• English
    • Login / Register

    మారుతి ఫ్రాంక్స్ Vs సబ్‌కాంపాక్ట్ SUV పోటీదారులు: ఇంధన సామర్ధ్య పోలిక

    మారుతి ఫ్రాంక్స్ కోసం tarun ద్వారా ఏప్రిల్ 06, 2023 06:06 pm ప్రచురించబడింది

    • 45 Views
    • ఒక వ్యాఖ్యను వ్రాయండి

    ఫ్రాంక్స్ SUV-క్రాస్ؚఓవర్ అయినప్పటికీ, దీని పరిమాణంలో ఉండే సబ్ؚకాంపాక్ట్ SUVలకు ఇది ప్రత్యామ్నాయంగా నిలుస్తుంది.

    Maruti Fronx

    ఈ నెల చివరిలో మారుతి ఫ్రాంక్స్ మార్కెట్‌లో విడుదల కానుంది, సబ్‌కాంపాక్ట్ SUV విభాగంలో ఉన్న పోటీని ఇది మరింతగా పెంచనుంది. ఇది కేవలం పెట్రోల్ వేరియంట్‌లో మాత్రమే వస్తుంది, నేచురల్లీ ఆస్పిరేటెడ్ మరియు టర్బోచార్జెడ్ ఇంజన్ ఎంపికలతో వస్తుంది. వివిధ పవర్ؚట్రెయిన్ ఎంపికలు ఉన్న ఏడు సబ్‌కాంపాక్ట్ SUVలతో ఇది గట్టి పోటీని ఎదురుకోనుంది. కారు తయారీదారు ఫ్రాంక్స్ ఇంధన సామర్ధ్య గణాంకాలను వెల్లడించారు, ఈ గణాంకాలను దాని పోటీదారులతో పోల్చి చూద్దాము:

    మారుతి ఫ్రాంక్స్ Vs మారుతి బ్రెజ్జా 

    స్పెక్స్ 

    ఫ్రాంక్స్ 

    బ్రెజ్జా

    ఇంజన్ 

    1.2-లీటర్ పెట్రోల్ 

    1-లీటర్ టర్బో పెట్రోల్ 

    1.5-లీటర్ పెట్రోల్

    పవర్/టార్క్ 

    90PS / 113Nm

    100PS / 148Nm

    103PS / 137Nm

    ట్రాన్స్ؚమిషన్

    5-స్పీడ్ MT/5-స్పీడ్ AMT

    5-స్పీడ్ MT/6-స్పీడ్ AT

    5-స్పీడ్ MT/6-స్పీడ్ AT

    మైలేజ్

    21.79kmpl/22.89kmpl

    21.5kmpl/20.1kmpl

    17.03kmpl/18.76kmpl

    • ఈ విభాగంలో మారుతి తరపున బ్రెజ్జా ఇప్పటికే పోటీదారుగా నిలవగా, ఫ్రాంక్స్ؚ మరింత చవకైన SUV-క్రాస్ؚఓవర్ ప్రత్యామ్నాయంగా నిలవనుంది. మరింత దృఢంగా కనిపించే బాలెనోని కోరుకునే వారు దీన్ని ఎంచుకోవచ్చు. 

    • ఈ విభాగంలో బ్రెజ్జా పెట్రోల్ కార్ అత్యధిక ఇంజన్ؚ డిస్ؚప్లేస్మెంట్ؚను పొందుతుంది. పోల్చి చూస్తే, ఫ్రాంక్స్ 6kmpl (క్లెయిమ్ చేసిన) వరకు అధిక మైలేజ్‌ను అందిస్తుంది. 

    • బ్రెజ్జా మోటార్ కంటే ఫ్రాంక్స్ 1.2-లీటర్ పెట్రోల్ తక్కువ శక్తి అందిస్తుంది అని భావించేవారు టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను పరిగణించవచ్చు, స్పేసిఫికేషన్‌ల పరంగా ఇది సారూప్య పనితీరు గణాంకాలను అందిస్తుంది. 

    మారుతి ఫ్రాంక్స్ Vs టాటా నెక్సాన్

    స్పెక్స్

    ఫ్రాంక్స్ 

    నెక్సాన్

    ఇంజన్ 

    1.2-లీటర్ పెట్రోల్ 

    1-లీటర్ టర్బో-పెట్రోల్

    1.2-లీటర్ టర్బో-పెట్రోల్

    పవర్/టార్క్

    90PS / 113Nm

    100PS / 148Nm

    120PS / 170Nm

    ట్రాన్స్‌మిషన్

    5-స్పీడ్ MT/5-స్పీడ్ AMT

    5-స్పీడ్ MT/6-స్పీడ్ AT

    6-స్పీడ్ MT/6-స్పీడ్ AMT

    మైలేజ్

    21.79kmpl/22.89kmpl

    21.5kmpl/20.1kmpl

    17.1kmpl

    • నెక్శాన్ మరియు ఫ్రాంక్స్ టర్బో-పెట్రోల్ ఇంజన్ గణాంకాలను పోల్చిచూస్తే, స్పేసిఫికేషన్‌ల పరంగా ఫ్రాంక్స్ కంటే నెక్శాన్ మరింత శక్తివంతమైనదిగా కనిపిస్తుంది.

    • టాటా SUV కంటే మారుతి 6kmpl వరకు ఎక్కువ మైలేజ్‌ను అందిస్తుంది. 

    ఇది కూడా చదవండి: మారుతి ఫ్రాంక్స్ అంచనా ధరలు: బాలెనో కంటే దీని ధర ఎంత ఎక్కువగా ఉంటుంది?

    ఫ్రాంక్స్ Vs XUV300

    స్పెక్స్

    ఫ్రాంక్స్ 

    XUV300

    ఇంజన్ 

    1.2- లీటర్ పెట్రోల్

    1- లీటర్ టర్బో-పెట్రోల్

    1.2- లీటర్ టర్బో-పెట్రోల్

    1.2- లీటర్ TGDI టర్బో-పెట్రోల్

    పవర్/టార్క్ 

    90PS / 113Nm

    100PS/148Nm

    110PS/200Nm

    130PS / Up to 250Nm

    ట్రాన్స్ؚమిషన్

    5- స్పీడ్ d MT / 5- స్పీడ్ AMT

    5- స్పీడ్ MT / 6- స్పీడ్ AT

    6- స్పీడ్ MT / 6- స్పీడ్ AMT

    6- స్పీడ్ MT

    మైలేజ్

    21.79kmpl / 22.89kmpl

    21.5kmpl / 20.1kmpl

    17.1kmpl

    -

    • XUV300 కేవలం టర్బో-పెట్రోల్ ఇంజన్‌ను మాత్రమే పొందింది, ఇది ఫ్రాంక్స్ కంటే మరింత శక్తివంతమైనది. 

    • సామర్ధ్యత పరంగా, ఫ్రాంక్స్ 6kmpl వరకు ఎక్కువ మైలేజ్‌ను అందిస్తుంది.

    మారుతి ఫ్రాంక్స్ Vs కియా సోనెట్/ హ్యుందాయ్ వెన్యూ

    Kia Sonet

    స్పెక్స్ 

    ఫ్రాంక్స్

    సోనెట్ 

    ఇంజన్ 

    1.2-లీటర్ పెట్రోల్ 

    1-లీటర్ టర్బో-పెట్రోల్ 

    1.2-లీటర్ పెట్రోల్ 

    1-లీటర్ టర్బో-పెట్రోల్

    పవర్/టార్క్ 

    90PS / 113Nm

    100PS/ 148Nm

    83PS/113Nm

    120PS / 172Nm

    ట్రాన్స్ؚమిషన్

    5-స్పీడ్ MT/ 5-స్పీడ్ AMT

    5-స్పీడ్ MT / 6-స్పీడ్ AT

    5-స్పీడ్ MT

    6-స్పీడ్ iMT / 7-స్పీడ్ DCT

    మైలేజ్

    21.79kmpl / 22.89kmpl

    21.5kmpl / 20.1kmpl

    18.4kmpl

    18.2kmpl / 18.3kmpl

    • ఈ మూడు SUVలు సారూప్యమైన 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను కలిగి ఉండగా, హ్యుందాయ్ మరియు కియా వాహనాలు వాటి టర్బో-పెట్రోల్ ఇంజన్ؚతో అన్నిటితో పోలిస్తే ఆధిక్యంలో ఉన్నాయి. 

    • అయితే, ఇంధన సామర్ధ్యత పరంగా సోనెట్ మరియు వెన్యూలు ఫ్రాంక్స్ టర్బోతో సమానంగానే నిలుస్తున్నాయి. వీటి మధ్య తేడా 3kmpl కంటే తక్కువగా ఉంది. 

    మారుతి ఫ్రాంక్స్ Vs నిస్సాన్ మాగ్నైట్ / రెనాల్ట్ కైగర్

    2022 renault kiger

    స్పెక్స్ 

    ఫ్రాంక్స్ 

    మాగ్నైట్ / కైగర్ 

    ఇంజన్ 

    1.2-లీటర్ పెట్రోల్ 

    1-లీటర్ టర్బో-పెట్రోల్ 

    1-లీటర్ పెట్రోల్ 

    1-లీటర్ టర్బో-పెట్రోల్ 

    పవర్/టార్క్

    90PS / 113Nm

    100PS/148Nm

    72PS / 96Nm

    100PS/160Nm

    ట్రాన్స్ؚమిషన్

    5-స్పీడ్ MT / 5-స్పీడ్ AMT

    5-స్పీడ్ MT / 6-స్పీడ్ AT

    5-స్పీడ్ MT / AMT (కైగర్ؚతో మాత్రమే)

    5-స్పీడ్ MT/ CVT

    మైలేజీ

    21.79kmpl / 22.89kmpl

    21.5kmpl / 20.1kmpl

    18.75kmpl / -

    20kmpl / 17.7kmpl

    • ఫ్రాంక్స్ؚకు తగిన పోటీదారులుగా మాగ్నైట్ మరియు కైగర్ؚలు నిలుస్తున్నాయి. వీటి టర్బో-పెట్రోల్ ఇంజన్ؚలు సారూప్య పనితీరును మరియు దాదాపు 20kmpl ఇంధన సామర్ధ్యాన్ని కలిగి ఉన్నాయి. 

    • పోల్చి చూస్తే, మాగ్నైట్ మరియు కైగర్ؚలలో ఉండే నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ తక్కువ శక్తివంతమైనది మరియు ఇంధన సామర్ధ్యం కూడా తక్కువ. 

    చూడండి: మీ కుటుంబం కోసం ఉత్తమమైన కాంపాక్ట్ SUV ఏది? ఈ కొత్త వీడియోలో వీటి పోలీకలను చూడండి

    సారాంశం:

    Maruti Fronx Side

    పైన పేర్కొన్న సబ్-కాంపాక్ట్ SUVలతో పోల్చినప్పుడు, మారుతి ఫ్రాంక్స్ అత్యంత ఇంధన సామర్ధ్యం కలిగి ఉంది. అయితే, వీటిలో ఎక్కువ SUVలు మరింత శక్తివంతమైన ఇంజన్ؚను అందిస్తాయి, తద్వారా సామర్ధ్యం మరియు పనితీరుల మధ్య సమీకరణం సంతులనం అవుతుంది. ఫ్రాంక్స్ మరియు దాని ప్రీమియం హ్యాచ్‌బ్యాక్ పోటీదారుల మధ్య వివరణాత్మక మైలేజ్ పోలిక కోసం కార్దెకోؚను చూడండి. 

    was this article helpful ?

    Write your Comment on Maruti ఫ్రాంక్స్

    explore similar కార్లు

    సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

    *ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

    ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

    • లేటెస్ట్
    • రాబోయేవి
    • పాపులర్
    ×
    We need your సిటీ to customize your experience