మారుతి సియాజ్ 1.5 లీటర్ డీజిల్ vs హ్యుందాయ్ వెర్నా, హోండా సిటీ, స్కోడా రాపిడ్ & VW వెంటో: స్పెసిఫికేషన్ పోలిక
ఒక పెద్ద ఇంజన్ పరిచయంతో సియాజ్ దాని ప్రత్యర్థులపై పేపర్ మీద ఆధిపత్యం చెలాయిస్తుందా? చూద్దాము
- మారుతి సియాజ్ యొక్క 1.5 లీటరు డీజిల్ ఇంజన్ అనేది దాని యొక్క 1.3-లీటర్ యూనిట్ కంటే కూడా 5Ps శక్తిని మరియు 25Nm టార్క్ లను అందిస్తుంది.
- సియాజ్ యొక్క 1.5 లీటర్ ఇంజన్ 1.3-లీటర్ ఇంజన్ లా కాకుండా తేలికపాటి-హైబ్రిడ్ SHVS టెక్నాలజీని మిస్ అవుతుంది.
- డీజిల్ సియాజ్ యొక్క ఇంధన సామర్థ్యం కూడా చాలా బాగుంది మరియు అది ఇచ్చే గణాంకాలు కూడా ఉత్తమంగా ఉన్నాయి అని చెప్పవచ్చు.
మారుతి సుజుకి తమ యొక్క సియాజ్ లో పెద్ద 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ ని ప్రవేశపెట్టింది. ఇది ఎక్కువ శక్తివంతమైనది మరియు ఎక్కువ టార్క్ ని కూడా అందిస్తుంది మరియు ఇది ప్రకటించిన ఇంధన సామర్ధ్యంలో మునుపటి దాని కంటే 1 Kmpl తగ్గడమనేది విశేషం అని చెప్పవచ్చు. ఈ మారుతి సంస్థలో అభివృద్ధి చేయబడిన ఈ మోటార్ DDiS225 అని పిలవబడుతుంది, దీనిలో ఫియట్ అందించే 1.3-లీటర్ తేలికపాటి-హైబ్రీడ్ స్టార్ట్ / స్టాప్ టెక్నాలజీ అనేది కలిగి ఉండడం లేదు. 5-స్పీడ్ మాన్యువల్ కి బదులుగా, ఇది 6 స్పీడ్ మాన్యువల్ తో వస్తుంది. 1.3-లీటరు డీజిల్ ఇంజన్ తో పాటు 1.5 లీటర్ డీజిల్ ఇంజన్ అమ్మకాలు దాని బేస్ సిగ్మా వేరియంట్ లో తప్ప మిగిలిన వాటిలో కొనసాగుతున్నాయి.
ఇప్పుడు సియాజ్ యొక్క స్పెసిఫికేషన్స్ ఏమిటేమిటి ఉన్నాయి మరియు ఈ పెద్ద ఇంజన్ అనేది మిగిలిన కార్లకి ఏ విధంగా పోటీ ఇస్తుందో మరియు గణాంకాల పరంగా ఎలా నిలబడుతుంది అనేది పేపర్ మీద చూద్దాము.
డీజిల్ |
కొత్త 1.5- లీటర్ DDiS225 |
1.3- లీటర్ DDiS200 |
హోండా సిటీ 1.5- లీటర్ |
హ్యుందాయి వెర్నా 1.6- లీటర్ |
హ్యుందాయి వెర్నా 1.4- లీటర్ |
VW వెంటో 1.5- లీటర్ |
స్కోడా రాపిడ్ 1.5- లీటర్ |
||
డిస్ప్లేస్మెంట్ |
1498cc, 4- సిలెండర్ |
1248cc. 4- సిలెండర్ |
1498cc, 4- సిలెండర్ |
1582cc, 4- సిలెండర్ |
1396cc, 4- సిలెండర్ |
1498cc, 4- సిలెండర్ |
|||
పవర్ |
95PS @ 4000rpm |
90PS @ 4000rpm |
100PS @ 3600rpm |
128PS @ 4000rpm |
90PS @ 4000rpm |
110PS @ 4000rpm |
|||
టార్క్ |
225Nm @ 1500-2500 |
200Nm @ 1750rpm |
200Nm @ 1750rpm |
260Nm @ 1500-3000rpm |
220Nm @ 1500-2750rpm |
250Nm @ 1500-300rpm |
250Nm @ 1500-2500rpm |
||
ట్రాన్స్మిషన్ |
6- స్పీడ్ MT |
5- స్పీడ్ MT |
6- స్పీడ్ MT |
6- స్పీడ్ MT/AT |
6- స్పీడ్ MT |
5- స్పీడ్ MT/7- స్పీడ్ DSG |
|||
క్లెయిమ్ చేసిన ఇంధన సామర్ధ్యం |
26.82kmpl |
28.09 kmpl |
25.6kmpl |
24.75kmpl/21.02kmpl |
24.8 kmpl |
22.27 kmpl/22.15kmpl |
22.27 kmpl/22.15kmpl |
సియాజ్ యొక్క కొత్త డీజిల్ ఇంజన్ 1.3 లీటర్ ఇంజిన్ కంటే మరింత శక్తివంతమైనది మరియు 5Ps శక్తిని మరియు 25Nm టార్క్ ని అధనంగా అందిస్తుంది. అయితే హ్యుందాయ్ వెర్నాలో ప్రవేశ స్థాయి డీజిల్ మినహా ఇది ప్రత్యర్థులతో పోలిస్తే తక్కువగానే ఉంది. ఈ టార్క్ విభాగంలో విషయాలు అన్నీ చాలా బాగుంటాయి, ఇది హోండా సిటీని అధిగమించింది మరియు వెర్నా యొక్క చిన్న 1.4 లీటర్ ఇంజిన్ ని కూడా అధిగమించింది అని చెప్పవచ్చు. అతిపెద్ద 1.6 లీటర్ పెద్ద ఇంజిన్ తో కూడిన వెర్నా, ఎక్కువ టార్క్ ని మనకి అందిస్తుంది, అయితే వెంటో మరియు రాపిడ్ దీని కంటే 10Nm తక్కువ టార్క్ ని మనకి అందిస్తాయి అని చెప్పవచ్చు.
కానీ మిగిలిన మారుతి కారుల లానే, ఇంధన సామర్ధ్యం విషయానికి వస్తే సియాజ్ అనేది దాని ప్రత్యర్థులను అత్యంత సమర్థవంతమైన ఒక ఆరోగ్యకరమైన మార్జిన్ ద్వారా ఓడిస్తుంది అని చెప్పవచ్చు. 1.27Kmpl డ్రాప్ ఉన్నప్పటికీ కూడా పెరిగిన సామర్ధ్యం వలన మరియు తేలికపాటి-హైబ్రిడ్ SHVS టెక్నాలజీ లేనప్పటికీ కూడా ఇది మంచి మైలేజ్ ని అందిస్తుందని చెప్పవచ్చు.
ఈ లక్షణాలు సంఖ్య అనేవి మారుతి సుజుకి సియాజ్ లో ఎలా అయితే ఉంటాయో దీనిలో కూడా అలానే ఉంటాయి, ఇది దీని ప్రత్యర్థులపై ఎలా పని చేస్తుందో తెలుసుకోవాలంటే ఇక్కడ క్లిక్ చేయండి.
ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)
మారుతి సియాజ్ 1.5 |
మారుతి సియాజ్ 1.3 |
హోండా సిటీ 1.5 |
హ్యుందాయ్ వెర్నా 1.4 నుండి 1.6 |
వోక్స్వ్యాగన్ వెంటో డీజిల్ |
స్కోడా రాపిడ్ డీజిల్ |
రూ. 9.97 లక్షల నుండి రూ. 11.37 లక్షలు |
రూ. 9.19 లక్షల నుండి రూ. 11.02 లక్షలు |
రూ. 11 లక్షల నుండి రూ. 14.05 లక్షలు |
రూ. 9.33 లక్షల నుండి రూ. 14.04 లక్షలు |
రూ. 9.45 లక్షల నుండి రూ. 14.32 లక్షలు |
రూ. 9.50 లక్షల నుండి రూ. 14 లక్షలు |
Read More on : Maruti Ciaz on road price