రాడార్-ఆధారిత ADASతో మరింత సురక్షితం కానున్న మహీంద్రా స్కార్పియో

మహీంద్రా స్కార్పియో ఎన్ కోసం tarun ద్వారా మే 02, 2023 11:36 am ప్రచురించబడింది

  • 33 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

అయితే, ఈ భద్రత సాంకేతికత అందుబాటులోకి రావడానికి కొంత సమయం పడుతుంది

Mahindra Scorpio N

  • ఆస్ట్రేలియాాలో స్కార్పియో N డీజిల్-ఆటోమ్యాటిక్ మోడల్‌ను ఇటీవల పరిచయం చేశారు.

  • ప్రస్తుతం ఇది భద్రత ప్రమాణాలకు అనుగుణంగా ఉన్నప్పటికీ, ఏప్రిల్ 2025 నాటికి ఈ వాహనం స్థానికంగా ADASతో నవీకరించబడాలి.

  • స్కార్పియో N భారతదేశం నుంచి ఆస్ట్రేలియాాకు ఎగుమతి చేయబడుతుంది కాబట్టి, భవిష్యత్తులో మనకు కూడా రాడార్-ఆధారిత సాంకేతికత రావచ్చు.

  • ఈ SUV ADAS స్యూట్ؚలో అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్, లేన్ కీప్ అసిస్ట్, మరియు ఆటోమ్యాటిక్ ఎమర్జెన్సీ బ్రేకింగ్ ఉంటాయి.

మహీంద్రా, ఇటీవల స్కార్పియో Nను ఆస్ట్రేలియాన్ మార్కెట్‌లోకి ప్రవేశపెట్టింది, అక్కడ ఇప్పటికే స్కార్పియో క్లాసిస్-ఆధారిత పికప్ ట్రక్ మార్కెట్‌లో ఉంది. ఈ SUV భారతదేశంలో ఉత్పత్తి చేసి, డీజిల్-ఆటోమ్యాటిక్ రూపంలో ఆస్ట్రేలియాా మార్కెట్ؚకు ఎగుమతి అవుతుంది.

Mahindra Scorpio N

ఆస్ట్రేలియా భద్రతా నిబంధనల ప్రకారం, ప్రతి కారులో లేన్-కీప్ అసిస్ట్, లేన్ డిపార్చర్ వార్నింగ్, బ్లైండ్ స్పాట్ మానిటరింగ్, మరియు రేర్-క్రాస్ ట్రాఫిక్ అలర్ట్ ఉండటం తప్పనిసరి. ఈ నిబంధన ఏప్రిల్ 2023 నుంచి విక్రయానికి ధృవీకరణ పొందే అన్నీ కార్‌లకు అమలు అవుతుంది, కానీ మహీంద్రా మార్చి నెలలోనే స్కార్పియో Nని రిజిస్టర్ చేయడం ద్వారా దీన్ని తప్పించుకుంది. ప్రస్తుతం, ఇది ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, ESP, హిల్ హోల్డ్ అసిస్ట్, మరియు టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ؚలను భద్రతా ఫీచర్‌లను అందిస్తుంది.

ఇది కూడా చదవండి: చూడండి: ఒక టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ రెండు మహీంద్రా స్కార్పియోల కంటే మెరుగా? మా సరికొత్త వీడియోలో కనుగొనండి

ఏప్రిల్ 2025 నుంచి మరింత కఠినంగా మారే ఆస్ట్రేలియాా నిబంధనలను అందుకునేందుకు, మహీంద్రా స్కార్పియో Nలో ADAS (అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్) ఫీచర్‌లను అందించాలి. దీనిపై మాట్లాడుతూ, మహీంద్రా ఆటోమోటివ్ ఇంటర్నేషనల్ ఆపరేషనల్ మేనేజర్ ఇలా అన్నారు, “మాకు దీని గురించి సైకిల్ ప్లాన్ ఉంది, కాబట్టి ఇది సమయానికి జరుగుతుంది.”

దీని ప్రభావం భారతదేశంపై ఎలా ఉంటుంది?

ఈ పరిణామం, మహీంద్రా స్కార్పియో Nలో రాడార్-ఆధారిత భద్రతా ఫీచర్‌లను పొందుపరిచేలా చేస్తుంది. ఈ కారు భారతదేశం నుండి ఎగుమతి అవుతుండడంతో. ఇండియా-స్పెక్ మోడల్ కూడా ADASను పొందే అవకాశం ఎక్కువగా ఉంది.

Mahindra Scorpio N

SUVకి ADASను జోడించడం కష్టమైన పని కాదు, ఎందుకంటే ఈ సాంకేతికత ఇప్పటికే XUV700లో ఉంది. దీని ADAS స్యూట్ؚలో అటానమస్ ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్-కీపింగ్ అసిస్ట్, హై బీమ్ అసిస్ట్, మరియు ఆడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ ఉన్నాయి. స్కార్పియో Nలో కూడా సారూప్య భద్రతా ఫీచర్‌లను ఆశించవచ్చు.

భారతదేశంలో, స్కార్పియో N 2.2-లీటర్‌ల డీజిల్ మరియు 2-లీటర్‌ల టర్బో-పెట్రోల్ ఇంజన్‌ల ఎంపికతో వస్తుంది, ఇది మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ట్రాన్స్ؚమిషన్‌లతో జోడించబడుతుంది. అయితే, ఆస్ట్రేలియాన్-స్పెక్ మోడల్ డీజిల్-ఆటోమ్యాటిక్ కాంబినేషన్ؚను ప్రామాణికంగా పొందుతుంది. ఇండియా-స్పెక్ మోడల్ؚలో రేర్ మరియు నాలుగు-వీల్ డ్రైవ్ ట్రెయిన్ؚలు ఉన్నాయి, కానీ ఆస్ట్రేలియాన్ వెర్షన్ؚలో నాలుగు-వీల్ డ్రైవ్ ట్రెయిన్ ప్రామాణికంగా ఉంటుంది. అలాగే, ఇది కేవలం టాప్-స్పెక్ Z8 మరియు Z8L వేరియెంట్ؚలలో మాత్రమే అందుబాటులో ఉంటుంది, ఇండియాలో అదనంగా Z2, Z4, మరియు Z6 వేరియెంట్ؚలు అందుబాటులో ఉన్నాయి.

ఇది కూడా చదవండి: రూ.15 లక్షల కంటే తక్కువ ధరకు ఔత్సాహికులు కొనుగోలు చేయగలిగిన టాప్ 10 టర్బో-పెట్రోల్ కార్‌ల వివరాలు

ఆస్ట్రేలియాాలో స్కార్పియో N ధర రూ.22.70 లక్షల నుండి రూ.24.31 లక్షల వరకు ఉంది, మన దేశంలో దీని ధర రూ.13.05 లక్షల నుండి రూ.24.52 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది.

మూలం

ఇక్కడ మరింత చదవండి: మహీంద్ర స్కార్పియో N ఆన్ؚరోడ్ ధర

ద్వారా ప్రచురించబడినది
was this article helpful ?

0 out of 0 found this helpful

Write your Comment పైన మహీంద్రా స్కార్పియో n

Read Full News

explore మరిన్ని on మహీంద్రా స్కార్పియో ఎన్

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉందిఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience