ఈ ఏప్రిల్ؚలో రెనాల్ట్ కార్‌లపై రూ.72,000 వరకు ప్రయోజనాలను పొందండి
రెనాల్ట్ క్విడ్ కోసం ansh ద్వారా ఏప్రిల్ 10, 2023 11:07 am ప్రచురించబడింది
- 38 Views
- ఒక వ్యాఖ్యను వ్రాయండి
ఈ ఏప్రిల్ నెలలో అన్నీ మోడల్‌లపై క్యాష్, ఎక్స్ؚఛేంజ్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ؚలను కారు తయారీదారు అందిస్తున్నారు
-
రెనాల్ట్ కైగర్ మరియు ట్రైబర్ రూ.72,000 వరకు అత్యధిక ప్రయోజనాలతో వస్తున్నాయి.
-
క్విడ్ؚను రూ.67,000 వరకు డిస్కౌంట్‌తో పొందవచ్చు.
-
ఈ ఆఫర్‌లు BS6 ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 యూనిట్‌లు రెండిటిపై అందుబాటులో ఉన్నాయి.
-
ఈ నెల చివరి వరకు డిస్కౌంట్ؚలను పొందవచ్చు.
BS6 ఫేజ్ 2 నిబంధనల కారణంగా ధరల పెరుగుదలతో, ఇతర కారు తయారీదారులతో పాటు, రెనాల్ట్ కూడా తన పూర్తి లైన్అప్‌పై ఆఫర్‌లను అందిస్తోంది. BS6 ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 యూనిట్‌లపై ఏప్రిల్ చివరి వరకు క్యాష్, ఎక్స్ؚఛేంజ్ మరియు కార్పొరేట్ డిస్కౌంట్ؚలతో పాటుగా స్క్రాపేజ్ చేసే ప్రయోజనాలను కూడా అందిస్తోంది.
ఇది కూడా చదవండి: ఈ ఏప్రిల్‌లో మారుతి నెక్సా కార్‌లపై రూ.44,000 వరకు ఆదా చేయండి
మోడల్-వారీ ఆఫర్ జాబితాను ఇక్కడ చూడండి”
క్విడ్
ఆఫర్‌లు |
BS6 ఫేజ్ 1 (MY22) |
BS6 ఫేజ్ 2 (MY23) |
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 25,000 వరకు |
రూ. 5,000 వరకు |
ఎక్స్ؚఛేంజ్ ప్రయోజనం |
రూ. 20,000 వరకు |
రూ. 10,000 వరకు |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ. 12,000 వరకు |
రూ. 12,000 వరకు |
స్క్రాపేజ్ ప్రయోజనం |
రూ. 10,000 వరకు |
రూ. 10,000 వరకు |
పూర్తి ప్రయోజనాలు |
రూ. 67,000 వరకు |
రూ. 37,000 వరకు |
-
క్విడ్ BS6 ఫేజ్ 1 యూనిట్‌లపై క్యాష్ డిస్కౌంట్ ఎంపికైన వేరియెంట్ؚలపై మాత్రమే ఉంటుంది, AMT వేరియెంట్ؚలపై రూ.25,000 వరకు మరియు మాన్యువల్ వేరియెంట్ؚలపై రూ.20,000 వరకు ఉంటుంది.
-
అన్నీ వేరియెంట్ؚల BS6 ఫేజ్ 1 యూనిట్‌లపై రూ.20,000 వరకు మరియు ఫేజ్ 2 యూనిట్‌లపై రూ.10,000 వరకు ఎక్స్ؚఛేంజ్ ప్రయోజనాలు లభిస్తున్నాయి.
-
BS6 ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 యూనిట్‌లపై సమానమైన కార్పొరేట్ (ఎంపికైన వేరియెంట్ؚల పైన) మరియు స్క్రాపేజ్ డిస్కౌంట్‌లను అందిస్తుంది.
-
రెనాల్ట్ క్విడ్ ధర రూ.4.70 లక్షల నుండి రూ.6.33 లక్షల పరిధిలో ఉంటుంది.
కైగర్
ఆఫర్‌లు |
BS6 ఫేజ్ 1 (MY22 & MY23) |
BS6 ఫేజ్ 2 (MY23) |
క్యాష్ డిస్కౌంట్ |
రూ. 25,000 వరకు |
రూ. 10,000 వరకు |
ఎక్స్ؚఛేంజ్ ప్రయోజనం |
రూ. 25,000 వరకు |
రూ. 20,000 వరకు |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ. 12,000 వరకు |
రూ. 12,000 వరకు |
స్క్రాపేజ్ ప్రయోజనం |
రూ. 10,000 వరకు |
రూ. 10,000 వరకు |
మొత్తం ప్రయోజనాలు |
రూ. 72,000 వరకు |
రూ. 52,000 వరకు |
-
BS6 ఫేజ్ 1 యూనిట్‌ల నేచురల్లీ ఆస్పిరేటెడ్ AMT వేరియెంట్ؚలపై రూ.25,000 మరియు నేచురల్లీ ఆస్పిరేటెడ్ మాన్యువల్ మరియు టర్బో వేరియెంట్ؚలపై రూ.15,000 వరకు క్యాష్ డిస్కౌంట్ లభిస్తుంది. BS6 ఫేజ్ 2 యూనిట్ కొన్ని వేరియెంట్ؚలపై రూ.10,000 వరకు డిస్కౌంట్ؚను అందిస్తున్నారు.
-
కైగర్ BS6 ఫేజ్ 1 యూనిట్‌లపై రూ.25,000 వరకు మరియు ఫేజ్ 1 యూనిట్‌లపై రూ.20,000 వరకు ఎక్స్‌ఛేంజ్ బోనస్ؚను పొందండి. ఇవి కొన్ని వేరియెంట్‌లపై మాత్రమే
-
కైగర్ BS6 ఫేజ్ 1 బేస్-స్పెక్ RXE వేరియెంట్‌పై ఎటువంటి క్యాష్ లేదా ఎక్స్ؚఛేంజ్ ప్రయోజనాలు ఉండవు.
-
కైగర్ BS5 ఫేజ్ 1 మరియు 2 వేరియెంట్ؚలపై సమానమైన కార్పొరేట్ డిస్కౌంట్ మరియు స్క్రాపేజ్ ప్రయోజనాలు అందిస్తున్నారు.
-
కైగర్ ధర రూ.6.50 లక్షల నుండి రూ.11.23 లక్షల మధ్య ఉంటుంది.
ట్రైబర్
ఆఫర్‌లు |
BS6 ఫేజ్ 1 |
BS6 ఫేజ్ 2 (MY23) |
|
MY22 |
MY23 |
||
క్యాష్ డిస్కౌంట్ |
రూ.25,000 వరకు |
రూ. 15,000 వరకు |
రూ. 10,000 వరకు |
ఎక్స్ؚఛేంజ్ బెనిఫిట్ |
రూ.25,000 వరకు |
రూ. 25,000 వరకు |
రూ. 20,000 వరకు |
కార్పొరేట్ డిస్కౌంట్ |
రూ.12,000 వరకు |
రూ. 12,000 వరకు |
రూ. 12,000 వరకు |
స్క్రాపేజ్ ప్రయోజనం |
రూ.10,000 వరకు |
రూ. 10,000 వరకు |
రూ. 10,000 వరకు |
మొత్తం ప్రయోజనాలు |
రూ.72,000 వరకు |
రూ. 62,000 వరకు |
రూ. 52,000 వరకు |
-
BS6 ఫేజ్ 1 యూనిట్‌లపై రూ.25,000 వరకు క్యాష్ డిస్కౌంట్ؚతో వస్తాయి BS6 ఫేజ్ 2 యూనిట్‌లలో కొన్ని వేరియెంట్ؚలపై రూ.10,000 వరకు డిస్కౌంట్ؚతో వస్తాయి.
-
BS6 ఫేజ్ 1 యూనిట్‌లపై ఎక్స్ؚఛేంజ్ బోనస్ రూ.25,000 వరకు మరియు ఫేజ్ 2 యూనిట్‌లపై రూ.20,000 వరకు లభిస్తుంది.
-
BS6 ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 యూనిట్‌లు రెండిటిపై సమానమైన కార్పొరేట్ మరియు స్క్రాపేజ్ రిపోర్ట్ؚలు లభిస్తాయి.
-
ట్రైబర్ ధరలు రూ.6.33 లక్షల నుండి రూ.8.98 లక్షల పరిధిలో ఉంటాయి.
*అన్నీ ఎక్స్-షోరూమ్ ఢిల్లీ ధరలు
ఇది కూడా చూడండి: యూరోప్‌లో కనిపించిన కొత్త జెన్ రెనాల్ట్ డస్టర్!
గమనిక:
-
పైన పేర్కొన్న జాబితాలోని ఆఫర్‌లు మీ ప్రాంతం మరియు మీరు ఎంచుకున్న వేరియెంట్‌పై ఆధారపడి మారవచ్చు. మరింత సమాచారం పొందడానికి, మీ దగ్గరలోని రెనాల్ట్ డీలర్ؚను సంప్రదించవలసిందిగా కోరుతున్నాము.
-
అన్నీ మోడల్‌లపై రూ.5,000 వరకు గ్రామీణ డిస్కౌంట్ కూడా లభిస్తుంది. కస్టమర్‌లు గ్రామీణ డిస్కౌంట్ లేదా కార్పొరేట్ డిస్కౌంట్ؚను పొందవచ్చు, రెండిటినీ పొందలేరు.
-
క్విడ్ BS6 ఫేజ్ 2కు అనుగుణంగా ఉండే బేస్-స్పెక్ RXE వేరియెంట్ మరియు కైగర్ BS6 ఫేజ్ 1 మరియు ఫేజ్ 2 RXE వేరియెంట్ؚలపై మరియు ట్రైబర్‌పై కేవలం లాయల్టీ ప్రయోజనాలు మాత్రమే లభిస్తాయి.
-
ఈ లాయల్టీ ప్రయోజనాలలో రూ.10,000 వరకు క్యాష్ డిస్కౌంట్, రూ.5.31 లక్షల వరకు ఋణ మొత్తంపై వర్తించే 3.99 శాతం వడ్డీ, మూడు సంవత్సరాల రోడ్ సైడ్ అసిస్టెన్స్‌తో మూడు సంవత్సరాలు/60,000km (ఏది ముందు అయితే అది) పొడిగించిన వారెంటీ మరియు మూడు సంవత్సరాల/30,000km వార్షిక మెయింటెనెన్స్ కేర్ ప్యాకేజీ ఉంటాయి.
ఇక్కడ మరింత చదవండి: క్విడ్ AMT
0 out of 0 found this helpful