• English
  • Login / Register

వచ్చే నెల నుండి ధర పెంపుతో రానున్న సిట్రోయెన్ C3

సిట్రోయెన్ సి3 కోసం shreyash ద్వారా జూన్ 13, 2023 07:06 pm ప్రచురించబడింది

  • 29 Views
  • ఒక వ్యాఖ్యను వ్రాయండి

2023లో సిట్రోయెన్ C3 ధర పెరగడం ఇది మూడోసారి, ప్రారంభించిన తర్వాత ఇది నాల్గొవసారి .

Citroen C3

  • సిట్రోయెన్ C3 ప్రస్తుతం రూ. 6.16 లక్షల రూపాయల నుండి రూ.8.92 లక్షల రూపాయల మధ్య ధరను కలిగి ఉంది.(ఎక్స్-షోరూమ్, ఢిల్లీ).
  • ఇది రెండు ఇంజన్ ఎంపికలతో వస్తుంది: 1.2-లీటర్ NA పెట్రోల్ మరియు 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్.
  • ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ ప్లే లకు మద్దతు ఇచ్చే 10.2 - అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్  ఫీచర్‌ ఉంది.
  • ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS) లను కూడా ఇప్పుడు C3 కలిగి ఉంది.

సిట్రోయెన్ C3పై మరో 17,500 రూపాయలు వ్యచ్చించడానికి సిద్ధంగా ఉండండి. ఈ ఏడాది జూలై 1 నుంచి ఈ హ్యాచ్బ్యాక్ ధరలు మళ్లీ పెరగనున్నాయి. సిట్రోయెన్ ఇప్పటికే C 3 యొక్క ఫీచర్ సెట్ను సవరించింది, కొత్త టాప్ స్పెక్ 'షైన్' వేరియంట్ ను విడుదల చేసింది, C 3 ను మూడు విస్తృత వేరియంట్లలో అందుబాటులో ఉంచుతుంది. 

C3 యొక్క ప్రస్తుత ధరలు చూద్దాం.

ధరల పట్టిక

వేరియంట్

ధర

లైవ్ 

రూ 6.16 లక్షలు

ఫీల్

రూ 7.08లక్షలు

ఫీల్ వైబ్ ప్యాక్

రూ 7.23 లక్షలు

ఫీల్ డ్యూయల్ టోన్

రూ 7.23లక్షలు

ఫీల్ డ్యూయల్ టోన్ విత్ వైబ్ ప్యాక్‌

రూ 7.38లక్షలు

ఫీల్ టర్బో డ్యూయల్ టోన్

రూ 8.28 లక్షలు

ఫీల్ టర్బో డ్యూయల్ టోన్ విత్ వైబ్ ప్యాక్‌ 

రూ 8.43 లక్షలు

షైన్

రూ 7.60లక్షలు

షైన్ డ్యూయల్ టోన్‌

రూ 7.75లక్షలు

షైన్ డ్యూయల్ టోన్‌ విత్ వైబ్ ప్యాక్‌

రూ 7.87 లక్షలు

షైన్ టర్బో డ్యూయల్ టోన్

రూ 8.80 లక్షలు

షైన్ టర్బో డ్యూయల్ టోన్ విత్ వైబ్ ప్యాక్‌

రూ 8.92 లక్షలు

అన్ని ధరలు ఎక్స్-షోరూమ్ ఢిల్లీ 

హ్యాచ్బ్యాక్ ధర 17,500 రూపాయలు పెరగనున్నందున, వేరియంట్ల ఆధారంగా ధరల పెరుగుదల మారవచ్చు.

ఆఫర్‌లో ఫీచర్లు

Citroen C3 Cabin

సిట్రోయెన్ C 3 ను 10.2 అంగుళాల టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్తో అమర్చారు, ఇది ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్ప్లేకు మద్దతు ఇస్తుంది. C3 లో ఎలక్ట్రికల్ గా సర్దుబాటు చేయగల ORVM లు, డే / నైట్  IRVM లు, ఎత్తు సర్దుబాటు చేయగల డ్రైవర్ సీటు మరియు నాలుగు స్పీకర్ సౌండ్ సిస్టమ్ కూడా ఉన్నాయి.

ప్రయాణీకుల భద్రత కోసం ముందు భాగంలో ద్వంద్వ ఎయిర్బ్యాగ్లు, EBD కూడిన ABS, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ (ESC), హిల్ హోల్డ్ అసిస్ట్, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ (TPMS), సీట్ బెల్ట్ రిమైండర్, రేర్ పార్కింగ్ సెన్సార్లతో కూడిన రివర్సింగ్ కెమెరా ఉన్నాయి.

ఇది కూడా చదవండి: సిట్రోయెన్ దక్షిణాఫ్రికాలో మేడ్ ఇన్ ఇండియా C3ను విడుదల చేసింది

ఇంజిన్ ఎంపికలు

Citroen C3 1.2-litre naturally aspirated petrol engine

సిట్రోయెన్ C 3కి రెండు ఇంజన్ ఎంపికలు ఉన్నాయి: 1.2-లీటర్ సహజ సిద్దమైన పెట్రోల్ ఇంజన్ (82PS/115Nm) మరియు 1.2-లీటర్ టర్బో పెట్రోల్ ఇంజన్ (110PS/190Nm). మునుపటిది 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్‌తో జత చేయబడింది, రెండోది 6-స్పీడ్ మాన్యువల్ గేర్‌బాక్స్‌తో జతచేయబడింది.

దాని ప్రత్యర్థులతో ఒక చర్చ

మేడ్-ఇన్-ఇండియా ఫ్రెంచ్ హ్యాచ్‌బ్యాక్ మారుతి ఇగ్నిస్, టాటా పంచ్ మరియు రాబోయే హ్యుందాయ్ ఎక్స్టర్ వంటి కార్లకు ప్రత్యామ్నాయం.

మరింత చదవండి: సిట్రోయెన్ C3 ఆన్-రోడ్ ధర.

was this article helpful ?

Write your Comment on Citroen సి3

సరిపోల్చడానికి & పరిశీలించడానికి ఒకే లాంటి కార్లు

*ఎక్స్-షోరూమ్ న్యూ ఢిల్లీ లో ధర

ట్రెండింగ్‌లో ఉంది హాచ్బ్యాక్ కార్లు

  • లేటెస్ట్
  • రాబోయేవి
  • పాపులర్
×
We need your సిటీ to customize your experience