పెట్రోల్ & డీజిల్ సబ్ కాంపాక్ట్ SUVల కంటే మహీంద్రా XUV400 స్పీడ్ ఎంత ఎక్కువో ఇక్కడ చూద్దాం
మహీంద్రా ఎక్స్యువి400 ఈ వి కోసం tarun ద్వారా మార్చి 13, 2023 11:03 am ప్రచురించబడింది
- 28 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
XUV400 ఎలక్ట్రిక్ SUV 150PS మరియు 310Nm పవర్ మరియు టార్క్ అందించే ఎలక్ట్రిక్ మోటార్‌ను కలిగి ఉంది
మహీంద్రా XUV400 మార్కెట్‌లోకి ప్రవేశించిన సరికొత్త ఎలక్ట్రిక్ SUV, దీని ధర రూ.6 లక్షల నుండి 19 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంది. ఇది XUV300పై ఆధారపడింది కానీ తిరిగి డిజైన్ చేయబడిన బూట్ మరియు మరింత బూ స్పేస్ కోసం 200mm వరకు పొడవు పెంచబడింది. XUV400 క్యాబిన్ స్పేస్ XUV300లో ఉన్నట్లుగానే ఉంటుంది, ఇది ముఖ్యంగా ICE-ఆధారిత సబ్ కాంపాక్ట్ SUVలకు పోటీ అని ఇది సూచిస్తుంది.
ఇది కూడా చదవండి: రూ. 31,000 వరకు పెరిగిన మహీంద్రా బొలెరో మరియు బొలెరో నియో ధరలు
మహీంద్రా XUV400కి మా పర్ఫార్మెన్స్ టెస్ట్‌లను నిర్వహించి కొన్ని ఆకర్షణీయమైన గణాంకాలను పొందాము. ఇక్కడ వాటిని, మా ఇంటర్నల్ టెస్ట్ గణాంకాల ఆధారంగా పెట్రోల్ మరియు డీజిల్ సబ్-ఫోర్-మీటర్ పోటీదారులతో పోల్చాము. ఈ కార్‌లను మేము గత కొన్ని సంవత్సరాలుగా పరీక్షిస్తున్నాము మరియు ప్రతి మోడల్ యొక్క వేగవంతమైన పవర్‌ట్రెయిన్ కాంబినేషన్ؚను పరిగణలోకి తీసుకున్నాము అని గమనించండి.
మోడల్స్ |
XUV400 EV |
XUV300 డీజిల్ MT |
సోనెట్ iMt |
బ్రెజ్జా AT |
మాగ్నైట్ CVT |
కైగర్ MT |
నెక్సాన్ MT |
వెన్యూ DCT |
0-100 kmph* |
8.4 సెకన్లు |
12.21 సెకన్లు |
11.68 సెకన్లు |
15.24 సెకన్లు |
12.03 సెకన్లు |
11.01 సెకన్లు |
11.64 సెకన్లు |
11.24 సెకన్లు |
పవర్/టార్క్ |
150PS / 310Nm |
117PS / 300Nm |
120PS / 172Nm |
103PS / 138Nm |
100PS / 152Nm |
100PS / 160Nm |
120PS / 170Nm |
120PS / 172Nm |
*ఇంటర్నల్ టెస్టింగ్ గణాంకాలు
-
XUV400 EV దాని పోటీదారులతో పోలిస్తే రూ.20 లక్షల కంటే తక్కువ ధరతో వస్తున్న వేగంగా యాక్సెలరేట్ అయ్యే కారు మరియు వేగవంతమైన మోడల్. ఈ గణాంకాలు కొత్త ఎలక్ట్రిక్ మహీంద్రాను BMW, ఆడి మరియు మినీ కూపర్ SE (7.13 సెకన్లు)తో కూడా పోటీ పడేలా చేస్తుంది.
- మేము పర్ఫార్మెన్స్ టెస్ట్ చేసిన రెండవ వేగవంతమైన వాహనం కైగర్, దీని వేగం XUV400 కంటే దాదాపు 2.5 సెకన్లు తక్కువ. ఆశ్చర్యకరంగా, దీని పోటీదారులలో అతి తక్కువ శక్తివంతమైన మరియు టార్క్ కలిగిన SUVలలో ఇది ఒకటి.
- రెనాల్ట్ తరువాత స్థానంలో DCTతో (డ్యూయల్ క్లచ్ ఆటోమ్యాటిక్) వెన్యూ టర్బో పెట్రోల్, మూడవ స్థానంలో టర్బో-పెట్రోల్ మరియు మాన్యువల్ కాంపినేషన్ؚతో వచ్చే నెక్సాన్, చివరిగా iMT(క్లచ్ లెస్ మాన్యువల్)తో టర్బో పెట్రోల్ సోనెట్ ఉన్నాయి.
- ఇక్కడ బ్రెజ్జా అన్నిటికంటే తక్కువ వేగం కలిగిన వాహనం మరియు ఈ లిస్ట్ؚలో టర్బో చార్జర్ లేకుండా ఉన్న ఒకే ఒక ICE-ఆధారిత SUV.
-
తన సబ్ؚకాంపాక్ట్ పోటీదారుల టాప్-ఎండ్ వేరియెంట్‌లతో పోలిస్తే, XUV400 ధర రూ.5 లక్షలు ఎక్కువ.
ఇది కూడా చదవండి: హ్యుందాయ్ కొత్త 1.5 లీటర్ టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను పొందుతున్న కియా సెల్టోస్ మరియు కేరెన్స్
మహీంద్రా XUV400 EVని – ఫన్, ఫాస్ట్ మరియు ఫియర్ లెస్ డ్రైవ్ మోడ్ؚలలో అందిస్తున్నారు- ఇవి త్రోటిల్ స్పందనను మారుస్తాయి. 456 కిలోమీటర్‌ల మైలేజ్‌తో, XUV400 డ్రైవర్ ఆందోళనను తగ్గిస్తుంది మరియు ఆకర్షణీయమైన డ్రైవింగ్ అనుభవాన్ని అందిస్తుంది. ఇది టాటా నెక్సాన్ EV మాక్స్ؚతో నేరుగా పోటీ పడుతుంది, సిట్రోయెన్ eC3 లాంటి మోడల్‌ల కంటే పై స్థానంలో ఉంటుంది.
ఇక్కడ మరింత చదవండి: XUV400 EV ఆటోమ్యాటిక్
0 out of 0 found this helpful