మారుతి ఫ్రాంక్స్ అంచనా ధరలు: బాలెనోతో పోలిస్తే దీని ధర ఎంత ఎక్కువగా ఉంటుంది?
మారుతి ఫ్రాంక్స్ కోసం rohit ద్వారా ఫిబ్రవరి 27, 2023 12:47 pm ప్రచురించబడింది
- 50 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
మారుతి ఇప్పటికే ఈ క్రాస్ؚఓవర్ SUV వేరియెంట్‌లు, సాంకేతిక స్పెసిఫికేషన్‌లతో సహా అన్నీ వివరాలను దాదాపుగా వెల్లడించింది.
బాలెనో–ఆధారిత క్రాస్ ఓవర్ SUV మారుతి ఫ్రాంక్స్ త్వరలో మార్కెట్‌లోకి ప్రవేశించనుంది. ఈ కారు తయారీదారు టర్బో-పెట్రోల్ స్పేస్‌లోకి తిరిగి ప్రవేశించడం దీని అతి పెద్ద ఆకర్షణలలో ఒకటి. వేరియెంట్‌లు, సాంకేతిక స్పెసిఫికేషన్‌లు, ఫీచర్‌లతో సహా ఫ్రాంక్స్ వివరాలు అన్నిటినీ దాదాపుగా తెలుసుకున్నాం. ధరల విషయంలో తయారీదారు అధికారిక ప్రకటనల చేయకపోయిన, దీని ధరలు ఎలా ఉండబోతున్నాయో అవగాహనాపూర్వక అంచనాని వేయవచ్చు.
వేరియెంట్-వారీ అంచనా ధరలు తెలుసుకునే ముందు, ఈ క్రాస్ؚఓవర్ పవర్ؚట్రెయిన్ వివరాలను చూద్దాం.
స్పెసిఫికేషన్ |
1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ |
1-లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ |
పవర్ |
90PS |
100PS |
టార్క్ |
113Nm |
148Nm |
ట్రాన్స్ؚమిషన్ |
5-స్పీడ్ల MT, 5-స్పీడ్ల AMT |
5-స్పీడ్ల MT, 6-స్పీడ్ల AT |
టర్బో-పెట్రోల్ యూనిట్ؚకు మృదువైన-హైబ్రిడ్ సాంకేతికతను కూడా మారుతి జతచేసింది. ఇటీవల కనిపించిన టెస్ట్ డిజైన్ కూడా, ఈ కారు తయారీదారు ఫ్రాంక్స్ CNG వర్షన్ؚను అభివృద్ధి చేస్తుండవచ్చు అని సూచిస్తుంది.
హెడ్స్-అప్ డిస్ప్లే, క్రూజ్ కంట్రోల్, తొమ్మిది-అంగుళాల టచ్ స్క్రీన్, 360-డిగ్రీ కెమెరాలతో సహా ఈ వాహనంలోని అన్నీ పరికరాలు దాదాపుగా బాలెనోను పోలి ఉంటాయి. ఫ్రాంక్స్‌లో ఉన్న ఏకైక అదనపు ఫీచర్ దీని వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్. భధ్రత విషయానికి వస్తే ఇందులో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), ఆరు వరకు ఎయిర్ؚబ్యాగ్ؚలు, ISOFIX చైల్డ్ సీట్ యాంకర్‌లు, వెనుక పార్కింగ్ సెన్సర్‌లు ఉన్నాయి.
ఇది కూడా చదవండి: CD మాటలలో: టర్బో-పెట్రోల్ ఇంజన్‌లు మారుతి కార్‌లలో తాజా మార్పును తెస్తాయా?
వేరియెంట్-వారీ అంచనా ధరలను ఇక్కడ చూడవచ్చు:
వేరియెంట్ |
1.2-లీటర్ పెట్రోల్ MT |
1.2-లీటర్ పెట్రోల్ AMT |
1-లీటర్ టర్బో-పెట్రోల్ MT |
1-లీటర్ టర్బో-పెట్రోల్ AT |
సిగ్మా |
రూ. 8 లక్షలు |
– |
– |
– |
డెల్టా |
రూ. 8.85 లక్షలు |
రూ. 9.40 లక్షలు |
– |
– |
డెల్టా+ |
రూ. 9.30 లక్షలు |
రూ. 9.75 లక్షలు |
రూ. 10.30 లక్షలు |
– |
జెటా |
– |
– |
రూ. 11 లక్షలు |
రూ. 12.50 లక్షలు |
ఆల్ఫా |
– |
– |
రూ. 11.85 లక్షలు |
రూ. 13.35 లక్షలు |
కొత్త డెల్టా+ మాత్రమే రెండు ఇంజన్‌లు, మొత్తం మూడు పవర్ ట్రెయిన్‌ల ఎంపికలను పొందిన ఏకైక వేరియెంట్. 1.2-లీటర్ వెర్యియెంట్‌లతో పోలిస్తే టర్బో-పెట్రోల్ MT వేరియెంట్‌ల ధర రూ.1.1 లక్షల అధికంగా ఉంటాయని అంచనా, వీటి ఆటోమ్యాటిక్ ప్రత్యర్ధుల ధర రూ.1.5 లక్షలు ఎక్కువగా ఉండవచ్చు.
సంబంధించినవి: తయారీలో ఉన్న ఎలక్ట్రిక్ మారుతి ఫ్రాంక్స్, టాటా నెక్సాన్ؚతో పోటీ పడనుంది
ఫ్రాంక్స్ అంచనా ధరలను దాని పోటీదారుల ధరలతో పోల్చి చూద్దాం:
మారుతి ఫ్రాంక్స్ |
మారుతి బ్రెజ్జా |
కియా సోనెట్ |
హ్యుందాయ్ వెన్యూ |
టాటా నెక్సాన్ |
హ్యుందాయ్ i20 |
మారుతి బాలెనో |
రూ, 8 లక్షల నుండి రూ. 13.35 లక్షల వరకు |
రూ. 8.19 లక్షల నుండి రూ. 14.04 లక్షల వరకు |
రూ. 7.69 లక్షల నుండి రూ. 14.39 లక్షల వరకు |
రూ. 7.68 లక్షల నుండి రూ. 13.11లక్షల వరకు |
రూ. 7.80 లక్షల నుండి రూ. 14.35 లక్షల వరకు |
రూ. 7.19 లక్షల నుండి రూ. 11.83 లక్షల వరకు |
రూ. 6.56 లక్షల నుండి రూ. 9.83 లక్షల వరకు |
ఫ్రాంక్స్ؚకు ప్రత్యేక్ష పోటీదారులు ఎవ్వరూ లేరు కానీ ఇది సబ్ؚకాంపాక్ట్ SUVలు, ఖరీదైన హ్యాచ్ؚబ్యాక్ؚలకి ప్రత్యామ్నాయం కాగలదు. ఈ క్రాస్ ఓవర్ SUV కోసం మారుతి ఇప్పటికీ ముందస్తు ఆర్డర్ؚలను ప్రారంభించింది. ఫ్రాంక్స్ బహుశా మార్చిలో మార్కెట్‌లోకి ప్రవేశించవచ్చు.
0 out of 0 found this helpful