ఈ పండుగ సీజన్ؚలో డిస్కౌంట్‌లో లభిస్తున్న ఏకైక Maruti SUV ఇదే
మారుతి జిమ్ని కోసం rohit ద్వారా అక్టోబర్ 24, 2023 02:09 pm ప్రచురించబడింది
- 167 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
జీమ్నీ ఎంట్రీ-లెవెల్ జెటా వేరియెంట్‌ను గరిష్టంగా రూ.1 లక్ష డిస్కౌంట్ؚతో అందిస్తున్నారు
-
మారుతి, జీమ్నీ జెటా వేరియంట్‌ను రూ.50,000 క్యాష్ డిస్కౌంట్ మరియు ఎక్స్‌ఛేంజ్ బోనస్ؚతో అందిస్తోంది.
-
టాప్-స్పెక్ ఆల్ఫా వేరియెంట్‌పై క్యాష్ డిస్కౌంట్ లేదు, దీని పై కేవలం రూ.20,000 ఎక్స్ؚఛేంజ్ బోనస్ లభిస్తుంది.
-
జీమ్నీ 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ మరియు 4WDతో ప్రామాణికంగా వస్తుంది.
-
మారుతి SUV ధరల పరిధి రూ.12.74 లక్షల నుండి రూ.15.05 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వరకు ఉన్నాయి.
మారుతి సుజుకి లైన్అప్ؚలో ప్రస్తుతం 4 SUVలు ఉన్నాయి, వీటిలో 3 SUVలను ప్రీమియం నెక్సా షోరూమ్ؚల ద్వారా విక్రయించబడుతున్నాయి. మారుతి బ్రెజ్జా, మారుతి గ్రాండ్ విటారా మరియు మారుతి ఫ్రాంక్స్ వంటి మోడల్‌లపై ఎటువంటి తగ్గింపు ప్రయోజనాలు లేవు, కేవలం మారుతి జీమ్నీ పై మాత్రమే అక్టోబర్ 2023లో ప్రత్యేక డిస్కౌంట్‌లను అందిస్తున్నారు.
జిమ్నీ పై అందిస్తున్న ఆఫర్‌లు
ఆఫర్ |
మొత్తం |
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 50,000 |
ఎక్స్ؚఛేంజ్ బోనస్ |
రూ. 50,000 |
మొత్తం ప్రయోజనాలు |
రూ. 1 లక్ష వరకు |
-
పైన పేర్కొన్న డిస్కౌంట్లను మారుతి కేవలం ఎంట్రీ-లెవెల్ జెటా వేరియెంట్‌పై మాత్రమే అందిస్తోంది. ఈ ఆఫర్ అక్టోబర్ 20 నుండి ప్రారంభం అయ్యింది మరియు అక్టోబర్ 31 వరకు ఉంటుంది.
-
టాప్-స్పెక్ ఆల్ఫా వేరియెంట్‌పై ఎటువంటి క్యాష్ డిస్కౌంట్ లేదు కానీ వీటి పై రూ.20,000 ఎక్స్ؚఛేంజ్ బోనస్ؚను అందిస్తున్నారు.
ఇది కూడా చదవండి: ఇప్పటి వరకు 10 లక్షల కంటే ఎక్కువ ఆటోమ్యాటిక్ కార్లను విక్రయించిన మారుతి సుజుకి, వీటిలో 65% AMTలు
ఈ ఆఫ్-రోడర్ؚకు శక్తిని అందించేది ఏది?
ఇండియా-స్పెక్ 5-డోర్ జీమ్నీలో మారుతి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను (105PS/134Nm) అందిస్తుంది, ఇది 5-స్పీడ్ మాన్యువల్ లేదా 4-స్పీడ్ ఆటోమ్యాటిక్ గేర్ؚబాక్స్ ఎంపికతో జోడించబడింది. ఇందులో 4-వీల్ డ్రైవ్ ట్రెయిన్ (4WD) ప్రామాణికంగా వస్తుంది.
వేరియెంట్ؚలు, ధరలు మరియు పోటీదారులు
మారుతి జీమ్నీ కేవలం రెండు విస్తృత వేరియెంట్‌లు –జెటా మరియు ఆల్ఫాలో మాత్రమే విక్రయించబడుతుంది – వీటి ధర రూ.12.74 లక్షలు మరియు రూ.15.05 లక్షల (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) మధ్య ఉంది. ఇది ఫోర్స్ గూర్ఖా మరియు మహీంద్రా థార్ؚలతో పోటీ పడుతుంది.
సంబంధించినది: ఎగుమతుల దారి పట్టిన భారతదేశంలో తయారైన మారుతి జీమ్నీ 5-డోర్
ఇక్కడ మరింత చదవండి: జీమ్నీ ఆన్ؚరోడ్ ధర
0 out of 0 found this helpful