Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

2024 లో విడుదల కానున్న New Suzuki Swift గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు

మారుతి స్విఫ్ట్ కోసం ansh ద్వారా అక్టోబర్ 26, 2023 09:32 pm ప్రచురించబడింది

ఈ కాన్సెప్ట్ వెర్షన్ ప్రొడక్షన్ కు చాలా దగ్గరగా ఉంది, ఇది కొత్త మారుతి స్విఫ్ట్ అందించే ఫీచర్లు అలాగే మరిన్ని వివరాలకు సంభందించి గ్లింప్స్ ఇస్తుంది.

  • 2023 స్విఫ్ట్ కాన్స్ట్ ను జపాన్ మొబిలిటీ షోలో ప్రదర్శించారు.

  • దీని ముందు భాగంలో కొత్త డిజైన్ తో పాటు కొత్త అల్లాయ్ వీల్స్ ను కూడా అందించారు.

  • దీని క్యాబిన్ బాలెనో, ఫ్రాంక్స్ మరియు గ్రాండ్ విటారా మోడెళ్లను పోలి ఉంటుంది.

  • మునుపటిలాగే ఇండియా-స్పెక్ వెర్షన్ కు 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ అందించవచ్చు.

  • ఈ కారును వచ్చే ఏడాది భారత్ లో ప్రవేశపెట్టే అవకాశం ఉంది.

భారతదేశంలో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లలో మారుతి స్విఫ్ట్ ఒకటి. ఇది మార్కెట్లోకి వచ్చి చాలా కాలమైంది, త్వరలో కంపెనీ తన కొత్త మోడల్ను విడుదల చేయనుంది. జపాన్ మొబిలిటీ షో 2023లో సుజుకి నాల్గవ తరం స్విఫ్ట్ కాన్సెప్ట్ మోడల్ ను ఆవిష్కరించింది. కొత్త స్విఫ్ట్ లో ప్రత్యేకత ఏమిటి, మరింత తెలుసుకోండి:

కొత్త డిజైన్

స్విఫ్ట్ కారు యొక్క మొత్తం డిజైన్ మరియు బాడీ షేప్ మునుపటి మాదిరిగానే ఉంటుంది. అయితే, ఈ కారు మునుపటి కంటే ఇప్పుడు మరింత ఆధునికంగా మరియు శక్తివంతంగా కనిపిస్తుంది. ముందు భాగంలో హనీకోంబ్ ప్యాట్రన్, స్లీక్ LED హెడ్ ల్యాంప్స్, DRLలతో కూడిన కొత్త రౌండ్ గ్రిల్ లభిస్తుంది.

ఇది కూడా చదవండి: ఎగుమతి కానున్న మేడ్ ఇన్ ఇండియా మారుతి జిమ్నీ5 డోర్స్

సైడ్ నుండి చూస్తే, ఇది మునుపటి మాదిరిగానే కనిపిస్తుంది అలాగే ఇప్పటికీ 'ఫ్లోటింగ్ రూఫ్' డిజైన్ థీమ్ తో అందించబడుతుంది. వెనుక డోర్ హ్యాండిల్స్ డోర్లపై అమర్చబడ్డాయి, ప్రస్తుత మోడల్లో, అవి C-పిల్లర్కు దగ్గరగా ఉంచబడ్డాయి. రైడింగ్ కోసం కొత్త డిజైన్ అల్లాయ్ వీల్స్ కూడా ఇందులో ఉన్నాయి.

వెనుక భాగంలో కొన్ని డిజైన్ నవీకరణలు కూడా చేయబడ్డాయి. కొత్త టెయిల్ గేట్, కొత్త బంపర్, కొత్త టెయిల్ లైట్లు ఉన్నాయి. దీని టెయిల్ లైట్ లో C-షేప్ లైటింగ్ ఎలిమెంట్స్ మరియు బ్లాక్ ఇన్సర్ట్స్ ఉన్నాయి.

క్యాబిన్

కొత్త స్విఫ్ట్ యొక్క క్యాబిన్ ను చూసినప్పుడు, మొదట గుర్తుకు వచ్చేది ఇది మారుతి యొక్క ఇతర మోడళ్లైన బాలెనో, ఫ్రాంక్స్ మరియు గ్రాండ్ విటారాలను పోలి ఉంటుంది. ఎందుకంటే స్టీరింగ్ వీల్, ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, టచ్ స్క్రీన్ సరిగ్గా ఒకేలా ఉంటాయి.

ఇది కూడా చదవండి: మారుతి సుజుకి ఇప్పటి వరకు 10 లక్షలకు పైగా ఆటోమేటిక్ కార్లను విక్రయించింది,అందులో 65 శాతం యూనిట్లు AMTవే

అయితే దీని డ్యాష్ బోర్డు డిజైన్ ప్రత్యేకమైనది ఇది నలుపు మరియు లేత గోధుమ రంగు షేడ్ తో లేయర్డ్ డ్యాష్ బోర్డ్ తో వస్తుంది.

ఫీచర్లు

కాన్సెప్ట్ మోడల్ యొక్క అన్ని వివరాలు ఇంకా వెల్లడించబడలేదు, అయితే క్యాబిన్లో 9-అంగుళాల టచ్స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సెమీ-డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్ బటన్ స్టార్ట్-స్టాప్, క్రూయిజ్ కంట్రోల్ మరియు ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయని భావిస్తున్నారు. పెద్ద టచ్స్క్రీన్ మినహా మిగతా ఫీచర్లన్నీ ప్రస్తుత స్విఫ్ట్లో ఇప్పటికే ఇవ్వబడ్డాయి.

ఇది కూడా చదవండి: ఈ పండుగ సీజన్లో డిస్కౌంట్ పొందిన ఏకైక మారుతి SUV ఇదే

మల్టిపుల్ ఎయిర్ బ్యాగులు, ABS తో EBD, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్ (ESP), హిల్ హోల్డ్ అసిస్ట్ వంటి భద్రతా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. డ్రైవర్ మానిటరింగ్ సిస్టమ్, హై బీమ్ అసిస్ట్ తో సహా ADAS ఫీచర్లు కూడా ఇందులో ఉంటాయి.

పవర్ ట్రైన్

కొత్త స్విఫ్ట్ కారు ఇంజిన్ కు సంబంధించి సుజుకి ఎక్కువ సమాచారాన్ని పంచుకోలేదు, కానీ CVT గేర్ బాక్స్ తో అధిక మైలేజ్ ఇంజిన్ లభిస్తుందని కంపెనీ ఖచ్చితంగా తెలిపింది. భారతీయ మోడల్ గురించి మాట్లాడితే, ఇది మునుపటి మాదిరిగానే 1.2-లీటర్ నేచురల్ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్ (90PS/113Nm) పొందవచ్చు. ప్రస్తుతం ఈ ఇంజన్ 5-స్పీడ్ మాన్యువల్ మరియు 5-స్పీడ్ AMT గేర్ బాక్స్ ఆప్షన్ తో అందుబాటులో ఉంది.

ప్రారంభ తేదీ, ధర మరియు ప్రత్యర్థులు

సుజుకి మొదట స్విఫ్ట్ యొక్క ప్రొడక్షన్ వెర్షన్ ను ఆవిష్కరిస్తుంది, తరువాత ఈ హ్యాచ్ బ్యాక్ కారు అమ్మకాలు ప్రారంభమవుతాయి. కొత్త స్విఫ్ట్ కారును 2024 ప్రారంభంలో భారతదేశంలో ప్రవేశపెట్టవచ్చు. ఇది ప్రస్తుత మోడల్ కంటే ఖరీదైనది కావచ్చు. మారుతి స్విఫ్ట్ ధర ప్రస్తుతం రూ .5.99 లక్షల నుండి రూ .9.03 లక్షల (ఎక్స్-షోరూమ్) మధ్య ఉంది. కొత్త స్విఫ్ట్ హ్యుందాయ్ గ్రాండ్ i10 నియోస్ తో పోటీ పడనుంది.

మరింత చదవండి : మారుతి స్విఫ్ట్ AMT

a
ద్వారా ప్రచురించబడినది

ansh

  • 691 సమీక్షలు
  • 0 Comments

Write your Comment పైన మారుతి స్విఫ్ట్

S
sumit kumar
Mar 30, 2024, 9:42:40 PM

Hurry launch

Read Full News

ట్రెండింగ్‌లో ఉందిహాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర