Login or Register కోసం ఉత్తమ CarDekho experience
Login

2023 హ్యుందాయ్ వెర్నా కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్ గురించి మీరు తెలుసుకోవలసిన విషయాలు

హ్యుందాయ్ వెర్నా కోసం shreyash ద్వారా మార్చి 02, 2023 12:18 pm ప్రచురించబడింది

కొత్త జనరేషన్ వెర్నా మార్చి 21, 2023 తేదీన అధికారికంగా విడుదల అవ్వనుంది: బుకింగ్ؚలు ప్రారంభమయ్యాయి.

  • కొత్త జనరేషన్ వెర్నాను రూ.25,000 ముందస్తు ధరతో బుక్ చేసుకోవచ్చు.

  • రానున్న సెడాన్ డిజైన్‌ను ఇప్పటికే లీక్ అయిన స్పై షాట్‌లు, టీజర్‌లలో చూడవచ్చు.

  • హ్యుందాయ్, ఈ సెడాన్ؚను రెండు ఇంజన్ ఎంపికలు: 1.5-లీటర్ T-GDi (టర్బో) పెట్రోల్ మరియు 1.5-లీటర్ MPi (నేచురల్లీ ఆస్పిరేటెడ్) పెట్రోల్ ఇంజన్ؚలతో అందిస్తుంది.

  • వెర్నా ఇకపై డీజిల్ ఇంజన్ؚతో అందుబాటులో ఉండదు.

  • ADAS వంటి ప్రీమియం ఫీచర్‌లతో వస్తుంది.

హ్యుందాయ్ తన కొత్త జనరేషన్ వెర్నాను కొత్త ఫీచర్‌లు, నవీకరించిన సాంకేతికతతో భారతదేశంలో ప్రవేశపెట్టనుంది. ఈ కాంపాక్ట్ సెడాన్, ప్రస్తుతం ఉన్న 1.5-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ (MPi) పెట్రోల్ ఇంజన్ؚతో పాటు, కొత్త 1.5-లీటర్ T-GDi టర్బో చార్జెడ్ పెట్రోల్ ఇంజన్ؚను కూడా కలిగి ఉంటుంది. దీని విడుదలకు ముందు, నవీకరించబడిన ఆల్కజార్ؚలో కూడా అందిస్తున్న తమ కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్ విడుదల చేసే శక్తి మరియు టార్క్ؚల వివరాలు తెలుసుకుందాం.

స్పెసిఫికేషన్‌లు

1.5-లీటర్ టర్బో

1.5-లీటర్ NA

పవర్

160PS

115PS

టార్క్

253Nm

144Nm

ట్రాన్స్ؚమిషన్

6-స్పీడ్ MT/7-స్పీడ్ DCT

6-స్పీడ్ MT/CVT

పైన పేర్కొన్న రెండు ఇంజన్‌లు, రాబోయే BS6 ఫేజ్ II నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి, వీటిలో E20 ఇంధనాన్ని (20-శాతం ఎథనాల్-బ్లెండెడ్ పెట్రోల్) కూడా ఉపయోగించవచ్చు. అంతేకాకుండా, ఈ కారు తయారీదారు సెడాన్ వాహనాలలో 1.5-లీటర్ డీజిల్ ఇంజన్ ఎంపికను నిలిపివేశారు.

ఇది కూడా చూడండి: టాటా పంచ్ؚకు సంభావ్య పోటీదారుగా నిలివగల కొత్త హ్యుందాయ్ సబ్ؚకాంపాక్ట్ SUV కనిపించింది

వెర్నా పోటీపడే విభాగంలో కొత్త టర్బో-పెట్రోల్ ఇంజన్ అత్యంత శక్తివంతమైనదే కాకుండా, ఇంధనాన్ని కూడా ఆదా చేస్తుంది. పెద్దదైన, బాక్సియర్ లుక్ కలిగిన ఆల్కజార్ ఇంజన్ (18kmpl వరకు) మీలేజ్ అందిస్తుంది అని అంచనా. చినదైన, మరింత ఏరో డైనమిక్ కలిగిన వెర్నాలో ఇది సుమారు 20kmpl వరకు ఇస్తుంది.

సరికొత్త ఆకర్షణీయమైన లుక్స్

కొత్త జనరేషన్ వెర్నా డిజైన్ ఇప్పటికే టీజర్, స్పై షాట్‌లలో కనిపించింది. ఈ సెడాన్ ముందు భాగంలో పొడవైన LED DRL స్ట్రిప్ؚతో ‘పారామెట్రిక్ జ్యువెల్’ డిజైన్ గ్రిల్ؚను కలిగి ఉంది.

ఏటవాలుగా ఉన్న రూఫ్ؚలైన్ పక్కవైపుల నుంచి షార్ప్ؚగా కనిపిస్తుంది, దీని డిజైన్ ప్రపంచవ్యాప్తంగా అందుబాటులో ఉన్న ఎలాంట్రా నుంచి ప్రేరణ పొందింది. కొత్త వెర్నా వెనుక వైపు కనెక్టెడ్ LED టేల్ؚలైట్‌లను కూడా కలిగి ఉంది.

ఇది కూడా చదవండి: నవీకరించబడిన ఆల్కజార్‌లో టర్బో-పెట్రోల్ ఇంజన్ؚను అందిస్తున్న హ్యుందాయ్, బుకింగ్ؚలు ప్రారంభం

ఆశించగల ఫీచర్‌లు

నవీకరించబడిన వెర్నాలో, కొత్త ఇంటెగ్రేటెడ్ స్క్రీన్ సెట్అప్ (ఇన్ఫోటైన్ మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్ కోసం) ఉండవచ్చు. ఆటో ఎమర్జెన్సీ బ్రేకింగ్, లేన్ అసిస్ట్ వంటి పూర్తి ADAS సూట్‌ను (అడ్వాన్సెడ్ డ్రైవర్-అసిస్టెన్స్ సిస్టమ్స్) కలిగి ఉంటుంది, అడాప్టివ్ క్రూజ్ కంట్రోల్ؚను కూడా చేర్చవచ్చు. ఆశిస్తున్న ఇతర ఫీచర్‌లలో వైర్ؚలెస్ ఫోన్ ఛార్జర్, డ్యూయల్ జోన్ క్లైమెట్ కంట్రోల్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్‌లు, ప్రీమియం సౌండ్ సిస్టమ్ ఉండవచ్చు.

అంచనా ధర పోటీదారులు

కొత్త వెర్నా ధరలను హ్యుందాయ్ మార్చి 21 తేదీన వెల్లడించనుంది, దీని ధర రూ.10 లక్షల (ఎక్స్-షోరూమ్) నుండి ప్రారంభమవుతుందని అంచనా. లాంచ్ తరువాత, ఇది స్కోడా స్లావియా, వోక్స్ؚవ్యాగన్ విర్టస్, మారుతి సియాజ్, నవీకరించబడిన హోండా సిటీలతో పోటీని కొనసాగిస్తుంది.

Share via

Write your Comment on Hyundai వెర్నా

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

Enable notifications to stay updated with exclusive offers, car news, and more from CarDekho!

ట్రెండింగ్‌లో ఉంది సెడాన్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
కొత్త వేరియంట్
Rs.6.54 - 9.11 లక్షలు*
ఫేస్లిఫ్ట్
కొత్త వేరియంట్
Rs.11.82 - 16.55 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.6 - 9.50 లక్షలు*
కొత్త వేరియంట్
Rs.11.07 - 17.55 లక్షలు*
*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర