Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ఏప్రిల్ 2023లో డీజిల్ వేరియెంట్ؚలకు అధిక ప్రాధాన్యతను ఇచ్చిన మహీంద్రా కస్టమర్‌లు

మే 15, 2023 02:54 pm ansh ద్వారా ప్రచురించబడింది
42 Views

నాలుగు SUVలలో పెట్రోల్ ఇంజన్ ఎంపిక ఉన్నపటికి, డీజిల్ ఇంజన్ ప్రధాన ఎంపికగా నిలిచింది

దృఢమైన నిర్మాణం మరియు శక్తివంతమైన SUVలకు పేరుగాంచిన బ్రాండ్ మహీంద్రా, తన అత్యంత ప్రజాదరణ పొందిన మోడల్‌లలో టర్బో-పెట్రోల్ మరియు డీజిల్ ఇంజన్‌ల ఎంపికలు రెండిటినీ అందిస్తుంది. కానీ కస్టమర్‌లు ప్రాధాన్యతనిస్తున్న ఇంజన్ ఏది? ఏప్రిల్ 2023లో ఈ కారు తయారీదారు వాహనాలు థార్, XUC300, స్కార్పియో(లు) మరియు XUV700ల వివరణాత్మక విక్రయ డేటాను చూద్దాం.

థార్

పవర్ؚట్రెయిన్

ఏప్రిల్ 2022

ఏప్రిల్ 2023

డీజిల్

2,294

4,298

పెట్రోల్

858

1,004

ప్రజాదరణ పొందిన మహీంద్రా కార్‌ల గురించి మాట్లాడుతున్నపుడు, ప్రధానంగా మహీంద్రా థార్‌ను ఖచ్చితంగా పేర్కొనాలి. ఈ ఆఫ్-రోడర్ డీజిల్ ప్రత్యామ్నాయాలతో పోలిస్తే, పెట్రోల్ ఆధారిత వేరియెంట్ؚలు ఎక్కువ ప్రజాదరణను పొందలేదు. గత సంవత్సరంతో పోల్చితే, థార్ డీజిల్ వేరియెంట్‌ల డిమాండ్ దాదాపుగా రెట్టింపు అయ్యింది, పెట్రోల్ వేరియెంట్ؚల కంటే ఇది నాలుగు రెట్లు ఎక్కువగా ఉంది. కొత్త 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికతో అత్యంత చవకైన థార్ కొత్త RWD వేరియెంట్ؚలను పరిచయం చేయడం ఈ వృద్ధికి కారణంగా భావించవచ్చు.

పవర్ؚట్రెయిన్

ఏప్రిల్ 2022

ఏప్రిల్ 2023

డీజిల్

72.78%

81.06%

పెట్రోల్

27.22%

18.94%

ఒక సంవత్సరంలో, ఈ లైఫ్‌స్టైల్ SUV పెట్రోల్ వేరియెంట్ؚలు అమ్మకాలలో 8 శాతం వరకు తగ్గుదలను చూడవచ్చు. రెండు పవర్‌ట్రెయిన్ؚల మొత్తం అమ్మకాలు పెరిగినప్పటికీ, ఏప్రిల్ 2023లో 80 శాతం కంటే ఎక్కువ అమ్మకాలతో డీజిల్ వేరియెంట్ؚలు ఆధిక్యాన్ని సాధించాయి.

స్కార్పియో N స్కార్పియో క్లాసిక్

పవర్‌ట్రెయిన్

ఏప్రిల్ 2022

ఏప్రిల్ 2023

డీజిల్

2,712

9,125

పెట్రోల్

0

442

గత సంవత్సరం ఈ సమయంలో, మహీంద్రా మునుపటి-జనరేషన్ స్కార్పియో మాత్రమే మార్కెట్‌లో అమ్మకానికి అందుబాటులో ఉంది, ఇది కేవలం డీజిల్ పవర్‌ట్రెయిన్ؚతో మాత్రమే అందించబడింది. ప్రస్తుతం ఈ SUV రెండు వేరియంట్‌లలో అందించబడుతోంది: స్కార్పియో క్లాసిక్ మరియు స్కార్పియో N. రెండవది టర్బో-పెట్రోల్ ఇంజన్ ఎంపికతో అందించబడుతుంది. అయితే, స్కార్పియో వాహనాలలో ఎక్కువ అమ్మకాలు భారీ సంఖ్యలో డీజిల్ వేరియెంట్ؚల నుంచి వస్తున్నాయి.

ఇది కూడా చదవండి: రాడార్-ఆధారిత ADASతో మరింత సురక్షితం కానున్న మహీంద్రా స్కార్పియో

పవర్ؚట్రెయిన్

ఏప్రిల్ 2022

ఏప్రిల్ 2023

డీజిల్

100%

95.38%

పెట్రోల్

0%

4.62%

గణాంకాలు సూచిస్తున్నట్లు, స్కార్పియో పెట్రోల్ వేరియెంట్ؚలు చాలా తక్కువగా కనిపిస్తాయి. స్కార్పియో క్లాసిక్ మరియు స్కార్పియో N డీజిల్ వేరియెంట్ؚలు ఏప్రిల్ 2023 అమ్మకాలలో 95 శాతం ఉన్నాయి.

XUV700

పవర్ؚట్రెయిన్

ఏప్రిల్ 2022

ఏప్రిల్ 2023

డీజిల్

2,839

3,286

పెట్రోల్

1,655

1,471

XUV700 ఇయర్-ఆన్-ఇయర్ అమ్మకాలు దాదాపుగా 5 శాతం పెరిగాయి. డీజిల్ వేరియెంట్ؚల అమ్మకాలు పెరగడాన్ని మరియు పెట్రోల్ వేరియెంట్ؚల అమ్మకాలు తగ్గడాన్ని గమనించవచ్చు.

పవర్ؚట్రెయిన్

ఏప్రిల్ 2022

ఏప్రిల్ 2023

డీజిల్

63.17%

69.07%

పెట్రోల్

36.83%

30.93%

ఈ SUV పెట్రోల్ వేరియెంట్ؚలు ప్రస్తుతం అమ్మకాలలో కేవలం 30 శాతం వాటాను కలిగి ఉన్నాయి.

XUV300

పవర్ؚట్రెయిన్

ఏప్రిల్ 2022

ఏప్రిల్ 2023

డీజిల్

2,035

2,894

పెట్రోల్

1,874

2,168

ఈ జాబితాలోని అన్నీ మోడల్ؚలతో పోలిస్తే, XUV300 పెట్రోల్ మరియు డీజిల్ వేరియెంట్ؚలకు మరింత ఎక్కువ సమతుల్యమైన డిమాండ్‌ను చూడవచ్చు. అయితే, వీటి మధ్య తేడా ఏప్రిల్ 2022తో పోలిస్తే ఏప్రిల్ 2023 నాటికి స్పష్టంగా పెరిగింది. అమ్మకాలలో డీజిల్ వేరియెంట్ؚల వాటా స్పష్టంగా అధికంగా ఉంది.

పవర్ؚట్రెయిన్

ఏప్రిల్ 2022

ఏప్రిల్ 2023

డీజిల్

52.05%

57.17%

పెట్రోల్

47.95%

42.83%

సబ్ؚకాంపాక్ట్ SUV విభాగంలో, అమ్మకాలలో సగం కంటే ఎక్కువ వాటాను కలిగి ఉండటం కొనసాగించిన డీజిల్ ఎంపికను అందించే కొన్ని SUVలలో XUV300 ఒకటి.

ఇది కూడా చదవండి: త్వరలోనే పునఃప్రవేశం చేయాలని కోరుకుంటున్న 7 ప్రముఖ కార్‌ల పేర్లు

పై అమ్మకాల డాటాను పరిశీలిస్తే, మోడల్ؚతో సంబంధం లేకుండా మహీంద్రా కస్టమర్‌లు డీజిల్ వేరియెంట్ؚకు అధిక ప్రాధాన్యతను ఇస్తున్నారని స్పష్టంగా కనిపిస్తుంది. మీరు ఏ పవర్ؚట్రెయిన్ؚకు ప్రాధాన్యతను ఇస్తారు, మీరు దాన్ని ఎందుకు ఎంచుకుంటున్నారు అనే విషయాలను క్రింద కామెంట్ చేయండి.

ఇక్కడ మరింత చదవండి: థార్ డీజిల్

Share via

explore similar కార్లు

మహీంద్రా ఎక్స్యువి700

4.61.1k సమీక్షలుకారు ని రేట్ చేయండి
Rs.13.99 - 25.74 లక్షలు* ఆన్ రోడ్ ధర పొందండి
పెట్రోల్15 kmpl
డీజిల్1 7 kmpl
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్

మహీంద్రా స్కార్పియో ఎన్

4.5774 సమీక్షలుకారు ని రేట్ చేయండి
Rs.13.99 - 24.89 లక్షలు* ఆన్ రోడ్ ధర పొందండి
పెట్రోల్12.1 7 kmpl
డీజిల్15.42 kmpl
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్

మహీంద్రా థార్

4.51.3k సమీక్షలుకారు ని రేట్ చేయండి
Rs.11.50 - 17.60 లక్షలు* ఆన్ రోడ్ ధర పొందండి
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.10 - 19.52 లక్షలు*
ఎలక్ట్రిక్కొత్త వేరియంట్
Rs.17.49 - 22.24 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.8.32 - 14.10 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర