Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

ఫిబ్రవరి 2023లో టాటా నెక్సాన్ నుండి విభాగపు ఆధిపత్యాన్ని తిరిగి తీసుకున్న మారుతి బ్రెజ్జా

మారుతి బ్రెజ్జా కోసం shreyash ద్వారా మార్చి 13, 2023 11:17 am ప్రచురించబడింది

మారుతి బ్రెజ్జా, కియా సోనెట్ మరియు రెనాల్ట్ కైగర్ వాహనాల అమ్మకాలు జనవరి నెలతో పోలిస్తే మెరుగ్గా ఉన్నాయి, చాలా వరకు ఇతర సబ్‌కాంపాక్ట్ SUVల అమ్మకాలలో భారీ తగ్గుదల కనిపించింది.

ఫిబ్రవరి 2023లో సబ్-4m SUV అమ్మకాలలో మారుతి తిరిగి అగ్ర స్థానానికి చేరుకుంది, ఆ తరువాతి స్థానంలో టాటా నెక్సాన్ మారుతికి చాలా దగ్గరలో ఉంది. గత నెలతో పోలిస్తే సబ్ؚకాంపాక్ట్ SUVల అమ్మకాలలో తగ్గుదల కనిపించిగా, రెనాల్ట్ కైగర్ నెలవారీ (MoM) అమ్మకాల గణాంకాలలో అత్యధిక పెరుగుదలను చూసింది.

ఫిబ్రవరి 2023లో సబ్-కంపాక్ట్ విభాగంలో అమ్మకాల వివరణాత్మక విభజన క్రింద ఇవ్వబడింది:

ఫిబ్రవరి 2023

జనవరి 2023

MoM వృద్ధి

మార్కెట్ వాటా ప్రస్తుతం (%)

మార్కెట్ వాటా (% గత సంవత్సరం )

YoY మార్కెట్ వాటా (%)

సగటు అమ్మకాలు (6 నెలలు)

మారుతి బ్రెజ్జా

15787

14359

9.94

27.53

18.85

8.68

12910

టాటా నెక్సాన్

13914

15567

-10.61

24.27

24.97

-0.7

14477

హ్యుందాయ్ వెన్యూ

9997

10738

-6.9

17.43

20.8

-3.37

10270

కియా సోనెట్

9836

9261

6.2

17.15

12.53

4.62

7935

మహీంద్రా XUV300

3809

5390

-29.33

6.64

9.19

-2.55

5471

నిస్సాన్ మాగ్నైట్

2184

2803

-22.08

3.8

4.19

-0.39

2717

రెనాల్ట్ కైగర్

1802

1153

56.28

3.14

4.57

-1.43

2231

ముఖ్యాంశాలు

  • ఈ విభాగంలో సుమారు 10 శాతం MoM వృద్ధితో 15,000 విక్రయాలతో అత్యధిక అమ్మకాలు కలిగిన ఏకైక మోడల్ మారుతి బ్రెజ్జా.

ఇది కూడా చదవండి: పెట్రోల్ డీజిల్ సబ్‌కాంపాక్ట్ SUVల కంటే మహీంద్రా XUV400 వేగం ఎంత ఎక్కువ

  • మరొక వైపు, MoMలో 10 శాతం కంటే ఎక్కువ తగ్గుదలతో టాటా నెక్సాన్ ఈ జాబితాలో రెండవ స్థానంలో నిలిచింది. ఫిబ్రవరి నెలలో నెక్సాన్ 14,000 కస్టమర్‌లను పొందగలిగింది.

  • అదేవిధంగా, హ్యుందాయ్ వెన్యూ MoM అమ్మకాలలో 6.9 శాతం తగ్గుదలను కనపరచగా, తిరిగి 10,000 యూనిట్‌ల మార్క్ కంటే తక్కువకు పడిపోయింది. ప్రస్తుతం, ఇది ఈ విభాగంలో 17 శాతం కంటే ఎక్కువ మార్కెట్ షేర్ؚను కలిగి ఉంది.

ఇది కూడా చదవండి: ఫిబ్రవరి 2023లో మారుతి సుజుకి అమ్మకాల చార్ట్ؚలో ఇలా ఆధిపత్యం చూపించింది

  • కియా సోనెట్‌కు ఉన్న దేమాండ్ సాపేక్షంగా స్థిరంగా ఉంది, ఫిబ్రవరిలో దీని అమ్మకాలు 9,500 యూనిట్‌లుగా ఉంది. కియా సబ్ؚకాంపాక్ట్ SUV కూడా MoM అమ్మకాలలో 6.2 శాతం పెరుగుదలను చూసింది, హ్యుందాయ్ తోటి వాహనంగా అదే మార్కెట్ షేర్ؚను కలిగి ఉంది.

  • మహీంద్రా XUV300 ఈ విభాగంలో అత్యధికంగా అమ్ముడైన ఐదవ మోడల్‌గా కొనసాగింది, అయితే MoM అమ్మకాలలో అధికంగా 29.33 శాతం తగ్గుదలను చూసింది. గత నెలలో 3,800 యూనిట్‌ల కంటే ఎక్కువ అమ్మకాలను నమోదు చేసింది.

  • నిసాన్ మాగ్నైట్ కూడా MoM అమ్మకాలలో తగ్గుదలను చూసింది, ఫిబ్రవరిలో కేవలం 2.184 యూనిట్‌ల అమ్మకాలతో 22.08 శాతం తగ్గాయి.

  • రెనాల్ట్ కైగర్ MoM అమ్మకాలలో అత్యధికంగా 56.28 శాతం ఉన్నప్పటికీ, ఈ విభాగంలో ఫిబ్రవరిలో దీని అమ్మకాలు అతి తక్కువగా 1,800 మాత్రమే ఉన్నాయి.

ఇక్కడ మరింత చదవండి: మారుతి బ్రెజ్జా ఆన్-రోడ్ ధర

Share via

Write your Comment on Maruti బ్రెజ్జా

explore similar కార్లు

కియా సోనేట్

పెట్రోల్18.4 kmpl
డీజిల్24.1 kmpl
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్

మారుతి బ్రెజ్జా

Rs.8.69 - 14.14 లక్షలు* ఆన్ రోడ్ ధర పొందండి
పెట్రోల్19.89 kmpl
సిఎన్జి25.51 Km/Kg
ట్రాన్స్ మిషన్మాన్యువల్/ఆటోమేటిక్
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది ఎస్యూవి కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.15.50 - 27.25 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.15 - 26.50 లక్షలు*
కొత్త వేరియంట్
కొత్త వేరియంట్
Rs.6.20 - 10.51 లక్షలు*
ఎలక్ట్రిక్
Rs.48.90 - 54.90 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర