‌బ్యాగ్, ఇది ఎంపికగా కూడా అందుబాటులో లేదు. కాబట్టి, మీరు చాలా టైట్ బడ్జెట్‌లో ఉంటే మరియు సాధారణంగా చల్లని ప్రాంతాల్లో ఒంటరిగా ప్రయాణించినట్లయితే మాత్రమే ఈ వేరియంట్ మీకు సరిపోతుంది. మా సలహా కోసం, మీరు కొంచెం ఎక్కువ స్క్రోల్ చేయాలి.

 

RXE: ఇది అందించే లక్షణాలతో పోలిస్తే కొంచెం ఖరీదైనది అని చెప్పవచ్చు

 

ధరలు

RXE

రూ. 3.53 లక్షలు

STD పై ప్రీమియం

రూ. 70,000

బాహ్యభాగం: గ్రాఫిక్స్

సౌకర్యం మరియు సౌలభ్యం: AC, ఫోల్డబుల్ రియర్ సీట్ బ్యాక్‌రెస్ట్, ప్యాసింజర్ సైడ్ సన్ విజర్, 2 ఫ్రంట్ స్పీకర్లు మరియు యాంటెన్నా వంటి లక్షణాలను కలిగి ఉంది.

తీర్పు

క్విడ్ RXE బేస్ వేరియంట్ అయి ఉండాలి, కాని మరింత సరసమైన ధర ట్యాగ్ తో ఉండాలి. ఇది AC మరియు ఫోల్డబుల్ రియర్ సీట్‌తో సహా కొన్ని ఉపయోగపడే సౌకర్యాలను పొందుతుంది, అయితే  రూ. 70,000 ప్రీమియం మునుపటి వేరియంట్‌తో పోలిస్తే అనేది చాలా పెద్ద మొత్తం అని చెప్పవచ్చు. ఇది స్పీకర్లు మరియు యాంటెన్నాలను పొందుతుంది కాని దానితో పాటు వచ్చే ఆడియో సిస్టమ్‌ను యాడ్-ఆన్‌ గా కొనుగోలు చేయాలి. అంతేకాకుండా, ఇది పవర్ స్టీరింగ్‌ను కోల్పోతూనే ఉంది మరియు మరీ ముఖ్యంగా, ప్రయాణీకుల ఎయిర్‌బ్యాగ్ ని కూడా కోల్పోతుంది.  కాబట్టి మా లిస్ట్ లో నుండి దీనిని ఖచ్చితంగా తీసేస్తున్నాము.

RXL: దీనిని కొద్దిగా పరిగణలోనికి తీసుకోవచ్చు, కానీ కొంత మంది కోసం మాత్రమే

 

ధరలు

RXL

రూ. 3.83 లక్ష

RXE పై ప్రీమియం

రూ. 30,000

బాహ్య భాగం: డ్యూయల్-టోన్ ORVM లు మరియు ఫుల్ వీల్ కవర్లు.

ఇంటీరియర్: తెలుపు కుట్టుతో గ్రే ఫాబ్రిక్ అప్హోల్స్టరీ.

సౌలభ్యం: ఫ్రంట్ పవర్ విండోస్, పవర్ స్టీరింగ్.

భద్రత: కీలెస్ ఎంట్రీ మరియు సెంట్రల్ లాకింగ్

ఆడియో: USB, AUX మరియు బ్లూటూత్ కనెక్టివిటీతో సింగిల్-డిన్ ఆడియో యూనిట్.

తీర్పు

ఈ వేరియంట్ RXE కంటే ఆమోదయోగ్యమైన ప్రీమియంలో అవసరమైన ఉపయోగపడే లక్షణాలను తెస్తుంది. ఇది కొన్ని యాజమాన్య లక్షణాలతో పాటు (పవర్ విండోస్ మరియు పవర్ స్టీరింగ్) కొన్ని సౌందర్య మెరుగుదలను పొందుతుంది, ఇవి మీ యాజమాన్య పనితీరులో ఉపయోగపడతాయి. మునుపటి వేరియంట్లో మీకు లభించే రెండు స్పీకర్లు ఇప్పుడు బ్లూటూత్-ప్రారంభించబడిన ఆడియో సిస్టమ్‌తో కలిసి ఉన్నాయి, ఇది ఇప్పటికీ సింగిల్-DIN యూనిట్.

ఇది కొనుగోలు చేసుకోడానికి పర్వాలేదు అనిపిస్తుంది, కాని ఇది ఇప్పటికీ ప్రయాణీకుల ఎయిర్‌బ్యాగ్‌ను కోల్పోతుంది, ఇది కుటుంబాలకు లేదా ముందు కో-ప్యాసింజర్ తో ప్రయాణించే వారికి కూడా సిఫారసు చేయడం కష్టం అవుతుంది.

కాబట్టి, మీరు ఇప్పటికే మీ బడ్జెట్‌ను ఈ వేరియంట్‌ వరకూ తీసుకొని వస్తే గనుక, మీరు తదుపరి RXT (O) వేరియంట్‌ను చూడాలని మేము సూచిస్తాము. ఎందుకంటే ఇది మీ యాజమాన్య అనుభవాన్ని మెరుగుపరచడానికి మరింత శక్తివంతమైన ఇంజిన్‌ను మాత్రమే కాకుండా, భద్రత మరియు సౌలభ్యం లక్షణాలను కూడా అందిస్తుంది.

RXT: మా ఎంపికలో ఉంది, కానీ ఆప్షనల్ ప్యాక్‌తో మాత్రమే

ధరలు

0.8- లీటర్

1.0- లీటర్ (O)

1.0- లీటర్ AMT (O)

ఎక్స్-షోరూం, ఇండియా

రూ. 4.13 లక్షలు

రూ. 4.33 లక్షలు (రూ. 4.41 లక్షలు)

రూ. 4.63 లక్షలు (రూ. 4.71 లక్షలు)

RXL పై ప్రీమియం

రూ. 30,000

రూ. 20,000 (+రూ. 8,000)

రూ. 80,000 (+రూ. 8,000)

బయట భాగం: 

గ్రిల్‌ లో క్రోమ్ ఇన్సర్ట్‌లు, విభిన్న షేడ్ లో డ్యూయల్-టోన్ ORVM లు, డార్క్ మెటల్ కలర్ వీల్ కవర్లు మరియు బ్లాక్ బి-పిల్లర్ వంటి లక్షణాలు ఉన్నాయి.

ఇంటీరియర్:

అప్హోల్స్టరీ, గేర్ నాబ్ లో మరియు లెథర్ తో చుట్టబడిన స్టీరింగ్ వీల్ పై క్రోమ్ ఇన్సర్ట్స్ మరియు రెడ్ స్టిచింగ్, A.C కంట్రోల్స్ కోసం క్రోమ్ గార్నిష్, పార్కింగ్ బ్రేక్ బటన్ మరియు లోపలి డోర్ హ్యాండిల్స్ పై ఎరుపు హైలైట్స్ వంటి లక్షణాలు ఉన్నాయి.

సౌకర్యం మరియు సౌలభ్యం: వెనుక పార్శిల్ ట్రే, 12V రియర్ పవర్ సాకెట్, USB ఛార్జర్ మరియు ఆప్షనల్  వెనుక పవర్ విండోస్.

భద్రత: 

గైడ్‌లైన్స్ తో వెనుక పార్కింగ్ కెమెరా మరియు ఆప్షనల్ కో-డ్రైవర్ సైడ్ ఎయిర్‌బ్యాగ్‌ (1.0-లీటర్ ఇంజిన్‌తో మాత్రమే).

ఆడియో:

ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లే, వాయిస్ రికగ్నిషన్ మరియు USB వీడియో ప్లేబ్యాక్ తో 8-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్.

తీర్పు

RXT వేరియంట్ చాలా మనోహరమైన అప్‌గ్రేడ్ మరియు 0.8-లీటర్ ఇంజిన్‌ను చూసేవారికి ఇది చాలా ఫీచర్-లోడెడ్‌గా ఉంటుంది. ఆప్షనల్ ప్యాకేజీతో 1.0-లీటర్ ఇంజిన్ ఎంపికను మాత్రమే మేము సిఫారసు చేస్తాము, ఎందుకంటే దీనికి కేవలం రూ .28,000 (ప్రయాణీకుల ఎయిర్‌బ్యాగ్‌కు రూ .8,000 అదనపు) ఖర్చవుతుంది, అయితే చిన్న ఇంజిన్ వెర్షన్‌ పై ఎక్కువ శక్తిని మరియు అదనపు ఎయిర్‌బ్యాగ్‌ను తెస్తుంది. మీరు ఖర్చు చేసే అదనపు మొత్తం మీ EMI మొత్తాన్ని ఎక్కువగా ప్రభావితం చేయదు. మీరు రెనాల్ట్ క్విడ్ ఫేస్‌లిఫ్ట్‌ను చూస్తుంటే, మీరు వెళ్ళవలసినది దీనికే.

అంతేకాకుండా, మీరు AMT పై దృష్టి పెడితే, రెండు పెడల్ సౌలభ్యంతో క్విడ్ కొనాలని చూస్తున్న వారికి ఇది ప్రారంభ స్థానం. రెనాల్ట్ తన మాన్యువల్ కౌంటర్ కంటే రూ .30,000 అధనంగా వసూలు చేస్తోంది, అదేవిధంగా AMT వెర్షన్లు తీసుకొనే అధనపు ధరకి ఇది తక్కువ అనే చెప్పాలి.

Renault Kwid: Old vs New

క్లైంబర్: మీకు కొన్ని అదనపు హంగులు కావాలంటే మీరు దీని కోసం వెళ్ళాలి

ధరలు

క్లైంబర్ MT (O)

క్లైంబర్ AMT (O)

ఎక్స్-షోరూం, ఇండియా

రూ. 4.55 లక్షలు (రూ. 4.62 లక్షలు)

రూ. 4.85 లక్షలు (రూ. 4.92 లక్షలు)

RXT పై ప్రీమియం

రూ. 22,000 (+రూ. 7,000)

రూ. 52,000 (+రూ. 7,000)

బాహ్యభాగాలు:

రూఫ్ రెయిల్స్, ఫాక్స్ స్కిడ్ ప్లేట్లు, హెడ్‌ల్యాంప్స్ హౌసింగ్ మరియు బయటి రియర్‌వ్యూ అద్దాల కోసం ఆరెంజ్ ఇన్సర్ట్‌లు. ఫ్రంట్ డోర్స్ పై ‘క్లైంబర్’ చిహ్నం.

ఇంటీరియర్: ఆరెంజ్ మరియు వైట్ ఫాబ్రిక్ అప్హోల్స్టరీ, స్టీరింగ్ వీల్ పై క్లైంబర్ చిహ్నం, స్టీరింగ్ వీల్ పై వైట్ స్టిచింగ్, ఆరెంజ్ మరియు బ్లాక్ ఫ్లోర్ మాట్స్, AMT డయల్ పై ఆరెంజ్ ఫినిష్ మరియు టచ్స్క్రీన్ చుట్టూ ఆరెంజ్.

సౌకర్యాలు: ఆప్షనల్ రేర్ పవర్ విండోస్

తీర్పు: క్లైంబర్ వేరియంట్ క్విడ్ యొక్క ప్యాకేజింగ్ కి కొంత వ్యానిటీని జోడిస్తుంది. అప్డేట్స్ అన్నీ కూడా బయట అయినా గానీ లోపల అయినా గానీ మనకి స్పష్టంగా కనిపిస్తాయి. మీరు రంగు స్ప్లాష్ కావాలనుకుంటే మాత్రమే దీని కోసం వెళ్లండి, ఎందుకంటే క్విడ్ ఆఫర్‌లో ఉన్న మొత్తం ఫీచర్లను RXT పొందుతుంది.

దీనిపై మరింత చదవండి: క్విడ్ AMT

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment on Renault క్విడ్

3 వ్యాఖ్యలు
1
s
srinivasa prabhu
Jan 9, 2021, 9:28:23 PM

Beware of the delivery partners as they are not delivering vehicle after making payment.

Read More...
    సమాధానం
    Write a Reply
    1
    H
    harry domnic santiago
    Nov 19, 2020, 9:23:49 PM

    It's a great car, but pricey for the higher grade KWID..

    Read More...
      సమాధానం
      Write a Reply
      1
      n
      nizam abbasi
      Feb 4, 2020, 4:32:57 PM

      Renault kwid flexi seat amt version

      Read More...
        సమాధానం
        Write a Reply
        Read Full News

        explore మరిన్ని on రెనాల్ట్ క్విడ్

        సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

        *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

        ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

        • లేటెస్ట్
        • రాబోయేవి
        • పాపులర్
        ×
        We need your సిటీ to customize your experience