హోండా ఎలివేట్ విడుదల తేదీ వివరాలు
హోండా కారు తయారీదారు నుండి వస్తున్న సరికొత్త కాంపాక్ట్ SUV, ఎలివేట్ ధరలు ఈ సంవత్సరం సెప్టెంబర్ మొదటి వారంలో ప్రకటించనున్నారు.
-
హోండా ఎలివేట్ బుకింగ్ؚలు జూలై మొదటి వారం నుండి ప్రారంభమయ్యాయి, రూ.5,000 ముందస్తు ధరను చెల్లించి బుక్ చేసుకోవచ్చు.
-
ఎలివేట్‌ను హోండా నాలుగు విస్తృత వేరియెంట్ؚలలో అందిస్తుంది: SV, V, VX మరియు ZX.
-
ఈ SUV ఆగస్ట్ మధ్యలో షోరూమ్ؚలకు చెరనుంది.
-
మాన్యువల్ మరియు ఆటోమ్యాటిక్ ఎంపికలు రెండింటితో సిటి 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్ؚను ఉపయోగిస్తుంది.
-
ఫీచర్ ముఖ్యాంశాలలో 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్, సింగిల్-పేన్ సన్ؚరూఫ్, మరియు ADAS ఉన్నాయి.
-
ధరలు రూ.11 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభం అవుతాయని అంచనా.
కొత్త హోండా ఎలివేట్ SUV ఫస్ట్‌లుక్‌ను ఇప్పటికే జూన్ ప్రారంభంలో చూశాము, దిని ప్రపంచవ్యాప్త విడుదలను భారతదేశంలో ఆవిష్కరించారు. దీని బుకింగ్ؚలు జూలై మొదటి వారం నుండి ప్రారంభం అయ్యాయి, రూ.5,000 ముందస్తు ధరను చెల్లించి బుక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ మొదటి వారంలో ఎలివేట్ విక్రయాలు ప్రారంభం అవ్వనున్నాయి. ఆగస్ట్ మధ్యలో వ్యక్తిగతంగా పరిశీలించడానికి వీలుగా ఈ వాహనాలు డీలర్ؚషిప్ؚలకు చేరుకొనున్నాయి.
బోనెట్ క్రింద సుపరిచిత ఇంజన్
ఎలివేట్ కోసం హోండా, 121PS మరియు 145Nm విడుదల చేసే సిటీ 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజన్‌పై ఆధారపడింది. సెడాన్ؚలో ఉన్నట్లు గానే, SUV కూడా 6-స్పీడ్ మాన్యువల్ ‘బాక్స్ లేదా CVTతో వస్తుంది. క్లెయిమ్ చేసిన మైలేజ్ గణాంకాలు ఇటీవల వెల్లడించారు, ఆటోమ్యాటిక్ మరింత మైలేజ్‌ను అందించనుంది. అయితే, ఎలివేట్ బలమైన హైబ్రిడ్ పవర్‌ట్రెయిన్ؚతో (సిటీ హైబ్రిడ్ విధంగా) అందించబడదు మరియు 2026 నాటికి నేరుగా EVన కూడా పొందనుంది.
ప్రీమియం ఎక్విప్మెంట్‌ను పొందుతుంది
ఈ కాంపాక్ట్ SUV ఫీచర్‌ల జాబితాలో వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ؚప్లేతో 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, 7-అంగుళాల సెమీ-డిజిటల్ డ్రైవర్ డిస్ప్లే మరియు సింగిల్-పేన్ సన్ؚరూఫ్ ఉన్నాయి. ఇతర ఫీచర్‌లలో పుష్-బటన్ స్టార్ట్/స్టాప్, ఆటో క్లైమేట్ కంట్రోల్, క్రూయిజ్ కంట్రోల్ కూడా ఉన్నాయి.
ఎలివేట్ؚలో అడ్వాన్సెడ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్‌లు (ADAS), ఆరు ఎయిర్ బ్యాగ్ؚలు, లేన్ؚవాచ్ కెమెరా (ఎడమ ORVMపై అమర్చబడింది) మరియు ISOFIX చైల్డ్ సీట్ యాంకరేజీలు వంటి భద్రత సాంకేతికతను హోండా అందిస్తుంది. కొత్త హోండా SUV నాలుగు వేరియెంట్ؚలలో లభిస్తుంది - SV, V, VX మరియు ZX.
ఇది కూడా చదవండి: భారతదేశంలో హోండా ఎలివేట్ తో పాటు సరికొత్త WR-Vని కూడా అందించాలా?
పోటీదారుల పరిశీలన
ఎలివేట్ ధర రూ.11 లక్షలు (ఎక్స్-షోరూమ్) ఉంటుందని ఆశిస్తున్నాము. హోండా SUV వోక్స్వాగన్ టైగూన్, స్కోడా కుషాక్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, MG ఆస్టర్‌లతో పాటు ఈ విభాగంలో ఉత్తమమైన హ్యుందాయ్ క్రెటా మరియు కియా సెల్టోస్ వంటి వాటితో కూడా పోటీ పడుతుంది. అంతేకాకుండా విడుదల కానున్న సిట్రోయెన్ C3 ఎయిర్‌క్రాస్‌తో కూడా పోటీ పడనుంది.