హోండా ఎలివేట్ ఇంధన సామర్ధ్య గణాంకాలు!
జూలై 26, 2023 05:47 pm tarun ద్వారా ప్రచురించబడింది
- 1.8K Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ కాంపాక్ట్ SUV సిటీలో ఉన్న 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది
-
హోండా ఎలివేట్ మాన్యువల్ వేరియెంట్‌లు 15.31kmpl ఇంధన సామర్ధ్యాన్ని అందిస్తున్నాయి.
-
CVT వేరియెంట్‌లు మాత్రం 16.92kmpl వరకు మైలేజ్‌ను అందించవచ్చు.
-
ఈ SUV 121PS 1.5-లీటర్ పెట్రోల్ ఇంజన్‌ను పొందుతుంది; హైబ్రిడ్ లేదా డీజిల్ ఎంపికలో వచ్చే అవకాశం లేదు.
-
2025 నాటికి ఎలివేట్ؚ EV వర్షన్ కూడా రానుంది.
-
ధరలు రూ.11 లక్షల నుండి రూ.18 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటాయి.
హోండా ఎలివేట్ ఇంధన సామర్ధ్యం వివరాలు వెల్లడయ్యాయి. ఈ కాంపాక్ట్ SUV ప్రరపంచవ్యాప్తంగా జూన్ నెలలో విడుదలైంది మరియు ధరలను సెప్టెంబర్ؚలో ప్రకటించవచ్చు.
హోండా ఎలివేట్ؚను సుపరిచిత 1.5-లీటర్ i-VTEC పెట్రోల్ ఇంజన్ؚతో అందిస్తున్నారు, ఇది 6-స్పీడ్ మాన్యువల్ మరియు CVT ఆటోమాటిక్ ఎంపికతో వస్తుంది. మాన్యువల్ ఎంపిక 15.31kmpl ఇంధన సామర్ధ్యాన్ని, CVT ఎంపిక 16.92kmpl మైలేజ్‌ను అందిస్తుంది. మెరుగైన మైలేజ్ మరియు సులభమైన డ్రైవింగ్ రెండిటి అనుభవాల కలయికగా ఉండేలా హోండా ట్రాన్స్ؚమిషన్ؚను రూపొందించింది.
ఇతర పవర్ؚట్రెయిన్ వివరాలు
హోండా సిటీ సెడాన్ؚలో ఉన్నట్లుగానే ఈ ఇంజన్ కూడా 121PS మరియు 145Nmగా టార్క్‌ను అందిస్తుంది. డీజిల్ పవర్ؚట్రెయిన్ؚను అందించడం లేదు, సిటిలో అందించే బలమైన హైబ్రిడ్ ఎంపిక కూడా ఇందులో లేదు.
అయితే, ఎలివేట్ EV వర్షన్ 2025 నాటికి వస్తుంది. ఇది 400-450 కిలోమీటర్‌ల వరకు డ్రైవింగ్ పరిధిని అందిస్తుందని అంచనా, దీని ధర సుమారు రూ.20 లక్షల వరకు ఉండవచ్చు. దీనికి MG ZS EV మరియు విడుదల కానున్న హ్యుందాయ్ EV పోటీ కావచ్చు.
ఇది కూడా చదవండి: ఈ 10 చిత్రాలలో హోండా ఎలివేట్ ఎక్స్ؚటీరియర్ؚను పరిశీలించండి
హోండా ఎలివేట్ వివరాల సారాంశం
హోండా ఎలివేట్ సింగిల్-పేన్ సన్-రూఫ్, 10.25-అంగుళాల టచ్ؚస్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్, వైర్ؚలెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు యాపిల్ కార్ ప్లే, 7-అంగుళాల డిజిటల్ డ్రైవర్ డిస్ప్లేؚ మరియు ఆటోమ్యాటిక్ ACలతో వస్తుంది. ఆరు ఎయిర్ؚబ్యాగ్ؚలు, హిల్ స్టార్ట్ అసిస్ట్, మరియు రాడార్-ఆధారిత ADAS సాంకేతికత భద్రతను అందిస్తాయి.
దీని ధర రూ.11 లక్షల నుండి రూ.18 లక్షల (ఎక్స్-షోరూమ్) వరకు ఉంటుందని అంచనా. ఈ విభాగంలో ప్రముఖమైన హ్యుందాయ్ క్రెటా, కియా సెల్టోస్, మారుతి గ్రాండ్ విటారా, టయోటా హైరైడర్, వోక్స్వ్యాగన్ టైగూన్, సిట్రోయెన్ C3 ఎయిర్ క్రాస్, స్కోడా కుషాక్ మరియు MG ఆస్టర్ వంటి వాటిలో హోండా ఎలివేట్ పోటీ పడుతుంది.