• English
  • Login / Register

కొత్త, పూర్తి ఫీచర్‌లతో షైన్ వేరియెంట్ؚతో పాటు BS6 ఫేజ్ 2 అప్‌డేట్‌ను పొందిన సిట్రోయెన్ C3 టర్బో వేరియెంట్ؚలు

సిట్రోయెన్ సి3 కోసం rohit ద్వారా మే 05, 2023 01:45 pm ప్రచురించబడింది

  • 83 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

ఈ అప్ؚడేట్ؚతో, ప్రస్తుతం C3 ధర రూ.6.16 లక్షల నుండి రూ.8.92 లక్షలుగా (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) ఉంది

Citroen C3

  • C3 అన్ని వేరియెంట్ؚలు ఇప్పుడు BS6 ఫేజ్ 2 నిబంధనలకు అనుగుణంగా ఉన్నాయి. 

  • C3 టర్బో డెలివరీలు మే నెల మధ్యలో మొదలవుతాయి.

  • సిట్రోయెన్ టర్బో వేరియెంట్ؚలను ESP మరియు ఐడిల్-ఇంజన్ స్టార్ట్/స్టాప్ వంటి కొన్ని ప్రత్యేక ఫీచర్‌లతో అందిస్తుంది. 

  • C3 రెండు పెట్రోల్ ఇంజన్‌ల ఎంపికతో వస్తుంది – 82PS 1.2-లీటర్ N.A. మరియు 110PS 1.2-లీటర్ టర్బో.

కొత్త టాప్-స్పెక్ షైన్ వేరియెంట్ؚను సిట్రోయెన్ C3 నేచురల్లీ ఆస్పిరేటెడ్ వేరియెంట్ؚలతో పరిచయం చేసిన తరువాత, ఈ కారు తయారీదారు ప్రస్తుతం ఈ హ్యాచ్ؚబ్యాక్ షైన్ టర్బో వేరియెంట్‌లను ఆవిష్కరించారు. ఈ అప్ؚడేట్ؚతో, టర్బో వేరియెంట్‌లు ఇప్పుడు BS6 ఫేజ్ 2కు అనుగుణంగా కూడా ఉన్నాయని గమనించండి. C3 టర్బో డెలివరీలు మే నెల మధ్యలో ప్రారంభం అవుతాయని సిట్రోయెన్ తెలియజేసింది.

C3 హ్యాచ్ؚబ్యాక్ పూర్తి మరియు అప్ؚడేట్ చేసిన ధరల జాబితా ఇక్కడ అందించబడింది:

వేరియెంట్ 

ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ)

లైవ్ 

రూ. 6.16 లక్షలు 

ఫీల్

రూ. 7.08 లక్షలు 

ఫీల్ వైబ్ ప్యాక్ 

రూ. 7.23 లక్షలు 

ఫీల్ డ్యూయల్ టోన్ 

రూ. 7.23 లక్షలు 

ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్ 

రూ. 7.38 లక్షలు 

షైన్ 

రూ. 7.60 లక్షలు 

షైన్ వైబ్ ప్యాక్ 

రూ. 7.72 లక్షలు 

షైన్ డ్యూయల్ టోన్ 

రూ. 7.75 లక్షలు 

షైన్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్ 

రూ. 7.87 లక్షలు 

ఫీల్ టర్బో డ్యూయల్ టోన్ (కొత్తది)

రూ. 8.28 లక్షలు 

ఫీల్ డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్ (కొత్తది)

రూ. 8.43 లక్షలు 

షైన్ టర్బో డ్యూయల్ టోన్ (కొత్తది)

రూ. 8.80 లక్షలు 

షైన్ టర్బో డ్యూయల్ టోన్ వైబ్ ప్యాక్ (కొత్తది)

రూ. 8.92 లక్షలు 

మరేమైనా మార్పులు ఉన్నాయా?

Citroen C3 idle-engine start/stop
Citroen C3 hill-hold assist

సిట్రోయెన్ C3 టర్బో వేరియెంట్ؚలలో ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రాం (ESP), హిల్-హోల్డ్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్, ఐడిల్-ఇంజన్ స్టార్ట్-స్టాప్ వంటి ఫీచర్‌లను ప్రత్యేకంగా అందిస్తుంది. ఇటీవల పరిచయం చేసిన షైన్ వేరియెంట్ ఎలక్ట్రికల్లీ అడ్జస్టబుల్ ORVMలు, ఫాగ్ ల్యాంప్ؚలు, 15-అంగుళాల డ్యూయల్-టోన్ అలాయ్ వీల్స్, 35 కనెక్టెడ్ కార్ టెక్ ఫీచర్‌లు మరియు డే/నైట్ IRVMలతో వస్తుంది. దీని భద్రత ఫీచర్‌లؚలో రివర్సింగ్ కెమెరా, రేర్ డిఫోగ్గర్, మరియు రేర్ వైపర్, వాషర్ కూడా ఉంటాయి.

ఇది కూడా చదవండి: ఈ సంవత్సరం సమ్మర్ సర్వీస్ క్యాంప్ؚలో సిట్రోయెన్ కస్టమర్‌లు పొందగలిగే ప్రయోజనాలు

C3 ఇంజన్‌ల వివరాలు

Citroen C3 1.2-litre naturally aspirated petrol engine

C3 రెండు పెట్రోల్ ఇంజన్‌ల ఎంపికను అందిస్తుంది – 1.2-లీటర్ నేచురల్లీ ఆస్పిరేటెడ్ ఇంజన్ (82PS/115Nm) ఇది 5-స్పీడ్‌ మాన్యువల్‌తో జోడించబడుతుంది. మరొకటి 1.2-లీటర్ టర్బో చార్జెడ్ యూనిట్ (110PS/190Nm), ఇది 6-స్పీడ్‌ మాన్యువల్ ట్రాన్స్ؚమిషన్ؚతో మాత్రమే జోడించబడుతుంది. త్వరలో సిట్రోయెన్ C3ని ఆటోమ్యాటిక్ గేర్ؚబాక్స్ؚతో కూడా అందిస్తుందని అంచనా. 

ఇది కూడా చదవండి: సిట్రోయెన్ C3 మరియు C3 ఎయిర్ؚక్రాస్ మధ్య గమనించదగిన 5 ముఖ్యమైన తేడాలు 

పోటీదారులను చూద్దాం 

Citroen C3 rear

మరిన్ని ఫీచర్‌లతో సిట్రోయెన్ హ్యాచ్ؚబ్యాక్- మారుతి వ్యాగన్ R, సెలెరియో మరియు టాటా టియాగో వంటి వాటితో పోటీని కొనసాగిస్తుంది. దీని పరిమాణం మరియు ధరను కారణంగా, ఇది మారుతి బాలెనో, టాటా ఆల్ట్రోజ్, హ్యుందాయ్ i20 వంటి ప్రీమియం హ్యాచ్ؚబ్యాక్ؚలతో అలాగే నిసాన్ మాగ్నైట్, మారుతి ఫ్రాంక్స్ మరియు రెనాల్ట్ కైగర్ వంటి సబ్-4m SUVలతో కూడా పోటీ పడుతుంది.

ఇక్కడ మరింత చదవండి: సిట్రోయెన్ C3 ఆన్ؚరోడ్ ధర

was this article helpful ?

Write your Comment on Citroen సి3

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience